Skip to main content

నేటి మోటివేషన్... పండ్లబుట్ట కథ .శ్రద్ధగా చదవoడి...


జస్ట్ 5 నిమిషాలకంటే ఎక్కువ టైం పట్టదు చదివి అర్థం చేసుకోడానికి..!!

అరటిపండును తొక్క తీసేసి తింటాం.

సపోటాను తొక్క, గింజ తీసేసి తింటాం.

సీతాఫలం మధ్యలో ఉన్న గుజ్జు తిని...పై తొక్కతో పాటు
లోపలి గింజలు కూడా వదిలేస్తాం.

ఆపిల్ లో గింజలు తీసేసి, మొత్తం తింటాం.

జామ పళ్ళని మొత్తం తినేస్తాం.

ఇలాగ మనం ఒక పండులో టెంకని, ఒక పండులో గింజని, ఇంకోదాంట్లో తొక్కని కాదనుకుంటాం.

ఒక్కోటి ఒక్కో రుచి.
తీపి, పులుపు, వగరు కొంచం తేడాలతో ఎన్నో రుచులు. 
అన్ని ఇష్టమే, ఏది తిన్నా మనకు ఆరోగ్యమే. 

అయితే పళ్ళు తింటునప్పుడు మంచి మాత్రమే గుర్తుంటుంది కానీ చెడు గుర్తుండదు. 
మనకు కావాల్సింది తీసుకొని అక్కర్లేనిది పారేస్తాం అoతే. 

అలాగే మనుషులు కూడా పళ్ళలాంటివారు.

కుటుంబంలో భార్య భర్త , అమ్మ నాన్న ,అక్క చెల్లి,అన్న తమ్ముడు, అందరు ఒక్కో రకం పండు లాంటివారు...
ఒకొక్కరిది ఒక్కో స్వభావం... అయితే అందరూ, పళ్ళ లాగా మనకు మంచి చేసేవాళ్ళే...
అయినా కానీ మనిషి స్వభావం విషయంలో వాళ్ళు మనకోసం చేసిన మంచి కంటే , వాళ్ళు అప్పుడప్పుడూ మనమీద చూపించిన కోపమో, చిరాకో ఎక్కువ గుర్తుంటుంది. 

పండులో అక్కర్లేని గింజ, తొక్క,తొడిమ కూడా ఒక భాగమే అనుకుంటాం కానీ పండుని ద్వేషించం కదా!!?
కొన్నిపండ్లు మనకు నచ్చనివి కూడా ఉండొచ్చు..వాటి జోలికి పోకుండా వదిలేస్తాం తప్ప..చిరాకుపడo కదా!!?

పండులాగే కోపతాపాలు, ప్రేమపాశాలు కలిస్తేనే మనిషి స్వభావం..
ఇది గుర్తించగలిగితే, వాళ్ళని ద్వేషించకుండా ప్రేమిస్తాం..

కుటుంబమంటే - అన్ని రకాల పండ్లతో నింపిన పండ్లబుట్ట!!
కుటుంబ స్థితిగతులను..అర్థం చేసుకుంటూ, ఒకరికొకరు సహకరించుకుంటూ, కలిసిమెలిసి ఉండేందుకు ప్రతి ఒక్కరూ ఎవరికివారే ఎప్పటికప్పుడు ప్రయత్నిస్తూ సున్నితంగా కుటుంబాన్ని manage చేసుకోవాలి తప్ప..ఓకే ఇంట్లో ఉంటూ రాగద్వేషాలకు తావిస్తూ..
శత్రువుల్లా మారకూడదు ఎప్పటికీ..!!


🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

Comments

Post a Comment

Popular posts

TET - PSYCHOLOGY IMPORTANT 100 bits for you

TET చైల్డ్ డెవలప్‌మెంట్ & పెడగాజీ: పార్ట్ 1 (బిట్స్ 1 – 100)  1. పెరుగుదల అంటే? — పరిమాణాత్మక మార్పు  2. వికాసం అంటే? — గుణాత్మక + పరిమాణాత్మక మార్పు  3. పరిపక్వత అంటే? — సహజ జీవసంబంధ ప్రక్రియ  4. వికాసం ఎలాంటి ప్రక్రియ? — నిరంతర ప్రక్రియ  5. తల నుండి కాళ్ల వరకు వికాసం ఏ సూత్రం? — శిరోపాద సూత్రం  6. కేంద్రం నుండి పరిధి వైపు వికాసం ఏ సూత్రం? — ప్రాక్సిమో-డిస్టల్ (సమీప దూరస్థ సూత్రం)  7. శిశు వికాసానికి కారణాలు? — వారసత్వం, పరిసరాలు  8. బాల్యదశను ఏమంటారు? — సామాజీకరణ దశ  9. కౌమార దశను ఏమంటారు? — పరివర్తన దశ  10. శిశువు మొదటి గురువు ఎవరు? — తల్లి  11. జ్ఞానాత్మక వికాస సిద్ధాంతకర్త? — పియాజే  12. పియాజే వికాస దశలు ఎన్ని? — 4  13. Sensorimotor (ఇంద్రియ చాలక దశ) వయస్సు? — 0–2 సం.  14. Preoperational (పూర్వ ప్రచాలక దశ) వయస్సు? — 2–7 సం.  15. Concrete Operational (మూర్త ప్రచాలక దశ) వయస్సు? — 7–11 సం.  16. Formal Operational (అమూర్త ప్రచాలక దశ) వయస్సు? — 11+ సం.  17. Object Permanence (వస్తు స్థిరత్వ భావన) ఏ...

