Skip to main content

Posts

Showing posts with the label మోటివేషన్

నేటి మోటివేషన్.... హృదయం కదిలించే కథ

రవి సాప్ట్ వేర్ ఇంజినీర్. భార్య డెలివరీకి వెళ్ళింది. అప్పటిదాకా తాముంటున్న సింగిల్ బెడ్ రూమ్ ఇంటిని ఖాళీ చేసి ఊరికి కొంచెం దూరంగా గేటెడ్ కమ్యూనిటీలో డబుల్ బెడ్ రూమ్ ఇల్లు అద్దెకు తీసుకుని చేరాడు. స్వయంపాకం చేసుకుంటాడు. ఆరోజు ఆదివారం. పోర్టికోలో కూర్చుని కాఫీ తాగుతున్నాడు. "ఆకు కూరలు... ఆకు కూరలు" అని కేక వినిపించింది. డెబ్బై ఏళ్ల వృద్ధురాలు తలపై కూరల గంప పెట్టుకుని కనిపించింది. పిలిచాడు. "కాస్త గంప దించయ్యా" అన్నది ఆమె. "పాలకూర కట్ట ఎంత?" అడిగాడు. "పది రూపాయలకు మూడయ్యా" చెప్పింది అవ్వ. "మరీ అన్యాయం... బయట అయిదు ఇస్తున్నారు" అన్నాడు చిరుకోపంగా "నాలుగు తీసుకో నాయన.." కట్టలు తీసింది అవ్వ. పదిరూపాయలు ఇచ్చాడు. "గంప కాస్త పట్టయ్యా" అన్నది అవ్వ గంపను తనవైపు ఎత్తి పట్టుకుని. గంపను పైకి లేపుతూ రెండు కట్టలు పాలకూర తీసి ఇంట్లోకి విసిరాడు రవి.అమ్మయ్య పది రూపాయలకు ఆరు కట్టలు వచ్చాయి అనుకున్నాడు ఒకింత సంతోషంగా. అవ్వ వెళ్ళిపోయింది. "ఎంత ఆశో ఈ ముసలిదానికి... ఇవాళో రేపో చావబోతుంది... ఇంకా డబ్బు మూటలు కడుతున్నది" ముసిముసిగా ...

నేటి మోటివేషన్... ప్రశాంత జీవనం

ప్రతి వ్యక్తీ ప్రశాంతమైన జీవితాన్నే కోరుకుంటాడు. ఆహ్లాదకరమైన వాతావరణంలో జీవనయానం కొనసాగాలని ఆకాంక్షిస్తాడు. ఒత్తిళ్లకు దూరంగా చింతలేని జీవితాన్ని ఆస్వాదించాలని ఆశిస్తాడు. కానీ ఆచరణలో అది సాధ్యమేనా? జీవితం సుఖదుఃఖాల సంగమం. కష్టాలూ సమస్యలు లేని వారంటూ ఎవరూ ఉండరు. అయితే వాటిని ఎంత నిబ్బరంగా ఎదుర్కొంటామన్న దానిపైనే మన జీవన నాణ్యత ఆధారపడి ఉంటుంది.  నిజానికి జీవితం అంటే ఒక సమస్య నుంచి మరొక సమస్యకు ప్రయాణించడమే. అయితే ఆ సమస్యల వల్ల ఏర్పడే విపరిణామాలలో చిక్కుకోకుండా వాటిని చాకచక్యంగా పరిష్కరించుకుంటూ ముందుకు సాగడం మన వివేచన మీద ఆధారపడి ఉంటుంది. ప్రశాంతత కోసం మనం ఎక్కడెక్కడో అన్వేషిస్తూ ఉంటాం. కానీ, ప్రశాంతత అనేది మనలోనే, మనతోనే, మన ఆలోచనల్లోనే నిండి ఉంటుంది. సర్వకాల సర్వావస్థల్లోనూ మనసును నిర్మలంగా స్ఫటికమంత స్వచ్ఛంగా ఉంచుకోగలిగితే ప్రశాంత అనుభూతిని ఆస్వాదించవచ్చు. సమస్యలనేవి సముద్రపు అలల్లా వచ్చి పోతూనే ఉంటాయి. వాటి ఒత్తిడికి అతీతంగా మసలుకుంటే మనల్ని మనం నియంత్రించుకోవచ్చు.  సుఖదుఃఖాలు అనేవి రెండు తలుపులు లాంటివి. వాటిలో ఒకటి తెరుచుకుంటే ఇంకొకటి మూసుకుంటుంది. సమస్యలతో సంఘటనలతో నిమిత్...

నేటి మోటివేషన్... జీవితంలో గొప్ప గొప్ప విజయాలు సాధించిన వారి దినచర్య ఇలా ఉంటుంది.

1. They get up early morning - వీరంతా ఉదయం బ్రహ్మిముహూర్త సమయానికే (4 లేదా 5 గంటలకు) లేచి  🌿ఆ రోజులో ఏమేమి పనులు చెయ్యాలి,  🌿ఎలా చెయ్యాలి  🌿ముందు చెయ్యాల్సిన ముఖ్యమైన 👉మూడు పనులు ఏంటి అని ప్రణాళిక వేసుకుంటారు. 2. They folllow a morning ritual -  వీరందరికీ పొద్దున్నే లేవగానే క్రమం తప్పకుండా చేసే పనులు ఉంటాయట -  🌿వ్యాయామం లేదా యోగా చెయ్యడం,  🌿ధ్యానం చెయ్యడం,  🌿మంచి పుస్తకాలు చదవడం.   👉వీటిలో ప్రతి పనికి ఖచ్చితంగా కనీసం 20 నిముషాలు కేటాయిస్తారు. ఎలాంటి పరిస్థితిలో అయినా వాళ్ళు ఇవి అమలు చేస్తారు. 3. They spend 15 minutes each day on focused thinking -  🌿వీరు కనీసం ఒక 15 నిముషాలు  - జీవితంలో వారు ఏమి సాధించాలనుకుంటున్నారు..  🌿వాళ్ళ ప్రధమ లక్ష్యం ఏమిటి.. 🌿దానిని అందుకోవడానికి ప్రణాళిక ఏంటి..  🌿అది అందుకున్నాక జీవితం ఎలా ఉంటుంది..  🌿ఎన్ని రోజుల్లో అది సాధించాలి..  🌿ఈరోజు ఎలా ఉండబోతోంది -  అని కళ్ళు మూసుకుని రోజూ మననం చేసుకుంటూ ఉంటారు. 4. They spend time with people who inspire them -  🌿వాళ్ళ సమయ...

