Skip to main content

Posts

Showing posts from May, 2022

నేటి మోటివేషన్.... పథకం..

చాలా కాలం క్రితం ఒక ఊరిలో ఒక శిల్పి ఉండేవాడు. ఆయన ఎంత గొప్ప శిల్పకారుడంటే, ఆయన చెక్కిన శిల్పాలలో జీవ కళ ఉట్టిపడుతూ ఉండేది. చుట్టుపక్కల ఊళ్ళల్లో ఆ శిల్పికి, ఆయన శిల్పకళా నైపుణ్యానికి ఎంతో పేరుండేది. దానితో ఆయన తన నైపుణ్యంపై ఎంతో గర్వపడేవాడు.  కాలక్రమంలో, ఆయనకు తాను మరణించే సమయం ఆసన్నమైనదని, ఇంకా ఎక్కువ రోజులు తాను బతకననే అందోళనలో పడిపోయాడు. అందుకే తనను తీసుకెళ్ళేందుకు వచ్చిన యమదూతలను భ్రమింపజేయడానికి ఒక పథకం వేశాడు. అచ్చం తనలాగే ఉండే పది ప్రతిమలను తయారు చేసుకొని వాటి మధ్య కూర్చున్నాడు. యమదూతలు అతన్ని తీసుకెళ్ళడానికి వచ్చి అక్కడున్న ప్రతిమలను చూసి ఆశ్చర్యంతో ఇరకాటంలో పడిపోయారు. అక్కడున్న ప్రతిమలకు అసలైన మనిషికి తేడా తెలుసుకోలేక “ఆ శిల్పి ప్రాణం తీసుకెళ్ళలేకపోతే సృష్టి నియమం ఉల్లంఘించినట్లవుతుంది. సత్యం తెలుసుకోవడానికి ప్రతిమలను పగలగొడితే కళను అవమానించినట్లవుతుంది” అని ఆలోచిస్తూ నిలబడిపోయారు..   అంతలో మానవ సహజమైన లోపాల పట్ల అవగాహన ఉన్న ఒక యమదూతకు ఒక ఆలోచన వచ్చింది. అతను ఆ ప్రతిమల వంక చూస్తూ "నిజంగా శిల్పి ఎంత అందమైన ప్రతిమలను తయారు చేశాడు. కాని ఈ ప్రతిమలలో ఒక చిన్న లోపం ఉంది. అతను నా

నేటి మోటివేషన్... ధనమా...ధర్మమా..?!

"రైతు బజార్లో కాయగూరలు కొనుక్కుని హడావుడిగా ఇంటికి వెళ్తున్నారు. ఈలోగా సడెన్ గా మీ ముందే "మనీ పర్స్" పడేసుకుని మీకన్నా హడావుడిగా.. వడివడిగా ముందుకు దూసుకుపోతున్నాడు  ఓ యువకుడు.  పాపం.. అతనికి తన పర్స్ క్రింద పడిన విషయమే తెలియదు మీ ఒక్కరికీ తప్ప..! సరిగ్గా అప్పుడే మీ మదిలో 2 రకాల అంతర్మధనం మొదలవుతుంది. 1.ధర్మంగా ఆ యువకుడిని వెనక్కి పిలిచి అతని పర్స్ ఇచ్చేయడం.   2.మీకున్నా ఆర్ధిక సమస్యల వల్ల ఆ పర్స్ ని మీరే ఉంచేసుకోవడం. విధి ఎంత విచిత్రమైనదో .. "ఖర్మ సిధ్ధాంతం" తెల్సిన ప్రముఖులకు బాగా తెలుసు. కానీ.. ఆ ఖర్మ సిథ్ధాంతం తెలియని వారి కోసమే ఈ "జీవిత సత్యం".   1.ధర్మానికి విలువిచ్చి ఈ కలియుగంలో కూడా మీరు సత్సంకల్పంతో.. సదాశయంతో ఆ వ్యక్తి పర్స్ ఆ వ్యక్తికే ఇచ్చేశారనుకోండి.. మీ మంచితనం "భావితరం"లో  అదే ధర్మంతో ఏదో ఒక రూపంలో మీరు చేసిన సహాయం కన్నా రెట్టింపు స్థాయిలో..  మీ కష్టకాలంలో మిమ్మల్ని కాపాడుతుంది..  అది ఒకరోజు..వారం. నెల.. సంవత్సరాలు కావచ్చు.. కానీ, ఆ మేలు జరిగింది గతంలో మీరు చేసిన "మంచిపని" వల్లే అనే జ్ణానం ఆ సమయంలో మీ బుర్రకు తట్టదు

