Skip to main content

నేటి మోటివేషన్.... హృదయం కదిలించే కథ

రవి సాప్ట్ వేర్ ఇంజినీర్. భార్య డెలివరీకి వెళ్ళింది. అప్పటిదాకా తాముంటున్న సింగిల్ బెడ్ రూమ్ ఇంటిని ఖాళీ చేసి ఊరికి కొంచెం దూరంగా గేటెడ్ కమ్యూనిటీలో డబుల్ బెడ్ రూమ్ ఇల్లు అద్దెకు తీసుకుని చేరాడు. స్వయంపాకం చేసుకుంటాడు.

ఆరోజు ఆదివారం. పోర్టికోలో కూర్చుని కాఫీ తాగుతున్నాడు. "ఆకు కూరలు... ఆకు కూరలు" అని కేక వినిపించింది. డెబ్బై ఏళ్ల వృద్ధురాలు తలపై కూరల గంప పెట్టుకుని కనిపించింది. పిలిచాడు.

"కాస్త గంప దించయ్యా" అన్నది ఆమె. "పాలకూర కట్ట ఎంత?" అడిగాడు.

"పది రూపాయలకు మూడయ్యా" చెప్పింది అవ్వ.

"మరీ అన్యాయం... బయట అయిదు ఇస్తున్నారు" అన్నాడు చిరుకోపంగా

"నాలుగు తీసుకో నాయన.." కట్టలు తీసింది అవ్వ.

పదిరూపాయలు ఇచ్చాడు. "గంప కాస్త పట్టయ్యా" అన్నది అవ్వ గంపను తనవైపు ఎత్తి పట్టుకుని.

గంపను పైకి లేపుతూ రెండు కట్టలు పాలకూర తీసి ఇంట్లోకి విసిరాడు రవి.అమ్మయ్య పది రూపాయలకు ఆరు కట్టలు వచ్చాయి అనుకున్నాడు ఒకింత సంతోషంగా.

అవ్వ వెళ్ళిపోయింది.

"ఎంత ఆశో ఈ ముసలిదానికి... ఇవాళో రేపో చావబోతుంది... ఇంకా డబ్బు మూటలు కడుతున్నది" ముసిముసిగా నవ్వుకున్నాడు.

అప్పటినుంచి అవ్వ వచ్చినపుడల్లా గంప ఎత్తడానికి సాయం పడుతూ ఒక బీరకాయో, రెండు వంకాయలో, ఒక దోసకాయో, చిన్న సొరకాయో లాఘవంగా తీయడం మొదలుపెట్టి ముసలిదాని రోగం కుదిర్చానని సంతోషపడసాగాడు.

కొన్నాళ్ల తరువాత ఎప్పటిలాగే గంప పైకెత్తుతూ రెండు కొత్తిమీర కట్టలు లేపేశాడు. అంతలోనే ఎవరిదో ఏడుపు వినిపించింది. ఎనిమిదేళ్ల అమ్మాయి పుస్తకాల సంచీని మోస్తూ "నానమ్మా... నన్ను స్కూల్ నుంచి పంపేశారు..." ఏడుస్తూ వచ్చింది.

అవ్వ కంగారుగా "అయ్యో నా బిడ్డ... బాబూ... కాస్త గంప కిందికి దించునాయనా" అన్నది రవితో.

"ఏడవకమ్మా... నేనొచ్చి చెబుతాలే. రేపు ఫీజు కడతాలే... నా తల్లే... ఇంటికిపొదాం పద" అన్నది పిల్లను వాటేసుకుని ధారాపాతంగా నీరు స్రవిస్తున్న ఆ చిన్నారి నయనాలను తుడుస్తూ.

రవికి అర్ధం కాలేదు. "ఎవరీ పిల్ల..?" అని అడిగాడు అవ్వను.