నేటి మోటివేషన్..... కోపం తెలివిని నశింపచేస్తుంది...

అనగనగా గోపయ్య అనే రైతు దగ్గర ఒక గొప్ప ఎద్దు ఉండేది… అది చాలా బలంగా ఉండేది. అయినా అది చాలా శాంతంగా ఉండేది. గోపయ్య ఏ పని చెబితే దాన్ని, చాలా ఇష్టంగా చేసి పెట్టేది. గోపయ్య కూడా ఆ ఎద్దును చాలా ప్రేమగా, జాగ్రత్తగా చూసుకునేవాడు. దాన్ని అస్సలు కొట్టేవాడు కాదు. దాని మీద ఈగను కూడా వాలనిచ్చేవాడు కాదు. ఆ ఎద్దు గురించి అందరితోనూ గొప్పగా చెప్పేవాడు. ఒకసారి గోపయ్య ఊళ్ళో పెద్ద మనుషులతో మాట్లాడుతూ “నా ఎద్దు నూరు బండ్లను ఒకేసారి లాగేస్తుంది- కావాలంటే వెయ్యి నాణేలు పందెం” అనేశాడు. కొందరు ఆ మాటను వినీ విననట్టు ఊరుకున్నారు కానీ, గోపన్న అంటే సరిపోనివాళ్ళు కొందరు జట్టు కట్టి, “పందెం అంటే పందెం” అన్నారు. పందెం రోజు రానే వచ్చింది. ఊళ్ళో వాళ్ళు నూరు బండ్లనూ వరుసగా ఒకదాని వెనుక ఒకటి కట్టి ఉంచారు. గోపయ్య ఎద్దును తెచ్చి మొదటి బండికి కట్టాడు. ఎద్దుకు ఇదంతా కొత్తగా ఉంది. అయినా యజమాని తెచ్చి నిలబెట్టాడు గనక, అట్లా ఊరికే నిలబడిందది. అందరూ ‘లాగు లాగు’ అన్నారు. కానీ ఎద్దు మాత్రం కదల్లేదు. గోపయ్య ఏం చెబుతాడోనని ఎదురు చూస్తూ అది అట్లానే నిలబడి ఉన్నది. గోపయ్యకు తల తీసేసినట్లయింది. ‘ఎద్దు బళ్ళను ఎందుకు లాగట్లేదు?’ అని చికా...

నేటి మోటివేషన్... మోటివేషన్ విభాగం లో ప్రధాన సూత్రాలు

🌴మంచి ఆలోచనా తీరు.. 🌴బద్దకం వదిలించండి. 🌴భయాన్ని జయించండి. 🌴మంచి మాట తీరు అలవరచుకోండి. 🌴అనుకుంటే సరిపోదు-- ఆచరించాలి. 🌴కొంచెం ఆలోచించండి.🍁 🍁 మంచి ఆలోచనా తీరు అంటే .🍁 🌿మనం చదివే పుస్తకాలే మన అలవాట్లకు, మన ఆలోచనలకు, మన కోరికలకు పునాదులు వేస్తాయి. 🌿ఆఫిల్ పండు కింద పడడం చూసిన న్యూటన్ భూమ్యాకర్షణ శక్తిని కనుగొన్నాడు.  🌿రైట్ బ్రదర్స్ విమానం కనుకున్నారన్నా,  గ్రహం బెల్ టెలిఫోన్ కనుకొన్నాడన్నా,  థామస్ ఆల్వా ఎడిసన్ విద్యుత్ బల్బు కనుకున్నాడన్నా,  👉అందుకు వారి పూర్వజన్మసుకృతం కారణం కాదు, వారి ఆలోచనలే ఈ అద్భుతసృష్టికి కారణం. 🍁 బద్దకం వదిలించండి 🌿వాడని ఇనుము తుప్పుపడుతుంది. కదలని నీరు స్వచ్ఛతను కోల్పోతుంది.  🌿బద్ధకం మెదడును నిస్తేజం చేస్తుంది. (వాఖ్య- లియోనార్డ్ డావింసీ). 🌿ఎప్పటి పని అప్పుడే చేయాలి.  🌿జీవితంలో ప్రతిపనిని దానికి నిర్డేశించిన సమయంలో చేసెయ్యాలి.  🌿రెండోఅవకాశం కొరకు వాయిదా వెయ్యద్దు. 🌿నీ జీవితం నీది. దానిని నీకు దేవుడు ఇచ్చాడు.  👉దానిని చెడగొట్టుకోవడం, బాగుచేసుకోవడం నీ ఇష్టం.  🌿చెడగొట్టుకుంటే దాని ఫలితం నువ్వే అనుభవించా...

