Skip to main content

Posts

Showing posts with the label తెలుసుకుందాం

రాత్రి సమయంలో మహిళా ప్రయాణికుల భద్రతకు రైల్వే ప్రత్యేక నిబంధనలు

భారతీయ రైల్వేలో ప్రతిరోజూ లక్షలాది మంది ప్రయాణిస్తుంటారు. ముఖ్యంగా మహిళలు, చిన్నారులతో కలిసి లేదా ఒంటరిగా ప్రయాణించే సందర్భాల్లో వారి భద్రతకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తారు. అత్యవసర పరిస్థితుల్లో టికెట్ లేకపోవడం, టికెట్ పోవడం లేదా ఇతర సమస్యలు ఎదురైతే కొందరు ప్రయాణికులు ఆందోళన చెందుతుంటారు. అలాంటి పరిస్థితుల్లో మహిళల భద్రతను దృష్టిలో ఉంచుకుని రైల్వే కొన్ని ప్రత్యేక నిబంధనలను అమలు చేస్తోంది. రాత్రి సమయంలో ఏమి జరుగుతుంది? రాత్రి 10:00 గంటల నుంచి ఉదయం 6:00 గంటల వరకు ఒంటరిగా ప్రయాణిస్తున్న మహిళను లేదా చిన్న పిల్లలతో ఉన్న మహిళను కేవలం టికెట్ లేకపోవడం కారణంగా మధ్యలోని స్టేషన్‌లో దింపకుండా ఉండేలా రైల్వే అధికారులు భద్రతాపరమైన జాగ్రత్తలు తీసుకుంటారు. ప్రధాన ఉద్దేశ్యం మహిళల భద్రతకు ఎలాంటి ప్రమాదం కలగకుండా చూడటమే. టికెట్ లేకపోతే TTE తీసుకునే చర్యలు • ప్రయాణ పరిస్థితిని పరిశీలిస్తారు. • నిబంధనల ప్రకారం జరిమానాతో పాటు అవసరమైతే కొత్త టికెట్ జారీ చేయవచ్చు. • వెంటనే డబ్బు చెల్లించే అవకాశం లేకపోయినా, భద్రతను దృష్టిలో ఉంచుకుని తదుపరి విధానాలను అనుసరిస్తారు. • అవసరమైతే సంబంధిత రైల్వే అధికారులకు సమాచారం అందజే...

తెలుసుకుందాం ఫ్రిజ్ తలుపు తెరిచి ఉంచితే గది చల్లబడుతుందా?

చాలామందికి ఉండే సందేహం ఇదే. ఫ్రిజ్ తలుపు తెరిచి ఉంచితే బయటకు వచ్చే చల్లని గాలి వల్ల గది మొత్తం చల్లబడుతుందని అనుకుంటారు. కానీ ఇది నిజం కాదు. ❄️ అసలు ఫ్రిజ్ ఎలా పనిచేస్తుంది? ఫ్రిజ్‌లో ఉండే రెఫ్రిజెరెంట్ (Refrigerant) అనే ప్రత్యేక ద్రవం లోపల ఉన్న వేడిని గ్రహించి ఆవిరిగా మారుతుంది. దీంతో ఫ్రిజ్ లోపలి భాగం చల్లగా ఉంటుంది. తర్వాత ఆ ఆవిరిని కంప్రెసర్ అధిక పీడనానికి గురిచేసి, కండెన్సర్ ద్వారా మళ్లీ ద్రవరూపంలోకి మారుస్తుంది. ఈ ప్రక్రియలో ఫ్రిజ్ లోపల నుంచి గ్రహించిన వేడిని ఫ్రిజ్ వెనుక భాగం ద్వారా బయటకు విడుదల చేస్తుంది. అందుకే ఫ్రిజ్ వెనుక భాగం వేడిగా ఉంటుంది. 🌡️ తలుపు తెరిచి ఉంచితే ఏమవుతుంది? • చల్లని గాలి వెంటనే బయటకు వస్తుంది. • లోపలి ఉష్ణోగ్రత పెరగడంతో కంప్రెసర్ నిరంతరం పనిచేస్తుంది. • ఎక్కువ విద్యుత్ వినియోగిస్తుంది. • ఫ్రిజ్ తీసుకున్న వేడికంటే ఎక్కువ వేడిని గదిలోకి విడుదల చేస్తుంది. దీని వల్ల గది చల్లబడకుండా స్వల్పంగా మరింత వేడిగా మారుతుంది. ⚡ ఎందుకు ఎక్కువ వేడి వస్తుంది? ఫ్రిజ్ పనిచేయడానికి విద్యుత్ శక్తిని ఉపయోగిస్తుంది. ఆ విద్యుత్ శక్తి కూడా చివరకు వేడిగా మారి గదిలోకి విడుదల అవుతుంద...

కొత్త విషయం తెలుసుకుందామా... శ్వాసక్రియలో నత్రజని గురించి ఎందుకు ఎక్కువగా మాట్లాడరు?

