Skip to main content

Posts

Showing posts from November, 2021

నేటి మోటివేషన్.... పలకరింపు

మనుషులకు మాత్రమే వున్న వరమిది. మానవీయ సంబంధాల వారధి. మనసు వ్యాకులతల పారద్రోలు మంత్రమిది. పలకరింపులు లేని సమాజం సమూహం ఒట్టి నిర్జీవంగా గోచరిస్తాయి. ఒక్క పలకరింపుతో నూతనోత్తేజమేదో తొంగి చూస్తూంటుంది. పలకరింపు అనేది మనిషితనానికి, కలిసి బతికే మనిషితనానికి నిదర్శనంగా నిలుస్తుంది. నేటి అత్యంతాధునిక అనేక సౌకర్యాల, విలాసాలననుభవిస్తున్న కాలంలో మనం పోగొట్టుకుంటున్న గొప్ప మానవాంశం పలకరింపు. ఇది చాలా చిన్న విషయంగానే అనిపించవచ్చు. ఒక్క చిన్న మాటే పలకరింపై వెలగవచ్చు. కానీ ఎన్ని డబ్బులు పోసినా దొరకని అమూల్య సంపద పలకరింపు. ఒక ప్రాణాన్ని నిలబెట్టవచ్చు. ఒక బాధని తొలగించవచ్చు. ఒక ఆలోచనను రేకెత్తించవచ్చు. ఒక ఆశను చిగురింపచేయొచ్చు. మనసు గాయాలను, గాట్లను మాన్పించవచ్చు ! పలకరింపుకు అంత శక్తి వుంది. పలకరించడమనే సమస్య నేడు ఇండ్లల్లో వృద్ధులు విపరీతంగా ఎదుర్కొంటున్నారు. తమ జీవితమంతా కుటుంబం కోసం, పిల్లల కోసం వెచ్చించి, వృద్ధాప్యంలో ఏమీ చేయలేని స్థితిలో ఇంట్లో వున్న పెద్దల్ని పనికిరాని వస్తువుల్ని చూసినట్లు చూస్తున్నారు. వారి శ్రమఫలమే వర్తమానపు మన కళ అని మరిచి పోతున్నారు. అట్లాంటి పెద్దలను ఆప్యాయంగా పలకరించాలి.

నేటి మోటివేషన్... అనుబంధం....

ఒక వేటగాడు అవసరానికి తన గుర్రాన్ని అమ్మడానికి  సంతకు వెళ్ళాడు.  గుర్రానికి సరైన బేరం కుదరక గుర్రానిచ్చి ఆవుకు మారకం వేశాడు. మరొకరి సలహా తీసుకుని ఆవునిచ్చి గాడిదకు మారకం వేశాడు.  గాడిదనిచ్చి బూట్లు తీసుకొన్నాడు.  చివరకు బూట్లిచ్చి ఒక టోపి తీసుకున్నాడు.  ఆ టోపితో ఇంటికి వస్తూ దారిలో వంతెన మీద నడుస్తుంటే రాయి తగిలి బోర్లాపడ్డాడు.  టోపి కాస్తా నదిలో పడింది.  దిగులుగా అటే చూస్తూ కూర్చున్నాడు.  అదే దారిలో వచ్చే ఇద్దరు బాటసారులు విషయం అడిగి తెలుసుకున్నారు.  అయ్యో పాపం అని బాధపడ్డారు.  "నీకివాల ఉపవాసమే" అన్నాడొకడు.  పెళ్ళాంతో బడితపూజ తప్పదన్నాడింకోకడు.  "నా పెళ్ళాం అలాంటిది కాదు, ఏమీ అనదు "అని వేటగాడు బాటసారులతో పందెం కట్టాడు. బాటసారులిరువురు వేటగాడింటికి వెళ్ళారు.  వేటగాడు గుమ్మంలో నుంచి భార్యను పిలిచాడు.  వాడి పెళ్ళాం ఎదురుగా వచ్చి మావా!  వచ్చినావా అంది ఆప్యాయంగా.  వాడు జరిగింది చెప్పడం మొదలు పెట్టాడు.  వేటగాడు : "గుర్రం ధరకు పలకకపోతే ఆవుకి మారకం వేశా "అన్నాడు. భార్య : "మంచి పని చేశావు మావా పాలు తాగవచ్చు" వేటగాడు : "ఆవు కూడా గాడిదకు మారకం వేశా&quo

నేటి మోటివేషన్... నల్లనివి అన్ని నీళ్ళు కాదు, తెల్లనివి అన్నీ పాలు కాదు అని పెద్దలు ఎప్పుడో చెప్పారు..