కొత్త అలవాట్లు, పాత ఆలోచనలు మన నుంచి దూరంగా పెట్టడం వల్ల జీవితంలో ఆనందాన్ని చూడగలుగుతాం

🌿1. ఇది ఇంతా అవసరమే.. అనుకోండి. శరీర ఆరోగ్యానికి కాస్త ఎక్కువ సమయం వెచ్చించడం, జిమ్‌కి వెళ్లడం, ఇంట్లో రాత్రి భోజనం చేయడం మొదలైన వాటితో పాటు, శరీరానికి కావలసిన విశ్రాంతి తీసుకోవడం, సినిమా లేదా షో చూడటం, స్నేహితులను కలవడం మొదలైన చేయడం ఆకర్షణీయంగా, ఆహ్లాదకరంగా ఉంటుంది. 🌿2. సాకులు వెతక్కండి. సాధారణంగా, ఏ పనినైనా చేయాల్సి వస్తే.. నేను చేయలేనని.. ఇప్పుడు నా వల్ల కాదని.. "నేను అలసిపోయాను," "నాకు సమయం లేదు," "నేను రేపు చేస్తాను," వంటి సాకులు చెపుతుంటాం.  👉ప్రతి దానికి ఇతరులను నిందించడం మానేసి, మీ జీవితం, మీ పనికి బాధ్యత వహించాల్సింది కూడా మీరేనని గుర్తుంచుకోవాలి. కాబట్టి సాకులు చెప్పడం మానేసి, మీ స్వంత మార్గానికి బాటలు వేయండి. 🌿3. వ్యక్తిగతంగా తీసుకోవడం ఆపండి. ఎవరి గురించో ఎవరో చెపుతుంటే మీరు చెవి వేయకండి. ఇతరులు జీవితాల్లోకి తొంగి చూసే ధోరణి చేటు తెచ్చిపెడుతుంది.  👉ఉచిత సలహాలను ఇవ్వడం, తీసుకోవడం లాంటివి అదుపులో ఉంటే మంచిది. ఎదుటివారు చెప్పింది బహుశా అసత్యం, అసంబద్ధం కావచ్చనేది ఆలోచించండి.  🌿4. వ్యాయామం చేయండి. రోజూ ఉదయాన్నే వ్యాయామానికి వెళ్లండి. ఈ అలవాటు ...

నేటి మోటివేషన్... పాము - కోతి

ఒక పాము చాలా హుషారుగా పాకుతూ,దొర్లుతూ అటువైపుగా వెళ్తోంది.దాని హుషారుతనాన్ని చూసిన ఒక కోతి దాన్ని పట్టుకుంది...ఆ పాము కోతిని కాటు వేయబోయింది...భయంతో కోతి ఆ పాము పడగను గట్టిగా పట్టుకుంది... గట్టిగా అరవసాగింది కోతి.. చుట్టుకున్న మిగతా కోతులన్నీ ఇలా అనుకున్నాయి. ఇక ఈ కోతి బ్రతకడం కష్టం..కోతి పామును వొదిలితే కచ్చితంగా కాటు వేస్తుంది...మనం దగ్గరికెళితే మనం కూడా పాము కాటుకు బలి కావాల్సిందే...మనం దూరంగానే ఉండటం మంచిది అని వెళ్లిపోయాయి... తనవాళ్ళంతా తనని రక్షిస్తారేమో అని ఎదురుచూసిన కోతికి నిరాశే ఎదురయ్యింది...అలాగే భయంతో కూర్చుంది.అటువైపుగా ఒక ముని వెళుతూ కోతి స్థితిని అర్థం చేసుకుని కోతితో ఇలా అన్నాడు.. ' నీ చేతిలోని పాము నువ్వు భయంతో గట్టిగా పట్టుకున్నప్పుడే ఊపిరి ఆడక చచ్చింది..వదిలేస్తే నిన్ను కాటు వేస్తుందని భయపడి ఇబ్బంది పడుతున్నావు.దాన్ని వదిలేయి" అన్నారు ముని...కోతి ఆ పామును వదిలి ఒక్క గెంతుతో చెట్టు ఎక్కేసింది...ఇందులోని నీతి ఏంటంటే... నీకు కష్టం వచ్చినప్పుడు దాని గురించే ఆలోచిస్తూ భయపడుతూ ఉంటే ఆ కష్టం నిన్ను వదిలి పోదు...కష్టాన్ని దూరంగా విసిరి కొట్టే పరిష్కారం వెతకాలి. అలా...

నేటి మోటివేషన్... మళ్ళీ బాల్యం వెనక్కి తీసుకొనేలా అవకాశం వస్తే

ఒక రోజు ఒక పిల్లాడు తన నాన్నతో కలిసి జాతరకు వెళ్ళాడు. కొడుకును జాతరంతా తిప్పి చూపించి సంతోష పరచాలని నాన్న ఆలోచన. జాతరలో మంచి మంచి బొమ్మలు, వస్తువులు కొనుక్కుని తన స్నేహితులకు చూపించి నాన్న కొనిచ్చడాని చెప్పుకొని ఆనందం పొందాలని కొడుకు ఆలోచన. పుత్రునికి జాతర విశేషాలు వివరిస్తూ మెల్లగా నడుస్తున్నాడు నాన్న. ఇంకా తనకి బొమ్మలు ఏవి కొనిపెట్టలేదని మనసులో ఆందోళన పడుతున్నాడు పిల్లాడు.  తన దగ్గర ఉన్న డబ్బుతో ఏమి కొనివ్వగలనా అని ఆలోచిస్తున్నాడు నాన్న.  పిల్లాడికి ఒక బొమ్మ నఛ్చి కొనిమ్మన్నాడు.  జేబులో ఉన్న డబ్బు చూసి , ఇంకొకటి కొందాం ,పద ముందుకు అన్నాడు నాన్న.  అలా పిల్లాడికి నచ్చిన బొమ్మలు కొనలేని తన స్థితిని మనసులోనే తిట్టుకుంటూ , తన దగ్గర ఉన్న డబ్బుతో కొనగల బొమ్మల కోసం నాన్న చూస్తున్నాడు.  పిల్లాడు జాతరలో కనిపించిన బొమ్మలన్ని కొనేస్తే బాగుంటుంది కదా అని ఆలోచిస్తున్నాడు. నాన్న మీద మెల్లగా కోపం ప్రారంభమైంది.  నాన్న తనకు అడిగిన వస్తువులు కొనివ్వడం లేదు. ఎందుకు తీసుకొచ్చినట్లు?  ఉన్న డబ్బు అంతా పిల్లాడి బొమ్మలకు ఖర్చు పెడితే ఇంట్లో వస్తువుల మాటేమిటి అని నాన్న ఆందోళన...

