Skip to main content

నేటి మోటివేషన్... మీ హాబీ ఏమిటి?


హీరో సల్మాన్‌ఖాన్‌ చక్కగా పెయింటింగ్స్‌ వేస్తాడు. సైఫ్‌ అలీ ఖాన్‌ గిటార్‌ అద్భుతంగా వాయిస్తాడు. అనిల్‌ అంబానీ క్రమం తప్పకుండా మారథాన్‌లలో పాల్గొంటాడు. రతన్‌ టాటా పియానో వాయిస్తాడు. అమితాబ్‌ బచ్చన్‌ బ్లాగు రాస్తుంటాడు. దియా మిర్జాకి కుండలు చేయడమంటే భలే సరదా. తమ వృత్తి వ్యాపారాల్లో కోట్లు సంపాదిస్తున్న వీరంతా ఈ పనులు ఎందుకు చేస్తున్నట్లు? ఎందుకంటే ఆ హాబీలు వారిని రీఛార్జ్‌ చేస్తాయి మరి!రోజూ ఛార్జింగ్‌కి పెట్టకపోతే మొబైల్‌ ఫోన్‌ మూగబోతుంది. 
బ్యాటరీ అయిపోతే ఏ రిమోటూ పనిచేయదు. 
పెట్రోలు పోయించకపోతే బండి అంగుళం కూడా కదలదు. 
మరి మన శరీరం? దానికి రీఛార్జింగ్‌ ఎలా? యంత్రం కాదు కాబట్టి దానికి తిండి ఒక్కటే సరిపోదు. వారానికో సినిమా, షికారూ; ఏడాదికో రెండేళ్లకో వారం రోజుల టూరూ వెళ్లొస్తే చాలు రీఛార్జ్‌ అయిపోతామనుకుంటారు చాలామంది. కొన్నాళ్లవరకూ వాటి ప్రభావంతో ఉత్సాహంగా పనిచేయొచ్చేమో కానీ వృత్తిపరంగా మంచి ఫలితాలు అందుకోవాలంటే మాత్రం ఇష్టమైన ఓ ప్రవృత్తి ఉండాలంటున్నారు నిపుణులు. అప్పుడే మనసూ శరీరమూ రెండూ రీఛార్జ్‌ అవుతాయట. సృజనశక్తీ ఉత్పాదకతా పెరుగుతాయట. పైన చెప్పిన సెలెబ్రిటీలందరూ తమ హాబీలను సాధన చేస్తున్నది అందుకే మరి! 
‘మడిసన్నాక కూసింత కలాపోసన ఉండాల’ంటాడు ‘ముత్యాలముగు’్గలో రావుగోపాలరావు. ఈ హాబీలన్నీ దానికిందికే వస్తాయి. కళలు లేని జీవితం కళేబరం లాంటిదని కవి సి.నారాయణరెడ్డి అన్నారు. కళలు జీవితాన్ని సౌందర్యమయం చేస్తాయి. అసలు కళలూ క్రీడలూ తయారైందే మనిషి మనసును ఉల్లాసభరితం చేయడానికి. ఏదో ఒక కళతోనో క్రీడతోనో పరిచయం లేని జీవితం ఉప్పులేని కూరలా చప్పగా నిస్సారంగా ఉంటుంది. కడుపు నిండా తిండీ తలదాచుకోను గూడూ దొరికాక మనిషి మనసు వినోదం మీదికి మళ్లింది. అలా కబుర్లు కథలయ్యాయి, కళలయ్యాయి, ఆటపాటలూ 
తయారయ్యాయి. జీవితమంటే రెక్కలు ముక్కలు చేసుకుని తిండీ బట్టా సంపాదించుకోవడమే కాదు, ఆనందంగా దాన్ని ఆస్వాదించాలన్న కాంక్ష పెరిగింది. అరవై నాలుగు కళలూ పుట్టుకొచ్చాయి. సృజనాత్మకత, కళాత్మకత... గొప్ప విషయాలయ్యాయి. స్వయంగా అందరూ కళాకారులే కానక్కర్లేదు, కళాభిమానులుగానూ వాటి నుంచి లబ్ధి పొందవచ్చు. అలాంటి కళల్లో మనసుకు నచ్చిన ఒకదాన్ని ప్రవృత్తిగా మార్చుకుని వృత్తికి దీటుగా సాధన చేయగలిగితే ప్రతి వ్యక్తి జీవితమూ ఆనందంగా, సంతృప్తిగా సాగుతుందనీ, ఉత్పాదకత పెరుగుతుందనీ అంటున్నాయి పలు పరిశోధనలు. సాధారణ ఉద్యోగులనుంచి శాస్త్రవేత్తల వరకూ అన్ని వర్గాల వారిమీదా జరిగిన ఈ అధ్యయనాలు ఒక్క హాబీ ఉంటే చాలు- రెండు జీవితాలు జీవిస్తున్న అనుభవం సొంతం చేసుకోవచ్చని బల్లగుద్ది మరీ చెబుతున్నాయి.

🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

Comments

Popular posts

RRB NTPC 8050 జాబ్స్ నోటిఫికేషన్ విడుదల

రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు (RRB) 2025 సంవత్సరానికి సంబంధించి 8,050 ఖాళీలతో నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీస్ (గ్రాడ్యుయేట్ అండ్ అండర్ గ్రాడ్యుయేట్) సెంట్రలైజ్డ్ ఎంప్లాయిమెంట్ నోటిఫికేషన్ (CEN 2025)ను ఒక ప్రకటనలో విడుదల చేసింది. మొత్తం 8,050 ఖాళీలను భర్తీ చేయనుంది. వీటిలో 5,000 పోస్టులు గ్రాడ్యుయేట్, 3,050 అండర్ గ్రాడ్యుయేట్ పోస్టులు ఉన్నాయి. అర్హత: గ్రాడ్యుయేట్ పోస్టులకు డిగ్రీ ఉత్తీర్ణత, అండర్ గ్రాడ్యుయేట్ పోస్టులకు ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత ఉండాలి. ముఖ్య తేదీలు: గ్రాడ్యుయేట్ ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 20.11.2025. అండర్ గ్రాడ్యుయేట్ ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 27.11.2025.  మరిన్ని వివరాల కోసం అలాగే పూర్తి నోటిఫికేషన్ కోసం క్రింద ఉన్న లింకును క్లిక్ చేయగలరు  https://www.rrbapply.gov.in/#/auth/landing (Join us on whatsapp at) https://chat.whatsapp.com/JuVLXd0zVNNGnadLIN4Pr8?mode=ems_copy_t https://whatsapp.com/channel/0029VbAmA2K4SpkJgaw7uJ3u 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

RRB JE Recruitment: రైల్వేలో 2,570 జూనియర్ ఇంజినీర్, మెటలర్జికల్ అసిస్టెంట్ పోస్టులు

భారతీయ రైల్వే (Indian Railway).. 2,570 పోస్టులతో మరో నోటిఫికేషన్ను విడుదల చేసింది. దేశ వ్యాప్తంగా అన్ని రీజియన్లలో ఉద్యోగాల భర్తీకి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు (RRB) నోటిఫికేషన్ (సీఈఎల్ నంబర్ 05/ 2025) విడుదల చేసింది. ఈ ప్రకటన ద్వారా 2,570 జూనియర్ ఇంజినీర్, డిపో మెటీరియల్ సూపరింటెండెంట్, కెమికల్ అండ్ మెటలర్జికల్ అసిస్టెంట్ ఖాళీలు భర్తీ కానున్నాయి. ఆర్ఆర్బీ ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ అక్టోబర్ 31వ తేదీ నుంచి ప్రారంభమై నవంబర్ 31వరకు కొనసాగనుంది. పూర్తి వివరాల కోసం ఆఫీసియల్ వెబ్సైటు లింక్ https://www.rrbcdg.gov.in/ 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

నేటి ప్రధాన వార్తా పత్రికలు

🗞️ఈనాడు ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.eenadu.net 📰ఆంధ్రజ్యోతి ➪ 🅐🅟 & 🅣🅢 http://mpaper.andhrajyothy.com/ 🗞️సాక్షి ➪ 🅐🅟 & 🅣🅢 http://epaper.sakshi.com/ 📰ఆంధ్రప్రభ ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.prabhanews.com/ 🗞️V6 వెలుగు➪ 🅣🅢 https://epaper.v6velugu.com 📰నవ తెలంగాణ ➪ 🅣🅢 http://epaper.navatelangana.com/ 🗞️నమస్తే తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.ntnews.com 📰మన తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.manatelangana.news 🧾English Newspapers🗞️        ☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟ 👉🏻The Hindu📰 https://epaper.thehindu.com/Home/Index 👉🏻Deccan Chronicle📰 http://epaper.deccanchronicle.com/states.aspx 👉🏻Indian Express📰 https://epaper.newindianexpress.com/t/3464 👉🏻The Hans India📰 https://epaper.thehansindia.com/           🏹లక్ష్య🇮🇳స్వచ్చంద📚సేవా🩺సంస్థ