Skip to main content

నేటి మోటివేషన్... సంతోషం : చిరునామ

మనిషి తాను జీవించినంతకాలం సంతోషంగా ఉండాలనుకొంటాడు. సంతోషం కోసమే అన్నం తింటాడు. సంతోషం కోసమే ఆటలాడుకుంటాడు, నిద్రపోతాడు. సంతోషం కోసమే పెళ్ళి చేసుకొంటాడు, పిల్లలు కావాలనుకొంటాడు. చేసే పని, కూసే కూత, రాసే రాత... అంతా సంతోషం కోసమే! ఇంతకూ సంతోషం ఎక్కడ దొరుకుతుంది అనేది విలువైన ప్రశ్న. సంతోషం చిరునామా కోసం మనిషి వెదకని చోటులేదు. చేయని ప్రయత్నం లేదు. అయినా సంతోషం గగన కుసుమంగా ఎందుకు ఉన్నదో మనిషికి అర్థం కావడంలేదు.

ప్రపంచాన్ని నడిపేది డబ్బు. డబ్బు లేకుండా ఏ మనిషీ జీవించలేడు. అది ఎంత ఎక్కువగా నిల్వ ఉంటే అంత సౌఖ్యంగా జీవించగలననుకుంటాడు. మనిషి. కానీ డబ్బు సంతోషాన్ని ప్రసాదిస్తుందా అంటే అనుమానమే. లోకంలో పుష్కలంగా ధనరాశులు పోగుచేసిన సంపన్నులెందరో ఉన్నారు. కానీ వారందరికీ సౌఖ్యం దొరకవచ్చునేమోగానీ సంతోషం దొరక్కపోవచ్చు. కనుక సంతోషానికి డబ్బు కారణం కాదు.

అధికారం ఉంటే సంతోషం ఉంటుందా అంటే, అదీ నమ్మకం లేదు. లోకంలో ఏకచ్ఛత్రాధిపత్యంతో అధికారాన్ని సొంతం చేసుకొని పాలించిన వారెందరో ఉన్నారు. వాళ్లు ఎల్లవేళలా సంతోషంగా ఉన్నారనే దాఖలాలు లేవు.

అందంగా ఉంటే సంతోషం ఉంటుందా? దానికీ రుజువు లేదు. ఎందరో అందగాళ్లు, సౌందర్యవంతులు మానసిక క్షోభలతో ఆత్మహత్యలు చేసుకొన్న చరిత్రలున్నాయి.

సకల విద్యలనూ ఆపోశన పడితే సంతోషం కలుగుతుందా అంటే అదీ సత్యం కాదు. ఎందరో విజ్ఞాన ఖనులైన మహానుభావులు అశాంతితో తనువులు చాలించారు.

కనుక సంతోషానికి మూలం సంపదలు, అధికారం, చదువు, అందం కావని అనుభవపూర్వకంగా మనిషికి అర్థమైంది. సంతోషానికి ధనికులు, పేదలు అనే భేదం లేదు. అందం, చదువు అనే బేరీజులు లేవు. వయోభేదం లేదు. ఎప్పుడైనా, ఎక్కడైనా మనిషికి స్వాధీనమై ఉండేది సంతోషం.

పసిపిల్లలకు బొమ్మలతో ఆడుకోవడంలోనే సంతోషం. ఎదిగే పిల్లలకు ఆటపాటలతో గడపడం సంతోషం. యువకులకు తమ కలలను సాకారం చేసుకోవడమే సంతోషం. వృద్ధులకు తమ సంతానాన్ని చక్కగా చూసుకొంటూ ఉండటమే సంతోషం. కొందరికి ప్రకృతి ఆరాధన సంతోషం. కొందరికి తీర్థక్షేత్రాలను సందర్శించడం సంతోషం. కొందరికి సంగీతం వినడం సంతోషం. కొందరికి సృజన చేయడమే పరమానందం. ఇలా సంతోషానికి ఒక నిర్వచనం లేదు. ఒక ఉనికి లేదు. ప్రపంచంలోని అణువణువులోనూ సంతోషం నిండి ఉంది. దాన్ని చూడగలగడమే మనిషి పని.