నేటి మోటివేషన్... పశ్చాత్తాపం

ఒక స్థలం తక్కువధరకు వస్తోందని తెలిసి ప్రక్కనున్న ఊరికి కారులో  బయలుదేరి వెళ్ళి , తిరిగి ఇంటికి వస్తున్నాడు రఘు. దారి మధ్యలో కారు అకస్మాత్తుగా రిపేరుకి వచ్చి ఆగిపోయింది. రఘు ఎంతగా ప్రయత్నించినా అది స్టార్ట్ కాలేదు. మండుటెండలో ఆదారిలో ఎవరైనా వస్తారేమో అని కొద్దిసేపు వేచి చూశాడు. కానీ ఎవరూ రాకపోవడంతో రఘుకు దాహం వేసి,  ప్రక్కనే పొలంలో ఉన్న మోటారు బావి దగ్గరకు వెళ్ళి........... అక్కడున్న ఒక వ్యక్తితో తాగడానికి మంచినీళ్ళు ఇవ్వమని అడిగాడు.అతను తాగేందుకు నీటిని ఇస్తూ............రఘు వివరాలను అడిగాడు. రఘు వాళ్ళ నాన్నగారి పేరు చెప్పగానే............. అతను ఎంతో అభిమానంగా “ నువ్వు ఆయన కొడుకువా.............? ఇలా నీడలోకి వచ్చి కూర్చోవయ్యా............” అని  అక్కడున్న మంచాన్ని చూపించాడు. రఘు మంచంలో కూర్చోగానే, “ మీరు ఇక్కడే ఉండండి, నేను ఊర్లోకి వెళ్ళి కారు రిపేరు చేయడానికి మెకానిక్ ను పిలుచుకొని వస్తాను “ అని సైకిల్ తీసుకొని వెంటనే ఊర్లోకి వెళ్ళి, పది నిమిషాలకు ఒక మెకానిక్ ను తీసుకొని అక్కడికి వచ్చాడు. టవల్ తో చెమటలు తుడుచుకుంటున్న ఆ వ్యక్తి వైపు రఘు ఆశ్చర్యంగా చూస్తూ, “ మా నాన్న గారు మీకె...

నేటి మోటివేషన్... ఉచిత_సలహా

'చచ్చిపోయేమనుకో.. అప్పుడు ఏమవుతుందంటావ్?' 'ఆ చావులో నన్నెందుకూ కలపడం? నాకింకా బతకాలనే ఉంది' 'సరే.. పోనీ.. నేనే చచ్చిపోయేననుకో.. అప్పుడు ఏమవుతుందంటావు?' 'ఏమీ అవ్వదు.. నిన్ను ఇష్టపడేవాళ్ళు ఓ రెండ్రోజులేడుస్తారు.. స్విగ్గీ వాడూ, డొమినోస్ వాడూ 'అయ్యో.. మంచి బేరం పోయిందే.. సారు మంచిగా టిప్పులిచ్చేవాడు' అని బాధపడతారు' 💥'అలాక్కాదు.. అంటే.. పుణ్యం గట్రా బాగానే చేసేను కదా.. స్వర్గానికి పోతానంటావా?' 'స్వర్గం అంటే ఏమిటో?' 'అదే.. ఇంద్రుడు, మునులూ కూచునుంటే రంభా, మేనకా డాన్సాడుతూంటారూ..' 'నీకసలే డాన్సులంటే బోరు కదా.. మరి నువ్వెళ్ళి ఏం చేస్తావు?' 'పుణ్యం చేస్తే అక్కడ మనకోసం రంభా, మేనకా వెయిటింగన్నారు? ' ' రంభా, మేనకా ఏవైనా కామపిశాచులేవిటీ? పైకొచ్చే మగవెధవలందరికోసం కాసుక్కూచోడానికి? అయినా నువ్వు పుణ్యం చెయ్యడానికి కారణం ఎవరో తెలీని ఆడదానితో పడుక్కోడానికన్నమాట' ' మరి పుణ్యం చేసి ప్రయోజనమేంటీ అని? ' 💥' సరే.. మీ ఆవిడ పుణ్యం చేసిందనుకో.. ఆవిడ కోసం ఇంద్రుడూ, వరుణ దేవుడూ కాసుక్కూచునుంటారా? ' ' ఛఛ...

నేటి మోటివేషన్... మనుషులు అందరికి మంచి మిత్రుడు ఎవరో తెలుసా ......!!

