Skip to main content

నేటి మోటివేషన్... నాన్నకు ప్రేమతో... 😓😓



"ఓయ్..రూమ్ లో నుండి వెళ్ళేటప్పుడు ఫ్యాన్ ఆపాలని తెలీదా..?" కరకుగా ఉన్న నాన్న గొంతు విని.. స్విచ్చాఫ్ చేసి వచ్చా.

"డ్రాయింగ్ రూమ్ లో ఎవరూ లేకపోతే టీవీ దేనికి..అది కూడా ఆఫ్ చేయమని చెప్పాలా ప్రత్యేకంగా..?" మళ్ళీ అదే గొంతు.

విసురుగా టీవీ ఆఫ్ చేసి టేబుల్ పై ఉన్న ఫైల్ తీసుకుని..బైటకి నడిచా..

ఎందుకిలా అవుతున్నాడు నాన్న..ప్రతిదానికి కోప్పడటం,చిరాకు.,అసహనం..ఇంత చిన్న విషయాలక్కూడా పెద్దగా అరవడం.తానే ఫ్యాన్,టీవీ స్విచ్చాఫ్ చేయొచ్చుగా..నన్నే పురామయించడం దేనికి..చాదస్తం ఎక్కువౌతుంది ఈమధ్య.

ఇక నా వల్ల కాదు..ఈ అసహనం భరించడం..ఎలా అయినా ఇల్లు వదిలి పోవాల్సిందే..ఈయన గారి బాధ నుండి విముక్తి పొందాల్సిందే.

ఈరోజు నాకు ఇంటర్వ్యూ ఉంది..లేటౌతున్నా అనే ఇంగితజ్ఞానం కూడా లేకుండా తిట్టి పోస్తున్నాడు..

దేవుడా..ఎలాగైనా ఈ ఉద్యోగం వచ్చేటట్లు చూడు..ఎలాగోలా ఇంటి నుండి బైటపడాలి.లేపోతే ఇంకా నాన్న విసుగు,కోపం,చిరాకు ఇంకొన్నాళ్లు భరిస్తే..పిచ్చెక్కక తప్పదు.. మనసులో ఫ్రస్ట్రేషన్ తన్నుకొచ్చేస్తుంది నాకు.

అంతలా టార్చర్ చేస్తున్నాడు నాన్న.సంపాదన లేదు.,ఇల్లు వదిలి బైటకు పోలేనని అలుసు.
ఎదడిగినా.. ఇప్పుడొద్దు,తర్వాత చూద్దాం..నాన్చడం తప్ప ఇంకేం తెలీదు.ఏదో ఈరోజు ఓ 500 ఇచ్చాడు ఇంటర్వ్యూ అని.

బస్ కోసం వెయిట్ చేశా..  రావట్లే.. ఇక లాభం లేదని ఆటోలో బయల్దేరి.. సరైన సమయానికే చేరుకున్నా.

పెద్ద భవనం.. గేట్ దగ్గర ఎవరూ లేరు అడ్డదిడ్డంగా ఉన్న గేట్ ను దాటి పొందిగ్గా మళ్ళీ చేరవేసా..  లోన భవనం వరకు మంచి రహదారి.. దారి చుట్టూ పూల మొక్కలు..డీసెంట్ గా ఉంది..మొక్కలకు నీళ్లుపోసే పైపు రహదారిపై పడి నీళ్ళన్ని పోతున్నాయి.. మాలి ఎక్కడ చచ్చాడో.. చుట్టుపక్కల లేదు..చిరాగ్గా పైపుని తీసి మొక్కల పక్క పెట్టి ముందుకి నడిచా..

రిసెప్షన్ లో ఎవరూ లేరు.. ఒక బోర్డ్ తప్ప.అందులో 3వ అంతస్తులో ఇంటర్వ్యూ అని రాసుంది. తడిగా ఉన్న బూటుకాళ్ల ప్రింట్స్ చూస్తూ మీదకి వెళ్లబోయి ఆగా..డోర్ మేట్ పక్కనే తిరగేసి పడుంది..ఆప్రయత్నం గా దాన్ని సరిచేసి బూట్లు దానిపై తుడిచి.. పై అంతస్థులకి వెళ్ళా.

ఇంటర్వ్యూ రూమ్ హడావిడిగా ఉంది.చాలా మంది వచ్చారు..రెండు సెక్షన్లలో కూచున్నారు.. ఒక సెక్షన్ ఖాళీ అయింది.. రెండో సెక్షన్లో కూర్చున్న నాకు..ఖాళీ అయిన సెక్షన్లో ఫ్యాన్లు తిరుగుతూ కనిపించాయి..  చెవిలో జోరీగలా.. నాన్న సౌండ్..

చిరాగ్గా ఫ్యాన్ల స్విచ్ఛాఫ్ చేసి కూర్చున్నా.
ఒక్కొక్కరే బాస్ రూమ్ లోనికెళ్లి అటునుంచి ఆటే వెళ్తున్నారు.. ఇంటమందిలో నేను సెలెక్ట్ కావడం కల్ల అని ముందే డిసైడ్ అయిపోయానేమో.. టెన్షన్ లేదు.. చిరాకు తప్ప.