మన చుట్టూ ఉన్న గాలిలో సుమారు 78 శాతం నత్రజని, 21 శాతం ఆక్సిజన్ మరియు మిగిలిన భాగంలో ఇతర వాయువులు ఉంటాయి. శ్వాస తీసుకునే సమయంలో ఈ వాయువులన్నీ మన ఊపిరితిత్తుల్లోకి ప్రవేశిస్తాయి. అయితే శరీరానికి అవసరమైన ఆక్సిజన్ మాత్రమే ఊపిరితిత్తుల నుంచి రక్తంలోకి చేరి కణాలకు అందుతుంది. నత్రజని ఒక స్థిర స్వభావం కలిగిన వాయువు. ఇది సాధారణ పరిస్థితుల్లో శరీరంలోని జీవక్రియల్లో పాల్గొనదు. అందువల్ల అది శరీరంలో శోషించబడకుండా, లోపలికి వెళ్లినట్లే తిరిగి బయటకు వస్తుంది. శ్వాసక్రియ గురించి మాట్లాడేటప్పుడు "ఆక్సిజన్ తీసుకుని కార్బన్ డయాక్సైడ్ విడుదల చేస్తాం" అని చెప్పడానికి కారణం ఉంది. మనం తీసుకున్న ఆక్సిజన్ శరీరంలోని పోషక పదార్థాలతో చర్య జరిపి శక్తిని ఉత్పత్తి చేస్తుంది. ఈ ప్రక్రియలో కార్బన్ డయాక్సైడ్ మరియు నీటి ఆవిరి వంటి ఉప ఉత్పత్తులు ఏర్పడతాయి. కార్బన్ డయాక్సైడ్ శరీరంలో ఎక్కువగా నిల్వ ఉంటే ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. అందుకే దానిని శ్వాస ద్వారా బయటకు పంపిస్తాం. నత్రజని మాత్రం శరీరంలో కొత్తగా ఉత్పత్తి కాకపోవడం వల్ల దానిని విసర్జిస్తున్నామని చెప్పరు; అది కేవలం లోపలికి వెళ్లి తిరిగి బయటకు వస్తుంద...

తెలుసుకుందామా రోజుకో కొత్త విషయం...

🟥తెల్ల వెంట్రుకల్ని తీసేస్తే మరింత ఎక్కువగా వస్తాయంటారు. నిజమేనా? 🟢ఈ అభిప్రాయంలో నిజం లేదనే చెప్పుకోవాలి. తెల్ల వెంట్రుకలకు, నల్ల వెంట్రుకలకు ఉన్న తేడా కేవలం వాటిలో ఉన్న మెలనిన్‌ అనే వర్ణరేణువుల శాతంలో తేడానే. తెల్ల వెంట్రుకలలో మెలనిన్‌ రేణువులు దాదాపు ఉండవనే చెప్పవచ్చు. గోధుమ రంగు వెంట్రుకల్లో ఇవి ఓ మోస్తరుగా ఉంటాయి. వెంట్రుకలు మన చర్మం కింద ఉండే రోమ కుదుళ్ల నుంచి మొలుస్తాయి. ఈ కుదుళ్లు ఉపరితల చర్మం (epidermis) కింద ఉన్న అంతశ్చర్మం (dermis)లో ఉంటాయి. అక్కడే మెలనిన్‌ రేణువులు ఉత్పత్తి అవుతూ వెంట్రుక అనే ప్రొటీన్‌ గొట్టంలో దట్టంగా పేరుకుంటూ వస్తాయి. తెల్లని వెంట్రుకలు వచ్చే కుదుళ్ల దగ్గర మెలనిన్‌ రేణువుల ఉత్పత్తి లేకపోవడం కానీ లేదా వృద్ధాప్యం వల్ల మందగించడం కానీ జరుగుతుంది. ఆ తెల్ల వెంట్రుకల్ని పదే పదే తీసేసినప్పుడు అవి మాత్రమే పెరిగేలా ఆ కుదుళ్లు ఉత్తేజం పొంది, తెల్ల వెంట్రుకల ఉత్పత్తి జోరుగా సాగవచ్చునన్నది ఓ సమాధానం. కానీ దీనికి ఉన్న సంభావ్యత తక్కువ. 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

మైక్రోసాఫ్ట్‌ వర్డ్‌లో ఆటోమేటిక్‌ క్లౌడ్‌ సేవ్‌.. , ఈ ఆప్షన్‌ ఆపేదెలా?

