ధైర్యం ఉన్న వ్యక్తికి పిరికివాడికి మధ్య పెద్ద తేడా ఏమీ లేదు. ఇద్దరికీ భయాలు ఉంటాయి. కానీ పిరికివాడు తన భయాలకు తగినట్లు ప్రవర్తిస్తాడు ధైర్యం ఉన్న వ్యక్తి తన భయా లన్నింటిని ,పక్కన పెట్టి తనకు తెలియని
వాటిలోకి కూడా దూసుకుపోతాడు.
భయం లేనంత మాత్రాన ధైర్యం ఉన్నట్లు కాదు. ఎన్ని భయాలు ఉన్నప్పటికీ తెలియని దాని లోకి చొచ్చుకు పోవడమే ధైర్యముంటే మీరు మరింత ధైర్యవంతులు అవుతున్నకొద్దీ నిర్భయత్వం మీలో చోటు చేసుకుంటుంది ఉంటుంది అదే ధైర్యం యొక్క అంతిమ అనుభవం. అదే దాని సుగంధం...
మీ భయమే మిమ్మల్ని బానిసగా చేస్తుంది. మీరు నిజంగా నిర్భయలు అయితే ఎవరికీ మీరు ఏ మాత్రము బానిస కాలేరు. నిజానికి మీలోని భయమే ఇతరులు మిమ్మల్ని బానిసగా చేసుకోవడానికి ముందే మిమ్మల్ని వారికి బానిసగా చేస్తుంది. నిర్భయ డైన వ్యక్తి దేనికి భయపడడు. తను చూసి ఇతరులు భయపడేలా ప్రవర్తించడు. ఎందుకంటే అతని దగ్గర భయం అనేది ఏమాత్రం ఉండదు.
హృదయ మార్గమే ధైర్య మార్గం. జీవితం చాలా ప్రమాదకరమైనది. అందుకే పిరికి వారు ప్రమాదకరమైన వాటి నుంచి తప్పించుకు తిరుగుతారు. నిజంగా పూర్తి జీవంతో వ్యక్తులు ఎప్పుడూ తెలియని వాటిని ఎంత ప్రమాదకరమైన తెలుసుకునే ప్రయత్నం చేస్తారు...
హృదయానిది జూద గాడి మనస్తత్వం అందుకే అది ఎప్పుడు ప్రమాదాన్ని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉంటుంది బుర్ర ది ఎప్పుడు వ్యాపారి మనస్తత్వం అది మహా మోసకారి ,అందుకే అది ఎప్పుడు లెక్కలు వేస్తూ ఉంటుంద కానీ హృదయం ఎప్పుడు ఎలాంటి లెక్కలు వెయ్యదు, ఎందుకంటే దానికి లెక్కలు తెలియవు...
పరిపూర్ణమైన ఎరుకతో, పూర్తి చైతన్యంతో, మీరు మీ హృదయం చెప్పే దానిని మాత్రమే చాలా శ్రద్ధగా వినండి అలా చేయడం ద్వారా మీరు ఎప్పుడూ ఎలాంటి విభజనకు లోను కాకుండా, మంచి ,చెడులు ,బేరీజులు ఏమాత్రం అవసరం లేని సరైన మార్గంలో పయనించడం ప్రారంభిస్తారు...
Comments
Post a Comment