ఒక జంట ఓడలో ప్రయాణిస్తున్నారు. ఉన్నట్టుండి ఓడ మునిగిపోతోంది. అందరూ లైఫ్ బోట్ లోకి వెళ్తున్నారు, ఆ లైఫ్ బోట్లో ఇంక ఒక్కరికే స్థానం ఉంది, జంట మాత్రమే ఇంక ఓడలో మిగిలింది, భార్య భర్త ఎవరో ఒక్కరే లైఫ్ బోట్లోకి వెళ్ళగలరు. ఇద్దరూ ఆలోచిస్తున్నారు, ఉన్నట్టుండి భర్త భార్యను మునిగిపోతున్న ఓడలోనే ఉంచేసి తాను మాత్రం లైఫ్ బోట్లోకి దూకేసాడు. వెనక నుంచి భార్య అరుస్తూ ఏదో చెప్తోంది....  తరగతిలో పిల్లలకి ఈ కథ చెప్తున్న ఉపాధ్యాయురాలు కథ చెప్పటం ఇక్కడ ఆపేసింది. పిల్లలూ, ఆవిడ భర్తతో ఏమని ఉంటుందో చెప్పగలరా అని పిల్లలని ప్రశ్నించింది, టీచర్. పిల్లలు ఒకేసారి చెప్పారు, ఇంత మోసమా, నిన్ను గుడ్డిగా నమ్మాను, అని ఉండచ్చు టీచర్ అన్నారు. ఒక బాబు మౌనంగా కూర్చుని ఉన్నాడు, టీచర్ ఆ బాబుని అడిగింది నువ్వేమి చెబుతావు అని. ఆ బాబు చెప్పాడు, మన బిడ్డను జాగ్రత్తగా చూసుకోండి, అని చెప్పి ఉంటుంది అన్నాడు. టీచర్ కళ్ళల్లో ఆశ్చర్యం, నీకు ఈ కధ ముందే తెలుసా, అని అడిగింది. బాబు తల అడ్డంగా ఊపాడు, లేదు, నాకు ఈ కథ తెలీదు, మా అమ్మ జబ్బుతో చనిపోతూ మా నాన్నకు చెప్పింది, మన బాబు జాగ్రత్త అని.. అన్నాడు. ఈ సారి టీచర్ కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి.

నేటి మోటివేషన్... అనుబంధమంటే.. ఒక ట్యాగ్‌లైన్‌తో డిఫైన్ చెయ్యబడేది కాదు..

ఈ ప్రపంచంలోకి ఒంటరిగా వస్తాం.. వచ్చాక చిన్నప్పుడు ఎవరో ఆడిస్తుంటారు.. అమ్మా.. నాన్నా.. తమ్ముడు, అక్కా, మామయ్య.. రకరకాల పిలుపులు అలవాటు చేస్తారు. ఎదిగే కొద్దీ బంధాలు బలపడతాయి.  ప్రతీ బంధానికీ ఓ పరిధి ఉంటుంది.. అంతకన్నా చొచ్చుకుని వెళ్లలేదు. ఎవరికి వాళ్లకి కుటుంబాలు ఏర్పడ్డాక ఆ అగాధాలు మరింత పెరిగిపోతాయి కూడా! చివరకు భార్యా భర్తల మధ్య కూడా ఓ అగ్రిమెంట్ లాంటి రిలేషన్ మాత్రమే జీవితాంతం కొనసాగే దుస్థితి. మనిద్దరం కలిసి ఉండాలి కాబట్టి.. "నువ్విలా ఉండు, నేనిలా ఉంటాను, నేను నీ జోలికి రాను, నువ్వు నా జోలికి రాకు.. నీకు ఆ విషయం కోపం కాబట్టి నేను ప్రస్తావించను, నా ఈ విషయం నచ్చదు కాబట్టి నువ్వు దాని గురించి మాట్లాడకు" ఇలా కొన్ని రహస్యపు హద్దులు ఏర్పడతాయి. సమాజంలో 95 శాతం జీవితాలు ఇలా సర్ధుబాట్ల మధ్యనే కొనసాగుతాయి. కానీ వీటన్నింటికీ అతీతమైన ప్రేమ ఉంటుంది.. ఏ బాహ్య విషయాలూ ఆ ఇద్దరి మధ్యా అగాధాన్ని ఏర్పరచలేనివి. ఒకరినొకరు జడ్జ్ చేసుకోని పరిపక్వతతో కూడిన ప్రేమ. చనువు పేరిట.. "ఏదో పెద్ద చెప్పొచ్చావులే.." అని కూడా తమ భాగస్వామితో నిష్టూరంగా మాట్లాడడం రాని స్వచ్ఛత. ప్రేమంటే.. అదీ ఇదీ అ

నేటి మోటివేషన్... ఓర్పు ఒక్కటే సంబంధ బాంధవ్యాలను ఎక్కువ కాలం నిలిపి ఉంచుతుంది.....

