✅ “ఉత్తర అట్లాంటిక్ సైనిక కూటమి" (నాటో)లో
చేరాలని నిర్ణయించుకున్నట్లు రష్యా సరిహద్న
దేశమైన ఫిన్లాండ్ అధికారికంగా ప్రకటించింది.
✅ ఉక్రెయిన్ కు తదుపరి మద్దతు అందించడంతో పాటు ఫిన్లాండ్, స్వీడన్‌లను నాటోలో చేర్చుకునే
విషయమై చర్చించడానికి 30 సభ్య దేశాలకు చెందిన దౌత్య వేత్తలు బెర్లిన్‌లో సమావేశమయ్యారు.
✅ ఈ నేపథ్యంలో ఫిన్లాండ్ ప్రకటన వెలువడింది. కొత్త దేశాలకు సభ్యత్వం ఇచ్చే విషయం సత్వరం
కొలిక్కి తెస్తామని నాటో సెక్రటరీ జనరల్ జెన్స్ స్టోల్తెన్‌బెర్ల్ ప్రకటించారు.
📌 నాటో అంటే ?
✅ ప్రచ్ఛన్న యుద్ధం తొలి దశల్లో 1949లో నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ (నాటో)ను సభ్య దేశాల ఉమ్మడి రక్షణకు ఒక రాజకీయ, సైనిక కూటమిగా నెలకొల్పారు. అదే నాటో.
✅ 1949లో అమెరికా మరో 11 దేశాలు (బ్రిటన్, ఫ్రాన్స్, ఇటలీ, కెనడా, నార్వే, బెల్జియం, డెన్మార్క్, నెదర్లాండ్స్, పోర్చుగల్, ఐస్‌ల్యాండ్, లక్సెంబర్గ్) ఒక రాజకీయ, సైనిక కూటమిగా ఏర్పడ్డాయి.
✅ ఈ సంస్థ 1952లో గ్రీస్, టర్కీలను చేర్చుకుని విస్తరించింది. 1955లో పశ్చిమ జర్మనీ కూడా చేరింది.
✅ 1999 నుంచి మాజీ తూర్పు కూటమి (ఈస్ట్రన్ బ్లాక్) దేశాలు కూడా ఇందులో చేరాయి. మొత్తం సభ్య దేశాల సంఖ్య 29కి పెరిగింది. 2017 జూన్‌లో మాంటెనిగ్రో కూడా నాటో భాగస్వామిగా మారింది.
📌ఈ నాటో ఎందుకు?
✅ నాటో అధికారికంగా చెప్తున్న ప్రధాన కారణం ''ఉత్తర అట్లాంటిక్ ప్రాంతంలో సుస్థిరత, శ్రేయస్సులను పెంపొందించటం ద్వారా సభ్య దేశాల స్వాతంత్ర్యం, ఉమ్మడి వారసత్వం, నాగరికతలను సంరక్షించటం''.
✅ నాటో సభ్య దేశాల్లో ఏదో ఒక దేశం మీద సాయుధ దాడి జరిగితే దానిని తమందరి మీదా దాడిగా పరిగణించటం జరుగుతుందని, అందరూ పరస్పర సాయం కోసం ముందుకు వస్తారని నాటో ఒప్పందం స్పష్టంచేస్తోంది.
✅ ఈ భద్రతకు సోవియట్ యూనియన్‌ను, కమ్యూనిజాన్ని ప్రధాన ముప్పుగా ఈ సంస్థ పరిగణించింది.
Comments
Post a Comment