"రైతు బజార్లో కాయగూరలు కొనుక్కుని హడావుడిగా ఇంటికి వెళ్తున్నారు. ఈలోగా సడెన్ గా మీ ముందే "మనీ పర్స్" పడేసుకుని మీకన్నా హడావుడిగా.. వడివడిగా ముందుకు దూసుకుపోతున్నాడు
ఓ యువకుడు.
పాపం.. అతనికి తన పర్స్ క్రింద పడిన విషయమే తెలియదు మీ ఒక్కరికీ తప్ప..! సరిగ్గా అప్పుడే మీ మదిలో 2 రకాల అంతర్మధనం మొదలవుతుంది.
1.ధర్మంగా ఆ యువకుడిని వెనక్కి పిలిచి అతని పర్స్ ఇచ్చేయడం.
2.మీకున్నా ఆర్ధిక సమస్యల వల్ల ఆ పర్స్ ని మీరే ఉంచేసుకోవడం.
విధి ఎంత విచిత్రమైనదో ..
"ఖర్మ సిధ్ధాంతం" తెల్సిన ప్రముఖులకు బాగా తెలుసు. కానీ.. ఆ ఖర్మ సిథ్ధాంతం తెలియని వారి కోసమే ఈ "జీవిత సత్యం".
1.ధర్మానికి విలువిచ్చి ఈ కలియుగంలో కూడా మీరు సత్సంకల్పంతో.. సదాశయంతో
ఆ వ్యక్తి పర్స్ ఆ వ్యక్తికే ఇచ్చేశారనుకోండి..
మీ మంచితనం "భావితరం"లో
అదే ధర్మంతో ఏదో ఒక రూపంలో మీరు చేసిన సహాయం కన్నా రెట్టింపు స్థాయిలో..
మీ కష్టకాలంలో మిమ్మల్ని కాపాడుతుంది..
అది ఒకరోజు..వారం. నెల.. సంవత్సరాలు కావచ్చు.. కానీ,
ఆ మేలు జరిగింది గతంలో మీరు చేసిన "మంచిపని" వల్లే అనే జ్ణానం ఆ సమయంలో మీ బుర్రకు తట్టదు అదే "ఖర్మ సిధ్ధాంతం"☺
2.ధనానికి విలువిచ్చి...మీరు
మీ స్వార్ధంతో ఆ పర్స్ ని మీరే ఉంచేసుకుంటే "ఖర్మ సిధ్ధాంతం" ప్రకారం మీరు మీ పర్స్ ని ఊహించకుండానే అలాగే పోగొట్టుకుంటారు...
అది ఒకరోజు,వారం,నెల, సంవత్సరాలు కావచ్చు.. కానీ,
ఆ ధనం పోయింది గతంలో ఇతరుల ధనాన్ని దొంగిలించడం వలనే అనే సూక్ష్మ పరిశీలన అప్పుడు మీ అంతరాత్మకు తట్టదు..అదే "మాయ"☺
స్వార్ధానికి ప్రతిరూపాలైన ఇలాంటి అనుభవాలెన్నో ప్రతి మనిషి దైనందిన జీవితంలో తటస్ధపడవచ్చు కానీ...ఇలాంటి విపత్కార పరిస్ధితులు ఎన్ని ఎదురైనా మనకంటూ ఓ ప్రత్యేకతను చాటుకోవడంలోనే
ఓ "ఉన్నత వ్యక్తిత్వం" దాగి వున్నదని నా అనుభవ సత్యం👍
ధనం కన్నా విలువైనది ధర్మం..
Comments
Post a Comment