ఈ ఆధునిక యుగంలో ప్రతి మనిషికి మిత్రులు ఉంటారు.అందరూ చెబుతూవుంటారు నాకు 100 మంది ఫేస్బుక్ ఫ్రెండ్స్ ఉన్నారు, ఇంస్టాగ్రామ్ లో 100 మంది ఫాలోయర్స్ ఉన్నారు అని.ఇలాంటివి చెప్పుకోవడానికి బాగుంటాయి. నిజానికి ఒక మంచి మిత్రుడు 100 పుస్తకాలతో సమానం.అతను నీకు మంచిని బోధించి అలవారుచుకొనేలా చేస్తాడు.ఇంక 100 మంది మిత్రులు ఉన్నా వారిలో మంచి బుద్ధి లేకపోతే వాళ్లు మనకి ఎందుకు పనికిరారు. ఒక్క పని బాగా చేస్తారు అదే మిమల్ని నాశనం చేయడం.ఒక మంచి మిత్రుడు మిమల్ని ఉన్నత శిఖరాలను ఎక్కిస్తే దుర్బుద్ధి గల మితుడు నిన్ను అందాకారంలోకి తోసేస్తాడు.మరి మీరు మీ మంచి మిత్రుడ్ని ఎంచుకున్నారా! ఆ మంచి మిత్రుడు ఎవరో మీకు తెలుసా! ఆశ్చర్య పోకండి నిజానికి మీకంటే గొప్ప మిత్రుడు మీకు ఇంకెవరు దొరకరు.మీకు మాత్రమే మీ గురించి పూర్తిగా తెలుస్తుంది.మీ ఆలోచనలు ఎలా ఉంటాయో తెలుస్తుంది. మీ గురించి మీకు అంత బాగా తెలిసినప్పుడు మీ కంటే మంచి మిత్రుడు మీకు ఈ ప్రపంచంలో దొరకడు.మీతో మీరే చెప్పుకోవాలి మీరు మంచి పనులు చేయాలని, అనుకున్న గమ్యాన్ని చేరుకోవాలని,కష్టంలోనే సుఖాన్ని వెతుక్కోవలని,తల్లిదండ్రులను సంతోషపెట్టాలని. అంతేగాని మన కోసం ఎవరో రావాలి వ...

నేటి మోటివేషన్... జీవిత ప్రయాణం

పెద్దతనం, ముసలి తనం, వృద్ధాప్యం అని అందరూ  హడలగొట్టి చంపేసే ఆ దశ వచ్చేసిందా?  అప్పుడే వచ్చేసిందా? నిన్నగాక మొన్ననేగా మావయ్య కొనిచ్చిన కొత్త ఓణీ చూసి మురిసి ముక్క చెక్కలయిందీ ! ఎదురింట్లో అద్దెకున్న స్టూడెంట్ కుర్రాడు ఇంకా కాలేజీకి వెళ్ళడేమిటా అని విసుక్కున్నదెప్పుడూ…  నాలుగు రోజుల క్రితమేగా! ప్రతి పెళ్ళిచూపులకి సింగారించుకుని కూచుని, తీరా వాళ్లు జాతకాలు నప్పలేదని కబురు పెడితే తిట్టరాని తిట్లన్నీ అందరం కలిసి తిట్టుకుంటూ ఎంజాయ్ చేసింది నిన్న మొన్నేగా! నాన్నని కష్టపెట్టకూడదని కూడబలుక్కుని, ఇంటి అరుగుమీద పెళ్ళి, పెరట్లో కొబ్బరి చెట్టుకింద బూందీ, లడ్డూ, కాఫీలతో రిసెప్షనూ ఇచ్చి, ఇంటి ఇల్లాలినయి ఎన్నాళ్ళయిందనీ ! అందుకు తగ్గట్టే పెళ్లివారు ఒకే పట్టుచీర తెచ్చి అన్నిటికీ దాన్నే తిప్పితే, నలుగురూ నవ్వినందుకు పౌరుషం వచ్చి,  'మేం బొంబాయిలో కొనుక్కుంటాం’ అని గొప్పలు పోయింది  ఈ మధ్యనేగా ! అయినా ఏం లోటయిందని ? వాయిల్సూ, జార్జెట్ లూ, బిన్నీలూ, బాంబే డయింగులూ, విమలలూ, వెంకటగిరి , ఉప్పాడ, గద్వాల, గుంటూరు, బెనారసు, కంచి, మైసూరు, ధర్మవరం, మహేశ్వరం, ఒరిస్సా, అస్సాం, మహారాష్ట్ర, మధ్యప...

నేటి మోటివేషన్... ఎవరు పేదవారు???

ఒక చాలా సంపన్న మహిళ చీరల షాప్ కి వెళ్లి , "బాబూ! కొన్ని చౌకగా చీరలు చూపించండీ! నా కుమారుడి వివాహం. కట్నంగా మా ఇంట్లో పని మనిషికి ఇవ్వాల్సి ఉంది." అలాగే అని చౌక చీరలను చూపించాడు ఆ షాప్ అబ్బాయి . అందులోంచి ఒక చౌక చీరను ప్యాక్ చేయించుకుని వెళ్లిపోయింది ఆ సంపన్న మహిళ. కొంత సమయం తర్వాత ఆ చీరల షాప్ కి మరొక మహిళ వచ్చి, "అన్నా! కొన్ని ఖరీదైన చీరలు చూపించు! మా యజమానురాలి కొడుకు వివాహం. ఈ సందర్భంగా మా యజమానురాలుకు కట్నం పెట్టడం కోసం నెలనెల డబ్బులు కూడబెట్టాను. ఆమెకు ఒక మంచి చీరను కట్నంగా ఇవ్వాలి. అలాగే అని ఖరీదైన చీరలను చూపించాడు ఆ షాప్ అబ్బాయి . అందులోంచి ఒక ఖరీదైన చీరను ప్యాక్ చేయించుకుని వెళ్లిపోయింది ఆ పేద మహిళ. ఈ ఇద్దరు స్త్రీలలో ఎవరు పేదవారు? పేదరికం ఎక్కడ ఉంది ? మనస్సులోనా? గుణం లోనా? సంపన్న మహిళకు ఇంట్లో పేదరికం లేకపోవచ్చు! కాని ఆమే వ్యక్తిత్వంలో పేదతనం ఉంది. ఆ పేద మహిళకు ఇంట్లో పేదరికం ఉండోచ్చు! కాని ఆమే వ్యక్తిత్వంలో పేదతనం లేదు. ఆ ఇద్దరు స్త్రీలను ఇల్లుతోనూ - దేనితోనూ సంబంధం లేకుండా ఒంటరిగా నిల్చోబెడితే ఎవరు పేదవారు ???              ⭐ ⭐ ⭐ ఎవరు ధ...

