Skip to main content

నేటి మోటివేషన్... "ఖాళీ గానే ఉంటావు కదా"

ఈ మాటల్ని ఈ మధ్య పిల్లలు కూడా అమ్మను అనడం ప్రారంభించారు...
"ఖాళీ గానే ఉన్నావు కదమ్మా నాకు అది చేసిపెట్టచ్చుగా" ఇలా అమ్మతో పిల్లలు అనడం సహజం అయిపోయింది...
నాన్నగారి మాటలను విని పిల్లలుకుడా ఇలా తయారయ్యారు...ఖాళీగా ఉంటున్నాను అని వీళ్లంతా అనుకుంటున్నారు కదా! నేనెందుకు ఒకరోజు ఖాళీగా కూర్చోకూడదు అన్న ఆలోచనవచ్చింది నాకు...🤔
ఆలోచన రావడమే తరువాయి పిల్లలు, మావారు వెళ్ళాక ఏ పని చేయకుండా ఖాళీగా కూర్చున్నాను...

సాయంత్రం అయింది.పిల్లలు ఇంటికి వచ్చారు... వస్తూనే...
ఇంటిముందు పిల్లలు వేసుకున్న షూ పాలిష్ మూత తెరిచివుంది.చెప్పుల స్టాండు చిందరవందరగా ఉంది.."అమ్మ కు ఏమైంది ఇవన్నీ ఎందుకు సర్దలేదు..అనుకుంటూ..."అమ్మా!ఎక్కడున్నావు? ఆకలవుతుందే ఏమైనా పెట్టు" 
జవాబులేదు..."తొందరగా కాస్త పాలైనా ఇవ్వమ్మా! అన్నారు.జవాబులేదు...అమ్మ పలకడం లేదేంటి అని అమ్మను వెతకసాగారు...ఇంతలో భర్త వచ్చారు.. రాగానే "లక్ష్మీ!తల పగిలిపోతోంది వేడిగా కాఫీ ఇవ్వు"అన్నాడు...జవాబులేదు.. భార్య వంటింట్లో ఉందేమో అని వెళ్లి చూసాడు... లేదు...ఎక్కడ ఉన్న పాత్రలు అన్నీ అక్కడే వాసనకొడుతూ ఉన్నాయి..బెడ్రూం లో ఉందేమో అని వెళ్ళాడు. అక్కడ తను తుడుచుకుని పడేసిన తడి టవలు అక్కడే ఉంది.. బనియన్,లుంగీ మంచం మీదే ఉన్నాయి... బెడ్ పై ఉన్న దుప్పట్లు అలాగే ఉన్నాయి...లక్ష్మి కనపడక పోయేసరికి పిల్లలు,భర్త తనని వెతుక్కుంటూ మేడ పైకి వెళ్లారు...అక్కడ నవల చదువుతూ..బఠానీలు తింటూ కనపడింది లక్ష్మి...

" ఏంటమ్మా! ఇక్కడ ఇలా కూర్చోని ఉన్నావు..రా! ఆకలవుతోంది. ఏదైనా పెట్టు" అన్నారు పిల్లలు..

"ఆఫీసులో పని ఒత్తిడితో తలపగిలిపోతోంది కాపీ పెడుదువుగాని రా! అని భర్త అన్నారు...లక్ష్మి ఇలా అంది..
" నేను ఒక్కరోజు ఖాళీగా కూర్చుంటే ఎలా ఉంటుందో చూద్దామని ఖాళీగా కూర్చున్నాను" 
అమ్మ ఖాళీగా కూర్చుంటే ఇల్లు ఇంత దరిద్రంగా ఉంటుందని అప్పటికే గమనించారు పిల్లలు,భర్త... తమతప్పును తెలుసుకుని.. ఇలా అన్నారు...

"లక్ష్మీ!తప్పయింది.. సరే నీకుకూడా నేనే కాపీ కలుపుకుని వస్తాను ఇక్కడే ఉండు.సరేనా? అన్నాడు భర్త.

"మేము నీకు స్నాక్స్ తెస్తాం ఉండమ్మా! అన్నారు పిల్లలు..