అనగనగా ఒక ఊళ్ళో ఒక నది. ఆ నది ఒడ్డున రెండు పెద్ద చెట్లు🌳🌳..... ఆ దారిన వెళుతున్న ఒక చిన్న పిట్ట 🕊️తనకూ తన పిల్లలకు ఒక చిన్న గూడు కట్టుకుందామని అనుకుని, మొదటి చెట్టు దగ్గరకు వెళ్లి అడిగింది, "వర్షాకాలం వస్తోంది, నేను నా పిల్లలు ఉండటానికి నీ కొమ్మ మీద గూడు కట్టుకోనా?" అంది. "వద్దు ", అనేసింది మొదటి చెట్టు.  ఆ పిట్ట చిన్నబుచ్చుకుంది. నిరాశగా రెండో చెట్టు దగ్గరకు పోయి సహాయం కోసం వేడుకుంది. "సరే ", అంది రెండో చెట్టు.  మహదానందంగా ఎగిరి గంతులేస్తూ గూడు కట్టే పని మొదలు పెట్టింది. వానాకాలం వచ్చేలోపే రెండో చెట్టు మీద గూడు కట్టేసుకుంది. పిట్ట, పిల్లలతో ఆనందంగా కాలం గడపసాగింది. ఈలోగా వర్షాకాలం వచ్చేసింది.  అంతలో పెద్ద వర్షం. వర్షం పెద్దదైంది. వరద రావడం మొదలైంది. ఆ వరదలో మొదటి చెట్టు కూకటి వేళ్ళతో సహా కూలి పోయి, నీటిలో కొట్టుకుని పోతోంది. ఆ దృశ్యాన్ని రెండో చెట్టు మీద కూర్చున్న పిట్ట చూస్తూ, "భగవంతుడు నీకు శిక్ష వేసాడు. నాకు సహాయం చేయడానికి నిరాకరించావుగా", అంది నవ్వుతూ. "నేను బలహీనమైనదానినని నాకు తెలుసు. వరద వస్తే కొట్టుకుని పోతానని కూడా తెలుసు. నాతో

నేటి మోటివేషన్... గాడిదలతో వాగ్వివాదాలు పెట్టుకోకండి...

🍁A GREAT MORAL🍁  "గడ్డి నీలం రంగులో కదా ఉండేది?"  అని ఒక గాడిద పులిని అడిగింది.  దానికి పులి, "నీ మొహం! గడ్డి నీలం రంగులో ఉండడం ఏమిటి?.. ఆకుపచ్చ రంగులో ఉంటుంది"  అని జవాబిచ్చింది..  గాడిద  "ఏడ్చావులే! గడ్డి నీలం రంగులోనే ఉంటుంది" అని వాదించింది..  అలా అలా గాడిదకు పులికి వాగ్వివాదం పెరిగింది...   ఎవరి మాట సరైందో తేల్చుకోవడానికి అవి రెండూ అడవికి రాజైన సింహం దగ్గరకు వెళ్ళాలని నిశ్చయించుకొన్నాయి....  దట్టమైన అడవి మధ్యలో ఒక ఎత్తైన ప్రదేశంలో సింహం హూందాగా కూర్చొని ఉంది. 🖱 అక్కడికి చేరుకోగానే  పులికి ఏ మాత్రం అవకాశం ఇవ్వకుండా  గాడిద  "వన రాజా! వన రాజా!... గడ్డి నీలం రంగులో కదా ఉండేది.. అవునా కాదా? మీరే చెప్పండి " అంది.  "అవును!  గడ్డి నీలం రంగులోనే ఉంటుంది" అంది సింహం  అది విని గాడిద  ఇంకా రెచ్చిపోతూ ...  "చూడండి మహారాజా! అలా అని నేను ఎంత చెప్పినా ఈ పులి ఒప్పుకోవడం లేదు, అలా కాదని నాతో వాదిస్తుంది,  దీనికి తగిన శిక్ష పడవలసిందే" అంది 🖱 "అవును,  పులికి తప్పకుండా శిక్ష పడవలసిందే..  పులిని ఒక సంవత్సరం పాటు జైలులో ఉంచండి!!" 

నేటి మోటివేషన్... ఇకనైనా మేలుకో - అందరినీ కలుపుకో....