ఇంతలో నా టర్న్ రానే వచ్చింది.. లోపల సూట్లలో నలుగురు కూర్చుని లాప్టాప్ లో ఏదో సీరియస్ గా చూసుకుంటున్నారు..

నన్ను కూర్చోమని కూడా అసలే..సర్టిఫికెట్స్ ఫైల్ అందించినా తీస్కోలే.. ఒకాయన పేరడిగాడు అంతే..ముక్తసరిగా చెప్పా.. రెండో ఆయన చెప్పాడు.."యువర్ ఇంటర్వ్యూ ఈస్ ఓవర్.. యూ కెన్ గో"

కోపం నషాలానికి అంటుతున్న వేళ.. మూడోవ్యక్తి ఒక కవర్ అందించి చెప్పాడు.."కంగ్రాట్స్..యూ ఆర్ ఇన్.. ఇది మీ అపోయింట్మెంట్ ఆర్డర్."
నిష్చేస్తుడైన నేను.. ఆప్రయత్నం గా ఆడిగేసా.."కానీ..మీరు నన్నేమీ అడగలేదు.."

నాలుగో వ్యక్తి తనముందున్న లాప్టాప్ నావైపు తిప్పి చూడన్నట్లు సైగ చేసాడు.. అందులో ఉన్నది.. నేనే.. గేట్ ను పొందిగ్గా పెట్టడం నుంచి.. పైప్., డోర్ మాట్., ఫాన్స్ స్విచ్ ఆఫ్ చేయడం.. అన్నీ.. సీసీకెమెరా రికార్డింగ్..

మొదటి వ్యక్తి చెప్తున్నాడు నెమ్మదిగా "మాకు qualifications తో పాటు మనిషికి ఉండాల్సిన కనీస బాధ్యతలు కూడా కావాలి.. ఇవన్నీ ఇంటర్వ్యూలో ఒక భాగమే.అందులో మీరు నెగ్గారు."

ఆనందంతో నోట మాట రాలేదు..

బైటకొచ్చాక కాస్త తేరుకున్నా.

సడెన్ గా చెళ్లున కొట్టినట్టు ... నాన్న.,తన మాటలు గుర్తొచ్చాయి.అంటే .. నాన్న నన్ను బాధ్యతాయుతంగా ఉండడానికి ఇలా అంటుండేవాడా.. ఎంత అపార్ధం చేసుకున్నా నాన్నా నిన్ను..కళ్ళంట నీళ్లు తిరిగాయి.

రాయిలాంటి నన్ను.. అందమైన శిల్పంగా మార్చడానికి ఉలితో కొట్టిన దెబ్బలే అవి.. నొప్పి ఫీల్ అయ్యానే తప్ప.. నాలో వచ్చిన అందమైన మార్పు గమనించలేకపోయా.

అమ్మ తన ప్రేమతో లాలించి పెద్ద చేసి అమృత హృదయురాలుగా మదిలో నిలిస్తే.. నాన్న తన ప్రేమని గుండెలో దాచుకుని కరకుగా నా భవిష్యత్తుని షేప్ చేస్తూ.. తను మాత్రం నా దృష్టిలో గుండేలేని పాషాణంగానే గుర్తించబడుతున్నాడు.

అమ్మ ప్రేమను గ్రహించగలుగుతున్నాం.. నాన్న ప్రేమ వేరెవరో చెప్తే.. గుర్తుచేస్తే గాని గ్రహించలేం.

బాల్యం లో నాన్నప్రేమ అనిర్వచనీయంగా.. యవ్వనంలో విలన్ గా,శాడిస్ట్ గా.. పోయిన తర్వాత గాని.. మనల్ని మలచిన ఒక గైడ్ గా భావించగలమే తప్ప... నిజంగా అర్థం చేసుకోడానికి ఎప్పుడూ ప్రయత్నించ0.

తండ్రి లేకపోతే కూతురు వద్ద నైనా తల్లి ఉండగలదు.. కానీ తల్లి లేకపోతే తండ్రికి కూతురి వద్ద కూడా ఉండడానికి వీల్లేని దుస్థితి.

ఒంటరిగానే ఉండి...పో..వా..లి.

చనిపోయిన తర్వాత ఫోటోకి దండేసి.. నమస్కారం పెట్టే బదులు.. బ్రతికుండగానే తండ్రిని అర్థం చేసుకుని అతనిని నొప్పించ కుండా ఉండే మహానుభావులందరకి 🙏🙏

🏹లక్ష్య🇮🇳స్వచ్చంద📚సేవా🩺సంస్థ

Comments

Popular posts

🎯 GENERAL ELECTIONS – ఓట్ల రకాలు పోటీ పరీక్షల ప్రత్యేక అధ్యయన మెటీరియల్ ముఖ్యమైన మల్టీపుల్ ఛాయస్ బిట్స్ తో పాటు.