"నా మనవరాలు బాబూ...ఆడపిల్ల పుట్టిందని అల్లుడు నా కూతురును వదిలేసి వెళ్ళిపోయాడు. చుట్టుపక్కలవారు సూటిపోటి మాటలు అంటుంటే తట్టుకోలేక కూతురు పురుగుల మందు మింగి చచ్చిపోయింది. మా ఆయన మూడేళ్ళబట్టీ పక్షవాతం వచ్చి మంచం మీదున్నాడు. ఈ నలుసును సాకడానికి చిల్లిగవ్వ లేదు. ఎప్పుడూ బయటకు వచ్చి ఎరగని నేను రోజూ తెల్లారుజామునే లేచి పొలాలకెళ్లి ఇరవై కిలోల కూరలు అరువు మీద తీసుకుని మోస్తూ ఇల్లిల్లూ తిరుగుతూ అమ్ముకుంటూ పైసాపైసా కూడబెట్టి దీన్ని చదివిస్తున్నా. మొన్న ఫీజు కట్టడానికి వెళ్తే వెయ్యి రూపాయలు పెరిగిందని చెప్పారు. నెలరోజుల్లో కడతానని చెప్పి బతిమాలితే సరే అన్నారు. ఈరోజు చూడు బాబు...పసిపిల్ల అనే కనికరం కూడా లేకుండా బయటకి పంపించారు." అన్నది కళ్ళు తుడుచుకుంటూ.

రవి నరాలు మొత్తం బిగుసుకునిపోయాయి. రక్తం స్తంభించిపోయింది. గిరుక్కున తిరిగి హాల్లోకి వచ్చాడు. అతని హృదయం ఆకాశం చిల్లులు పడేలా ఏడుస్తున్నది. మనసంతా ఉష్ణ జలపాతం అయింది. ఎంత నిగ్రహించుకున్నా కళ్ళు ధారలు కట్టాయి. "ముసల్దానికి ఎంత డబ్బాశ" అనే తన వెకిలి మాట వెయ్యి గునపాలై దేహాన్ని కుళ్ళబొడిచింది. ప్రతి కష్టం వెనుకా ఒక కన్నీటిగాధ ఉంటుందని తెలియని తన అజ్ఞానానికి తనను తానే శపించుకున్నాడు.

పర్సులో చెయ్యి పెట్టాడు. బయటకొచ్చి "అవ్వా..ఈ ఐదువేలు తీసుకుని మనవరాలి ఫీజ్ కట్టెయ్యి" అన్నాడు బలవంతంగా అవ్వ చేతిని తీసుకుని.

హంపి మొహంజదారో శిధిలాలకు ప్రతీకలాంటి అవ్వ వృద్ధశరీరం భూకంపం వచ్చినట్లు కంపించింది.

"బాబూ...ఇంత అప్పు తీర్చాలంటే నాకు ఏడాది పడుతుంది" అన్నది వణుకుతూ.

"అప్పని ఎవరు చెప్పారు? చనిపోయిన మా అమ్మ ఆత్మశాంతి కోసం ఇస్తున్నాను. ఇప్పుడే కాదు..నీ మనవరాలి చదువు అయ్యేంతవరకు నేనే ఫీజ్ కడతాను..రేపటినుంచి రోజూ నేను ఉన్నా లేకపోయినా పదిరూపాయల ఆకు కూరలు ఇచ్చేసి వెళ్ళు" గంప పైకెత్తాడు రవి.

మరునాడు రవి నిద్రలేచి తలుపు తీశాడు. వాకిట్లో ఆరు ఆకు కూర కట్టలు కనిపించాయి!.