ఓ మనిషి ఏమవుతాయి నీ డబ్బులు ఏమవుతాయి నీ బంగళాలు ఏమవుతాయి నీ కార్లు ఏమవుతాయి నీ బంగారు ఆభరణాలు ఏమవుతాయి నీవు సంపాదించిన లంచగొండి సొమ్ము ఏ కారులో వెళ్లగలవు బయటికి నేడు ఏ విమానంలో బయటకు వెళ్లగలవు నేడు ఏ షిప్పులో బయటకు వెళ్లగలవు నేడు ఎవడు నిన్ను తాకుతాడు ఈరోజు ఏమవుతుంది నీవు కూడబెట్టిన వేల ఎకరాల భూమి రోడ్డుకిరువైపులా పచ్చని పొలాలు మాయం చేస్తివి పేదోడు వంద గజాల భూమి కొనుక్కునే పరిస్థితి చేజారిస్తివి పచ్చదనం కాలరాస్తివి పైసలకు కకృతి పడితివి ఏమవుతాయి నీ వందల ఎకరాల నేడు అంతరాలు పెంచితివి  ఆత్మీయత తుంచితివి డబ్బే సర్వస్వం అనుకుంటివి డబ్బులిచ్చిఆపగలవా కరోనాను... భూములిచ్చి ఆపగలవా కారోనాను లంచమిచ్చి ఆపగలవా కారోనాను మనిషిని మనిషిగా చూడవైతివి నిన్ను కాపాడడానికి మళ్లీ మనిషే కావాలి నేడు(డాక్టర్) డబ్బులున్నోడికొక మర్యాద డబ్బులు లెనోడికొక మర్యాద నడిచొస్తే ఒక మర్యాద  కార్లోవస్తే మరొక మర్యాద గోచి పెడితే ఒక మర్యాద  సూటు వేస్తే మరొక మర్యాద ఎందుకీ అంతరం-ఏమవుతావు నేడు మానవా.. ఇకనైనా మేలుకో - అందరినీ కలుపుకో.... 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

నేటి మోటివేషన్... గుర్తింపు

ఒక రాజసభకు ఒక అపరిచితుడు ఉద్యోగం అడగటానికి వచ్చాడు. “నీ విశేషం ఏంటి?” అని అడిగితే, “మనిషి అయినా, జంతువైనా నేను ముఖం చూసి వారి గురించి చెప్పగలుగుతాను.” అని చెప్పాడు. రాజు అతడిని తన అశ్వశాలకు అధిపతిని చేశాడు.  కొన్ని రోజుల తర్వాత రాజు అతడిని తనకు అన్నిటికంటే ప్రియమైన, ఖరీదైన గుర్రాన్ని చూపించి, అడిగాడు. అప్పుడు అతను, “ఇది జాతిగుఱ్ఱం కాదు.” అని అన్నాడు.  రాజు చాలా ఆశ్చర్యపోయాడు.  అడవి నుంచి గుర్రపువాడిని పిలిపించి అడిగితే అతడు - “గుర్రం జాతిదే కానీ ఇది పుట్టంగానే దాని తల్లి చనిపోయింది.  దీనిని ఆవు పాలు పోసి పెంచామ”ని చెప్పాడు. రాజు తన ఉద్యోగిని పిలిచి, “నీకు ఈ సంగతి ఎట్లా తెలుసు?” అని అడిగాడు. అప్పుడు అతడు- “ఇది గడ్డి తినేటప్పుడు ఆవులాగా తలకాయ కిందకని తింటుంది. జాతి గుర్రం అయ్యుంటే దాణా నోట్లోకి తీసుకుని తలెత్తి తినేది.” అని చెప్పాడు.  రాజుకు అతడి కౌశలం చూసి చాలా సంతోషం వేసింది.  అతడికి బోలెడు ధాన్యం, నెయ్యి, కోడ్లు, కోడిగుడ్లు, ఉదారంగా పంపించాడు.  అతడిని రాణి భవంతికి ఉద్యోగిగా పెట్టాడు. కొన్ని రోజుల తర్వాత అతడు రాణీ గురించి అడిగాడు... అప్పుడు ఉద్యోగి చెప్పాడు- “ఆమె తీరుతెన్నులు, వ్యవహారం

