Skip to main content

నేటి మోటివేషన్... ప్రశాంత జీవనం


ప్రతి వ్యక్తీ ప్రశాంతమైన జీవితాన్నే కోరుకుంటాడు. ఆహ్లాదకరమైన వాతావరణంలో జీవనయానం కొనసాగాలని ఆకాంక్షిస్తాడు. ఒత్తిళ్లకు దూరంగా చింతలేని జీవితాన్ని ఆస్వాదించాలని ఆశిస్తాడు. కానీ ఆచరణలో అది సాధ్యమేనా? జీవితం సుఖదుఃఖాల సంగమం. కష్టాలూ సమస్యలు లేని వారంటూ ఎవరూ ఉండరు. అయితే వాటిని ఎంత నిబ్బరంగా ఎదుర్కొంటామన్న దానిపైనే మన జీవన నాణ్యత ఆధారపడి ఉంటుంది. 

నిజానికి జీవితం అంటే ఒక సమస్య నుంచి మరొక సమస్యకు ప్రయాణించడమే. అయితే ఆ సమస్యల వల్ల ఏర్పడే విపరిణామాలలో చిక్కుకోకుండా వాటిని చాకచక్యంగా పరిష్కరించుకుంటూ ముందుకు సాగడం మన వివేచన మీద ఆధారపడి ఉంటుంది. ప్రశాంతత కోసం మనం ఎక్కడెక్కడో అన్వేషిస్తూ ఉంటాం. కానీ, ప్రశాంతత అనేది మనలోనే, మనతోనే, మన ఆలోచనల్లోనే నిండి ఉంటుంది. సర్వకాల సర్వావస్థల్లోనూ మనసును నిర్మలంగా స్ఫటికమంత స్వచ్ఛంగా ఉంచుకోగలిగితే ప్రశాంత అనుభూతిని ఆస్వాదించవచ్చు. సమస్యలనేవి సముద్రపు అలల్లా వచ్చి పోతూనే ఉంటాయి. వాటి ఒత్తిడికి అతీతంగా మసలుకుంటే మనల్ని మనం నియంత్రించుకోవచ్చు. 

సుఖదుఃఖాలు అనేవి రెండు తలుపులు లాంటివి. వాటిలో ఒకటి తెరుచుకుంటే ఇంకొకటి మూసుకుంటుంది. సమస్యలతో సంఘటనలతో నిమిత్తం లేకుండా భావనలను ఆలోచనలను నిర్మలంగా ఉంచుకోగలిగినంత కాలం ప్రశాంతమైన జీవితాన్ని గడపవచ్చు. ఈ లోకంలో నాకెలాంటి సమస్య లేదు అని ఎవరైనా చెబితే అది వారిని వారు మోసం చేసుకుంటున్నట్టుగా భావించాలి. కాలు తడవకుండా నదినీ, కళ్లు తడవకుండా జీవితాన్నీ దాటలేమని పెద్దలు ఎప్పుడో చెప్పారు. కష్టసుఖాలు జీవనపర్యంతం మనతో కొనసాగుతూనే ఉంటాయి. తామరాకు మీద నీటిబొట్టులా వాటి తాలూకు ప్రభావం అంటకుండా మనదైన ప్రశాంతతను ఆస్వాదిస్తూ జీవన సమరంలో నిలిచి గెలవాలి. చాలామంది సమస్యలకు పరిష్కారం వెతకడంలోనే జీవితంలో విలువైన సమయాన్ని వృథా చేస్తుంటారు. దీనివల్ల మనశ్శాంతి కరవవుతుంది. ‘జీవితం రంగుల నది లాంటిది. ప్రతి రంగుకూ ఒక భావం ఉంటుంది. ఆ భావజాలంతో ముందుకు ప్రవహించాలి. జీవితం అలుపెరగని ప్రయాణం. ప్రతి మజిలీలోనూ ఆనందంగా సాటి ప్రయాణికులతో మమేకం కావాలి. ప్రతికూల పరిస్థితుల్లో సైతం ఎదురు నిలిచి పోరాడి గెలుపును సాధించడమే జీవితానికి లక్ష్యం కావాలి’ అని రామకృష్ణ పరమహంస ఉపదేశించారు.

