*దేశంలోని ప్రతిష్ఠాత్మకమైన విద్యాసంస్థల్లో లేదా ఐఐటీల్లో ఇంజినీరింగ్, టెక్నాలజీ, ఆర్కిటెక్చర్, సైన్స్ విభాగాల్లో పీజీ, పీహెడీ ప్రవేశాల కోసం నిర్వహించే గేట్ -2020 ప్రకటన విడుదలైంది. *GATE-2020 -గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజినీరింగ్ (గేట్)ను ఈసారి రొటేషన్ పద్ధతిలో ఐఐటీ ఢిల్లీ నిర్వహిస్తుంది. ఈ పరీక్ష స్కోర్ ఉన్నత విద్యకు, ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉద్యోగాలు సాధించడానికి ఉపయోగపడుతుంది. *గేట్-2020 ఫలితాలు విడుదలైన తేదీ నుంచి పీజీ ప్రవేశాలకు మూడేండ్లు, పబ్లిక్ సెక్టార్ అండర్‌టేకింగ్స్ (పీఎస్‌యూ)లకు ఒకటి లేదా రెండేండ్లవరకు వ్యాలిడిటీ ఉంటుంది. - ఐఐటీలతోపాటు ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్, ఎన్‌ఐటీలు, ప్రముఖ ఇంజినీరింగ్ కళాశాల్లో ప్రవేశానికి గేట్ స్కోర్ తప్పనిసరి. *అర్హతలు: సంబంధిత ఇంజినీరింగ్/టెక్నాలజీ, ఆర్కిటెక్చర్, సైన్స్ విభాగాల్లో బ్యాచిలర్ డిగ్రీ, ఎమ్మెస్సీ (సైన్స్/మ్యాథ్స్/స్టాటిస్టిక్స్, కంప్యూటర్ అప్లికేషన్), ఎంసీఏ, ఇంటిగ్రేటెడ్ మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణత. ఫైనల్ ఇయర్ చదువుతున్న విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. *ఫీజు: జనరల్/ఓబీసీలకు రూ.1,500/...