Skip to main content

నేటి మోటివేషన్... "మనిషి పుట్టుకె గెలుపుతో మొదలవుతుంది". "పుట్టిన తర్వాత వచ్చిన ఓటమికి బయపడితే ఎలా ?

               

         ఓక ఊరిలో ఇద్దరు మిత్రులు ఉన్నారు ,
వారు ఇద్దరు పదవ తరగతి పరీక్షలు రాసి ఫలితాలు కోసం 
వేచిచూస్తున్నారు. ఆ సమయం రానే వచ్చింది ఒకరు పాస్ అయ్యారు ఇంకొకరు ఫెయిల్ అయ్యారు. పాస్ అయిన వ్యక్తి
పైచదువులకోసం పట్టణంలో ఉన్న  తన మామయ్య ఇంటికి
వెళ్ళిపోయాడు.

            ఫెయిల్ అయిన వ్యక్తిని అందరూ తిట్టడం ,
ఎగతాళి చేయడం మొదలుపెట్టారు. వాడు ఎందుకు 
పనికిరాడు వాడి తల రాత అంతే అంటుంటే అది నిజమేనేమో
అని ఆ విద్యార్ధి కూడా ఆలోచించడం మొదలుపెట్టాడు.
వాళ్ళు అంటున్న మాటలని భరించలేక ఆత్మహత్య  చేసుకుందాం అని అనుకోని వాళ్ళ ఊరి చివరిలో ఉన్న చెరువులో దూకుదాం అని నిశ్చయించుకున్నాడు.

                          ఆ విద్యార్థి ఏడుస్తూ ఇంటి దగ్గర నుండి ఊరి చివర లో ఉన్న చెరువు దగ్గరికి బయల్దేరాడు. దారి మధ్యలో తన గురువు ఒకరు కనిపించి పలకరించారు. ఆ విద్యార్థి ఏడుస్తూ జరిగిన కథ మొత్తం చెప్పాడు. దానికి ఆ గురువు నవ్వుతూ అయ్యో ఇంత చిన్న దానికి ఎవరైనా ఏడుస్తారా ? దానికి ఆ విద్యార్థి , మీకు నా బాధ అర్ధం కావడం లేదు గురువు గారు నేను చచ్చిపోతా నేను బ్రతకలెను అని ఏడుస్తూ అన్నాడు.  అది తప్పు , ఆత్మహత్య చేసుకోవడం మహా పాపం. నువ్వు  అలాంటి తప్పు చేయవద్దు అని గురువు తనను తిట్టాడు.

                        నేను ఒకటి చెప్తా గుర్తుపెట్టుకో ఓడిపోయిన
ప్రతిసారి చావే పరిష్కారం అంటే భూమి మీద ఒక్కరు కూడా 
ఉండరు , ఆఖరికి నేను కూడా ! ఏంటి గురువు గారు మీరు అనేది ? అని ఆ విద్యార్థి అడిగాడు.

                            అవును నేను కూడా పదవ తరగతి ఒకసారి ఫెయిల్ అయ్యాను , నీకన్నా ఎక్కువ ఏడ్చాను , నీకన్నా ఎక్కువ అవమానాలను అనుభవించాను కానీ చనిపోవాలి అని అనుకోలేదు. వాళ్ల అందరికి తగిన గుణపాఠం చెప్పాలి అనుకున్న ఆ ఓటమి నాలో చాలా పట్టుదలని తెచ్చింది.
అదే పట్టుదలతో ఇంత స్థాయికి ఎదిగాను కొన్ని  వేల మందికి 
పాఠాలు చెప్పి వాళ్ళ భవిష్యత్తుకి బాటను అయ్యాను.

"మనిషి పుట్టుకె  గెలుపుతో మొదలవుతుంది".
"పుట్టిన తర్వాత వచ్చిన ఓటమికి బయపడితే ఎలా ? 
ఆ కళ్ళు తుడుచుకుని ఇంటికి వెళ్ళు మళ్ళీ ప్రయత్నించు మళ్ళీ మళ్ళీ ప్రయత్నించు , 
"ఓటమి కూడా నీచేతిలో ఓడిపోయేంత వరకు ప్రయత్నించు."
               ఆ మాటలు విన్న విద్యార్థి మళ్ళీ పరీక్ష రాసాడు. ఈ సారి అత్యధిక మార్కుల తో జిల్లా ఫస్ట్ వచ్చాడు. అదే పట్టుదలతో జీవితంలో ఎన్నో సాధించాడు. ఒక సంస్థ కూడా
ప్రారంభించాడు, ఎంతో ఆనందంగా ఉన్నాడు. ఒక రోజు అతని దగ్గరికి ఒక వ్యక్తి ఉద్యోగం కోసం వచ్చాడు. ఆ వ్యక్తి ఇంకేవరో కాదు తన కంటే ముందుగా పదవ తరగతి పాస్ అయ్యి పట్టణం కి వెళ్లిన తన చిన్ననాటి స్నేహితుడు. ఇప్పుడు అతనే తన దగ్గరికి ఉద్యోగం కోసం రావడం  అతనికి చాలా ఆనందాన్ని ఇచ్చింది.
            నా చిన్నప్పుడు తీసుకున్న నిర్ణయం నిజమయితే
ఇప్పుడు ఈ సంతోషం నాకు దక్కేది కాదు అని తన లో తాను నవ్వుకుంటూ అతనికి ఉద్యోగాన్ని ఇచ్చాడు.