నేటి మోటివేషన్ తెలివైన తాబేలు

ఒక అడవిలో ని చెరువులు ఒక తాబేలు ఉండే ది. ఒకరోజు సాయంత్రం అది నీటిలోంచి బయటకు వచ్చి ఒడ్డున నెమ్మదిగా తిరగసాగింది. ఇంతలో అక్కడికి ఒక నక్క వచ్చింది దాన్ని చూసి నీటిలోకి వెళ్ళిపోవాలనుకుంది తాబేలు. కానీ ఇంతలో నక్క దాన్ని చూసింది. వెంటనే తాబేలు కాళ్లు తల లోపలికి లాక్కొని కదలకుండా ఉండి పోయింది. నక్క-తాబేలు దగ్గరికి వెళ్లి దాన్ని పట్టుకొని చూసింది పైన డొప్ఫ గట్టిగా తగిలింది. తాబేలును తిరిగేసి మూతిని దగ్గరగా పెట్టింది ఇలా నక్క తనని పరీక్షిస్తున్న ఎంతసేపు తాబేలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఊపిరి బిగపట్టుకొని ఉన్నది. ఊపిరి బిగపట్టుకొని ఉన్నది ఇంతలో దానికి ఒక ఉపాయం తట్టింది. దాంతో ధైర్యం చేసి తలా కొంచెం బయట పెట్టింది అయ్యో నక్క బావ నువ్వు ఎన్ని తిప్పలు పడ్డా నా శరీరంలో ఇతర మాంస మైనా తినలేవు అంది తాబేలు. ఎందుకలా అన్నదో అర్థం కాక నక్క అయోమయంగా చూసింది. తాబేలు మళ్లీ నా శరీరం తీరే అంత నా అక్క బావ నీటిలోనుంచి పైకి రాగానే గాలి తగిలి గట్టిపడి పోతాను,  మళ్లీ నీళ్లు తగిలాయి అనుకో వెంటనే మెత్తబడ్డ తాను అందుకే నువ్వు నన్ను కాసేపు ఆ నీటిలో నానబెట్టి ఆ తర్వాత కడుపారా తినొచ్చు అని చెప్పింది. అసలే జిత్తులమారి న

నేటి మోటివేషన్... కష్టాలు మన మంచికే

ఎన్నో కష్టాల్లో ఉన్న ఒకతను తన సద్గురువు దగ్గరికి వెళ్ళి చెప్పాడు ఏమిటి స్వామీ నాకీ కష్టాలు? ఇవి ఎప్పటికి తీరేను? అసలు దేవుడు నన్నెందుకు పట్టించుకోడు? శిష్యుడి వంక దయగా చూస్తూ అడిగాడాయన నేనో చిన్నకథ చెప్తాను వింటావా? తలూపాడు శిష్యుడు. ఆయన కథ చెప్పసాగాడు ఒకతను తన ఇంట్లో గోడకి కట్టిన ఓ సీతాకోకచిలుక గూడుని చూశాడు. దాన్ని నిత్యం అతను ఆసక్తిగా గమనించ సాగాడు. ఓ రోజు ఆ గూడులో ఓ చోట రంధ్రం పడింది. సీతాకోక చిలుకగా మారిన అందులోని గొంగళిపురుగు ఆ గూటిలోంచి బయటకు రావడానికి ప్రయత్నం చేయడం అతను గమనిం చాడు. అయితే దాని పెద్ద శరీరం ఆ చిన్న రంధ్రం లోంచి బయటికి రావడం సాధ్యం కావడం లేదు. అది ఎంత ప్రయత్నించినా ఆ పని దానివల్ల కాకపోవడం అతను గుర్తించాడు.  ఆ సీతాకోకచిలుకకి సాయపడాలన్న ఆలోచన కలిగిం దతనికి, దాంతో చిన్న కత్తెరని తీసుకుని ఆ గూడుగోడని కత్తిరించి ఆ రంధ్రాన్ని కాస్తంత పెద్దది చేశాడు. ఆ రంధ్రంలోంచి ఆ సీతాకోకచిలుక బయటికి వచ్చింది. అయితే దాని శరీరం ఉబ్బి ఉంది. రెక్కలు పూర్తిగా రాలేదు. దాంతో అది ఎగరలేక ఆ ఉబ్బిన శరీరంతో నేలమీద పాకుతూ జీవితాంతం అలాగే గడిపేసింది. తన గురువు చెప్పేది ఆసక్తిగా వింటున్నాడు అతను ఆజీ

TODAY - HINDU - VOCABULARY 03.11.2021

1.DISPUTE(VERB):(विवादकरना):Challenge Synonyms:Contest,Deny Antonyms:Accept Example Sentence: The accusations on him are entirely disputed. 2.HARROW(VERB):(परेशानकरना):Distress Synonyms:Trouble,Afflict Antonyms:Calm Example Sentence: Rima could take it,whereas I'm harrowed by it. 3.BOLSTER(VERB):(मजबूतबनाना):Strengthen Synonyms:Support,Reinforce Antonyms:Avoid Example Sentence: The fall in interest rates is starting to bolster confidence. 4.DISORIENTED(ADJECTIVE):(गुमराह):Confused Synonyms:Bewildered,Perplexed Antonyms:Oriented Example Sentence: She was so disoriented that Joe had to walk her to her room. 5.AUGMENT(VERB):(बढ़ाना):Increase Synonyms:Add to,Supplement Antonyms:Decrease Example Sentence: He augmented his summer income by painting. 6.INNATE(ADJECTIVE):(जन्मजात):Inborn Synonyms:Natural,Inbred Antonyms:Acquired Example Sentence: Her innate capacity for organization. 7.DEFY(VERB):(अवज्ञाकरना):Disobey Synonyms:Go against,Flout Antonyms:Obey Example Sentence: She is a woman

