మెట్ట ప్రాంతాలలో, కొండలు, గుట్టలపై, రోడ్డుకు ఇరు పక్కలా ఎక్కువగా పెరిగే చెట్లల్లో రేల చెట్టు కూడా ఒకటి. దీనిని చాలా మంది చూసే ఉంటారు. ఈ చెట్టు ఎన్నో ఔషధ గుణాలను కలిగి ఉంటుంది. మనకు వచ్చే అనేక రకాల అనారోగ్య సమస్యలను నయం చేయడంలో ఈ మొక్క ఎంతగానో ఉపయోగపడుతుంది. రేల చెట్టు లో ఉండే ఔషధ గుణాల గురించి, ఈ చెట్టు వల్ల కలిగే ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. రేల చెట్టు కషాయం చేదుగా ఉండి వేడి చేసే గుణాన్ని కలిగి ఉంటుంది. మలబద్దకాన్ని తగ్గించడంలో ఈ చెట్టు ఎంతగానో ఉపయోగపడుతుంది. చర్మ రోగాలను, కఫ రోగాలను, క్రిమి రోగాలను, విషాన్ని హరించడంలో కూడా ఈ చెట్టు సహాయపడుతుంది. రేల చెట్టు బెరడును దంచి దానిని ఒక గ్లాస్ నీటిలో వేసి ఒక కప్పు కషాయం అయ్యే వరకు మరిగించి వడకట్టి గోరు వెచ్చగా తాగుతూ ఉంటే మూత్రం నుండి రక్తం పడడం తగ్గుతుంది. రేల చెట్టు పువ్వులను ఇతర దినుసులతో కలిపి పచ్చడిగా కూడా చేసుకుని తినవచ్చు. ఈ పచ్చడి ఎంతో రుచిగా ఉంటుంది. జ్వరం తగ్గిన వారు పథ్యంగా...
ఆసరా లేదని అక్షరం... డబ్బు లేదని ఊపిరి ఆగకూడదు... ఇదే లక్ష్య స్వచ్చంద సేవా సంస్థ యొక్క విధానం...నినాదం...