Microsoft Word | ఇంటర్నెట్‌ డెస్క్:  మైక్రోసాఫ్ట్‌ వర్డ్‌ యాప్‌ను ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది దశాబ్దాలుగా ఉపయోగిస్తున్నారు. , తాజాగా వచ్చిన అప్‌డేట్‌లో ఇకపై మీ వర్డ్‌ డాక్యుమెంట్లు డిఫాల్ట్‌గా వన్‌డ్రైవ్ లేదా మీరు ఎంచుకున్న ఇతర క్లౌడ్ స్టోరేజ్‌లో ఆటోమేటిక్‌గా సేవ్ అవుతాయి. , ఈ ఆటోమేటిక్‌ క్లౌడ్ బ్యాకప్‌ ఫీచర్‌ వల్ల రిమోట్‌ యాక్సెస్‌, ఫైళ్లపై ఫ్లెక్సిబుల్ కంట్రోల్‌, మరింత భద్రత వంటి అనేక ప్రయోజనాలు ఉన్నాయని మైక్రోసాఫ్ట్‌ తన బ్లాగ్‌ పోస్ట్‌లో పేర్కొంది.  అలాగే మైక్రోసాఫ్ట్‌ 365, కోపైలట్‌ చాట్, కోపైలట్‌ లైసెన్స్‌ ఉన్న యూజర్లు అదనంగా కోపైలట్‌ ఫీచర్లను కూడా వాడుకోవచ్చు. , అయితే ఈ ఫీచర్‌ అందరికీ సౌకర్యవంతంగా అనిపించకపోవచ్చు. , కొందరికి తమ ఫైల్స్‌ క్లౌడ్‌లో నిల్వ చేయడం ఇష్టం ఉండదు. , అలా అనుకొనే వారిలో మీరూ ఒకరైతే.. , ఆటోమేటిక్‌ క్లౌడ్‌ బ్యాకప్‌ను ఆప్షన్‌ తొలగించుకొనేందుకు ఈ కింద పేర్కొన్న స్టెప్స్‌ ఫాలో అవ్వండి.  మీ విండోస్‌ పీసీ లేదా ల్యాప్‌టాప్‌లో మైక్రోసాఫ్ట్‌ వర్డ్‌ ఓపెన్‌ చేసి ఎడమవైపు పైభాగంలో ఉన్న ఫైల్ ఆప్షన్‌పై క్లిక్‌ చేయండి. మెనూలో ‘ఆప్షన్స్’ను ఎంచుకుని సేవ్ ట్యాబ్‌...

తెలుసుకుందామా రోజుకో కొత్త విషయం... “భూమి మీద సరిగ్గా పనిచేసే గడియారం, వేరే గ్రహం మీద కూడా అదే విధంగా పనిచేస్తుందా?”

వివరణ: సాధారణంగా మనం గడియారం ఎక్కడ పెట్టినా అది ఒకేలా టిక్ టిక్ చేస్తుందని అనుకుంటాం. కానీ భౌతిక శాస్త్రం చెబుతున్న సత్యం వేరే! ఐన్‌స్టీన్ చెప్పిన సాపేక్షతా సిద్ధాంతం ప్రకారం, సమయం అనేది గురుత్వాకర్షణ మరియు వేగం మీద ఆధారపడి మారుతుంది. ఒక గ్రహానికి గురుత్వాకర్షణ ఎక్కువగా ఉంటే, అక్కడ గడియారం నెమ్మదిగా నడుస్తుంది. తక్కువ గురుత్వం ఉన్న గ్రహంలో అది వేగంగా నడుస్తుంది. కాంతి వేగానికి దగ్గరగా కదిలే వస్తువుల్లో సమయం మరీ ఎక్కువగా నెమ్మదిస్తుంది. ఉదాహరణకు – భూమి మీద ఒక గడియారం ఒక గంట చూపుతుంటే, అదే గడియారం బలమైన గురుత్వం ఉన్న జూపిటర్ దగ్గర ఉంటే కొద్దిగా వెనకబడుతుంది. చంద్రునిపై అయితే భూమికంటే వేగంగా నడుస్తుంది. 👉 అంటే సమయం అనేది ఒకేలా ఉండే గడియారం టిక్ టిక్ కాదు; ప్రపంచంలో మీరు ఎక్కడ ఉన్నారో, ఎంత వేగంగా కదులుతున్నారో, ఎంత బలమైన గురుత్వం ఉందో అనుసరించి మారిపోతుంది. 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

తెలుసుకుందామా రోజుకో కొత్త విషయం... పురుగులు రైల్లో ఎలా ఎగరగలవు? How insects flying in Train Bogie?

స్టేషనులో ఆగి ఉన్న రైలులో మనం కూర్చొని ఒక బంతినిపైకి విసిరితే, అది తిరిగి మన చేతిలోకే పడుతుంది. అదే వేగంగా వెళుతున్న రైలు పెట్టెలో కూర్చొని బంతిని పైకి విసిరినా అది కూడా మన చేతిలోనే పడుతుంది. బంతి పైకి వెళ్లి తిరిగి వచ్చేలోగా రైలు ముందుకు కదులుతుంది కాబట్టి అది వెనక్కి ఎందుకు పడదనే సందేహం మీకు కలగవచ్చు. దీనికి కారణం రైలు సమ వేగంతో ముందుకు వెళుతుండడమే. మనం బంతిని పైకి విసిరినపుడు మన చేతిలోంచి పైకి గాలిలోకి లేచిన బంతికి కూడా రైలు వేగమే ఉంటుంది. అంటే సమవేగంతో వెళుతున్న రైలుకు ఉండే ధర్మాలన్నీ ఆ రైలులో ఉన్న ప్రయాణికులకు, వస్తువులకు కూడా ఉంటాయన్నమాట. అదే సూత్రం రైలులో లైటు చుట్టూ తిరుగుతున్న పురుగులకు కూడా వర్తిస్తుంది. అంటే ఆ పురుగులు కూడా రైలు వేగాన్ని కలిగి ఉంటాయి. అందువల్లే పురుగులు రైలు నిలకడగా ఉన్నప్పుడు, వేగంగా ఉన్నప్పుడు ఒకే రకంగా లైటు చుట్టూ తిరుగుతుంటాయి. 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

తెలుసుకుందామా... రోజుకో కొత్త విషయం.... పునాదులతో సహా ఇళ్లు లేపి కూలిపోకుండా మరో చోట పెడుతున్నారు. ఇదెలా సాధ్యం?

