Skip to main content

తెలుగు విశ్వవిద్యాలయంలో 2026-27 విద్యా సంవత్సరానికి అడ్మిషన్లు

అమరావతి: పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో 2026-27 విద్యా సంవత్సరానికి వివిధ కోర్సుల్లో ప్రవేశాల ప్రక్రియ ప్రారంభం కానుంది. రాజమహేంద్రవరం, శ్రీశైలం, కూచిపూడి ప్రాంగణాల్లో అందుబాటులో ఉన్న పలు కోర్సుల్లో చేరేందుకు ఆసక్తి ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ శ్రీనివాసరావు తెలిపారు.

రాజమహేంద్రవరం సాహిత్య పీఠంలో ఎం.ఏ. తెలుగు, జ్యోతిష్యం కోర్సులతో పాటు సర్టిఫికెట్, డిప్లొమా విభాగాల్లో యోగా సంబంధిత కోర్సులు నిర్వహించనున్నారు.

శ్రీశైలం ప్రాంగణంలో ఎం.ఏ. చరిత్ర, పురావస్తు శాస్త్రం కోర్సులకు అవకాశం కల్పిస్తున్నారు. కూచిపూడి ప్రాంగణంలో ఎం.ఏ. కూచిపూడి నృత్యం, కూచిపూడి నాట్యం వంటి కోర్సులతో పాటు సర్టిఫికెట్, డిప్లొమా స్థాయిలో సాత్వికాభినయం, యక్షగానం తదితర అంశాల్లో శిక్షణ అందించనున్నారు.

ఆసక్తి కలిగిన విద్యార్థులు అక్టోబర్ 17, 2026లోపు తమ దరఖాస్తులను సమర్పించాల్సి ఉంటుంది. దరఖాస్తు ఫారాలు, కోర్సుల వివరాలు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంటాయి. కోర్సు ఫీజులను క్యూఆర్ కోడ్ ద్వారా చెల్లించే సదుపాయం కూడా కల్పించారు.

తెలుగు భాష, సాహిత్యం, కళలు, సంప్రదాయ విద్యల్లో ఆసక్తి ఉన్నవారు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని విశ్వవిద్యాలయ అధికారులు సూచించారు.

మరిన్ని వివరాలకు సంప్రదించండి:

📞 9492692389
📞 0883-2947005

Lakshya Educational Groups

Comments

Popular posts

నేటి ప్రధాన వార్తా పత్రికలు తెలుగు మరియు ఇంగ్లీష్

                             ఈనాడు ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.eenadu.net సాక్షి ➪ 🅐🅟 & 🅣🅢 http://epaper.sakshi.com ఆంధ్రప్రభ ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.prabhanews.com/ V6 వెలుగు➪ 🅣🅢 https://epaper.v6velugu.com 📰నవ తెలంగాణ ➪ 🅣🅢 http://epaper.navatelangana.com/ నమస్తే తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.ntnews.com 📰మన తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.manatelangana.news English Newspapers        ☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟ 👉🏻The Hindu📰 https://epaper.thehindu.com/reader Deccan Chronicle http://epaper.deccanchronicle.com/states.aspx Indian Express https://epapeHr.newindianexpress.com/t/3464 The Hans India https://epaper.thehansindia.com/ 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

🎯 GENERAL ELECTIONS – ఓట్ల రకాలు పోటీ పరీక్షల ప్రత్యేక అధ్యయన మెటీరియల్ ముఖ్యమైన మల్టీపుల్ ఛాయస్ బిట్స్ తో పాటు.

భారతదేశ ఎన్నికల ప్రక్రియలో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి వివిధ పద్ధతులు ఉన్నాయి. అర్హత, విధులు, ఎన్నికల నియమాలను బట్టి ఈ పద్ధతులు మారుతాయి. 📌 1. ఎన్నికల్లో ముఖ్యమైన ఓట్ల రకాలు 1️⃣ Ordinary Vote – సాధారణ ఓటు సంబంధిత పోలింగ్ కేంద్రంలో ఓటరు తన ఓటు హక్కును వినియోగించుకునే సాధారణ విధానం. ప్రస్తుతం సాధారణంగా EVM ద్వారా ఓటు నమోదు చేస్తారు. 2️⃣ Postal Ballot – పోస్టల్ బ్యాలెట్ ఎన్నికల నియమాల ప్రకారం అర్హత పొందిన ఓటర్లు పోస్టల్ బ్యాలెట్ ద్వారా తమ ఓటును నమోదు చేసే విధానం. ఎన్నికల విధుల్లో ఉన్న కొందరు ఉద్యోగులు, అర్హులైన సర్వీస్ ఓటర్లు, నిబంధనలకు లోబడిన ఇతర వర్గాలకు ఈ సదుపాయం ఉంటుంది. 3️⃣ EDC – Election Duty Certificate ఎన్నికల విధుల్లో ఉన్న అర్హుడైన ఉద్యోగి, తాను ఓటరుగా నమోదైన నియోజకవర్గంలోనే విధులు నిర్వహిస్తున్నప్పుడు, వర్తించే నిబంధనల ప్రకారం EDC ద్వారా ఓటు వేయవచ్చు. 4️⃣ Service Vote – సర్వీస్ ఓటు సాయుధ దళాలు, వర్తించే చట్టాల పరిధిలోని బలగాలు, భారతదేశం వెలుపల పనిచేస్తున్న అర్హులైన ప్రభుత్వ ఉద్యోగులు వంటి నిర్దిష్ట వర్గాలకు చెందిన సర్వీస్ ఓటర్లు వినియోగించుకునే ఓటు హక్కు. వర్తించ...

జవహర్ నవోదయ విద్యాలయాల్లో ప్రవేశాల గడువు పెంపు: పూర్తి వివరాలు

జవహర్ నవోదయ విద్యాలయాల్లో 2027–28 విద్యా సంవత్సరానికి గాను లాటరల్ ఎంట్రీ (Lateral Entry) ద్వారా ప్రవేశాలు పొందాలనుకునే విద్యార్థులకు కేంద్ర నవోదయ విద్యాలయ సమితి ఊరట కల్పించింది. 9వ తరగతి మరియు 11వ తరగతి ఖాళీ సీట్ల భర్తీకి సంబంధించి ఆన్‌లైన్ దరఖాస్తుల తుది గడువును అక్టోబర్ 15 వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని కిల్తంపాలెం నవోదయ విద్యాలయ ప్రిన్సిపల్ బి.కె. ప్రసాద్ అధికారికంగా వెల్లడిస్తూ, అర్హత కలిగిన విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. ముఖ్యమైన మార్గదర్శకాలు & అర్హతలు  * 9వ తరగతి ప్రవేశాలకు: ప్రస్తుతం (2026–27 విద్యా సంవత్సరంలో) గుర్తింపు పొందిన ప్రభుత్వ లేదా ప్రైవేట్ పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న విద్యార్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.  * 11వ తరగతి ప్రవేశాలకు: ప్రస్తుతం గుర్తింపు పొందిన పాఠశాలలో 10వ తరగతి అభ్యసిస్తున్న విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.  * బోధనా మాధ్యమం & వసతులు: గ్రామీణ ప్రాంత ప్రతిభావంతులైన విద్యార్థులకు నాణ్యమైన సీబీఎస్‌ఈ (CBSE) విద్యతో పాటు ఉచిత వసతి, భోజనం మరియు ఇతర సౌకర్యాలు లభిస్తాయి. దరఖాస్తు చేసుకు...