Skip to main content

జీరో షాడో డే అంటే ఏమిటి... తరువాత ఎక్కడెక్కడ ఆవిషకృతం కానుంది...



🔊Zero Shadow Day: ఆ కాసేపు నీడ కనిపించలేదు.. హైదరాబాద్‌లో అరుదైన ఘట్టం ఆవిష్కృతం


🍥హైదరాబాద్‌: నగరంలో నీడ కనిపించని అరుదైన ఘట్టం ఆవిష్కృతమైంది. ఇవాళ మధ్యాహ్నం 12.12 గంటల నుంచి 12.14 గంటల వరకు రెండు నిమిషాల వ్యవధిలో నీడ మాయమైంది. ‘జీరో షాడో డే’ సందర్భంగా హైదరాబాద్‌లోని బిర్లా సైన్స్‌ ప్లానిటోరియం వద్ద ఏర్పాటు చేసిన ప్రదర్శనను పలువురు ఆసక్తిగా తిలకించారు.

🌀వైజ్ఞానిక ప్రపంచం జీరో షాడోగా పరిగణించే ఈ దృశ్యం.. సూర్యుడి కిరణాలు నిట్టనిలువుగా ప్రసరించడం వల్ల జరుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఎండలో నిటారుగా (90 డిగ్రీలు) ఏదైనా వస్తువును ఉంచితే దానిపై రెండు నిమిషాల పాటు నీడ కనిపించదని హైదరాబాద్‌లోని బిర్లా సైన్స్ సెంటర్ అధికారులు తెలిపారు.

💥ఈ విచిత్రం ఎప్పుడెప్పుడు జరుగుతుందో తెలుసా?

✳️ఇలాంటి విచిత్రం ప్లస్‌ 23.5, మైనస్‌ 23.5 డిగ్రీల అక్షాంశాల మధ్య ప్రాంతాల్లో ఏడాదికి రెండు సార్లు జరుగుతుంది. సూర్యుడు మిట్ట మధ్యాహ్నం, సరిగ్గా నడి నెత్తి మీదికి వచ్చినప్పుడు నీడ మాయం అవుతుంది! నిజానికి సూర్యుడు మిట్ట మధ్యాహ్న సమయంలోనూ కాస్త ఉత్తరం వైపో, దక్షిణం వైపో వాలి ఉంటాడు. సూర్యుడి చుట్టూ తిరిగే మన భూమి అక్షం 23.5 డిగ్రీల వాలుతో ఉంటుంది. దీని మూలంగానే రుతువులు ఏర్పడుతుంటాయి. అయితే ఉత్తరాయణంలో ఒకసారి, దక్షిణాయణంలో ఒకసారి సూర్యుడి వంపు అక్షాంశంతో సమానమవుతుంది. అప్పుడు సూర్యుడు సరిగ్గా నడి నెత్తి మీదికి వస్తాడు. దీంతో ఆయా వస్తువుల నీడ భూమి మీద పడదు. ఈ పరిస్థితి కొద్దిసేపే ఉంటుంది. దీన్ని నీడ లేని రోజుగా (జీరో షాడో డే) భావిస్తుంటారు. ఇది వేర్వేరు ప్రాంతాల్లో వేర్వేరు రోజుల్లో కనబడుతుంది. మనదేశంలో ఏప్రిల్‌ 6న ఇందిరా పాయింట్‌ వద్ద నుంచి ఇది మొదలైంది. మన తెలుగు రాష్ట్రాల్లోనూ ఇప్పటికే కొన్నిచోట్ల నీడ లేని రోజు కనిపించింది. చాలామంది దీన్ని గమనించి ఉండకపోవచ్చు. అలాగని నిరాశ పడాల్సిన పనిలేదు. దీన్ని ప్రత్యక్షంగా అనుభవించటానికి ఇంకా అవకాశం ఉంది.