Word of the day - 03.11.2021

🌼knell: /nɛl/ (verb) నెల్  (simple present :knells,  present participle knelling;   simple past and past participle knelled) Meaning: (intransitive) To ring a bell slowly, especially for a funeral; to toll.  2) (transitive) To signal or proclaim something (especially a death) by ringing a bell. 3) (transitive) To summon by, or as if by, ringing a bell.  🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

Spoken English - 03.11.2021

🌸Today's topic is... It's hard for me to + (verb) 👉When saying that something is 'hard for me' you are informing someone that what you are talking about is difficult or challenging for you. Here are some examples for you...👇👇 "It's hard for me to accept what you are telling me." "It's hard for me to argue your point." "It's hard for me to balance my check book." "It's hard for me to concentrate on the task." "It's hard for me to consider your other options." "It's hard for me to depend on you." "It is hard for me to decide where to go tonight." "It is hard for me to explain my actions." "It is hard for me to guarantee your success." "It is hard for me to handle so much pressure."  🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

నేటి మోటివేషన్... నీ తండ్రి ప్రేమను వృధాగా పోనివ్వకు

కనురెప్ప వెయ్యకుండా 10 సెకండ్లు ఈ చిత్రాన్ని చూసా....  కొద్ధి క్షణాలకు ఫోటో మసకగా కనిపించింది, ఏమిటా అని చూస్తే కళ్ళల్లో నీళ్ళు... ఒక్కసారిగా గుండె బరువెక్కింది. నేటి కాలం పిల్లలు  కావాలి అని అనుకున్నది ఇస్తేనో, కోరుకున్నవాటిని కొని ఇస్తేనో ప్రేమ ఉన్నట్టు అనుకునే రోజులు ఇవి, ఇక తండ్రి ప్రేమ గురించి చెప్పాల్సిన అవసరంలేదు... కూతురు పుడితే తన తల్లి పుట్టిందని మురిసిపోయే వ్యక్తి కేవలం తండ్రి మాత్రమే.. పుట్టింది మొదలుకుని, బట్టలు, బంగారాలు, ఫంక్షన్లు, పెళ్లిళ్లు, సారెలు ఇలా అబ్బాయికంటే అమ్మాయికే ఎక్కువ డబ్బు ఖర్చు అవుతుందని తెలిసి కూడా... ఖర్చు పెట్టె రూపాయికి లెక్కచేయకుండా, కేవలం కూతురి కళ్ళల్లో ఆనందం మాత్రమే చూస్తూ మురిసిపోతాడు... రెక్కాడితే డొక్కాడని తండ్రి కూడా... తన కూతురిని యువరాణిలానే చూసుకుంటాడు... దానికి నిదర్శనమే ఈ చిత్రం... ఆ చిట్టితల్లికి తన గుండెను బంగారు పానుపుగా చేసాడా తండ్రి... బహుసా ఇంతకంటే గొప్పదైనా , విలువైన పానుపు ఎక్కడ ఉండదు, లేదు... ఎంత ఎదిగినా తండ్రి గుండెను ఆనుకుని ఉన్న అనుభూతివేరు... చాలామంది కూతుర్లు అదే గుండెపై తన్ని, తండ్రి ప్రేమను మరచి, నీచమైన కోరికలు తీర్చుకున

నేటి మోటివేషన్... సమయస్ఫూర్తి

ఒకానొకప్పుడు ఇటలీ దేశంలోని ఒక చిన్న పట్టణంలో ఒక చిరువ్యాపారి ఉండేవాడు. అతను పెద్ద మొత్తంలో ఒక వడ్డీ వ్యాపారికి బాకీ పడ్డాడు. ఆ వడ్డీ వ్యాపారి ముసలివాడు, కానీ చండశాసనుడు. తన వడ్గీ వసూలు కోసం ఎంత నీచస్థాయికైనా దిగజారగలడు. ఒకసారి, వడ్డీ ఇవ్వడం ఆలస్యమయినందున, ఆ వడ్డీవ్యాపారి కోపంగా ఈ చిన్న దుకాణదారు ఇంటికి వచ్చాడు. తన వడ్డీ సంగతేం చేశావని నిలదీసాడు. ఈ నెల దుకాణం సరిగా నడవనందున ఆదాయం చాలినంత లేదని, త్వరలో ఇచ్చేస్తానని నమ్మబలికాడు. ఆ ముసలివాడిని శాంతపరిచేందుకు మజ్జిగ తెమ్మని తన కూతురికి పురమాయించాడు. మజ్జిగతో వచ్చిన ఆ వ్యాపారి కూతుర్ని చూసిన ఈ వృద్ధ వడ్డీ వ్యాపారి దుర్బుద్ధి పుట్టి ఆ దుకాణదారుతో ‘నీ కూతుర్ని నాకిచ్చి పెళ్లి చేస్తే, నీ బాకీ మొత్తం రద్దు చేస్తా’నని స్పష్గం చేసాడు. ఆ వ్యాపారి ముసలివాడిని అసహ్యంగా చూసాడు. అది గమనించిన వడ్డీవ్యాపారి, ‘సరే… నీకు రెండు అవకాశాలిస్తాను. ఏదైనా ఒకదానిని నువ్వు ఎంపిక చేసుకోవచ్చు. అవేంటంటే, రెండు గులకరాళ్లు ఒక సంచీలో వేస్తాను. ఒకటి నల్లది. రెండోది తెల్లది. మీ అమ్మాయి వచ్చి సంచీలోనుండి ఒక రాయిని బయటకు తీయాల్సివుంటుంది. నల్లరాయి వస్తే, నీ బాకీ రద్దవుతుంది

