🔊Zero Shadow Day: ఆ కాసేపు నీడ కనిపించలేదు.. హైదరాబాద్‌లో అరుదైన ఘట్టం ఆవిష్కృతం 🍥హైదరాబాద్: నగరంలో నీడ కనిపించని అరుదైన ఘట్టం ఆవిష్కృతమైంది. ఇవాళ మధ్యాహ్నం 12.12 గంటల నుంచి 12.14 గంటల వరకు రెండు నిమిషాల వ్యవధిలో నీడ మాయమైంది. ‘జీరో షాడో డే’ సందర్భంగా హైదరాబాద్‌లోని బిర్లా సైన్స్ ప్లానిటోరియం వద్ద ఏర్పాటు చేసిన ప్రదర్శనను పలువురు ఆసక్తిగా తిలకించారు. 🌀వైజ్ఞానిక ప్రపంచం జీరో షాడోగా పరిగణించే ఈ దృశ్యం.. సూర్యుడి కిరణాలు నిట్టనిలువుగా ప్రసరించడం వల్ల జరుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఎండలో నిటారుగా (90 డిగ్రీలు) ఏదైనా వస్తువును ఉంచితే దానిపై రెండు నిమిషాల పాటు నీడ కనిపించదని హైదరాబాద్‌లోని బిర్లా సైన్స్ సెంటర్ అధికారులు తెలిపారు. 💥ఈ విచిత్రం ఎప్పుడెప్పుడు జరుగుతుందో తెలుసా? ✳️ఇలాంటి విచిత్రం ప్లస్ 23.5, మైనస్ 23.5 డిగ్రీల అక్షాంశాల మధ్య ప్రాంతాల్లో ఏడాదికి రెండు సార్లు జరుగుతుంది. సూర్యుడు మిట్ట మధ్యాహ్నం, సరిగ్గా నడి నెత్తి మీదికి వచ్చినప్పుడు నీడ మాయం అవుతుంది! నిజానికి సూర్యుడు మిట్ట మధ్యాహ్న సమయంలోనూ కాస్త ఉత్తరం వైపో, దక్షిణం వైపో వాలి ఉంటాడు. సూర్యుడి చుట్టూ తిరిగే మన భ...
ఆసరా లేదని అక్షరం... డబ్బు లేదని ఊపిరి ఆగకూడదు... ఇదే లక్ష్య స్వచ్చంద సేవా సంస్థ యొక్క విధానం...నినాదం...