పరిమిత సంపాదనతో అన్నవస్త్రాదులను సమకూర్చుకొని సంతోష జీవనం గడుపుతున్నవాళ్లెందరో ఉన్నారు. వాళ్లకు పూరి గుడిసెలైనా, పక్కా భవనాలైనా ఒక్కటే. రాజప్రాసాదాల వంటి విలాస భవనాల్లో హంసతూలికాతల్పాలపైన పడుకున్నా కొందరు ముళ్లపాన్పు మీద పడుకొన్నట్లే నిద్ర కరవై, దుఃఖ జీవితాన్ని కొనసాగిస్తుంటారు. ఉన్నంతలో గడుపుకొంటూ, తోటివారికి సహాయపడుతూ, దీనులపట్ల కారుణ్యాన్ని ప్రదర్శించేవారికి ఏ సంపదలతోనూ పని లేదు. సంపదలు ఎన్ని ఉన్నా ఎవరికీ ఏ విధంగా తోడ్పడని జీవితాలూ ఉన్నాయి.

మనిషి తన జీవితంలో అనుక్షణం సంతోషాన్ని ఆహ్వానించాలి. అసంతృప్తిని తరిమివేయాలి. కష్టాలకు, కడగండ్లకు, బాధలకు కుంగిపోరాదు. ఉన్నంతలో ఆనందాన్ని తోడుకోవాలి. ఆత్మీయులతో మనోభావాలను పంచుకొని సేదదీరాలి. అనవసరమైన భయాలను దరిజేరనీయరాదు. అనవసర విషయాల్లో తలదూర్చరాదు. కోరి కోరి కష్టాలు తెచ్చుకోరాదు. నీతిమంతమైన జీవితానికి దారులు వేసుకోవాలి. అనుచిత సంపాదనకోసం అర్రులు చాచకూడదు. తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు, బంధుమిత్రులు, శ్రేయోభిలాషులు అందించే స్ఫూర్తితో జీవితాన్ని అమృతమయం చేసుకోవాలి. మానసికోన్నతికి దారులను అన్వేషించాలి...

అంతర్యామితో అనుసంధానం కావాలి. అదే చిట్టచివరి

 సంతోషానికి చిరునామా!😅
 ఆనందం సంతోషం ఈ చిన్ని జీవితానికి ఆయురారోగ్యాలు
అందరమూ సుఖసంతోషాలతో
జీవితాన్ని గడుపుదాం.

    👍ఇదే జీవిత పరమార్ధo

🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

Comments

Post a Comment

Popular posts

నేటి ప్రధాన వార్తా పత్రికలు

🗞️ఈనాడు ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.eenadu.net 📰ఆంధ్రజ్యోతి ➪ 🅐🅟 & 🅣🅢 http://mpaper.andhrajyothy.com/ 🗞️సాక్షి ➪ 🅐🅟 & 🅣🅢 http://epaper.sakshi.com/ 📰ఆంధ్రప్రభ ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.prabhanews.com/ 🗞️V6 వెలుగు➪ 🅣🅢 https://epaper.v6velugu.com 📰నవ తెలంగాణ ➪ 🅣🅢 http://epaper.navatelangana.com/ 🗞️నమస్తే తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.ntnews.com 📰మన తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.manatelangana.news 🧾English Newspapers🗞️        ☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟ 👉🏻The Hindu📰 https://epaper.thehindu.com/Home/Index 👉🏻Deccan Chronicle📰 http://epaper.deccanchronicle.com/states.aspx 👉🏻Indian Express📰 https://epaper.newindianexpress.com/t/3464 👉🏻The Hans India📰 https://epaper.thehansindia.com/           🏹లక్ష్య🇮🇳స్వచ్చంద📚సేవా🩺సంస్థ

తెలుసుకుందాం...