నేటి మోటివేషన్... మనిషే ఒక సైన్యం

మనిషి గమ్యం చేరతాడు, ఒక లక్ష్యం ఉన్నప్పుడు. లక్ష్యం ఏర్పరచుకుంటాడు, సంకల్పం దృఢమైనప్పుడు. సంకల్పించుకుంటాడు, మంచి ఆలోచన రూపుదిద్దుకున్నప్పుడు. వీటన్నింటికీ మూలం ధర్మం. అది మనసులో పుట్టే కోరికలన్నింటికీ నిజమైన స్నేహితుడి వంటిది. తత్వోపదేశంలో గురువు వంటిది. యుద్ధరంగాన సైనికుడి వంటిది. ధనార్జనలో మంత్రి వంటిది. పోషణలో తల్లి వంటిది. ప్రయాణంలో తండ్రి వంటిది. చతుర్విధ పురుషార్థాల్లో ధర్మానిదే ప్రథమస్థానం. పోయేటప్పుడు మనిషి వెంట వచ్చేది ధర్మం ఒక్కటే! మనిషిలో ఉల్లాసం, ఉత్సాహం, ఆనందం, శాంతం, కార్యదీక్ష, సహనం తగ్గాయీ అంటే- అతడు ధర్మాన్ని విస్మరిస్తున్నాడన్న మాట. ధర్మం ఒక్కటే అతడికి అపూర్వమైన శక్తినిస్తుంది. అద్భుతమైన సంతృప్తి కలిగిస్తుంది. ఐహికమైన ఆనందాలు, సరదాలు చాలా ఉంటాయి. అవేమీ శాశ్వతాలు కావు. దైహిక వాంఛల వలలో పడితే, మనిషి అదే లోకమనుకుంటాడు. బావిలో కప్పలా మారతాడు. నశ్వర భోగభాగ్యాల్లో కొట్టుమిట్టాడుతుంటాడు. తన జీవితానికి అసలు కావాల్సిందేమిటి, ఎటు వెళ్లాలి, ఎలా వెళ్లాలి? ఈ ప్రశ్నలే ఉదయించవు అజ్ఞాని మనసులో! అటువంటి మనసు- తెగిన గాలిపటం. ఆకులు కప్పి ఉండే వూబి. వివేకం కొరవడినప్పుడు, మనసే మనిషిని సు

