✳పొటాషియం సైనైడు నీటిలోను, రక్తంలోను బాగా కరుగుతుంది. చాలా మందిలో ఉన్న అపోహ ఏమిటంటే దీన్ని మింగగానే అది రక్తంలోని హీమోగ్లోబిన్‌లో ఉండే ఇనుము కేంద్రానికి అనుసంధానించుకుంటుందని, తద్వారా శ్వాసక్రియలో ఆక్సిజన్ సరఫరా కణాలకు అందకపోవడం వల్ల మరణం సంభవిస్తుందని అనుకుంటారు. నిజానికి పొటాషియం సైనైడుకు, హీమోగ్లోబిన్‌కు మధ్య రసాయనిక ప్రక్రియ ఏమీ లేదు. నోటిలో వేసుకోగానే ఇది జీర్ణవాహిక ద్వారా త్వరగా రక్తంలో కలుస్తుంది. వెంటనే పొటాషియం, సైనైడు అయాన్లుగా విడివడుతుంది. ఇది కణాల్లో ఉండే 'సైటోక్రోమ్-సి-ఆక్సిడేజ్' అనే ఎంజైముతో బంధించుకుంటుంది. ఈ ఎంజైము రక్తం ద్వారా వచ్చిన గ్లూకోజ్ నుంచి ఎలక్ట్రాన్లను గైకొని, వాటిని శ్వాసద్వారా వచ్చే ఆక్సిజన్‌కు బదలాయించే ప్రక్రియలో ప్రధాన సంధాన కర్త. అయితే సైనైడు అయానులో బంధించుకున్నప్పుడు ఈ ప్రక్రియ జరగదు. దాంతో కణాల్లోని ఆక్సిజన్, గ్లూకోజ్ పరస్పరం వృథా అయిపోతాయి. ఫలితంగా కణాలకు శక్తి అందదు. శక్తిలేని కణాలు చేష్టలుడిగిపోవడం వల్ల మరణం త్వరగా వస్తుంది.
TET పరీక్షకు సిద్ధమవుతున్న అభ్యర్థుల కోసం ఒక ప్రత్యేకమైన ఆన్‌లైన్ మాక్ టెస్ట్ ప్లాట్‌ఫామ్ అందుబాటులో ఉంది. ఈ ప్లాట్‌ఫామ్‌లో మీరు ఎన్ని సార్లైనా పరీక్ష రాయవచ్చు. ప్రతి ప్రయత్నంలో కొత్త ప్రశ్నాపత్రం రూపొందించబడటం దీని ప్రత్యేకత. ఈ మాక్ టెస్టులు విస్తృతమైన ప్రశ్నల బ్యాంక్ ఆధారంగా రూపొందించబడుతున్నందున, ప్రతి పరీక్షలో భిన్నమైన ప్రశ్నలు ఎదురవుతాయి. దీనివల్ల ఒకే రకమైన ప్రశ్నలు పదేపదే రావడం తగ్గి, అభ్యర్థులు వివిధ అంశాలపై మెరుగైన అవగాహన పెంపొందించుకోవచ్చు. ఈ ప్లాట్‌ఫామ్‌ను ఉపయోగించడం ద్వారా: • అపరిమిత సంఖ్యలో మాక్ టెస్టులు రాయవచ్చు. • ప్రతి ప్రయత్నంలో కొత్త ప్రశ్నాపత్రం లభిస్తుంది. • విభిన్న అంశాలపై ప్రాక్టీస్ చేసే అవకాశం ఉంటుంది. • పరీక్షా సమయ నిర్వహణ నైపుణ్యాలు మెరుగుపడతాయి. • మీ బలాలు, బలహీనతలను గుర్తించి వాటిపై మరింత దృష్టి పెట్టవచ్చు. • కంప్యూటర్ ఆధారిత పరీక్షలకు అలవాటు పడేందుకు ఇది ఉపయోగపడుతుంది. • కంప్యూటర్ వినియోగంలో అనుభవం తక్కువగా ఉన్న అభ్యర్థులు కూడా ముందుగానే ప్రాక్టీస్ చేసి ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవచ్చు. నిరంతరంగా మాక్ టెస్టులు రాయడం ద్వారా పరీక్షా భయం తగ్గి, నిజమైన TET పరీక్షలో ...
.jpeg)
Comments
Post a Comment