Skip to main content

నేటి మోటివేషన్... ఇకనైనా మేలుకో - అందరినీ కలుపుకో....

ఓ మనిషి
ఏమవుతాయి నీ డబ్బులు
ఏమవుతాయి నీ బంగళాలు
ఏమవుతాయి నీ కార్లు
ఏమవుతాయి నీ బంగారు ఆభరణాలు
ఏమవుతాయి నీవు సంపాదించిన లంచగొండి సొమ్ము
ఏ కారులో వెళ్లగలవు బయటికి నేడు
ఏ విమానంలో బయటకు వెళ్లగలవు నేడు
ఏ షిప్పులో బయటకు వెళ్లగలవు నేడు
ఎవడు నిన్ను తాకుతాడు ఈరోజు
ఏమవుతుంది నీవు కూడబెట్టిన వేల ఎకరాల భూమి
రోడ్డుకిరువైపులా పచ్చని పొలాలు మాయం చేస్తివి
పేదోడు వంద గజాల భూమి కొనుక్కునే పరిస్థితి చేజారిస్తివి
పచ్చదనం కాలరాస్తివి పైసలకు కకృతి పడితివి
ఏమవుతాయి నీ వందల ఎకరాల నేడు
అంతరాలు పెంచితివి 
ఆత్మీయత తుంచితివి
డబ్బే సర్వస్వం అనుకుంటివి
డబ్బులిచ్చిఆపగలవా కరోనాను...
భూములిచ్చి ఆపగలవా కారోనాను
లంచమిచ్చి ఆపగలవా కారోనాను
మనిషిని మనిషిగా చూడవైతివి
నిన్ను కాపాడడానికి మళ్లీ మనిషే కావాలి నేడు(డాక్టర్)
డబ్బులున్నోడికొక మర్యాద
డబ్బులు లెనోడికొక మర్యాద
నడిచొస్తే ఒక మర్యాద 
కార్లోవస్తే మరొక మర్యాద
గోచి పెడితే ఒక మర్యాద 
సూటు వేస్తే మరొక మర్యాద
ఎందుకీ అంతరం-ఏమవుతావు నేడు
మానవా..
ఇకనైనా మేలుకో - అందరినీ కలుపుకో....

🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

Comments

Popular posts

నేటి ప్రధాన వార్తా పత్రికలు తెలుగు మరియు ఇంగ్లీష్

                             ఈనాడు ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.eenadu.net సాక్షి ➪ 🅐🅟 & 🅣🅢 http://epaper.sakshi.com ఆంధ్రప్రభ ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.prabhanews.com/ V6 వెలుగు➪ 🅣🅢 https://epaper.v6velugu.com 📰నవ తెలంగాణ ➪ 🅣🅢 http://epaper.navatelangana.com/ నమస్తే తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.ntnews.com 📰మన తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.manatelangana.news English Newspapers        ☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟ 👉🏻The Hindu📰 https://epaper.thehindu.com/reader Deccan Chronicle http://epaper.deccanchronicle.com/states.aspx Indian Express https://epapeHr.newindianexpress.com/t/3464 The Hans India https://epaper.thehansindia.com/ 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

Teachers day

https://drive.google.com/file/d/1j6D1j7NedC_wcJPP3HBEHfoppXrRE8la/view?usp=drivesdk https://drive.google.com/file/d/1kKNR6ew3Xlaapsy5FRfibB5iiCW0SCDw/view?usp=drivesdk https://drive.google.com/file/d/1m9J50vHSuDwNBhi5NBvJv_p40i5Ri1ww/view?usp=drivesdk Lakshya Educational Groups

🚨 SSC 2027 విద్యార్థులకు గుడ్ న్యూస్ – అధికారిక మోడల్ పేపర్లు, బ్లూ ప్రింట్లు విడుద

📢 BSEAP SSC 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు 2027: అధికారిక మోడల్ పేపర్లు, బ్లూ ప్రింట్లు విడుదల ఆంధ్రప్రదేశ్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (BSEAP) 2027లో నిర్వహించనున్న SSC (10వ తరగతి) పబ్లిక్ పరీక్షలకు సంబంధించిన అధికారిక మోడల్ ప్రశ్నాపత్రాలు మరియు సబ్జెక్టు వారీ బ్లూ ప్రింట్లను విడుదల చేసింది. ఈ మోడల్ పేపర్లు విద్యార్థులు తాజా పరీక్షా విధానాన్ని అర్థం చేసుకోవడానికి, ప్రశ్నల నమూనాను తెలుసుకోవడానికి మరియు పరీక్షలకు సమర్థవంతంగా సిద్ధం కావడానికి ఎంతో ఉపయోగపడతాయి. అలాగే బ్లూ ప్రింట్ల ద్వారా ప్రతి సబ్జెక్టులో ఏయే పాఠాలకు ఎంత వెయిటేజ్ ఉందో, ప్రశ్నల పంపిణీ ఎలా ఉంటుందో స్పష్టమైన అవగాహన పొందవచ్చు. విద్యార్థులు ఈ అధికారిక మోడల్ పేపర్లను సమయపాలనతో సాధన చేయడం ద్వారా పరీక్షలపై ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకోవచ్చు. ఉపాధ్యాయులు కూడా తరగతి బోధన, రివిజన్ ప్రణాళికలు మరియు ప్రాక్టీస్ పరీక్షలను రూపొందించడంలో వీటిని సమర్థవంతంగా ఉపయోగించుకోవచ్చు. ఈ విడుదలైన మోడల్ పేపర్లు ముఖ్యంగా: • తాజా పరీక్షా విధానాన్ని అర్థం చేసుకోవడానికి • ప్రశ్నల నమూనా మరియు మార్కుల పంపిణీ తెలుసుకోవడానికి • ముఖ్యమైన అంశాలపై దృష్టి సారించడ...