◼️మే 10, ఆగస్టు 2: సంగారెడ్డి, జనగాం, పాల్వంచ, విశాఖపట్నం

◼️మే 11, ఆగస్టు 1: మెదక్‌, వరంగల్‌, విజయనగరం

◼️మే 12, జులై 31: శ్రీకాకుళం

◼️మే 13, జులై 30: కరీంనగర్‌, పామునూరు, బొబ్బిలి

◼️మే 14, జులై 29: నిజామాబాద్‌, కోరుట్ల, రామగుండం, పాలకొండ

◼️మే 15, జులై 28: మంచిర్యాల, మందమర్రి

◼️మే 16, జులై 27: నిర్మల్‌, మండ

◼️మే 18, జులై 25: ఆదిలాబాద్‌

🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

Comments

Popular posts

TET అభ్యర్థులకు ఉపయోగకరమైన ఆన్‌లైన్ మాక్ టెస్ట్ ప్లాట్‌ఫామ్

TET పరీక్షకు సిద్ధమవుతున్న అభ్యర్థుల కోసం ఒక ప్రత్యేకమైన ఆన్‌లైన్ మాక్ టెస్ట్ ప్లాట్‌ఫామ్ అందుబాటులో ఉంది. ఈ ప్లాట్‌ఫామ్‌లో మీరు ఎన్ని సార్లైనా పరీక్ష రాయవచ్చు. ప్రతి ప్రయత్నంలో కొత్త ప్రశ్నాపత్రం రూపొందించబడటం దీని ప్రత్యేకత. ఈ మాక్ టెస్టులు విస్తృతమైన ప్రశ్నల బ్యాంక్ ఆధారంగా రూపొందించబడుతున్నందున, ప్రతి పరీక్షలో భిన్నమైన ప్రశ్నలు ఎదురవుతాయి. దీనివల్ల ఒకే రకమైన ప్రశ్నలు పదేపదే రావడం తగ్గి, అభ్యర్థులు వివిధ అంశాలపై మెరుగైన అవగాహన పెంపొందించుకోవచ్చు. ఈ ప్లాట్‌ఫామ్‌ను ఉపయోగించడం ద్వారా: • అపరిమిత సంఖ్యలో మాక్ టెస్టులు రాయవచ్చు. • ప్రతి ప్రయత్నంలో కొత్త ప్రశ్నాపత్రం లభిస్తుంది. • విభిన్న అంశాలపై ప్రాక్టీస్ చేసే అవకాశం ఉంటుంది. • పరీక్షా సమయ నిర్వహణ నైపుణ్యాలు మెరుగుపడతాయి. • మీ బలాలు, బలహీనతలను గుర్తించి వాటిపై మరింత దృష్టి పెట్టవచ్చు. • కంప్యూటర్ ఆధారిత పరీక్షలకు అలవాటు పడేందుకు ఇది ఉపయోగపడుతుంది. • కంప్యూటర్ వినియోగంలో అనుభవం తక్కువగా ఉన్న అభ్యర్థులు కూడా ముందుగానే ప్రాక్టీస్ చేసి ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవచ్చు. నిరంతరంగా మాక్ టెస్టులు రాయడం ద్వారా పరీక్షా భయం తగ్గి, నిజమైన TET పరీక్షలో ...

AP 2026-27 TEXT Books New అప్లోడ్ చేశారు

2026-27 TEXT Books New అప్లోడ్ చేశారు.  https://cse.ap.gov.in/loadacademictextbookpublicview?random=0.6384777802675639 Lakshya Educational Groups

నేటి ప్రధాన వార్తా పత్రికలు తెలుగు మరియు ఇంగ్లీష్

                             ఈనాడు ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.eenadu.net సాక్షి ➪ 🅐🅟 & 🅣🅢 http://epaper.sakshi.com ఆంధ్రప్రభ ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.prabhanews.com/ V6 వెలుగు➪ 🅣🅢 https://epaper.v6velugu.com 📰నవ తెలంగాణ ➪ 🅣🅢 http://epaper.navatelangana.com/ నమస్తే తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.ntnews.com 📰మన తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.manatelangana.news English Newspapers        ☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟ 👉🏻The Hindu📰 https://epaper.thehindu.com/reader Deccan Chronicle http://epaper.deccanchronicle.com/states.aspx Indian Express https://epapeHr.newindianexpress.com/t/3464 The Hans India https://epaper.thehansindia.com/ 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