🚨 తల్లికి వందనం 2026: ₹15,000 పొందేందుకు మీ వివరాలు తప్పనిసరిగా పరిశీలించండి! 🚨

తల్లికి వందనం పథకం కింద అర్హులైన లబ్ధిదారుల ఖాతాల్లో ఆర్థిక సహాయం జమ చేసే ప్రక్రియ త్వరలో ప్రారంభం కానుంది. 💰 మీ పేరు అర్హుల జాబితాలో ఉందో లేదో, దరఖాస్తు ఆమోదం పొందిందో లేదో ముందుగానే తెలుసుకోవడం మంచిది. కొత్త మార్గదర్శకాల ప్రకారం, ఒకే కుటుంబంలో అర్హత కలిగిన ఒక్కరికంటే ఎక్కువ మంది విద్యార్థులు ఉంటే, ప్రతి విద్యార్థికి విడివిడిగా ప్రయోజనం అందే అవకాశం ఉంది. క్రింది కారణాల వల్ల మీ దరఖాస్తు ప్రభావితమయ్యే అవకాశం ఉంటుంది: ❌ అర్హత నిబంధనలకు సంబంధించిన వివరాలు సరిపోకపోతే ❌ బ్యాంక్ ఖాతా ఆధార్ మరియు NPCIతో అనుసంధానం కాకపోతే ❌ ఇతర ధృవీకరణ వివరాల్లో లోపాలు ఉంటే మీ ఆధార్ వివరాలతో ఇంటి నుంచే ఆన్‌లైన్‌లో స్టేటస్‌ను సులభంగా పరిశీలించవచ్చు. 📱 మరిన్ని వివరాల కోసం: https://apgovtschemes.com/thalliki-vandanam-status-check-2026-27/ https://apgovtschemes.com/thalliki-vandanam-status-check-2026-27/ 📢 గమనిక: తుది అర్హత, చెల్లింపు తేదీలు మరియు నిబంధనలు ప్రభుత్వ అధికారిక ప్రకటనల ఆధారంగా మారవచ్చు. 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

క్యాలిక్యులేటర్ లో ఉండే ఈ GT, MU, M+, M-, MRC బటన్ల అర్థాలు, ఎందుకు వాడుతారో తెలుసా..?

ఇప్పుడంటే అన్నీ కంప్యూటర్ మయం అయిపోయాయి. దానికి తోడు స్మార్ట్ ఫోన్ లేకుండా క్షణం గడవదు. ప్రతీ దానికి యాప్ లు వచ్చేసాయి. ఇప్పుడంటే మనం సులభం గా పెద్ద పెద్ద అమౌంట్స్ కూడిక వెయ్యటానికి కాలిక్యులేటర్ యాప్ లను వాడుతున్నాం. అయితే ఫిజికల్ కాలిక్యులేటర్ వాడకం మాత్రం ఇంకా తగ్గలేదని చెప్పాలి. ఇప్పటికీ షాపుల్లో, ఆఫీసుల్లో అకౌంట్స్ సెక్షన్స్ లో దీని అవసరం ఉంటూనే ఉంటుంది. మీరు ఎప్పుడైనా కాలిక్యులేటర్ ను సరిగా చూసినట్లయితే అందులో కొన్ని ప్రత్యేకమైన బటన్స్ ఉంటాయి. GT, MU, M+, M-, MRC ఇలా కొన్ని స్పెషల్ బటన్లు ఉంటాయి. కాలిక్యులేటర్ ను వాడే చాలా మందికి అవేంటో ఎందుకు వాడతారో తెలియదనే చెప్పాలి. అసలు ఆ బటన్ల ఉపయోగం ఏంటో తెలుసుకుందామా... 1. GT - గ్రాండ్ టోటల్ (Grand Total) GT బటన్ మీకు గ్రాండ్ టోటల్ ను చెప్తుంది. అంటే ఉదాహరణకు 4 × 2 = 8 అని ఒక గుణకారాన్ని వేసుకుని తరువాత 7 × 6 = 42 అనే వేరే లెక్కను వేసారనుకోండి. ఇప్పుడు GT అనే బటన్ ప్రెస్ చేస్తే మీకు టోటల్ 50 (08 + 42 = 50) అనే ఆన్సర్ వస్తుంది. సో ఇది పెద్ద పెద్ద మొత్తాలలో లెక్కలు చేసినప్పుడు ఈజీ గా గ్రాండ్ టోటల్ తెలుసుకోవడానికి పనికొస్తుంది. ఒకసారి ట్రై చ...