💚ఎన్నో సాంకేతిక శాస్త్రాల మేళవింపునకు సంబంధించిన ఆధునిక ప్రక్రియ ఇది. ప్రతి ఇంటికి భూమిలో కొంత లోతు వరకు పునాదులు ఉంటాయి. ఆ పునాదిపైనే భవనం స్థిరంగా ఉండగలదు. సాధారణంగా కాంక్రీటు స్తంభాలు, కాంక్రీటువాసాలు, పునాది వాసాలతో నిర్మించబడ్డ దృఢమైన పంజరజాలయే భవనానికి స్థిరత్వాన్ని ఇస్తుంది. భవనంలో మిగిలిన భాగాలన్నీ కేవలం హంగులే. మన ఇంట్లో ఒక బల్ల ఉందనుకుందాం. అది సాధారణంగా నాలుగు కాళ్ల మీద ఉంటుంది. దాన్ని ఒక గది నుంచి మరో గదికి తీసుకెళ్లాలంటే రెండు పద్ధతులున్నాయి. ఒకరో ఇద్దరో కలిసి దాన్ని లాగడమో లేదా తోయడమే ఒక పద్ధతి. ఈ పద్ధతిలో బల్లమీద బలాలు సమంగా పనిచేయవు. రెండు కాళ్ల మీద పనిచేసే బలం ఓవిధంగా ఉండగా మిగిలిన రెండు కాళ్ల మీద బలం మరోలా ఉంటుంది. కానీ అదే బల్లను అటు ఇటు సమంగా ఎత్తిపట్టుకొని పక్క గదిలో పెట్టడం రెండో పద్ధతి. ఇక్కడ అన్ని ప్రాంతాల్లో బల్ల మీద ఒకే విధమైన బల ప్రయోగం ఉంటుంది. మొదటి పద్ధతిలో వ్యత్యాస బలాలుండటం వల్ల బల్లలోని సంధి ప్రాంతాలు వీగిపోయే ప్రమాదముంది. రెండో పద్ధతిలో అటువంటి ప్రమాదం లేదు. ఇదే విధంగా పెద్ద పెద్ద క్రేనుల సాయంతో భూమిలో భవనపు పునాదులున్న కుదుళ్ల వరకు అతి జాగ్రత్తగా, బ్...

తెలుసుకుందాము... రోజుకో కొత్త విషయం...

పాములు, బొద్దింకలు పర్యావరణానికి ఏవిధంగా దోహదకారులవుతున్నాయి? How Snakes and cockroaches protect Environment? ఈ విశాల విశ్వంలో మనకు తెలిసినంతవరకు భూమి తర్వాత మరెక్కడా జీవం ఉన్న ఆనవాళ్లు కానరాలేదు. భూమ్మీద జీవం ఆవిర్భవించి సుమారు 400 కోట్ల సంవత్సరాలైంది. ఎన్నో లక్షల రకాల వృక్ష జాతులు, వేలాదిగా జంతుజాతులు ఈ భూమ్మీద పరిణామం చెంది పర్యావరణానికి అనుకూలంగా ప్రకృతివరణం (Natural selection) ప్రకారం జీవనం సాగిస్తున్నాయి. పరస్పరం సహకరించుకుంటూ, ఘర్షించుకుంటూ, సహజీవనం సాగిస్తూ జీవావరణాన్ని, జీవ వైవిధ్యాన్ని సమతుల్యం చేయగలుగుతున్నాయి. ప్రకృతినెదిరించే సామర్థ్యం జంతువులకు, వృక్షాలకు లేదు. కానీ మానవుడికున్న తెలివి, అవసరాల కారణంగా ప్రకృతిని ఎదురించి, పర్యావరణాన్ని ప్రభావితం చేస్తున్నాడు. ఫలితంగా జీవ వైవిధ్యంలో తేడాలు సంభవిస్తున్నాయి. విపరీతమైన పట్టణీకరణ, జల ప్రణాళికల వల్ల ఎలుకలు, కప్పలు, పాములు, బొద్దింకలు పిచ్చుకలు, గాడిదలు, నక్కలు, రాబందులు, పులులవంటి పలు జంతువుల సంఖ్య క్రమేపీ తగ్గుతోంది. బొద్దింకలు పలు రకాల మురికి పదార్థాలు తినికూడా బతుకుతాయి. ఒక అంచనా ప్రకారం అత్యంత స్వల్పంగా పరిణామం చెందిన అతి...

నేటి ఆరోగ్య సూత్ర.... రేల చెట్టు ఉపయోగాలు...