తెలుసుకుందాం

🦟కీటకాలు చలినెలా తట్టుకుంటాయ్❓ 🌸జవాబు: మనకు విసుగును కల్గించే ఈగల్ల్లాంటి కీటకాలు శీతాకాలంలో అంతగా ఇళ్లలో కనిపించవు. ఇతర శీతల రక్త (cold blooded) ప్రాణుల్లాగానే కీటకాలు చాలా వరకు తమ శరీర ఉష్ణోగ్రతలను వివిధ కాలాల్లో స్థిరంగా ఉంచుకోలేవు. వాతావరణంలోని ఉష్ణోగ్రతలు పడిపోగానే ఆ మార్పులకు అనుగుణంగానే కీటకాలు తమ శరీర ధర్మాలను సర్దుబాటు చేసుకోవడంతో వాటి జీవసంబంధిత ధర్మాలన్నీ (vital functions) శూన్యదశకు చేరుకుంటాయి. ఈ దశలో అవి ఒక సురక్షిత ప్రదేశాన్ని చేరుకొని గుడ్లు లేక లార్వా రూపంలో ఉండే తమ సంతానాన్ని చలి బారి నుండి కాపాడుకుని ఆ తర్వాత వచ్చే వసంత కాలంలో జీవించడానికి కావాల్సిన జాగ్రత్తలు తీసుకుంటాయి. గుడ్లు లేక లార్వా దశలో ఉన్న కీటకాలు తక్కువ ఉష్ణోగ్రతలను తట్టుకోగల సామర్థ్యం కలిగి ఉంటాయి. కొన్ని కీటకాల లార్వాలు శీతాకాలంలో సరస్సులలో గడ్డకట్టకుండా ఉండే నీటి లోతుల్లో సురక్షితంగా ఉంటాయి. అక్కడి ఉష్ణోగ్రత పరిసరాలతో పోలిస్తే ఎక్కువగా ఉంటుంది. 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

Spoken English - 02.11.2021

🌸Today's topic is... I'm dying to + (verb) 👉When using the word 'dying' in this manner you are referring to wanting or desiring something greatly. Here are some examples for you....👇👇 "I'm dying to relax on the beach." "I'm dying to pick some fresh fruit." "I'm dying to order some desserts." "I'm dying to find out if I got the job." "I'm dying to move to a bigger house." "I'm dying to look at all the work you've done." "I'm dying to learn more about you." "I'm dying to introduce you to my parents." "I'm dying to expand my business." "I'm dying to check my score on the test."  🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

Word of the day - 02.11.2021

🌼acclaimed : /əˈkleɪmd/ ( adjective) (ఎక్లైమ్డ్)   Meaning: Greatly praised or lauded, revered, highly respected.  Examples: Many critically acclaimed novels are not commercially successful. She's an acclaimed writer, her books are bestsellers before they are published.  🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

Current Affairs - 01.11.2021

1. In which city the 30th edition of "Hunar Haat" has been inaugurated? ️Ans. Dehradun✔️ 2. Which country launched its first manned ocean mission "Samudrayaan"? ️Ans. India✔️ 3. Which ministry is organizing "Deep Dive Online Training Program"? ️Ans. Ministry of Electronics and Information Technology✔️ 4. Which organization has released the report titled "State of the Climate in Asia"? ️Ans. world meteorological organization✔️ 5. Which edition of "National Formulary of India" has been launched by the Union Minister of Health and Family Welfare Mansukh Mandaviya? ️Ans. sixth✔️ 6. According to the annual report released by NCRB, which state of India has ranked first in terms of suicide? ️Ans. Maharashtra✔️ 7. In which Indian state famous actor Yusuf Hursain has passed away? ️Ans. Punjab✔️ 8. DRDO and which Indian Army have successfully test-fired India's first indigenous long-range bomb? ️Ans. Indian Air Force✔️ 9. In which state the P

