Skip to main content

Posts

Showing posts with the label Motivation మోటివేషన్

నేటి మోటివేషన్.... హృదయం కదిలించే కథ

రవి సాప్ట్ వేర్ ఇంజినీర్. భార్య డెలివరీకి వెళ్ళింది. అప్పటిదాకా తాముంటున్న సింగిల్ బెడ్ రూమ్ ఇంటిని ఖాళీ చేసి ఊరికి కొంచెం దూరంగా గేటెడ్ కమ్యూనిటీలో డబుల్ బెడ్ రూమ్ ఇల్లు అద్దెకు తీసుకుని చేరాడు. స్వయంపాకం చేసుకుంటాడు. ఆరోజు ఆదివారం. పోర్టికోలో కూర్చుని కాఫీ తాగుతున్నాడు. "ఆకు కూరలు... ఆకు కూరలు" అని కేక వినిపించింది. డెబ్బై ఏళ్ల వృద్ధురాలు తలపై కూరల గంప పెట్టుకుని కనిపించింది. పిలిచాడు. "కాస్త గంప దించయ్యా" అన్నది ఆమె. "పాలకూర కట్ట ఎంత?" అడిగాడు. "పది రూపాయలకు మూడయ్యా" చెప్పింది అవ్వ. "మరీ అన్యాయం... బయట అయిదు ఇస్తున్నారు" అన్నాడు చిరుకోపంగా "నాలుగు తీసుకో నాయన.." కట్టలు తీసింది అవ్వ. పదిరూపాయలు ఇచ్చాడు. "గంప కాస్త పట్టయ్యా" అన్నది అవ్వ గంపను తనవైపు ఎత్తి పట్టుకుని. గంపను పైకి లేపుతూ రెండు కట్టలు పాలకూర తీసి ఇంట్లోకి విసిరాడు రవి.అమ్మయ్య పది రూపాయలకు ఆరు కట్టలు వచ్చాయి అనుకున్నాడు ఒకింత సంతోషంగా. అవ్వ వెళ్ళిపోయింది. "ఎంత ఆశో ఈ ముసలిదానికి... ఇవాళో రేపో చావబోతుంది... ఇంకా డబ్బు మూటలు కడుతున్నది" ముసిముసిగా ...

నేటి మోటివేషన్... ప్రశాంత జీవనం

ప్రతి వ్యక్తీ ప్రశాంతమైన జీవితాన్నే కోరుకుంటాడు. ఆహ్లాదకరమైన వాతావరణంలో జీవనయానం కొనసాగాలని ఆకాంక్షిస్తాడు. ఒత్తిళ్లకు దూరంగా చింతలేని జీవితాన్ని ఆస్వాదించాలని ఆశిస్తాడు. కానీ ఆచరణలో అది సాధ్యమేనా? జీవితం సుఖదుఃఖాల సంగమం. కష్టాలూ సమస్యలు లేని వారంటూ ఎవరూ ఉండరు. అయితే వాటిని ఎంత నిబ్బరంగా ఎదుర్కొంటామన్న దానిపైనే మన జీవన నాణ్యత ఆధారపడి ఉంటుంది.  నిజానికి జీవితం అంటే ఒక సమస్య నుంచి మరొక సమస్యకు ప్రయాణించడమే. అయితే ఆ సమస్యల వల్ల ఏర్పడే విపరిణామాలలో చిక్కుకోకుండా వాటిని చాకచక్యంగా పరిష్కరించుకుంటూ ముందుకు సాగడం మన వివేచన మీద ఆధారపడి ఉంటుంది. ప్రశాంతత కోసం మనం ఎక్కడెక్కడో అన్వేషిస్తూ ఉంటాం. కానీ, ప్రశాంతత అనేది మనలోనే, మనతోనే, మన ఆలోచనల్లోనే నిండి ఉంటుంది. సర్వకాల సర్వావస్థల్లోనూ మనసును నిర్మలంగా స్ఫటికమంత స్వచ్ఛంగా ఉంచుకోగలిగితే ప్రశాంత అనుభూతిని ఆస్వాదించవచ్చు. సమస్యలనేవి సముద్రపు అలల్లా వచ్చి పోతూనే ఉంటాయి. వాటి ఒత్తిడికి అతీతంగా మసలుకుంటే మనల్ని మనం నియంత్రించుకోవచ్చు.  సుఖదుఃఖాలు అనేవి రెండు తలుపులు లాంటివి. వాటిలో ఒకటి తెరుచుకుంటే ఇంకొకటి మూసుకుంటుంది. సమస్యలతో సంఘటనలతో నిమిత్...

నేటి మోటివేషన్... జీవితంలో గొప్ప గొప్ప విజయాలు సాధించిన వారి దినచర్య ఇలా ఉంటుంది.

