నేను నిన్న నా షాప్ లో మా బాబు మా పాపతోపాటు
ఎండలో చెప్పులు కుడుతుంటే ....
ఒక కలెక్టర్ తన చెప్పు తెగిందని వాటిని చేతిలో
పట్టుకునివచ్చి సర్ ఈ చెప్పులు
కుట్టివ్వగలరా అన్నాడు.. నాకు
ఆశ్చర్యంతో కళ్ళల్లో నీళ్ళు వచ్చాయి
ఏంటి సర్ మీలాంటి వారు నన్ను సర్
అనడం ఏంటీ అంటే.. మానాన్న కి
రెండు కాళ్ళు లేవు.తను గుళ్ళ దగ్గర
అడుక్కొని ఆ వచ్చిన డబ్బులతో నన్ను చదివించాడు
అయితే అప్పుడప్పుడు తనతో పాటు
నన్నూ తీసుకెళ్ళేవాడు..కొంచెం ఎక్కువ డబ్బు
వస్తుందని..
నేను అందరూ మానాన్నని ఈసడించుకుంటుంటే చీపో అని చీదరించుకుంటుంటే అవమానిస్తుంటే చూసి నాలో తెలియని కసి పెరిగింది..
ఆ కసితోనే అడుక్కుని అయినా చదువుకోవాలని
నిర్ణయించుకుని ప్రతిరోజూ మా ఊరికి దూరంగా ఉన్న గుళ్ళముందు సాయంత్రం కూర్చోని చదువుకుని సివిల్స్ పాసై కలెక్టర్ అయ్యాను...
ఇప్పుడు అందరూ నాతోపాటు మానాన్న
ని కూడా సర్ అంటున్నారు..
ఇది నా కథ. ఇది అందరికీ
చెప్పుకుని నన్ను నేను చిన్నబుచ్చుకోలేను.
నేను ఇందాక ఇటు వెళ్తుంటే మీతో పాటు మీ
పాప బాబు కనపడ్డారు. చదువుకునే వయసులో పనిలో ఉన్నారు.ఆ సంపాదన చూస్తే వీరు కూడా నీలానే చెప్పులు కుట్టుకుని ఎక్కడ బతుకుతారోనని కావాలని నా చెప్పు నేనే తెంపుకుని ఇక్కడికి వచ్చాను. ఈ పిల్లల్లో దేశ భవిష్యత్తు కనపడుతుంది
రేపు మీ పిల్లలు
ఏ కలెక్టరో ఏ ముఖ్యమంత్రో ఏ ప్రధానమంత్రో
కావచ్చు. అప్పుడే సర్ అనే బదులు ఇప్పుడే
అంటే మీ పిల్లలని అలా పెంచాలన్న కసి
అయినా పెరుగుతుంది కదా అన్నాడు
నాకు రెండువేల నోటు ఇచ్చి పిల్లలని ఏదో పనిగా కాకుండా కసిగా పెంచమన్నాడు..
నేను ఏడుస్తూ సార్ నేను కుట్టిన చెప్పుకి పదిరూపాయలే కాని మీరిచ్చిన రెండు వేలు రెండు భవిష్యత్తులనిచ్చాయి
మీ డబ్బు వద్దనను దీన్ని లామినేషన్ చేయించుకుని
నా ముందు పెట్టుకుంటాను మీ మాటలెప్పుడు నా గుండెల్లో మోగేలా.. మీ రూపమెప్పుడు నాకళ్ళముందు మెదిలేలా...
Thank you sir.. అన్నాను
గొప్పోళ్ళెప్పుడూ గొప్ప కొంపళ్ళో పుట్టరు...మన చుట్టూ మనతోనే పుడతారు.. మనం గుర్తించక తుంచేస్తాం అనుకుంటూ పిల్లలని ఇంకెప్పుడూ ఇక్కడికి తీసుకురావొద్దని నిర్ణయించుకుని ఆ అట్ట కట్టిన కన్నీటిని తుడుచుకోవడం కూడా మర్చిపోయి మా నాన్నలా నేను మారొద్దని ఆ కార్ వెళ్తున్న వైపు చూస్తుంటే ఆ పొగలో నాకు దేవుడు కనపడ్డాడు..
ఇట్లు..
#బస్టాండ్_ముందు_చెప్పులు_కుట్టుకుని_బతికే_నేను
Really suuuuuper sir. Salute sir
ReplyDelete