Skip to main content

నేటి మోటివేషన్.... ఈ క్షణం జీవించడం

జీవితం గురించి అతిగా,అనవసరంగా ఆలోచించడం వ్యర్థం. అది వుంది. దాన్ని గురించి ఆలోచించడమెందుకు? అసలు ఆలోచన అన్నది విషంతో సమానమయింది. జీవితమన్నది జీవించడానికి, ఆలోచించడానికి కాదు. అన్నం తినడానికి ఆలోచిస్తామా? గాలి పీల్చడానికి ఆలోచిస్తామా? చూడడానికి ఆలోచిస్తామా? అలాగే జీవితం దానంతట అది సాగనీ. అది సాగుతుంది. దాన్ని గురించి ఆలోచించడమెందుకు? ఆరాటమెందుకు? ఆలోచన అన్నది గతానికో,భవిష్యత్తుకో సంబంధించి ఉంటుంది. వర్తమానానికి కాదు. ఈ క్షణంలో మనిషి బతకాలి. రేపు కాదు. నిన్న జీవించిలేం, రేపు జీవిస్తామోలేదో తెలీదు. ఇప్పుడు ఇక్కడ బతకాలి.

ఒక గ్రామంలో ఒక పేదరైతు ఉండేవాడు. అతను చాలా అమాయకుడు. అతనికి కొద్దిగా పొలం ఉండేది. పొలం పని చేసుకుంటూ జీవితం వెళ్లదీసేవాడు. పొలం పని చేసేటప్పుడు ఎదురుగా ఉన్న కొండల్ని చూసేవాడు. అవి ఎంతో గంభీరంగా, పచ్చగా కనిపించేవి. అవి అతని పొలానికి దగ్గర్లోనే ఉండేవి. ఆ రైతుకు ఆ పర్వతాల పైకి వెళ్లాలని ఎప్పటినుంచో కోరిక. ఇతర్లని వాకబు చేస్తే ”తెల్లవారుజామునే లాంతరు తీసుకుని బయల్దేరితే సూర్యోదయం అయ్యేలోపున పర్వతం పైకి చేరుకోవచ్చు. అదేమంత కష్టం కాదు. మరీ

ఉదయం బయల్దేరితే కొండపైకి వెళ్లేసరికి ఎండ బాగా వేడెక్కుతుంది. అప్పుడు ఇబ్బంది అవుతుంది” అని చెప్పారు.

ఆరైతు ఒకరోజు పర్వతం ఎక్కాలని నిర్ణయించుకున్నాడు. ఒక లాంతరు సంపాదించాడు. పర్వత సౌందర్యాన్ని ఊహించుకుంటూ, ప్రయాణాన్ని తలచుకుంటూ పడుకున్నాడు.

ఉన్నట్లుండి మెలకువ వచ్చింది. అప్పటికి రాత్రి ఒంటిగంట అయింది. నిజానికి రాత్రి నాలుగు గంటలకు బయలుదేరితే చాలు. కానీ రైతుకు నిద్ర రాలేదు. ఒంటిగంట అయితే ఏమి? మెల్లగా నడుద్దాం” అనుకుని లాంతరు వెలిగించి కొండ దగ్గరకు వెళ్లాడు. అంతలో అతన్ని ఒక సందేహం పట్టుకుంది. కొండని చూశాడు. వేల అడుగుల ఎత్తువుంది. గాండాంధకారంలో ఉంది. లాంతరు చూశాడు. దాని కాంతి కేవలం పది అడుగులు మాత్రమే పడుతోంది. తక్కిన స్థలమంతా చీకటిగా ఉంది. దాంతో దిగులుపడిపోయాడు. పది అడుగులు దూరం పడే కాంతితో వేల అడుగుల పర్వతాన్ని ఎలా ఎక్కాలి? అని దిగులు పడిపోయాడు. పర్వతం అంచులో దిగాలుగా కూచుని ఆలోచనలో మునిగిపోయాడు.

ఇంతలో ఒక వృద్ధుడు ఒక లాంతరు పట్టుకుని పర్వతం ఎక్కుతూ కనిపించాడు. అతన్ని చూసి రైతు ఆశ్చర్యపోయాడు. పరిగెత్తుకుంటూ వృద్ధుని దగ్గరకి వెళ్లి ”ఇంత చిన్న లాంతరు పట్టుకుని అంత పెద్ద పర్వతాన్ని నువ్వు ఎలా ఎక్కుతావు. ఈ లాంతరు కాంతి పది అడుగుల మేర మాత్రమే పడుతుంది కదా!” అని తన సందేహం వ్యక్తపరిచాడు. వృద్ధుడు ఆ రైతు అమాయకత్వానికి విస్తుపోయాడు. అతన్ని తేరిపార జూసి ” నువ్వు అమాయకుడిలా

ఉన్నావు. లాంతరు కాంతి పది అడుగులమేర మాత్రమే పడుతుంది. నాకూ తెలుసు. పర్వతం గాండాంధకారంలో మునిగిఉంది. ఆ సంగతి కూడా నాకు తెలుసు. కానీ నువ్వు తెలుసుకోవాల్సిన సంగతి ఒకటుంది. నేను లాంతరు పట్టుకుని నడుస్తున్నాను. నడిచినంతమేరా కాంతి పడుతూనే ఉంటుంది. దారి కనిపిస్తూనే ఉంటుంది. కదలకుండా ఒకచోట ఆగిపోతే అంతా చీకటిగా ఉంటుంది కాంతితో బాటు నడిస్తే కాంతి కూడా మనతో బాటు నడుస్తుంది. దారి మనకు కనిపిస్తుంది” అన్నాడు. రైతుకు రహస్యం బోధపడింది.

🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

Comments

Popular posts

నేడే ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల

తెలంగాణ ఇంటర్మీడియట్ విద్యా మండలి (TGBIE) ప్రకటన ప్రకారం, 2026 మే/జూన్‌లో నిర్వహించిన ఇంటర్ మొదటి సంవత్సరం, రెండో సంవత్సరం (జనరల్ & వొకేషనల్) అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు జూన్ 11, 2026న ఉదయం 11:30 గంటలకు విడుదల కానున్నాయి. ఫలితాలు అందుబాటులో ఉండే వెబ్‌సైట్లు: tgbie.cgg.gov.in results.cgg.gov.in విద్యార్థులు తమ హాల్‌టికెట్ నంబర్ ద్వారా ఆన్‌లైన్‌లో ఫలితాలను చూసుకోవచ్చు. 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

TET - PSYCHOLOGY IMPORTANT 100 bits for you

TET చైల్డ్ డెవలప్‌మెంట్ & పెడగాజీ: పార్ట్ 1 (బిట్స్ 1 – 100)  1. పెరుగుదల అంటే? — పరిమాణాత్మక మార్పు  2. వికాసం అంటే? — గుణాత్మక + పరిమాణాత్మక మార్పు  3. పరిపక్వత అంటే? — సహజ జీవసంబంధ ప్రక్రియ  4. వికాసం ఎలాంటి ప్రక్రియ? — నిరంతర ప్రక్రియ  5. తల నుండి కాళ్ల వరకు వికాసం ఏ సూత్రం? — శిరోపాద సూత్రం  6. కేంద్రం నుండి పరిధి వైపు వికాసం ఏ సూత్రం? — ప్రాక్సిమో-డిస్టల్ (సమీప దూరస్థ సూత్రం)  7. శిశు వికాసానికి కారణాలు? — వారసత్వం, పరిసరాలు  8. బాల్యదశను ఏమంటారు? — సామాజీకరణ దశ  9. కౌమార దశను ఏమంటారు? — పరివర్తన దశ  10. శిశువు మొదటి గురువు ఎవరు? — తల్లి  11. జ్ఞానాత్మక వికాస సిద్ధాంతకర్త? — పియాజే  12. పియాజే వికాస దశలు ఎన్ని? — 4  13. Sensorimotor (ఇంద్రియ చాలక దశ) వయస్సు? — 0–2 సం.  14. Preoperational (పూర్వ ప్రచాలక దశ) వయస్సు? — 2–7 సం.  15. Concrete Operational (మూర్త ప్రచాలక దశ) వయస్సు? — 7–11 సం.  16. Formal Operational (అమూర్త ప్రచాలక దశ) వయస్సు? — 11+ సం.  17. Object Permanence (వస్తు స్థిరత్వ భావన) ఏ...

TET- PSYCHOLOGY REVISION BITS PART - 2

101. ప్రజ్ఞ అంటే? — సమస్య పరిష్కార సామర్థ్యం   102. ప్రజ్ఞను తీర్పు శక్తిగా నిర్వచించినవాడు? — బినెట్   103. వ్యక్తిత్వం అంటే? — సమగ్ర లక్షణాల సమాహారం   104. Trait Theory ఎవరిది? — ఆల్పోర్ట్   105. 16 Personality Factors ఎవరిది? — క్యాటెల్   106. Introvert ఎవరు? — ఒంటరిగా ఉండేవాడు   107. Extrovert ఎవరు? — సమాజంలో కలిసేవాడు   108. Ambivert అంటే? — రెండు లక్షణాల సమ్మేళనం   109. Learningను ప్రభావితం చేసేది? — ఆసక్తి   110. Behaviourను ప్రభావితం చేసేది? — వైఖరి   111. అభిరుచి అంటే? — ప్రత్యేక ఆకర్షణ   112. Aptitude ఏమి సూచిస్తుంది? — భవిష్యత్ విజయం   113. Achievement Test ఏమి కొలుస్తుంది? — నేర్చుకున్నది   114. Aptitude Test ఏమి కొలుస్తుంది? — భవిష్యత్ సామర్థ్యం   115. Personality Test ఏమి కొలుస్తుంది? — వ్యక్తిత్వం   116. Inkblot Test ఎవరిది? — రోర్షాక్   117. TAT రూపొందించినవాడు? — ముర్రే   118. Creativity ప్రధాన లక్షణం? ...