🌸జవాబు: గోత్రం అంటేనే అద్భుతమైన సైన్సు. ఈ శాస్త్రం ప్రకారం మన పూర్వీకులు గోత్ర విధానాన్ని ఎలా ఏర్పాటు చేశారో గమనించండి. మీరు పూజలో కూర్చున్న ప్రతిసారీ పూజారి మీ గోత్రం గురించి  ఎందుకు అడుగుతారో మీకు తెలుసా? _తెలీదు కాబట్టి అది చాదస్తం అనుకుంటున్నారు?_ 💐గోత్రం వెనుక ఉన్న శాస్త్రం మరేమిటో కాదు-  జీన్-మ్యాపింగ్. అది ఈ మధ్య కాలంలో బాగా ప్రాచుర్యం  పొందిన అధునాతన శాస్త్రమే! 👉🏻 గోత్రం వ్యవస్థ అంటే ఏమిటి? 👉🏻 మనకు ఈ వ్యవస్థ ఎందుకు ఉంది?  👉🏻 వివాహాలకు ఇది చాలా ముఖ్యమైనదిగా మనం ఎందుకు భావిస్తాము? 👉🏻 కొడుకులకు ఈ గోత్రం ఎందుకు వారసత్వంగా వస్తుంది, కుమార్తెలకు ఎందుకు రాదు? 👉🏻 వివాహం తర్వాత కుమార్తె గోత్రం ఎలా/ఎందుకు మారాలి? 👉🏻 తర్కం ఏమిటి? 💐ఇది మనం అనుసరించే అద్భుతమైన జన్యు శాస్త్రం.   మన గోత్ర వ్యవస్థ వెనుక  జన్యుశాస్త్ర వ్యవస్థ ఎలా పనిచేస్తుందో చూద్దాం! గోత్రమ్ అనే పదం రెండు సంస్కృత పదాల నుంచి ఏర్పడింది.   మొదటి పదం 'గౌ'- అంటే ఆవు, రెండవ పదం 'త్రాహి' అంటే కొట్టం. గోత్రం అంటే 'గోశాల' అని అర్థం. జీవశాస్త్ర పరంగా, మానవ శరీరంలో 23 జతల క్...

నేటి మోటివేషన్... ఉద‌యం 8 లోపు చేసే (S.A.V.E.R.S.)….అనే ఈ 6 అల‌వాట్లు మీ జీవితాన్నే మారుస్తాయ్.!

హాల్ ఎలోర్డ్ అనే ప్ర‌ముఖ ర‌చ‌యిత రాసిన “ద మిరాకిల్ మార్నింగ్” అనే బుక్ లో ఉద‌యం 8 లోపు చేసే 6 ప‌నులు మ‌న జీవితాన్నే మారుస్తాయ్ అని చాలా స్ఫ‌ష్టంగా చెప్పాడు. కార్ యాక్సిడెంట్ అయ్యి కోమాలోంచి బ‌య‌ట‌ప‌డ్డ ఈ ర‌చ‌యిత ఇప్పుడు త‌న ర‌చ‌న‌ల‌తో ప్ర‌పంచాన్ని ఆలోచింప‌జేస్తున్నాడు. ఆనందానికి 6 అంశాల సూత్రం. S.A.V.E.R.S S-Silence( నిశ్శ‌బ్దం)....మ‌న ప్ర‌తి రోజును చాలా నిశ్శ‌బ్దంగా ప్రారంభించాలి…అంటే ప్ర‌శాంత‌త‌తో స్టార్ట్ చేయాలి..లేవ‌డం లేట‌య్యింది…అయ్యే ఎలా…? ఆఫీస్ ప‌ని…ఈ రోజు అత‌డిని క‌లుస్తాన‌ని చెప్పాను…ఎమోయ్…టిఫిన్ అయ్యిందా…..ఇదిగో ఇంత‌లా హైరానా ప‌డొద్దు… ప్ర‌శాంతంగా లేవ‌గానే….కాసింత సేపు మెడిటేష‌న్ చేయండి. లేదా…క‌ళ్ళు మూసుకొని ప్ర‌శాంత‌త‌ను మీ మ‌న‌స్సులోకి ఆహ్వానించండి. ఇక్క‌డే మ‌న రోజు ఎలా గ‌డుస్తుంది? అనేది డిసైడ్ అయిపోతుంది . A-Affirmations ( నీతో నువ్వు మాట్లాడుకోవ‌డం)…. అంద‌రి గురించి, అన్ని విష‌యాల గురించి అన‌ర్గ‌లంగా మాట్లాడే మ‌నం…మ‌న‌తో మ‌నం ఒక్క‌సారి కూడా మాట్లాడుకోలేక‌పోతున్నాం. అస‌లు మ‌న‌లోని మ‌న‌కు ఏం కావాలి? పెద్ద స్థాయికి ఎదిగిన వాళ్ళ‌ల్లో ఖ‌చ్చితంగా ఈ ల‌క్ష‌ణం ఉంటుంది. ఈ మూడు పా...