రాష్ట్రంలో జరుగుతున్న Special Intensive Revision (SIR) ప్రక్రియలో ఓటర్ల వివరాలను నవీకరించడం మరియు ధృవీకరించడం కీలకంగా మారింది. ముఖ్యంగా 2002 ఓటర్ జాబితాను ఆధారంగా తీసుకుని ఓటర్ల మ్యాపింగ్ ప్రక్రియ నిర్వహిస్తున్న నేపథ్యంలో ప్రతి ఓటరు తనకు వర్తించే మ్యాపింగ్ విధానాన్ని తెలుసుకోవడం అవసరం. పెళ్లి తర్వాత నివాసం మార్చుకున్న మహిళలు, 2002లో ఓటు హక్కు వయస్సు రాని యువత, అలాగే ఇతర కారణాల వల్ల పాత ఓటరు జాబితాలో పేరు నమోదు కాకపోయిన వారు ఈ ప్రక్రియపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. పెళ్లి తర్వాత గ్రామం లేదా పట్టణం మార్చుకున్న మహిళలకు సూచనలు 2002 ఓటర్ జాబితాలో ప్రస్తుతం నివసిస్తున్న ప్రాంతంలో వారి పేరు ఉండకపోవచ్చు. అలాంటి పరిస్థితిలో వారు తమ పుట్టిన ఊరు లేదా తల్లిదండ్రులు నివసించిన ప్రాంతంలోని 2002 ఓటర్ జాబితాను పరిశీలించాలి. అక్కడ వారి తల్లి, తండ్రి లేదా కుటుంబ సభ్యుల పేర్లు నమోదై ఉంటే, ఆ వివరాలను సేకరించి ప్రస్తుత ప్రాంతంలోని BLO (Booth Level Officer)కు అందించాలి. దీంతో వారి ఓటరు వివరాలను సరైన విధంగా మ్యాపింగ్ చేసే అవకాశం ఉంటుంది. 2002 ఓటర్ జాబితా ఎక్కడ లభిస్తుంది? • సంబంధిత BLO వద్ద • తహసీల్దార్ కార్యాల...