మిత్రమా , 
        జీవితం అంటే ఏంటో ఎవరికి తెలియదు , నిన్న ఉన్నట్టు ఇవాళ ఉండదు , ఇవాళ ఉన్నట్టు రేపు ఉండదు. పూట  పూటకి మారిపోయే దానికి నీ జీవితాన్ని బలి ఇవ్వాలి అని చూస్తే  నీకన్నా  మూర్ఖుడు ఇంకా ఎవరు ఉండరు. ఏదైనా పోరాడి సాధించుకోవాలి అలా కాకుండా  జీవితంలో  ఓడిపోయాం అని , స్నేహితులు మోసం చేశారు అని ,  ప్రేమించినవాళ్ళు వదిలేసి వెళ్లిపోయారు అని , పరీక్ష ఫెయిల్ అయ్యాం అని ప్రతి చిన్నదనికి చచ్చిపోదాం అనుకుంటే ఎలా?
నువ్వు పుట్టింది చవడానికి కాదు ,  నీకంటూ చరిత్రలో ఒక  
గుర్తింపు తెచ్చుకో ,  లే  లేచి  పోరాడి సాదించుకో , నిన్ను ఎగతాళి చేసిన వాళ్ళకే నువ్వు ఆదర్శంగా మారి నీ ప్రతిభ ఏంటో వాళ్లకి చూపించు..
                                                              
🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

Comments

Post a Comment

Popular posts

నేడే ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల

తెలంగాణ ఇంటర్మీడియట్ విద్యా మండలి (TGBIE) ప్రకటన ప్రకారం, 2026 మే/జూన్‌లో నిర్వహించిన ఇంటర్ మొదటి సంవత్సరం, రెండో సంవత్సరం (జనరల్ & వొకేషనల్) అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు జూన్ 11, 2026న ఉదయం 11:30 గంటలకు విడుదల కానున్నాయి. ఫలితాలు అందుబాటులో ఉండే వెబ్‌సైట్లు: tgbie.cgg.gov.in results.cgg.gov.in విద్యార్థులు తమ హాల్‌టికెట్ నంబర్ ద్వారా ఆన్‌లైన్‌లో ఫలితాలను చూసుకోవచ్చు. 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

TET - PSYCHOLOGY IMPORTANT 100 bits for you

TET చైల్డ్ డెవలప్‌మెంట్ & పెడగాజీ: పార్ట్ 1 (బిట్స్ 1 – 100)  1. పెరుగుదల అంటే? — పరిమాణాత్మక మార్పు  2. వికాసం అంటే? — గుణాత్మక + పరిమాణాత్మక మార్పు  3. పరిపక్వత అంటే? — సహజ జీవసంబంధ ప్రక్రియ  4. వికాసం ఎలాంటి ప్రక్రియ? — నిరంతర ప్రక్రియ  5. తల నుండి కాళ్ల వరకు వికాసం ఏ సూత్రం? — శిరోపాద సూత్రం  6. కేంద్రం నుండి పరిధి వైపు వికాసం ఏ సూత్రం? — ప్రాక్సిమో-డిస్టల్ (సమీప దూరస్థ సూత్రం)  7. శిశు వికాసానికి కారణాలు? — వారసత్వం, పరిసరాలు  8. బాల్యదశను ఏమంటారు? — సామాజీకరణ దశ  9. కౌమార దశను ఏమంటారు? — పరివర్తన దశ  10. శిశువు మొదటి గురువు ఎవరు? — తల్లి  11. జ్ఞానాత్మక వికాస సిద్ధాంతకర్త? — పియాజే  12. పియాజే వికాస దశలు ఎన్ని? — 4  13. Sensorimotor (ఇంద్రియ చాలక దశ) వయస్సు? — 0–2 సం.  14. Preoperational (పూర్వ ప్రచాలక దశ) వయస్సు? — 2–7 సం.  15. Concrete Operational (మూర్త ప్రచాలక దశ) వయస్సు? — 7–11 సం.  16. Formal Operational (అమూర్త ప్రచాలక దశ) వయస్సు? — 11+ సం.  17. Object Permanence (వస్తు స్థిరత్వ భావన) ఏ...

TET- PSYCHOLOGY REVISION BITS PART - 2

101. ప్రజ్ఞ అంటే? — సమస్య పరిష్కార సామర్థ్యం   102. ప్రజ్ఞను తీర్పు శక్తిగా నిర్వచించినవాడు? — బినెట్   103. వ్యక్తిత్వం అంటే? — సమగ్ర లక్షణాల సమాహారం   104. Trait Theory ఎవరిది? — ఆల్పోర్ట్   105. 16 Personality Factors ఎవరిది? — క్యాటెల్   106. Introvert ఎవరు? — ఒంటరిగా ఉండేవాడు   107. Extrovert ఎవరు? — సమాజంలో కలిసేవాడు   108. Ambivert అంటే? — రెండు లక్షణాల సమ్మేళనం   109. Learningను ప్రభావితం చేసేది? — ఆసక్తి   110. Behaviourను ప్రభావితం చేసేది? — వైఖరి   111. అభిరుచి అంటే? — ప్రత్యేక ఆకర్షణ   112. Aptitude ఏమి సూచిస్తుంది? — భవిష్యత్ విజయం   113. Achievement Test ఏమి కొలుస్తుంది? — నేర్చుకున్నది   114. Aptitude Test ఏమి కొలుస్తుంది? — భవిష్యత్ సామర్థ్యం   115. Personality Test ఏమి కొలుస్తుంది? — వ్యక్తిత్వం   116. Inkblot Test ఎవరిది? — రోర్షాక్   117. TAT రూపొందించినవాడు? — ముర్రే   118. Creativity ప్రధాన లక్షణం? ...