భారతదేశ ఎన్నికల ప్రక్రియలో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి వివిధ పద్ధతులు ఉన్నాయి. అర్హత, విధులు, ఎన్నికల నియమాలను బట్టి ఈ పద్ధతులు మారుతాయి. 📌 1. ఎన్నికల్లో ముఖ్యమైన ఓట్ల రకాలు 1️⃣ Ordinary Vote – సాధారణ ఓటు సంబంధిత పోలింగ్ కేంద్రంలో ఓటరు తన ఓటు హక్కును వినియోగించుకునే సాధారణ విధానం. ప్రస్తుతం సాధారణంగా EVM ద్వారా ఓటు నమోదు చేస్తారు. 2️⃣ Postal Ballot – పోస్టల్ బ్యాలెట్ ఎన్నికల నియమాల ప్రకారం అర్హత పొందిన ఓటర్లు పోస్టల్ బ్యాలెట్ ద్వారా తమ ఓటును నమోదు చేసే విధానం. ఎన్నికల విధుల్లో ఉన్న కొందరు ఉద్యోగులు, అర్హులైన సర్వీస్ ఓటర్లు, నిబంధనలకు లోబడిన ఇతర వర్గాలకు ఈ సదుపాయం ఉంటుంది. 3️⃣ EDC – Election Duty Certificate ఎన్నికల విధుల్లో ఉన్న అర్హుడైన ఉద్యోగి, తాను ఓటరుగా నమోదైన నియోజకవర్గంలోనే విధులు నిర్వహిస్తున్నప్పుడు, వర్తించే నిబంధనల ప్రకారం EDC ద్వారా ఓటు వేయవచ్చు. 4️⃣ Service Vote – సర్వీస్ ఓటు సాయుధ దళాలు, వర్తించే చట్టాల పరిధిలోని బలగాలు, భారతదేశం వెలుపల పనిచేస్తున్న అర్హులైన ప్రభుత్వ ఉద్యోగులు వంటి నిర్దిష్ట వర్గాలకు చెందిన సర్వీస్ ఓటర్లు వినియోగించుకునే ఓటు హక్కు. వర్తించ...

నేటి ప్రధాన వార్తా పత్రికలు తెలుగు మరియు ఇంగ్లీష్

                             ఈనాడు ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.eenadu.net సాక్షి ➪ 🅐🅟 & 🅣🅢 http://epaper.sakshi.com ఆంధ్రప్రభ ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.prabhanews.com/ V6 వెలుగు➪ 🅣🅢 https://epaper.v6velugu.com 📰నవ తెలంగాణ ➪ 🅣🅢 http://epaper.navatelangana.com/ నమస్తే తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.ntnews.com 📰మన తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.manatelangana.news English Newspapers        ☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟ 👉🏻The Hindu📰 https://epaper.thehindu.com/reader Deccan Chronicle http://epaper.deccanchronicle.com/states.aspx Indian Express https://epapeHr.newindianexpress.com/t/3464 The Hans India https://epaper.thehansindia.com/ 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

🎯 పోస్టల్ బ్యాలెట్ – ఆన్‌లైన్ దరఖాస్తు విధానం ఎన్నికల విధుల్లో పాల్గొనే ఉద్యోగుల కోసం ముఖ్యమైన సమాచారం

ఎన్నికల విధులు నిర్వహిస్తున్న అర్హులైన ఉద్యోగులు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు, ఎన్నికల సంఘం నిర్దేశించిన విధానం ప్రకారం పోస్టల్ బ్యాలెట్ కోసం దరఖాస్తు చేసుకోవాలి. 💻 ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ దశ 1: అధికారిక పోర్టల్‌ను సందర్శించండి 🔗 https://sec-ems.ap.gov.in/apsec/ దశ 2: రిజిస్ట్రేషన్ / లాగిన్ పోర్టల్‌లో సూచించిన విధంగా మీ మొబైల్ నంబర్‌తో నమోదు చేసుకోండి లేదా ఇప్పటికే ఖాతా ఉంటే లాగిన్ అవ్వండి. దశ 3: అవసరమైన వివరాలు నమోదు చేయండి పోర్టల్ అడిగే వివరాలను జాగ్రత్తగా నమోదు చేయండి. ఉదాహరణకు: - ఉద్యోగి పేరు, మొబైల్ నంబర్ - ఓటరు గుర్తింపు, నియోజకవర్గ వివరాలు - ఎన్నికల విధులకు సంబంధించిన సమాచారం - పోర్టల్ కోరిన ఇతర వివరాలు దశ 4: దరఖాస్తును సమర్పించండి నమోదు చేసిన వివరాలను మరోసారి పరిశీలించి, పోర్టల్‌లోని సూచనల ప్రకారం దరఖాస్తును సమర్పించండి. దశ 5: దరఖాస్తు స్థితిని తనిఖీ చేయండి దరఖాస్తు సమర్పించిన తర్వాత అందుబాటులో ఉంటే అప్లికేషన్ నంబర్ లేదా రసీదును భద్రపరచుకోండి. పోర్టల్‌లో దరఖాస్తు స్థితిని తనిఖీ చేయండి. ⚠️ ఉద్యోగులు తప్పక గుర్తుంచుకోవాల్సినవి ✅ పోస్టల్ బ్యాలెట్‌కు అర్హత, దరఖాస్తు గడు...