ఖాళీగా ఉండటం అంటూ ఇల్లాలికి ఉండదు...అది మీరు తెలుసుకుంటే చాలు...మీరు అనడం చూసి పిల్లలు అనడంతో కాస్త బాధనిపించింది అంతే! 10నిమిషాలు ఆగండి మీ అందరికీ తినడానికి,తాగడానికి ఏవో ఒకటి చేసి తీసుకొస్తాను."
అంటూ లక్ష్మి చీర కొంగును నడుము లో దోపుకుని నవ్వుతూ వెళ్ళింది 

ఇంటి ఇల్లాలికి ఎంతో పని ఉంటుంది... ఖాళీగా ఉన్నావని, ఉద్యోగం చేయడం లేదని చులకన చేయడం తప్పుకదా!......


🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

Comments

Popular posts from this blog

నేటి ప్రధాన వార్తా పత్రికలు తెలుగు మరియు ఇంగ్లీష్

                             ఈనాడు ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.eenadu.net ఆంధ్రజ్యోతి ➪ 🅐🅟 & 🅣🅢 http://mpaper.andhrajyothy.com/ సాక్షి ➪ 🅐🅟 & 🅣🅢 http://epaper.sakshi.com ఆంధ్రప్రభ ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.prabhanews.com/ V6 వెలుగు➪ 🅣🅢 https://epaper.v6velugu.com 📰నవ తెలంగాణ ➪ 🅣🅢 http://epaper.navatelangana.com/ నమస్తే తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.ntnews.com 📰మన తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.manatelangana.news English Newspapers        ☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟ 👉🏻The Hindu📰 https://epaper.thehindu.com/Home/Index Deccan Chronicle http://epaper.deccanchronicle.com/states.aspx Indian Express https://epapeHr.newindianexpress.com/t/3464 The Hans India https://epaper.thehansindia.com/ 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

కాంట్రాక్ట్ ఉద్యోగుల కోసం జారీ చేసిన G.O.MS.No.2 – సమగ్ర ఆదేశాలు

ప్రభుత్వ శాఖల్లో కాంట్రాక్ట్ ఉద్యోగులకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం G.O.MS.No.2 ద్వారా తాజా మార్గదర్శకాలు జారీ చేసింది. ఈ ఆదేశాలు 2025 జనవరి 6న అమల్లోకి వచ్చాయి. ఈ ఉత్తర్వులు కాంట్రాక్ట్ ఉద్యోగుల వేతనాలు, మాతృత్వ సెలవులు, ఎక్స్‌గ్రేషియా వంటి అంశాలను స్పష్టంగా చర్చించాయి. ఈ ఆదేశాలలో ఉన్న ముఖ్యాంశాలు, పాజిటివ్ మరియు నెగటివ్ అంశాలను ఈ వ్యాసంలో విశ్లేషించబడింది. ముఖ్యాంశాలు: 1.MTS: ప్రభుత్వ శాఖలు, యూనివర్సిటీలు, మరియు సమాజాల్లో ఖాళీగా ఉన్న నిబంధిత పోస్టులపై నియమితులైన కాంట్రాక్ట్ ఉద్యోగులకు మాత్రమే న్యూనత పేస్కేల్ వర్తిస్తుంది. MTS ద్వారా నెలవారీ చెల్లింపులు కలిపి ఒకే రూపంలో అందిస్తారు. అయితే, ఈ పేమెంట్‌లో అదనపు అలవెన్స్‌లు, వార్షిక పెంపులు ఉండవు. 2. మాతృత్వ సెలవులు: వివాహిత మహిళా ఉద్యోగులకు రెండు ప్రసవాలకు 180 రోజుల చెల్లింపు మాతృత్వ సెలవు కల్పించడం ఈ ఉత్తర్వుల్లో ప్రధానమైన పాజిటివ్ అంశం. ఈ కాలంలో EPF, ESI వంటి అన్ని ప్రయోజనాలు అందుబాటులో ఉంటాయి. 3. ఎక్స్‌గ్రేషియా: అపఘాత మృతి చెందిన కాంట్రాక్ట్ ఉద్యోగుల కుటుంబాలకు రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా, సహజ మృతికి రూ.2 లక్షల ఎక్స్‌గ్రేషియా అందించ...

ఫ్లాష్ ఫ్లాష్ ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల... Top sites మీకోసం....

Link 1 Link 2 Link 3 Link 4 Link 5 Link 6 Link 7 Link 8 Link 9 Link 10 Link 11 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