మెట్ట ప్రాంతాల‌లో, కొండ‌లు, గుట్ట‌ల‌పై, రోడ్డుకు ఇరు ప‌క్క‌లా ఎక్కువ‌గా పెరిగే చెట్ల‌ల్లో రేల చెట్టు కూడా ఒక‌టి.  దీనిని చాలా మంది చూసే ఉంటారు.  ఈ చెట్టు ఎన్నో ఔష‌ధ గుణాల‌ను క‌లిగి ఉంటుంది.  మ‌న‌కు వ‌చ్చే అనేక ర‌కాల అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను న‌యం చేయ‌డంలో ఈ మొక్క ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డుతుంది.  రేల చెట్టు లో ఉండే ఔష‌ధ గుణాల గురించి, ఈ చెట్టు వ‌ల్ల క‌లిగే ప్ర‌యోజ‌నాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.  రేల చెట్టు క‌షాయం చేదుగా ఉండి వేడి చేసే గుణాన్ని క‌లిగి ఉంటుంది.  మ‌ల‌బ‌ద్ద‌కాన్ని త‌గ్గించ‌డంలో ఈ చెట్టు ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డుతుంది.  చ‌ర్మ రోగాల‌ను, క‌ఫ రోగాల‌ను, క్రిమి రోగాల‌ను, విషాన్ని హ‌రించ‌డంలో కూడా ఈ చెట్టు స‌హాయ‌ప‌డుతుంది. రేల చెట్టు బెర‌డును దంచి దానిని ఒక గ్లాస్ నీటిలో వేసి ఒక క‌ప్పు క‌షాయం అయ్యే వ‌ర‌కు మ‌రిగించి వ‌డ‌క‌ట్టి గోరు వెచ్చ‌గా తాగుతూ ఉంటే మూత్రం నుండి ర‌క్తం ప‌డ‌డం త‌గ్గుతుంది.  రేల చెట్టు  పువ్వుల‌ను ఇత‌ర దినుసుల‌తో క‌లిపి ప‌చ్చ‌డిగా కూడా చేసుకుని తిన‌వ‌చ్చు.  ఈ ప‌చ్చ‌డి ఎంతో రుచిగా ఉంటుంది.  జ్వ‌రం త‌గ్గిన వారు ప‌థ్యంగా...

తెలుసుకుందాం... రోజుకో కొత్త విషయం...

🔴రహదారులపై వాహనాల డ్రైవర్లు మత్తు పానీయాలు తీసుకున్నారని కనిపెట్టే బ్రీత్‌ ఎనలైజర్‌ ఎలా పనిచేస్తుంది? ✳వాహనాలను నడిపేవారు తాగి ఉన్నారో లేదో తెలుసుకోడానికి పోలీసులు ఉపయోగించే 'బ్రీత్‌ ఎనలైజర్‌' పేరుకు తగినట్టుగానే శ్వాసను విశ్లేషించడం ద్వారా పనిచేస్తుంది.ఒక వ్యక్తి మత్తుపానీయం సేవిస్తే అది అతని రక్తంలో కొంత శాతం కలుస్తుంది. ఆ రక్తం ఊపిరితిత్తులకు సరఫరా అయినపుడు అందులోని మత్తు పానీయం కొంత ఆవిరయి ఊపిరిలో కలుస్తుంది. రక్తంలో ఎంత ఎక్కువ మత్తుపానీయం కలిస్తే అంత ఎక్కువగా శ్వాసలో దాని ప్రభావం ఉంటుంది. అందువల్లే తాగిన వ్యక్తి దగ్గర వాసన వస్తుంది. బ్రీత్‌ ఎనలైజర్‌లోని ఒక గొట్టం వ్యక్తి శ్వాసను పీల్చుకుంటుంది. పరికరంలో ఉండే ప్లాటినం ఏనోడ్‌ (విద్యుత్‌ ధ్రువం), వ్యక్తి శ్వాసలోని మత్తు పానీయాన్ని ఆక్సీకరించి ఎసిటిక్‌ యాసిడ్‌గా మారుస్తుంది. ఈ యాసిడ్‌లోని అణువులు కొన్ని ఎలక్ట్రాన్లను కోల్పోవడంతో విద్యుత్‌ ప్రవాహం ఏర్పడుతుంది. ఈ విద్యుత్‌ ప్రవాహం తీవ్రత ఎక్కువగా ఉంటే పరికరంలో ఎర్ర బల్బు, తక్కువగా ఉంటే ఆకుపచ్చ బల్బు వెలుగుతాయి. దాన్ని బట్టి ఆ వ్యక్తి ఎంత మేర మద్యం పుచ్చుకున్నాడో తెలుస్తుంది...

తెలుసుకుందాం... కొత్తవిషయాలు....