కరెంట్ అఫైర్స్ - 01.11.2021

 1. "హునార్ హాత్" 30వ ఎడిషన్ ఏ నగరంలో ప్రారంభించబడింది?  ️జ. డెహ్రాడూన్✅  2. మానవ సహిత సముద్ర మిషన్ "సముద్రయాన్"ను ఏ దేశం ప్రారంభించింది?  ️జ. భారతదేశం✅  3. ఏ మంత్రిత్వ శాఖ "డీప్ డైవ్ ఆన్‌లైన్ శిక్షణా కార్యక్రమాన్ని" నిర్వహిస్తోంది?  ️జ. మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ✅ 4. "స్టేట్ ఆఫ్ ది క్లైమేట్ ఇన్ ఆసియా" పేరుతో ఏ సంస్థ నివేదికను విడుదల చేసింది?  ️జ. ప్రపంచ వాతావరణ సంస్థ✅ 5. "నేషనల్ ఫార్ములారీ ఆఫ్ ఇండియా" ఏ ఎడిషన్‌ను కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రి మన్సుఖ్ మాండవియా ప్రారంభించారు?  ️జ. ఆరవ✅ 6. NCRB విడుదల చేసిన వార్షిక నివేదిక ప్రకారం, ఆత్మహత్యల విషయంలో భారతదేశంలోని ఏ రాష్ట్రం మొదటి స్థానంలో ఉంది?  ️జ. మహారాష్ట్ర✅ 7. ప్రముఖ నటుడు యూసుఫ్ హుర్సేన్ ఏ భారతదేశంలో మరణించారు?  ️జ. పంజాబ్✅  8. DRDO మరియు ఏ భారత సైన్యం భారతదేశం యొక్క మొట్టమొదటి స్వదేశీ లాంగ్-రేంజ్ బాంబును విజయవంతంగా పరీక్షించింది?  ️జ. ఇండియన్ ఎయిర్ ఫోర్స్✅  9. భారత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఏ రాష్ట్రంలో ఆర్థికంగా వెనుకబడిన వర్గాల కోసం గృహ

CURRENT AFFAIRS - 01.11.2021

📅 01 November : World Vegan Day 📌 In 1994 , The Vegan Society Celebrated The 1st World Vegan Day On November 1st 📅 01 November : Karnataka Day 👋 Afghanistan's Asghar Afghan Has Announced His Retirement From International Cricket 📝 He Became The Second Cricketer For Afghanistan To Play In 100 ODI  📅 2 August 2018 , He Changed His Last Name From Stanikzai To Afghan 🔝 Asghar Aghan Most Successful T20I Captain In The World With 42 Wins 🏢 Sports Complex Of Udaipur Military Station Renamed As Neeraj Chopra Sports Complex 🏏 Mohammad Shahzad Becomes 1st Afghan Player To Reach 2000 T20I Runs 📌 Shahzad Achieved The Feat Against Namibia In The T20 World Cup 'dee¶' 📌 Shahzad Has Now Scored 2011 Runs In T20Is In 68 Matches With 12 Fifties & 1 Century 🔝 Virat Kohli Is The Highest Run-Scorer In The Format With 3216 Runs 🏢 2 New Colleges Under Delhi University To Be Named After Veer Savarkar & Sushma Swaraj 🏟 Sunil Gavaskar Has Inaugurated A Stand At The Wankhede Stad

TODAY - HINDU - VOCABULARY 02.11.2021

1. RADICAL (ADJECTIVE): (संपूर्ण): Thoroughgoing Synonyms: Thorough, Complete Antonyms: Superficial Example Sentence: A radical overhaul of the existing regulatory framework is needed. 2.APPEALING (ADJECTIVE): (आकर्षक): Attractive Synonyms: Engaging, Alluring Antonyms: Off-putting Example Sentence: Village life is somehow more appealing than city's. 3. HOSTILITY (NOUN): (युद्ध): Fighting Synonyms: Conflict, Combat Antonyms: Peace Example Sentence: He called for an immediate cessation of hostilities. 4. RELATIVE (ADJECTIVE): (तुलनात्मक): Comparative Synonyms:Respective, Comparable Antonyms: Absolute Example Sentence: The relative effectiveness of the various mechanisms is not known. 5. AGITATE (VERB): (उत्तेजित करना): Upset Synonyms: Perturb, Fluster Antonyms: Calm Example Sentence: The thought of questioning Tony agitated him extremely. 6. MOUNT (VERB): (बढ़ना): Increase Synonyms: Grow, Rise Antonyms: Decrease Example Sentence: The costs mount up when you buy a home. 7. BANISH (VER