నేటి మోటివేషన్... తృప్తి -- positive attitude

పందెం గెలిచిన గుర్రాన్ని అమ్మడానికి వేటగాడు సంతకు వెళ్ళాడు. బేరం కుదరక గుర్రానిచ్చి ఆవుకు మారకం వేశాడు. మరొకరి సలహా తీసుకుని ఆవునిచ్చి గాడిదకు మారకం వేశాడు. గాడిదనిచ్చి బూట్లు తీసుకొన్నాడు. బూట్లిచ్చేమో టోపి తీసుకున్నాడు. ..ఆ టోపితో ఇంటికి వస్తూ దారిలో వంతెన మీద నడుస్తుంటే రాయి తగిలి బోర్లాపడ్డాడు. టోపి కాస్తా నదిలో పడింది. దిగులుగా అటే చూస్తూ కూర్చున్నాడు. అదే దారిలో వచ్చే ఇద్దరు బాటసారులు విషయం అడిగి తెలుసుకున్నారు. అయ్యోపాపం అని బాధపడ్డారు. "నీకివాల ఉపవాసమే" అన్నాడొకడు. పెళ్ళాంతో బడితపూజ " తప్పదన్నాడింకోకడు." నా పెళ్ళాం అలాంటిది కాదు, ఏమీ అనదు "అని వేటగాడు బాటసారులతో పందెం కట్టాడు. బాటసారులిరువులు వేటగాడింటికి వెళ్ళారు.  వేటగాడు గుమ్మంలో నుంచి భార్యను పిలిచాడు. వాడి పెళ్ళాం ఎదురుగా వచ్చి మావా! వచ్చినావా అంది ఆప్యాయంగా, వాడు జరిగింది చెప్పడం మొదలు పెట్టాడు.వేటగాడు : "గుర్రం ధరకు పలకకపోతే ఆవుకి మారకం వేశా "అన్నాడు. భార్య : "మంచి పని చేశావు మావా పాలు తాగవచ్చు "వేటగాడు : "ఆవు కూడా గాడిదకు మారకం వేశా" భార్య : "కట్టెలు అడివినుంచి

కష్టాలు మిమ్మల్ని బలోపేతం చేస్తాయి

కష్టాలు మిమ్మల్ని పరీక్షించడానికి వస్తాయి, మీ సంకల్పశక్తిని, సహనమును, తితీక్షలను బలోపేతము చేసి, తద్వారా మీకు సహాయము చేయడానికి వస్తాయి. మీరు సాహసోపేతులుగా ఉండండి. ఉల్లాసముగా ఉండండి. నిరంతరము సావధానముగా, శాంతముగా, కష్టకాలములో కూడా ఈ లక్షణాలన్నింటిని కూడగట్టుకొని ఉండండి. కష్టాలనుంచి దుఃఖాలనుంచి విడుదల చేసేటటువంటి ఏ ఆధ్యాత్మిక సాధన లేదు(అభ్యాసము). (అంటే ఈ సాధన చేస్తే నా కష్టాలన్నీ తీరిపోతాయి ఇక నాకు జీవితములో ఇబ్బందులేమీ రావు, ఉండవు అనేటటువంటి సాధన అని భావము). చిత్తశుద్ధిగల సాధకునకు భగవంతుడు ప్రతి దశలో తప్పక స్వాంతన చేకూరుస్తాడు, ప్రోత్సహిస్తాడు కూడా. ఓటమి మరియు వైఫల్యము అనేవాటికి వాటి యొక్క ఉద్దేశ్యము వాటికి తప్పకుండా ఉంటుంది. విమర్శలకు కూడా వాటి ఉపయోగము వాటికి ఉంటుంది.        విచారము మరియు ఆగ్రహముల నుండి విడుదలకండి. పొగడ్తలు లేక తెగడ్తల చేత కదలక ఉండండి. దృఢముగా ఉండండి. రాయి వలే స్థిరముగా దృఢముగా ఉండండి - మానసిక ప్రకోపముల చేత, నిరాశ నిస్పృహలచేత, పరాజయముల చేత కదిలింపబడక ఉండండి. ఆధ్యాత్మిక సాధకుడు, ఆధ్యాత్మిక ప్రపంచము మొత్తము చేత నడపబడుతూ ఉంటాడు. అలా పోరాటము చేస్తున్న సాధకునికి సాధు సత్పు

