Skip to main content

నేటి మోటివేషన్... మీ మనస్సుకు నచ్చే స్టోరీ...!!!


రాళ్ళు కొట్టుకుని జీవించే ఒక అతను ఒక రోజు తన పని చేసుకుంటూ ఉండగా..,
కను చూపులో ఒక రాయి ఎంతో ఆకర్షణీయంగా
కనిపించింది.అతను ఆ రాయినిఇంటికి తీసుకుని వెళ్లి
భార్యకు ఇచ్చాడు.

ఆమె దాన్ని గూట్లో పెట్టింది. కొన్ని రోజుల
తరువాత కుంకుడు కాయలు కొట్టడానికి
దాన్ని ఉపయోగించుకుంది!

ఒక రోజున వాళ్ళ పిల్లవాడు రాళ్ళ ఆట ఆడుకోటానికి ఆ
రాయిని తీసుకుని బయటకి వెళ్ళాడు.
కొద్ది సేపటికి
అటుగా మిఠాయిలు అమ్ముకునే అతను
వచ్చేటప్పటికి పిల్లలు అందరూ ఆ మిఠాయి బండి
చుట్టూ మూగారు. ఈ పిల్లాడు కూడా రాయి 
చేతిలో పట్టుకుని
వెళ్ళాడు.

ఆ రాయి మిఠాయి వ్యాపారిని ఆకర్షించింది. అతను
బాబుతో ఆ రాయి నాకు ఇస్తావా .. నీకు ఒక లడ్డూ ఇస్తాను అన్నాడు. పిల్లాడు
సంతోషంతో ఆ రాయి అతనికి ఇచ్చేశాడు.
సాయంత్రం చెత్త వస్తువులు ఏరుకునే అతని
స్నేహితుడు చూసి ఆ రాయి గురించి అడిగితే
అతను ఎవరో పిల్లాడి చేతిలో ఉంటె బాగుంది కదా అని
ఒక లడ్డూ ఇచ్చి తీసుకున్నాను అని చెప్పాడు. ఆ
స్నేహితుడు ఆ రాయిని కోరగా అతనికి ఇచ్చేశాడు.

అతను ఆ రాయిని మిగతా చెత్త వస్తువులతో కలిపి
చెత్త వస్తువులు కొనే వ్యాపారి వద్దకి పోయి
వస్తువులని వివిధ రకాలుగా విభజించి అతనికి
అమ్మగా అతను ఈ రాయిని చూసి అది ఏమిటి భలే ఉంది! నాకు ఇచ్చేయ్ 
అని అడిగాడు. దానికి అతను కొంత డబ్బు 
తీసుకుని ఆ రాయి వ్యాపారి కి ఇచ్చేశాడు.
బాగుంది
కదా అని వ్యాపారి దాన్ని బల్ల పైన పేపర్ వెయిట్ గా
వాడసాగాడు.

కొన్ని రోజులకి ఒక టోకు వ్యాపారి ఇతని దుకాణానికి
వచ్చి ఆ రాయిని చూసి, అతనికి మరి కొంత ఇచ్చి ఆ
రాయిని తీసుకున్నాడు. దాన్ని వజ్రాల వ్యాపారి వద్దకి
తీసుకుని వెళ్లి పరీక్ష చేయిస్తే అది కొన్ని కోట్లు
విలువ చేసే మేలిమి వజ్రం అని తేలింది.

నీతి :-
అదే రాయి ని ఒకళ్ళు కుంకుడు కాయలు
కొట్టుకో డానికి వాడుకున్నారు. ఒకళ్ళు రాళ్ళ
ఆటఆడుకోటానికి వాడుకున్నారు. ఒకళ్ళు ఒక లడ్డూ 
కోసం దాన్ని ఇతరులకి ఇచ్చేశాడు.
ఒకళ్ళు దాన్ని
పేపర్ వెయిట్ గా వాడుకున్నారు. నిజంగా దాని
గురించి తెలిసిన వ్యక్తి దాని విలువ
రాబట్టుకున్నాడు.

అట్లాగే ఈ మానవ జన్మ ఎంతో విలువైనది. ఎంతో
అరుదుగా లభించేది. దాన్ని దేనికోసం వాడుకోవాలి
అన్నది వారి వారి బుద్ధి మీద ఆధార పడి ఉంటుంది! మానవ జీవిత పరమార్థం
తెలిసికొనినవారు ఈ జన్మను సరిగా వాడుకుంటూ
జీవన్ముక్తి పొంద గలుగుతారు.
లేని వారు ఈ జీవితాన్ని వృథా చేసుకొంటారు.
అసలు..,
మానవ జన్మ ఎత్తిన ఈ,
మనుషులందరూ వజ్రాలే!
తమలోని మంచి,మానవత్వం,ప్రేమ అనే ధగ ధగలను దాచుకుని రాళ్ళలా జీవిస్తున్నారు!

🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

Comments

Popular posts

RRB NTPC 8050 జాబ్స్ నోటిఫికేషన్ విడుదల

రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు (RRB) 2025 సంవత్సరానికి సంబంధించి 8,050 ఖాళీలతో నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీస్ (గ్రాడ్యుయేట్ అండ్ అండర్ గ్రాడ్యుయేట్) సెంట్రలైజ్డ్ ఎంప్లాయిమెంట్ నోటిఫికేషన్ (CEN 2025)ను ఒక ప్రకటనలో విడుదల చేసింది. మొత్తం 8,050 ఖాళీలను భర్తీ చేయనుంది. వీటిలో 5,000 పోస్టులు గ్రాడ్యుయేట్, 3,050 అండర్ గ్రాడ్యుయేట్ పోస్టులు ఉన్నాయి. అర్హత: గ్రాడ్యుయేట్ పోస్టులకు డిగ్రీ ఉత్తీర్ణత, అండర్ గ్రాడ్యుయేట్ పోస్టులకు ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత ఉండాలి. ముఖ్య తేదీలు: గ్రాడ్యుయేట్ ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 20.11.2025. అండర్ గ్రాడ్యుయేట్ ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 27.11.2025.  మరిన్ని వివరాల కోసం అలాగే పూర్తి నోటిఫికేషన్ కోసం క్రింద ఉన్న లింకును క్లిక్ చేయగలరు  https://www.rrbapply.gov.in/#/auth/landing (Join us on whatsapp at) https://chat.whatsapp.com/JuVLXd0zVNNGnadLIN4Pr8?mode=ems_copy_t https://whatsapp.com/channel/0029VbAmA2K4SpkJgaw7uJ3u 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

RRB JE Recruitment: రైల్వేలో 2,570 జూనియర్ ఇంజినీర్, మెటలర్జికల్ అసిస్టెంట్ పోస్టులు

భారతీయ రైల్వే (Indian Railway).. 2,570 పోస్టులతో మరో నోటిఫికేషన్ను విడుదల చేసింది. దేశ వ్యాప్తంగా అన్ని రీజియన్లలో ఉద్యోగాల భర్తీకి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు (RRB) నోటిఫికేషన్ (సీఈఎల్ నంబర్ 05/ 2025) విడుదల చేసింది. ఈ ప్రకటన ద్వారా 2,570 జూనియర్ ఇంజినీర్, డిపో మెటీరియల్ సూపరింటెండెంట్, కెమికల్ అండ్ మెటలర్జికల్ అసిస్టెంట్ ఖాళీలు భర్తీ కానున్నాయి. ఆర్ఆర్బీ ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ అక్టోబర్ 31వ తేదీ నుంచి ప్రారంభమై నవంబర్ 31వరకు కొనసాగనుంది. పూర్తి వివరాల కోసం ఆఫీసియల్ వెబ్సైటు లింక్ https://www.rrbcdg.gov.in/ 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

నేటి ప్రధాన వార్తా పత్రికలు

🗞️ఈనాడు ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.eenadu.net 📰ఆంధ్రజ్యోతి ➪ 🅐🅟 & 🅣🅢 http://mpaper.andhrajyothy.com/ 🗞️సాక్షి ➪ 🅐🅟 & 🅣🅢 http://epaper.sakshi.com/ 📰ఆంధ్రప్రభ ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.prabhanews.com/ 🗞️V6 వెలుగు➪ 🅣🅢 https://epaper.v6velugu.com 📰నవ తెలంగాణ ➪ 🅣🅢 http://epaper.navatelangana.com/ 🗞️నమస్తే తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.ntnews.com 📰మన తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.manatelangana.news 🧾English Newspapers🗞️        ☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟ 👉🏻The Hindu📰 https://epaper.thehindu.com/Home/Index 👉🏻Deccan Chronicle📰 http://epaper.deccanchronicle.com/states.aspx 👉🏻Indian Express📰 https://epaper.newindianexpress.com/t/3464 👉🏻The Hans India📰 https://epaper.thehansindia.com/           🏹లక్ష్య🇮🇳స్వచ్చంద📚సేవా🩺సంస్థ