1. They get up early morning - వీరంతా ఉదయం బ్రహ్మిముహూర్త సమయానికే (4 లేదా 5 గంటలకు) లేచి  🌿ఆ రోజులో ఏమేమి పనులు చెయ్యాలి,  🌿ఎలా చెయ్యాలి  🌿ముందు చెయ్యాల్సిన ముఖ్యమైన 👉మూడు పనులు ఏంటి అని ప్రణాళిక వేసుకుంటారు. 2. They folllow a morning ritual -  వీరందరికీ పొద్దున్నే లేవగానే క్రమం తప్పకుండా చేసే పనులు ఉంటాయట -  🌿వ్యాయామం లేదా యోగా చెయ్యడం,  🌿ధ్యానం చెయ్యడం,  🌿మంచి పుస్తకాలు చదవడం.   👉వీటిలో ప్రతి పనికి ఖచ్చితంగా కనీసం 20 నిముషాలు కేటాయిస్తారు. ఎలాంటి పరిస్థితిలో అయినా వాళ్ళు ఇవి అమలు చేస్తారు. 3. They spend 15 minutes each day on focused thinking -  🌿వీరు కనీసం ఒక 15 నిముషాలు  - జీవితంలో వారు ఏమి సాధించాలనుకుంటున్నారు..  🌿వాళ్ళ ప్రధమ లక్ష్యం ఏమిటి.. 🌿దానిని అందుకోవడానికి ప్రణాళిక ఏంటి..  🌿అది అందుకున్నాక జీవితం ఎలా ఉంటుంది..  🌿ఎన్ని రోజుల్లో అది సాధించాలి..  🌿ఈరోజు ఎలా ఉండబోతోంది -  అని కళ్ళు మూసుకుని రోజూ మననం చేసుకుంటూ ఉంటారు. 4. They spend time with people who inspire them -  🌿వాళ్ళ సమయ...

నేటి మోటివేషన్... మెదడుని ప్రశాంతంగా ఉంచడం

ఇంటర్నెట్, సోషల్ మీడియా కారణంగా చాలా మంది పొద్దస్తమానం స్మార్ట్ ఫోన్లతోనే గడిపేస్తున్నారు. రాత్రి చాలా సేపు దానితోనే గడుపుతూ ఆలస్యంగా నిద్రపోవడం, ఉదయమే ఆలస్యంగా మేల్కొనడం, లేవగానే ఫోన్ పట్టుకుని కూర్చోవడం వంటివి సాధారణమైపోయాయి. దీని కారణంగా మన మెదడు మొద్దుబారిపోతోందని... ఆలోచనా శక్తి, ఏకాగ్రత తగ్గిపోతున్నాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. అయితే రోజూ పొద్దునే కొన్ని రకాల అలవాట్లను చేసుకుంటే... మెదడు చురుకుగా మారుతుందని వివరిస్తున్నారు. రోజూ దాదాపు ఒకే సమయంలో నిద్రలేవడం ఎవరైనా సరే రోజూ దాదాపు ఒకే సమయంలో నిద్ర లేవడం వల్ల మన శరీరంలోని జీవగడియారం (సర్కాడియం రిథమ్) సరిగా సెట్ అవుతుందని నిపుణులు చెబుతున్నారు. దీనివల్ల మెదడు పనితీరు మెరుగుపడుతుందని వివరిస్తున్నారు. ఏకాగ్రత, జ్ఞాపకశక్తి పెరుగుతాయని స్పష్టం చేస్తున్నారు. యోగా లేదా స్ట్రెచింగ్ వ్యాయామాలు, మెడిటేషన్ చేయండి ఉదయమే కాసేపు యోగా లేదా కండరాలను సాగదీసే స్ట్రెచింగ్ వ్యాయామాలు చేయడం వల్ల శరీరంలో ఎండార్ఫిన్లు విడుదల అవుతాయని నిపుణులు చెబుతున్నారు. ధ్యానం (మెడిటేషన్) చేయడం వల్ల కూడా ప్రయోజనం ఉంటుందని పేర్కొంటున్నారు. వీటితో శరీరంలో ఒత్తిడి తగ...

నేటి మోటివేషన్... కష్టే ఫలి... చదివి చూడండి ఒకసారి

సమస్య చిన్నదైనా పెద్దదైనా ప్రయత్నించి చూడు గెలవకపోయినా ప్రయత్నం చేయకుండానే ఓడిపోయాను అన్న ఫీలింగ్ నీకు ఉండదు .. ఈ ప్రపంచంలో ఎంత విచిత్రమైనది అంటే అన్నీ ఉన్నవాడికి చేయాలన్న జ్ఞానం ఉండదు. అవయవాలు సరిగా లేకపోయినా వాళ్ళు ఏంటో నిరూపించుకోవాలి ప్రపంచంలో విజేతలుగా నిలబడాలని ఎంతో మంది ప్రయత్నం చేస్తూ ఉంటారు వాళ్ళని మనం బ్లెస్స్ చేయాలి అభినందించాలి .. నేను అనాటమీ న్యూరో క్లాసెస్ నేర్చుకుంటున్నాను అనాటమీ న్యూరో అంటే మన బ్రెయిన్ ద్వారా మన ఆలోచనలని ఎలా నియంత్రించవచ్చు ఎలా డైవర్ట్ చేయొచ్చు అదే క్లాస్ .. మన ఆలోచనలు మారడం వల్ల సగం సమస్యలు పోతాయి అంటే మన ఆలోచనలని మనం నియంత్రించడం ద్వారా మానసిక శరీరకమైన ఎన్నో సమస్యలకి పరిష్కారం మందులు కూడా లొంగనీ ఎన్నో జబ్బులకి మెడిసన్ దొరుకుతుంది.. మా క్లాసులో ఒక అమ్మాయి ఉంటుంది అమ్మాయి హైట్ చాలా అంటే చాలా తక్కువ అండ్ ఏదో ఒక యాక్సిడెంట్ జరగడం వల్ల టోటల్గా  బెడ్ మీద లేచి నడవలేదు చేతులు కూడా సహకరిస్తాయో లేదో తెలీదు కానీ ఆ అమ్మాయి గిన్నిస్ బుక్ ఆఫ్ ఓల్డ్ రికార్డులో గొప్ప మౌత్ పెయింటర్ గా నిలబడింది .. తనను చూస్తే చాలా చిన్న పిల్ల లాగా ఉంటుంది కానీ అంత కాన్ఫిడెన్స్ లెవ...