తెల్లవారుతున్నప్పుడు తూర్పు దిశలోను, సాయంత్రం వేళల్లో పడమర దిశలోను ప్రకాశవంతమైన నక్షత్రాలు కనిపిస్తాయి. అవేంటి? ✳తెల్లవారుతుండగా తూర్పున, సాయంత్రం పడమర దిక్కున కనిపించే నక్షత్రం ఒక్కటే. వేర్వేరు కావు. నిజానికి అది నక్షత్రం కాదు. అది శుక్రగ్రహం (వీనస్‌). అందమైన ఉజ్వలమైన కాంతిని వెలువరించడం వల్ల ఈ గ్రహానికి రోమన్‌ ప్రేమదేవత 'వీనస్‌' పేరును పెట్టారు. ఇంతటి వెలుగుకు కారణం ఈ నిర్జీవ గ్రహంపై ఉండే ప్రమాదకరమైన యాసిడ్‌ మేఘాలే. ఇవి సూర్యకాంతిని ఎక్కువగా పరావర్తనం చెందిస్తాయి. ఎంత ఎక్కువగా అంటే మనకి సూర్యుడు, చంద్రుడు తర్వాత ప్రకాశవంతంగా కనిపించేది శుక్రుడే. శుక్రుడు పరిభ్రమించే కక్ష్య భూకక్ష్య లోపల ఉంటుంది. అందువల్లనే మనం ఆకాశం వైపు చూసినప్పుడు సూర్యుడు, శుక్రగ్రహం వ్యతిరేక దిశల్లో ఉండకపోవడమే కాకుండా అర్థరాత్రివేళ అది కనిపించదు. తెల్లవారుతున్నప్పుడు, సాయం సమయాల్లో మాత్రమే కనిపిస్తుంది. అలాగే శుక్రగ్రహం సాయం వేళల్లో అస్తమించదు. తెల్లవారుజామున ఉదయించదు. సూర్యుడు ఉదయించినప్పుడు తూర్పు దిశలో, సూర్యుడు అస్తమిస్తున్నప్పుడు పశ్చిమ దిశలో మాత్రమే కనిపిస్తుంది. ఉదయాన్నే కనిపించే శుక్రగ్రహాన్ని నక...

తెలుసుకుందాం పొటాషియం సైనైడును నోట్లో వేసుకోగానే ఎందుకు చనిపోతారు?

✳పొటాషియం సైనైడు నీటిలోను, రక్తంలోను బాగా కరుగుతుంది. చాలా మందిలో ఉన్న అపోహ ఏమిటంటే దీన్ని మింగగానే అది రక్తంలోని హీమోగ్లోబిన్‌లో ఉండే ఇనుము కేంద్రానికి అనుసంధానించుకుంటుందని, తద్వారా శ్వాసక్రియలో ఆక్సిజన్‌ సరఫరా కణాలకు అందకపోవడం వల్ల మరణం సంభవిస్తుందని అనుకుంటారు. నిజానికి పొటాషియం సైనైడుకు, హీమోగ్లోబిన్‌కు మధ్య రసాయనిక ప్రక్రియ ఏమీ లేదు. నోటిలో వేసుకోగానే ఇది జీర్ణవాహిక ద్వారా త్వరగా రక్తంలో కలుస్తుంది. వెంటనే పొటాషియం, సైనైడు అయాన్లుగా విడివడుతుంది. ఇది కణాల్లో ఉండే 'సైటోక్రోమ్‌-సి-ఆక్సిడేజ్‌' అనే ఎంజైముతో బంధించుకుంటుంది. ఈ ఎంజైము రక్తం ద్వారా వచ్చిన గ్లూకోజ్‌ నుంచి ఎలక్ట్రాన్లను గైకొని, వాటిని శ్వాసద్వారా వచ్చే ఆక్సిజన్‌కు బదలాయించే ప్రక్రియలో ప్రధాన సంధాన కర్త. అయితే సైనైడు అయానులో బంధించుకున్నప్పుడు ఈ ప్రక్రియ జరగదు. దాంతో కణాల్లోని ఆక్సిజన్‌, గ్లూకోజ్‌ పరస్పరం వృథా అయిపోతాయి. ఫలితంగా కణాలకు శక్తి అందదు. శక్తిలేని కణాలు చేష్టలుడిగిపోవడం వల్ల మరణం త్వరగా వస్తుంది. 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

తెలుసుకుందాం

కొంత మంది నీటిపై వెల్లకిలా పద్మాసనం వేసి గంటలతరబడి తేలియాడుతారు. అదెలా సాద్యం? ✳ఇలా చేయడం మానవాతీత శక్తుల వల్ల కానీ, మంత్ర తంత్రాల వల్ల కానీ కాదు. దీన్ని సాధారణ భౌతిక శాస్త్ర నియమాల ద్వారా వివరించగలము. ప్లవన సూత్రాల (laws of floatations) ప్రకారం ఏదైనా వస్తువు సాంద్రత (density)నీటి సాంద్రత కన్నా ఎక్కువైతే నీటిలో మునుగుతుందని, తక్కువైతే తేలుతుందని చదువుకుని ఉంటారు. సాధారణ మానవుడి శరీర సాంద్రత నీటి సాంద్రత కన్నా కొంచమే ఎక్కువ కావడం వల్ల ఈతకొట్టకపోతే మనిషి మునుగుతాడు. ఈత రాక మరణిస్తే శవమై తేలడానికి కారణం చనిపోయిన వ్యక్తి దేహపు సాంద్రత నీటి సాంద్రతకన్నా తక్కువ కావడమే. ప్రాణంతో ఉన్న వ్యక్తి ఓ పద్ధతి ప్రకారం నీటిలోకి దిగి పద్మాసనం వేసుకొనే సందర్భంలో వీపు కింద ఖాళీ ఏర్పడి అక్కడ గాలి బుడగలు ఏర్పడేలా నేర్పరితనంతో కూర్చుంటాడు. అందువల్ల ఎంత సేపైనా తేలియాడుతూ ఉండగలడు. 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

తెలుసుకుందాం.... నీటి నుండి కరెంటు ఎలా తీస్తారో... 🤔

Link here 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

తెలుసుకుందాం...