నేటి మోటివేషన్... Heart TouchingStory....

అమ్మాయి : హాయ్...లవ్ యు బంగారం... అబ్బాయి : లవ్ యు టూ డార్లింగ్.... అమ్మాయి : నన్ను ఎప్పటికి వొదిలిపెట్టవ్ కదా... అబ్బాయి : నువ్వు వొదిలెసినా...నా ప్రాణం పొయిన నిన్ను మాత్రం వొదలను...నీ కోసం చచ్చిపొతా... అమ్మాయి : ఒరేయ్ అలా అనకురా...భాదగా ఉంది అలా అన్నవో కొడతా నిన్ను... అబ్బాయి : ఉరికే అన్నానురా.... అమ్మాయి : సరే ఇ రోజు ఎంటి స్పెషల్... అమ్మాయి : నువ్వు నా లైఫ్ లోకి రావడమే స్పెషల్...నాకు ప్రతి రోజు స్పెషల్ నువ్వంటే...లవ్ యు రా... అబ్బాయి : లవ్ యు టూ... కొన్ని రోజులా తర్వత.... ఆ అబ్బాయి ఆ అమ్మాయికి చూపించే ప్రేమ ఎక్కువగా నచ్చదు...బోర్ అనిపిస్తుంది...అతను చూపించే ప్రేమ ఆ అమ్మాయికి విసుగు వచ్చింది...ఎవరినైనా లవ్ ఎంత చేస్తె తిరిగి అంత చేయాలి కాని ఆ అమ్మాయి మాత్రం వద్దు అనుకూనేధి అబ్బాయి : బంగారం అమ్మాయి : హా చెప్పు అబ్బాయి : ఎంటి ఇ మధ్య కొత్తగా ఐ పొయావ్...సరిగా మాట్లాడట్లే అన్లైన్లో ఉండి కూడ మెసెజ్ చేయ్యాట్లే...మెస్సెజ్ చేస్తే లేట్ రిప్లై... అమ్మాయి : ఎం లేదు ఊరికే... అబ్బాయి : సర్లే...మనం మ్యారెజ్ ఎప్పుడు చేస్కుందాం... అమ్మాయి : నాకు నువ్వంటె ఇంట్రేస్ట్ లేదు...ఫుల్ బోర్ నువ్వంటే గుడ్ బై......

నేటి మోటివేషన్... మనిషిని అభిమానించగలం గానీ ద్వేషించే హక్కు మనకు లేదు..

నిన్నటి వరకూ ఎంతో ఇష్టపడిన మనిషిపై చిన్నదో, చితకదో కారణంతో అయిష్టం ఏర్పడుతుంది. అలా అయిష్టం మనసులో చోటుచేసుకున్న క్షణం మొదలు.. ఆ వ్యక్తీ, ఆ వ్యక్తితో ముడిపడిన ప్రతీ ఆలోచనా, ఆ వ్యక్తి హావభావాలు మొదలుకుని అభిప్రాయాలూ, మాటలూ, ఛేష్టల వరకూ ప్రతీదీ అపసవ్యమైనవిగానే, వికారంగానే కన్పిస్తుంటాయి. అవే ఆలోచనలనూ, అదే మనిషి చిరునవ్వునూ ఇన్నాళ్లూ మనం ఆస్వాదించాం. "ఎంత కల్లాకపటం లేని మనిషి మనకు జీవితంలో ఆత్మీయంగా దొరికారో కదా" అని మురిసిపోయాం. పదిచోట్లా ఆ మనిషి గురించి గర్వంగా చెప్పుకున్నాం. మరి ఆ చిరునవ్వులో ఈ క్షణం కుటిలత్వం గోచరిస్తోందంటే అది మన దృష్టిదోషమా.. లేక రాత్రికి రాత్రి ఆ మనిషిలో వచ్చిన అనూహ్యపు మార్పా?   మనుషుల్ని మనం దగ్గరకు తీసుకునేతనంలోనే మనం పరిణతిని కలిగి ఉండడం లేదు. ఒక వ్యక్తిలోని ఏదో ఒక్క పార్శ్యాన్నే చూసి మనం మనుషుల్ని అభిమానిస్తున్నాం, చేరువ అవుతున్నాం. మనకు నచ్చిన ఆ ఒక్క కోణంతో సరిపెట్టుకోకుండా మరింతగా ఆ వ్యక్తికి మనం దగ్గర అయ్యే కొద్దీ ఆ వ్యక్తిని నఖశిఖపర్యంతం గమనిస్తూ మనకు ఇంతకాలం ఆ మనిషిలో తెలియని కోణాలనూ గ్రహిస్తూ వాటినీ జడ్జ్ చేస్తూ.. వీలైతే మనకు నచ్చినట్లు ఆ ఇతర క...

నేటి మోటివేషన్... నమ్మకం...!