నేటి మోటివేషన్.... జీవన సత్యం

ఈ జీవితం ఎందుకొచ్చిందో తెలియదు నుంచి ఎందుకొచ్చిందో తెలుసుకోవడం వరకు చేసే ప్రయాణమే జీవితం. జ్ఞానపరంగా జీవనం గురించి జీవితం బోలెడంత సమాచారం ఇస్తూనే ఉంటుంది. జీవించడంలోనే జీవితం చాలా విషయాలు నేర్పిస్తుంది. నేర్చుకోను అని భీష్మించుక్కూర్చున్న మనిషికి సైతం అన్ని వైపుల నుంచీ జ్ఞానం చేరువవుతూనే ఉంటుంది. జీవితం నేర్పిస్తూనే ఉంటుంది. జీవితంలో ఇటువంటి ఏర్పాట్లు ఎన్నో ఉన్నాయి. అయితే జీవితానికి ఎందుకింత ప్రయాస... నా బాధేదో నన్ను పడనివ్వొచ్చు కదా అని మనిషికి అనిపిస్తుంది. అయినా జీవితం వదలదు. గొప్ప నైపుణ్యం కలిగిన దర్శకుడిలా నాటకీయంగా మనల్ని బతుకు సంఘటనల్లో (అనుభవాల్లో) ఇరికించి మన ప్రజ్ఞ చూస్తుంది. ఎందుకంటే, అలజడిలోనే మనిషి బయటపడతాడు అని దానికి బాగా తెలుసు. జీవితం మంచి చెప్పదు. అలాగని చెడూ చెప్పదు. రెండింటినీ మనకు చూపిస్తుంది. మన ముందుంచుతుంది. ఏది ఎన్నుకుంటావో నీ ఇష్టం అంటుంది. భగవద్గీతలా సాక్షిగా ఉండి నిశ్చలంగా చూపిస్తుంది. జీవితమనే నదిలో దిగిపోయాం. ఈదాలి. నది మధ్యలో మార్పులు జరగవు. ఎదురీత కుదరదు. ప్రవాహపు దిశలో నదితో పాటు సాగాలి. వ్యతిరేక దిశలో ప్రయాణం చెయ్యలేం. వ్యతిరేకంగా వెళ్లడానికి జీవితం ఒప

నేటి మోటివేషన్... ఆత్మ స్వచ్ఛత

మహర్షి దేవేంద్రనాథ్ ఠాగూర్ ధ్యానం చేసేటపుడు వందలకొద్దీ పక్షులు ఆయన సమీపంలోను, ఆయన మీద వాలుతూ ,తుల్లుతూ ఆడుకుంటూ ఉండేవి.... ఆయన యొక్క ఆత్మ స్వచ్ఛత పక్షులు, ఉడుతలు లాంటి జీవులను ఆయనవైపుకు ఆకర్షించేది.  ఒకరోజు ఒక చిన్న బాలుడు ఆయన దగ్గరకొచ్చి తాతగారూ.. నాకు ఒక పక్షిని పట్టి ఇవ్వండి...అని కోరాడు. అందుకు ఆయన " ఉండు నాయనా....నేను ధ్యానం చేసే సమయంలో చాలా పక్షులు వస్తాయి....అప్పుడు నీకొక పక్షిని పట్టిస్తాను అని చెప్పి.. ధ్యానానికి వెళ్ళాడు. ఆశ్చర్యంగా ఒక పక్షి కూడా ఆయన దగ్గర వాలలేదు....ఆ రోజు నుండీ... ఏ పక్షీ ఆయన సమీపంలో వాలకపోవడం గమనించిన ఆయన ఒక పెద్ద పాఠం నేర్చుకున్నాడు. మనచుట్టూ ఉన్న ప్రకృతికి మనం అనుసంధానం కావాలంటే.....ఆ ప్రకృతి కల్మషం లేకుండా ఎలా స్వచ్చంగా ఉంటుందో...మనం కూడా ఆ ఫ్రీక్వెన్సీ స్థాయికి ఆత్మ స్వచ్ఛత కల్గి ఉండాలి. ఆయన స్వచంగా ఉన్నంత కాలం పక్షులు ఆయన సమీపంలోకి వచ్చాయి....ఎప్పుడైతే పక్షిని పట్టుకోవాలన్న ఒక చిన్న కల్మషం మనసులో పుట్టిందో....ఆ రోజునుండీ ఆయన ప్రకృతి నుండీ అనుసంధానం తొలగించ బడ్డాడు. అందుకే ...ఒక్క పక్షీ ఆయన చెంతకు రాలేదు. మిత్రమా...సృష్టిలో.. అత్యంత శక్తివంతమైనది