🌸జవాబు: గోత్రం అంటేనే అద్భుతమైన సైన్సు. ఈ శాస్త్రం ప్రకారం మన పూర్వీకులు గోత్ర విధానాన్ని ఎలా ఏర్పాటు చేశారో గమనించండి. మీరు పూజలో కూర్చున్న ప్రతిసారీ పూజారి మీ గోత్రం గురించి  ఎందుకు అడుగుతారో మీకు తెలుసా? _తెలీదు కాబట్టి అది చాదస్తం అనుకుంటున్నారు?_ 💐గోత్రం వెనుక ఉన్న శాస్త్రం మరేమిటో కాదు-  జీన్-మ్యాపింగ్. అది ఈ మధ్య కాలంలో బాగా ప్రాచుర్యం  పొందిన అధునాతన శాస్త్రమే! 👉🏻 గోత్రం వ్యవస్థ అంటే ఏమిటి? 👉🏻 మనకు ఈ వ్యవస్థ ఎందుకు ఉంది?  👉🏻 వివాహాలకు ఇది చాలా ముఖ్యమైనదిగా మనం ఎందుకు భావిస్తాము? 👉🏻 కొడుకులకు ఈ గోత్రం ఎందుకు వారసత్వంగా వస్తుంది, కుమార్తెలకు ఎందుకు రాదు? 👉🏻 వివాహం తర్వాత కుమార్తె గోత్రం ఎలా/ఎందుకు మారాలి? 👉🏻 తర్కం ఏమిటి? 💐ఇది మనం అనుసరించే అద్భుతమైన జన్యు శాస్త్రం.   మన గోత్ర వ్యవస్థ వెనుక  జన్యుశాస్త్ర వ్యవస్థ ఎలా పనిచేస్తుందో చూద్దాం! గోత్రమ్ అనే పదం రెండు సంస్కృత పదాల నుంచి ఏర్పడింది.   మొదటి పదం 'గౌ'- అంటే ఆవు, రెండవ పదం 'త్రాహి' అంటే కొట్టం. గోత్రం అంటే 'గోశాల' అని అర్థం. జీవశాస్త్ర పరంగా, మానవ శరీరంలో 23 జతల క్...

తెలుసుకుందాం

🐟చేపలు తొట్టె గోడలకు తగలకుండా ఎలా ఈదగలుగుతుతాయి❓ 🌸జవాబు: చేపలకు నీటిలో కదలికల వల్ల కలిగే ప్రచోదనాలను (Impulses) గుర్తించగల అతీంద్రయ శక్తి ఉంది. ఈ శక్తికి కారణమైన జ్ఞానేంద్రియం చేపల దేహంలో వాటి కంటి నుంచి తోక చివరి వరకు ఒక రేఖా రూపంలో వ్యాపించి ఉంటుంది. దీనిని 'పార్శ్వరేఖ' అంటారు. 👉 ఈ రేఖ అతి చిన్న రంధ్రాలు కలిగి చేపల దేహంలో ఒక పాలిపోయిన గీత రూపంలో ఉండి చేపల చర్మం కింద సన్నని గొట్టాల రూపంలో ఉండే న్యూరోమాస్ట్స్‌ అనే జీవకణాలతో కలుపబడి ఉంటుంది. 👉 ఈ కణాలు నీటిలో ఉత్పన్నమయ్యే అతి స్వల్పమైన కంపనాలను, కదలికలను చేపలు గ్రహించేటట్లు చేస్తాయి. అందువల్లే చేపల తొట్టెలో అవి ఎంత వేగంగా ఈదుతున్నా తొట్టె గోడలకు ఢీకొనకుండా ఉంటాయి. మురికి నీటిలో కూడా అవి వాటి మార్గాలకు అడ్డంకులు తగలకుండా ముందుకు పోగలుగుతాయి. ఈ అతీంద్రయ శక్తి వల్లే వాటిి సమీపానికి వచ్చే హానికరమైన ప్రాణుల లేక ఆహారానికి పనికి వచ్చే వాటి ఉనికిని, పరిమాణాన్ని అంచనా వేయగలవు. 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

తెలుసుకుందాం...