రాయవరంలో రామ్మూర్తి అనే దర్జీ ఉండేవాడు. అతని ఒక్కగానొక్క కూతురు సుకన్య. కూతురిని కలవారింటి కోడలిని చెయ్యాలని కలలు కనేవాడు. తన పేదరికపు కష్టాలు ఆమెకు ఉండకూడదని శ్రమపడి ఆమె పెళ్లికి డబ్బు కూడబెట్టేవాడు. ఒకనాడు బంగారం తగ్గిందని జనం చెప్పుకోవడం రామ్మూర్తి చెవిన పడింది. కూడబెట్టిన డబ్బుతో సుకన్యకు నగలు చేయించాలనుకున్నాడు. డబ్బును జాగ్రత్తగా మూట కట్టుకుని నగల కొనుగోలు నిమిత్తం పట్నం బయలుదేరాడు. కానీ దారిలో చిన్నపాటి అడవి దాటాలి. దొంగల భయం ఉంటుందేమోనని సందేహించాడు. ఎంతో కాలంగా ఎరిగున్న వీరయ్యను తోడు రమ్మన్నాడు. ఇద్దరూ మధ్యాహ్నం వరకూ నడిచాక ఒక పెద్ద చెట్టు కింద ఆగారు. తెచ్చుకున్న రొట్టెలు తిన్నారు. కాసేపు నడుం వాల్చారు. బడలికతో రామ్మూర్తికి కునుకు పట్టింది. ఎందుకో కళ్లు తెరిచిన రామ్మూర్తి ఉలిక్కిపడ్డాడు. అతడి తల కింద పెట్టుకున్న డబ్బుల సంచీని వీరయ్య నెమ్మదిగా లాగుతూ కనిపించాడు. పట్టుబడగానే మొహం చూపించలేక అక్కడి నుంచి ఉడాయించాడు. రామ్మూర్తి దిగ్భ్రాంతికి లోనయ్యాడు. కొంచెం ఆదమరుపుగా ఉంటే ఏళ్ల తరబడి కూడబెట్టుకున్న తన కష్టార్జితాన్ని పోగొట్టుకునేవాడు. ఎంత ప్రమాదం తప్పిందీ! ఆ ఉద్దేశంతో అతడు ఏడ్వ సా...

నేటి మోటివేషన్... నాగరికత నేర్పుతున్న పరుగు పందెంలో మనిషి కోల్పోతున్నదేమిటి ??

" నాతోపాటు కాలేజీలో చదువుకున్న నా ఫ్రెండ్ ఒకడు ఓ పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తున్నాడు ప్రస్తుతం.. ఈమధ్య వాడు ఫోన్ చేసి మాట్లాడినప్పుడు " లైఫ్ ఎలా లీడ్ అవుతోందిరా " అని నేను అడిగితే మొత్తం వాడు పడుతున్న ఇబ్బందులన్నీ ఈవిధంగా చెప్పుకొచ్చాడు నాతో ఇలా. ( ఆ సంభాషణ యధాతధం ) " పొద్దున్న పదిగంటలకే ఆఫీస్ అయినా ఎనిమిదీ ఆ సమయానికే బయల్దేరాల్సి వస్తోందిరా ట్రాఫిక్ వల్ల లేట్ అవుతుందని.. ఆ సమయానికెళ్ళి రాత్రి ఇంటికొచ్చేసరికి మరలా పదవుతోంది.. ఇక అప్పుడు వంట వండుకొనే ఓపిక లేక బయటెక్కడో కర్రీ పాయింట్ నుంచి తెచ్చుకుని తింటున్నా.. అది ఇంట్లో చేసినట్లు ఉండదుగా ? మసాలాలనీ ఇదనీ ఇదనీ ఏవేవో పేర్లు పెట్టి నానారకాల చెత్తా అందులో కలిపి ఏదో చేస్తాడు వాడు.. అదే భాగ్యం అనుకొని తెచ్చుకు తినాల్సి వస్తోంది.. అది తినడం కాసేపు కంప్యూటర్లో సినిమాలో , లేక జబర్దస్త్ వీడియోలో చూసి పడుకోవడం.. మళ్ళా లేవడం - ఆఫీస్ కి వెళ్ళడం - తిరిగిరావడం. ఇంకేం చేద్దామన్నా టైం ఉండట్లేదు పొద్దునెప్పుడో సూర్యోదయాన్ని చూస్తున్నా , రాత్రి చంద్రోదయాన్ని చూస్తున్నాను, మధ్యలో అసలీ ప్రపంచంలో ఏమవుతోందనేది కూడా తెలీట్లేదురా ,,...