వాస్తవ దృష్టితో ఆలోచించినట్లయితే సమస్యలు చాలావరకు మనకి మనం తెచ్చుకునేవే! మనం సృష్టించుకున్న సమస్యల నుంచి మనమే బయటపడాలి. ఎవరిని వారే ఉద్ధరించుకోవాలి- అని భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పిన సందేశం అనుసరణీయం. ఒత్తిళ్లకు దూరంగా, సమస్యలు లేకుండా జీవన గమనమనేది అసాధ్యం. కాబట్టి ముళ్ల మధ్య వికసించిన గులాబీ పువ్వులా, బురద నుంచి ఉద్భవించిన తామర పువ్వులా ఎవరిని వారు వికసింప చేసుకోవాలి. జీవనపథాన అలుపెరగని బాటసారిగా పురోగమించాలి. జీవన మాధుర్యాన్ని నిరంతరం ఆస్వాదించాలి.

🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

Comments

Popular posts

TET అభ్యర్థులకు ఉపయోగకరమైన ఆన్‌లైన్ మాక్ టెస్ట్ ప్లాట్‌ఫామ్

TET పరీక్షకు సిద్ధమవుతున్న అభ్యర్థుల కోసం ఒక ప్రత్యేకమైన ఆన్‌లైన్ మాక్ టెస్ట్ ప్లాట్‌ఫామ్ అందుబాటులో ఉంది. ఈ ప్లాట్‌ఫామ్‌లో మీరు ఎన్ని సార్లైనా పరీక్ష రాయవచ్చు. ప్రతి ప్రయత్నంలో కొత్త ప్రశ్నాపత్రం రూపొందించబడటం దీని ప్రత్యేకత. ఈ మాక్ టెస్టులు విస్తృతమైన ప్రశ్నల బ్యాంక్ ఆధారంగా రూపొందించబడుతున్నందున, ప్రతి పరీక్షలో భిన్నమైన ప్రశ్నలు ఎదురవుతాయి. దీనివల్ల ఒకే రకమైన ప్రశ్నలు పదేపదే రావడం తగ్గి, అభ్యర్థులు వివిధ అంశాలపై మెరుగైన అవగాహన పెంపొందించుకోవచ్చు. ఈ ప్లాట్‌ఫామ్‌ను ఉపయోగించడం ద్వారా: • అపరిమిత సంఖ్యలో మాక్ టెస్టులు రాయవచ్చు. • ప్రతి ప్రయత్నంలో కొత్త ప్రశ్నాపత్రం లభిస్తుంది. • విభిన్న అంశాలపై ప్రాక్టీస్ చేసే అవకాశం ఉంటుంది. • పరీక్షా సమయ నిర్వహణ నైపుణ్యాలు మెరుగుపడతాయి. • మీ బలాలు, బలహీనతలను గుర్తించి వాటిపై మరింత దృష్టి పెట్టవచ్చు. • కంప్యూటర్ ఆధారిత పరీక్షలకు అలవాటు పడేందుకు ఇది ఉపయోగపడుతుంది. • కంప్యూటర్ వినియోగంలో అనుభవం తక్కువగా ఉన్న అభ్యర్థులు కూడా ముందుగానే ప్రాక్టీస్ చేసి ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవచ్చు. నిరంతరంగా మాక్ టెస్టులు రాయడం ద్వారా పరీక్షా భయం తగ్గి, నిజమైన TET పరీక్షలో ...

AP 2026-27 TEXT Books New అప్లోడ్ చేశారు

2026-27 TEXT Books New అప్లోడ్ చేశారు.  https://cse.ap.gov.in/loadacademictextbookpublicview?random=0.6384777802675639 Lakshya Educational Groups

నేటి ప్రధాన వార్తా పత్రికలు తెలుగు మరియు ఇంగ్లీష్

                             ఈనాడు ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.eenadu.net సాక్షి ➪ 🅐🅟 & 🅣🅢 http://epaper.sakshi.com ఆంధ్రప్రభ ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.prabhanews.com/ V6 వెలుగు➪ 🅣🅢 https://epaper.v6velugu.com 📰నవ తెలంగాణ ➪ 🅣🅢 http://epaper.navatelangana.com/ నమస్తే తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.ntnews.com 📰మన తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.manatelangana.news English Newspapers        ☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟ 👉🏻The Hindu📰 https://epaper.thehindu.com/reader Deccan Chronicle http://epaper.deccanchronicle.com/states.aspx Indian Express https://epapeHr.newindianexpress.com/t/3464 The Hans India https://epaper.thehansindia.com/ 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