𝗧𝗢𝗗𝗔𝗬 - 𝗛𝗜𝗡𝗗𝗨 - 𝗩𝗢𝗖𝗔𝗕𝗨𝗟𝗔𝗥𝗬

1.BANDY (ADJECTIVE): (झुका हुआ): bowed Synonyms: curved, bent Antonyms: straight Example Sentence: She had legs that were bent and slightly bandy. 2.SPLENDOUR (NOUN): (वैभव): magnificence Synonyms: grandeur, opulence Antonyms: modesty Example Sentence: The barren splendour of the Lake District looked stunning. 3.INDICT (VERB): (अभियोग लगाना): charge with Synonyms: summon, cite Antonyms: acquit Example Sentence: His former manager was indicted for fraud. 4.INSURGENT (NOUN): (विद्रोही): rebel Synonyms: revolutionary, mutineer Antonyms: loyalist Example Sentence: He signaled to the other insurgent, who obeyed and moved forward. 5.CONFER (VERB): (प्रदान करना): bestow on Synonyms: present with/to, grant to Antonyms: withhold Example Sentence: The Minister may have exceeded the powers conferred on him by Parliament. 6.CONSENSUS (NOUN): (आम सहमति): agreement Synonyms: harmony concord Antonyms: disagreement Example Sentence: There is a growing consensus that the current regime has failed. 7.BL

నేటి మోటివేషన్... మనం ఆలోచనలు మెచ్యూర్డ్ గా ఎందుకు ఉండవు?

 ఎదుటి వ్యక్తి ఎలా ప్రవర్తిస్తాడో మనమే అంచనా వేయడం:   కొన్నిసార్లు వేరొక వ్యక్తి మన గురించి ఎలాంటి అభిప్రాయాలను కలిగి ఉన్నారో తెలియకుండానే వారు మన గురించి ఫలానా విధంగా ఫీలవుతూ ఉండి ఉండొచ్చు అని మనమే ఓ కన్ఫర్మేషన్ కి వస్తుంటాం. మనం ఇలా ఇతరుల ఆలోచనల్ని ఊహించడంలో ఓ లోపముంది. వివిధ సందర్భాల్లో, వివిధ వ్యక్తుల గురించి మనం ఎలాగైతే ఫీలవుతామో ఇతరులూ మనలాంటి ఫీలింగులనే కలిగి ఉంటారని భ్రమిస్తాం. మనం అంచనా వేసే దానికి భిన్నంగా అవతలి వ్యక్తి మన పట్ల ఫీలయ్యే విధానం ఉండవచ్చు.     ప్రతీ సంఘటనా మనకు కేవలం రెండు ఫలితాలనే ఇస్తుంది:   ఒక సంఘటన జరిగినప్పుడు ఓ సగటు మనిషిగా మనం ఆలోచించేది.. అది మనకు మంచి చేస్తుందా, చెడు చేస్తుందా, ఆనందపరుస్తోందా, విచారంలో ముంచుతోందా.. ఇలా కేవలం రెండు ఫలితాలే మన ఆలోచనలకు తడతాయి తప్ప ప్రతీ సంఘటనలోనూ mixed ఫలితాలూ ఉంటాయనీ.. వాటిలో మనకు కావలసిన కాంబినేషన్లని మనం గ్రహించి మనసుకి ఫీల్ అవ్వొచ్చనీ ఆలోచించం. దీంతో మనం సక్సెసా, ఫెయిలా, హాపీనా, డిజప్పాయింటెడ్డా వంటి పరిమితమైన conclusions మాత్రమే మనకు మిగులుతుంటాయి.   అందరి అభిప్రాయాలూ అందరికీ సరైనవే:   మనం సరైనదని నమ్మిన దాన్ని ఇతరుల