Skip to main content

Posts

Showing posts from November, 2020

నేటి మోటివేషన్... ఇరుగుపొరుగువారితో స్నేహబంధాలు పెంచుకోవాలి

పెద్ద పెద్ద పట్టణాల్లో నివసించేవారు ఎవరికి వారే యమునాతీరేలాగా తమ చుట్టూముట్టు గిరిగీసుకుని ఇరుగు పొరుగు వారితో సంబంధం లేకుండా, ఎవరి తోనూ మాట్లాడకుండా ఉంటున్నారు. అందుకు కారణం, కుటుంబంలోని ప్రతి వారూ బిజీగా ఉండటమే, ఆలుమగలి ద్దరూ ఉద్యోగం చేయడం, పిల్లలు కూడా స్కూలు నుంచి వచ్చిప్పటినుండి హోమ్ వర్కులు, చదువుతో గడుపుతూ ఆరు బయట ఆడుకోకపోవడం, ఆ తర్వాత టి.వి.ముందు కుర్చోవడం చేస్తారు. ఆలు మగలిద్దరూ యాంత్రిక దినచర్యతో, ఉద్యోగంతో బిజీగా ఉండటంతో,చుట్టు ప్రక్కల ఎవరున్నారో, వారేంచేస్తారో, వారి పేర్లేమిటీ కూడా పట్టించుకోరు. • చుట్టు ప్రక్కలవారు స్నేహబాంధవ్యాలు పెంచు కోవడం ప్రతివారికీ అవసరం. ఏదో ఒక సమయంలో ఇరుగు పొరుగువారి అవసరం తప్పనిసరి అవుతుంది. ఏకష్టమొచ్చినా, దు:ఖంలోనూ, బాధల్లోనూ మొట్టమొదటగా ఆడుకునేవారు ఇరుగుపొరుగులే అని తెలుసుకోవాలి. • ఇతరులతో అంటీ ముట్టనట్టుగా ప్రవర్తించకూడదు. ఎవరి మటుకు వారు మౌనంగా ఉంటూ నాలుగు గోడల మధ్యనే కాలం గడుపాలను కోకూడదు. సమాజంలో తోటి మనుషుల మధ్యకలిసి బ్రతుకుతున్నప్పుడు కలిసి కట్టుగా స్నేహబంధాన్ని పెంచుకుంటూ మెలగాలి. • ప్రతిరోజు కాకపోయినా అప్పుడప్పుడు తీరిక సమ యంలో ఇరుగుపొరు

నేటి మోటివేషన్... మీ జీవితం మీ చేతుల్లో

🌳 చాలా కాలం క్రితం ఓ పెద్ద పండ్ల చెట్టు ఉండేది. ఓ చిన్న పిల్లవాడు చాలా ఇష్టంగా, ప్రేమగా దాని చుట్టూ ఆడుకునేవాడు.   🌴 ఓ రోజు చెట్టు పైకి ఎక్కాడు,పండ్లు కోసుకొని తిన్నాడు, ఆ చెట్టు నీడలో కాసేపు పడుకున్నాడు. ఆ అబ్బాయి ఆ చెట్టును ఎంతగానో ప్రేమించాడు, ఆ చెట్టు కూడా ఆ అబ్బాయి తన వద్ద ఆడుకోవడాన్ని చాలా ఇష్టపడింది, అతన్ని అమితంగా ప్రేమించింది.  🏝 కాలం గడిచింది, చిన్న పిల్లవాడు పెరిగి పెద్ద వాడైయ్యాడు. ఇప్పుడు ఎక్కువగా ఆ చెట్టు నీడలో ఆడుకోవడం లేదు 🌿 కొంత కాలం తర్వాత ఓ రోజు ఆ బాలుడు చెట్టు వద్దకు వెళ్లాడు,ఎందుకో విచారంగా ఉన్నాడు. "రా వచ్చి నా వద్ద ఆడుకో"  అని చెట్టు అడిగింది.  👦 బాలుడు:- "నేనింకా చిన్న పిల్లాడిని కాను, చెట్ల చుట్టూ తిరుగుతూ ఆడుకునే వయసు కాదు నాది, నాకిప్పుడు ఆడుకోడానికి బొమ్మలు కావాలి, అవి కొనడానికి డబ్బులు కావాలి " అన్నాడు.  🌳 చెట్టు :- "నా దగ్గర డబ్బులు అయితే లేవు, కానీ నువ్వు ఓ పని చేయవచ్చు, నా పండ్లన్ని కోసుకుని వెళ్లి అమ్మివేయి, దానితో నీకు డబ్బులు వస్తాయి" అని అన్నది.  🍎 బాలుడు ఎంతోషంగా ఆ చెట్టు పండ్లన్ని కోసుకుని వెళ్ళిపోయాడు. మళ్ళీ తి

నేటి మోటివేషన్... వివాహ బంధం

  భర్త ఆ రోజు రాత్రి ఇంటికి వచ్చేసరికి, వాళ్ళ భార్య భోజనం వడ్డిస్తూ వుంది. భర్త ఆమె చేయి పట్టుకుని, నీతో ఒకటి చెప్పాలి అని అన్నాడు. ఆమె కూర్చుని నిశ్శబ్దంగా భోజనం చేస్తుంది. ఆమె కళ్ళలో బాధని భర్త గమనించాడు. అతను ఆమె తో ఒక విషయం గురించి మాట్లాడాలి అనుకుంటున్నాడు. కానీ ఆమె కి ఆ విషయం ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు..ఎలాగయినా ఆమె కి ఆ విషయం చెప్పాలి.. చివరికి ఇలా చెప్పాడు... . భర్త - నాకు విడాకులు కావాలి అని ప్రశాంతంగా తన తో అసలు విషయం చెప్పాడు. . భార్య - (ఆ మాటలకి బదులుగా ఆమె ) ఎందుకు అని మాములుగా అడిగింది? . భర్త - ఆమె ప్రశ్నను పట్టించుకోకుండా సమాధానం ఏం ఇవ్వలేదు.. . భార్య - (ఆమెకి కోపం వచ్చింది.) ఆమె ఒక వస్తువును దూరంగా విసిరేసి, మీరు ఒక మనిషేనా అని భర్త మీద గట్టిగా అరిచింది.. . ఆ రాత్రి, వాళ్లిద్దరూ మాట్లాడుకోలేదు. ఆమె బాగా ఏడ్చింది. భర్త ఎందుకు విడాకులు అడుగుతున్నాడో అసలు ఏమి జరిగిందో తను తెలుసుకోవాలి అనుకుంది. భర్త ని గట్టిగా అడిగింది..భర్త ఆమెకి సమాధానం ఇలా చెప్పాడు. . భర్త - నేను జాను అనే అమ్మాయిని ప్రేమించాను. నాకు నీపైన ప్రేమ లేదు.. . భార్య - ఆ మాటలు విన్న తాను చాలా బాధపడింది.. ఒక