🧑🏻‍⚕️చక్కెరలేని గమ్ తింటే పళ్లలో క్యావిటీలు ఏర్పడతాయా❓ 🌸జవాబు: సుగర్ లేని గమ్‌ తింటే పళ్ళలో కావిటీలు ఏర్పడవు . మనము ఎదైనా తిన్నప్పుడు నోటిలోని బాక్టీరియా ఆహారములోని సుగరు తో కలిసి ఒక రకమైన ఆర్గానిక్ ఆమ్లాన్ని ఉత్పత్తి చేస్తాయి . ఈ ఆమ్ల ప్రభావము వలన దంతక్షీణత కలుగుతుంది . క్యావిటీలు ఏర్పడతాయి. సుగరు లేకపోతే ఈ పక్రియ జరుగదు . 👉 నోటిలోని లాలాజలము ఆహారముతో కలిసి ఆ ఆమ్లాన్ని డైల్యూట్ చేస్తుంది . చప్పరిస్తున్నప్పుడు లాలాజలము ఊరుతుంది . అలాగే జున్నులోని కొవ్వులు పళ్ళపైన ఒక పొరగా ఏర్పడి పళ్ళను రక్షిస్తాయి . .దానిలోని కాల్సియం , పాస్పేట్స్ దంతక్షయాన్ని అరికడతాయి. బోజనము తరువాత సుగరు లేని గమ్‌ గాని జున్ను గాని తింటే మంచిదే. 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

తెలుసుకుందాం

👆🏻ఓటు ఎన్నిరకాలుగా వేయవచ్చు? 🌸జవాబు: ఓటర్లు నేరుగా ఎన్నికల కేంద్రానికి వెళ్లి ఓటు వేయడం పరిపాటే. ఎన్నికల సంఘం నిబంధనల మేరకు ఓటును పోలింగ్‌ కేంద్రంలోకి వెళ్లడమే కాకుండా... నాలుగు రకాలుగా అవకాశాలు కల్పించింది. అంటే... ఒక్కఓటు.. నాలుగు రకాలన్న మాట. 📦సాధారణ ఓటు... 👉 18 ఏళ్లు నిండిన పౌరులు దేశంలో ఓటు హక్కును కలిగి ఉంటారు. వీరు నేరుగా పోలింగ్‌ కేంద్రానికి వెళ్లి ఓట్లు వేస్తారు. దీనిని సాధారణ ఓటుగా పరిగణిస్తారు. ఈ పద్ధతిలోనే అత్యధిక శాతం పోలింగ్‌ జరుగుతుంది. 📦సర్వీస్‌ ఓటు... 👉 సరిహద్దుల్లో సైనికులు, పారా మిలటరీ దళాల ఉద్యోగులు ఈ విధానంలో ఓట్లు వేస్తారు. వీరంతా స్వగ్రామాలకు దూరంగా ఉంటారు కాబట్టి ఎన్నికల సంఘం వీరికి సర్వీస్‌ ఓటు వేసే అవకాశం కల్పించింది. 📦ప్రాక్సీ ఓటు... 👉 తమకు బదులుగా ఇతరులను పంపి ఓటు వేయించే ప్రక్రియను ప్రాక్సీ ఓటు అంటారు. దీనిని ఇంటెలిజెన్స్, గూఢచారి సిబ్బంది ఇటువంటి విధానాన్ని వినియోగించుకుంటారు. ఇటువంటి ఓట్లు తక్కువగా కనిపిస్తుంటాయి. 📦పోస్టల్‌ బ్యాలెట్‌.... 👉 ఎన్నికల విధుల్లో పాల్గొనే ప్రభుత్వ సిబ్బంది స్వస్థలాలకు వెళ్లి ఓటు వేసే వీలుండదు.దీంతో వారికి పోస్టల్‌ బ్య...

తెలుసుకుందాం

🦷జ్ఞాన దంతం ఎందుకు వస్తుంది❓ 🌸జవాబు: మనిషి జ్ఞానానికి, దంతానికి అసలు సంబంధమే లేదు. మరి ఆపేరు ఎందుకు వచ్చిందో తెలియదు. మనిషికి మొత్తం 32 దంతాలు ఉంటాయి. కింది, పై దవడల్లో కుడి వైపు 8, ఎడమ వైపు 8 దంతాలు అమరి ఉంటాయి. ఆ 8 దంతాలలో ముందుండే 2 కొరుకుడు(incissors) పళ్లు, ఒక కోరపన్ను(canine tooth), 2 అగ్రచర్వణ కాలు(premolars), 3 చర్వణకాలు(Molars) ఉంటాయి. వీటిలో అన్నిటికన్నా లోపల ఉండే మూడవ చర్వణకాన్ని (3rd molar) జ్ఞాన దంతమని పిలుస్తారు.  👉 ఒక నాడు మనిషి దవడ మరింత పెద్దదిగా మరింత బలమైన దవడపల్లుతో ఉండేది.. కానీ ఉడికించి తినడం అలవాటైన తర్వాత దవడ రూపం తగ్గి, లోపలి చర్వణకానికి స్థానం ఇరుకైంది. ఈ దంతం సాధారణంగా 15 నుంచి 25 ఏళ్ల మధ్య వస్తుంది. ఇరుకు దవడలో ఆ పన్ను వచ్చేటపుడు చాల భాధ కలుగుతుంది.  👉 అయితే మరో పదివేల సంవత్సరాలు గడిచేసరికి మనుషుల దంతాల సంఖ్యలో మార్పువచ్చి అసలు జ్ఞానదంతాలే ఏర్పడకపోవచ్చునన్నది ఓ ఊహ. బాధ నివారణకు ఈ దంతాలను తీసివేయడం మంచిది, ఎన్ని మందులు వాడినా ఫలితం ఉండదు. 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