నేటి మోటివేషన్... ప్రేమించే తండ్రి వున్నంతకాలం ఏ కూతురయినా ధనవంతురాలే !! 🙏🙏🙏🙏🙏

అనుకోకుండా తన ఇంటికి వచ్చిన తండ్రిని చూసి కూతురు ఎంత సంతోషించిందో అంత ఖంగారు పడింది!🙏 దూరం నుంచి వచ్చిన తండ్రి భోజనం చెయ్యకుండా ఎలా వెళతాడు .....? కానీ ఇంట్లో బియ్యంలేవు,  డబ్బాలోంచి వూడ్చి వూడ్చి తీస్తే  సోలెడు కూడా లేవు,  తన అడుగంటిన సంసారం  కన్నతండ్రి కంట పడక తప్పేట్టు లేదు!  కూతురి ఆందోళన తండ్రి గమనించాడు!  ఏదో పనున్నట్టు వంటింట్లోకి వెళ్ళి  అన్ని డబ్బాలూ మూతలు తీసి చూశాడు.  బాధతో ఆయన మనసు కృంగిపోయింది..  ఎంత గారంగా పెంచాడు పిల్లని!!  అల్లుడు నిక్షేపం లాంటి ఉద్యోగం మానేసి.. వ్యాపారంలోకి దిగి నష్టాల పాలయి  సంసారం ఈ స్తితికి తెచ్చాడు!  " ఇప్పుడే వస్తా తల్లీ " అని బైటకి వెళ్ళాడు,  తండ్రి వచ్చాక ఏం సంజాయిషీలు చెప్పుకోవాలా అని కూతురు దిగులుగా ఆలోచిస్తోంది!  "ఇక్కడే అబ్బీ ఆపు " రిక్షా దిగిన నాన్న సామానంతా ఇంట్లోకి చేర్పించాడు బియ్యం బస్తా తో సహా!  ఏమీ అనలేక కూతురు గుడ్లనీళ్ళు కుక్కుకుంది .. " ఊరుకో తల్లీ , ఓర్చుకుంటే ఓరుగల్లు పట్టణమవుతుందంటారు , ఓర్పుగా వుండు , నీకూ మంచిరోజులొస్తాయి "ఓదార్చాడు!  ఆయన అన్నట్టే ...

నేటి మోటివేషన్... ఆ... కొడుకుల కోసమే ఈ పోస్ట్

గమనిక: ఇది కొంత మంది ని ఉద్దేశించి మాత్రమే.ఆ కొంత మంది లో మీరు లేకపోతె ఈ పోస్ట్ మీకు తప్పకుండ నచ్చుతుంది. "ము* కిందకి ముప్పై ఏళ్ళు" వస్తున్నా.... అమ్మబాబు సంపాదన మెక్కుతున్న సన్నాసుల్లారా.....మీకే చెప్తున్నా వినండి. మీరేదో పొడిచేసి చించేసి చదివిన చదువుకి సరిపడిన ఉద్యోగం రాలేదు అని ఏడుస్తూ, ప్రభుత్వాన్ని నిందిస్తూ సంవత్సరాల తరబడి రోడ్డున పడి తిరిగేటపుడు ఒక్క క్షణం ఐన ఆలోచించారా ...?  నీ భవిష్యత్తు కోసం, నీ చదువు కోసం ఇప్పటికి నీ తండ్రి ఓ కూలివాడిలా, ముసలి ఎద్దులా పని చేస్తున్నాడని.  ఉడుకు రక్తం... ఉడుకు రక్తం... అని విర్రవీగే ఏదవల్లారా రంగులు పూసుకునే వాళ్ళ వెనక పరిగెత్తడం కాదు.... నీ జీవితం కోసం పరిగెత్తు.   ఎవడో వస్తాడు,ఎదో చేస్తాడు...! ఆడొస్తే అది చేస్తాడు, ఈడొస్తే ఇది చేస్తాడు అన్నది కాదు నువ్వెవరు ? నువ్వేం చేస్తావ్ ? నీకోసం ఎం చేస్తావ్ ? ఎప్పుడైనా చేసావా ? ఆలోచన ఐన చేసావా ?  టైం బాలేదు, టైం రాలేదు అని కూసే నువ్వు ఏ రోజు ఐన టైంకి లేచావా ? ఏ పని ఐన సక్రమంగా చేసావా ? ఇంట్లో అమ్మ పాల పాకెట్ తెమ్మంటే కదలవు......అదే నీ ఫ్రెండ్ రాత్రి 2 కి బీరేద్దాం రమ్మంటే పరుగెత...

నేటి మోటివేషన్... పరిశీలన!

పరిశీలన అంటే ఏమిటి తాతయ్యా’ అడిగాడు తరగతి పుస్తకం చదువుతున్న రమణ. పక్కనే పత్రికలో వార్తలు చదువుకుంటున్న వాళ్ల తాతయ్యని. తాతయ్య పేపర్‌ మడిచి పక్కన పెడతూ ‘మంచి ప్రశ్నే అడిగావు. పరిశీలన అంటే మన చుట్టు పక్కల జరుగుతున్న ప్రతి విషయాన్నీ శ్రద్ధగా గమనించడం అన్నమాట. అలా గమనిస్తుండటం వల్ల మనకు కొత్త విషయాలెన్నో తెలుస్తాయి. మన బుద్ధి వికసిస్తుంది. దాంతో మన విజ్ఞానం కూడా పెరుగుతుంది. అందువల్ల మన చుట్టుపక్కల జరుగుతున్న ప్రతీ విషయాన్నీ ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలి’ అని వివరించాడు తాతయ్య.  ‘అలాగే తాతయ్యా’ అన్నాడు రమణ. ఎనిమిదేళ్ల రమణ చాలా చురుకైన వాడు. తెలివి తేటలున్నవాడు. చదువులోనూ ఆటల్లోనూ ముందే. ఉపాధ్యాయులు అతన్ని ఎంతగానో మెచ్చుకుంటుంటారు.  ఆ సాయంత్రం రమణ, వాళ్ల తాతయ్యతో పాటు బజారుకెళ్లాడు. ఆ మరునాడు పండుగ రోజు కావడంతో అందుకు కావలసిన సరుకులు కొనడానికి ఒక పచారీ దుకాణం దగ్గరికి వెళ్లారు ఇద్దరూ. ఆ దుకాణంలో సరుకులు ఎప్పటికప్పుడు తూకం వేసి అమ్ముతుంటారు. వాళ్లు సరుకుల కోసం వెళ్లేసరికి వాళ్ల ముందు ఇంకో ఇద్దరు వ్యక్తులు వరుసలో నిలబడి ఉన్నారు. తమ వంతు కోసం ఎదురు చూస్తూ వాళ్ల వెనుక నిలబడ్డారు తాతయ్...