" నేను బాగుండాలి అనుకోవడం స్వార్థం"

" అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి అనుకోవడం లోకకళ్యాణం
🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

Comments

Popular posts

నేటి ప్రధాన వార్తా పత్రికలు

🗞️ఈనాడు ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.eenadu.net 📰ఆంధ్రజ్యోతి ➪ 🅐🅟 & 🅣🅢 http://mpaper.andhrajyothy.com/ 🗞️సాక్షి ➪ 🅐🅟 & 🅣🅢 http://epaper.sakshi.com/ 📰ఆంధ్రప్రభ ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.prabhanews.com/ 🗞️V6 వెలుగు➪ 🅣🅢 https://epaper.v6velugu.com 📰నవ తెలంగాణ ➪ 🅣🅢 http://epaper.navatelangana.com/ 🗞️నమస్తే తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.ntnews.com 📰మన తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.manatelangana.news 🧾English Newspapers🗞️        ☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟ 👉🏻The Hindu📰 https://epaper.thehindu.com/Home/Index 👉🏻Deccan Chronicle📰 http://epaper.deccanchronicle.com/states.aspx 👉🏻Indian Express📰 https://epaper.newindianexpress.com/t/3464 👉🏻The Hans India📰 https://epaper.thehansindia.com/           🏹లక్ష్య🇮🇳స్వచ్చంద📚సేవా🩺సంస్థ

తెలుసుకుందాం...

🌸జవాబు: గోత్రం అంటేనే అద్భుతమైన సైన్సు. ఈ శాస్త్రం ప్రకారం మన పూర్వీకులు గోత్ర విధానాన్ని ఎలా ఏర్పాటు చేశారో గమనించండి. మీరు పూజలో కూర్చున్న ప్రతిసారీ పూజారి మీ గోత్రం గురించి  ఎందుకు అడుగుతారో మీకు తెలుసా? _తెలీదు కాబట్టి అది చాదస్తం అనుకుంటున్నారు?_ 💐గోత్రం వెనుక ఉన్న శాస్త్రం మరేమిటో కాదు-  జీన్-మ్యాపింగ్. అది ఈ మధ్య కాలంలో బాగా ప్రాచుర్యం  పొందిన అధునాతన శాస్త్రమే! 👉🏻 గోత్రం వ్యవస్థ అంటే ఏమిటి? 👉🏻 మనకు ఈ వ్యవస్థ ఎందుకు ఉంది?  👉🏻 వివాహాలకు ఇది చాలా ముఖ్యమైనదిగా మనం ఎందుకు భావిస్తాము? 👉🏻 కొడుకులకు ఈ గోత్రం ఎందుకు వారసత్వంగా వస్తుంది, కుమార్తెలకు ఎందుకు రాదు? 👉🏻 వివాహం తర్వాత కుమార్తె గోత్రం ఎలా/ఎందుకు మారాలి? 👉🏻 తర్కం ఏమిటి? 💐ఇది మనం అనుసరించే అద్భుతమైన జన్యు శాస్త్రం.   మన గోత్ర వ్యవస్థ వెనుక  జన్యుశాస్త్ర వ్యవస్థ ఎలా పనిచేస్తుందో చూద్దాం! గోత్రమ్ అనే పదం రెండు సంస్కృత పదాల నుంచి ఏర్పడింది.   మొదటి పదం 'గౌ'- అంటే ఆవు, రెండవ పదం 'త్రాహి' అంటే కొట్టం. గోత్రం అంటే 'గోశాల' అని అర్థం. జీవశాస్త్ర పరంగా, మానవ శరీరంలో 23 జతల క్...

నేటి మోటివేషన్... ఉద‌యం 8 లోపు చేసే (S.A.V.E.R.S.)….అనే ఈ 6 అల‌వాట్లు మీ జీవితాన్నే మారుస్తాయ్.!

హాల్ ఎలోర్డ్ అనే ప్ర‌ముఖ ర‌చ‌యిత రాసిన “ద మిరాకిల్ మార్నింగ్” అనే బుక్ లో ఉద‌యం 8 లోపు చేసే 6 ప‌నులు మ‌న జీవితాన్నే మారుస్తాయ్ అని చాలా స్ఫ‌ష్టంగా చెప్పాడు. కార్ యాక్సిడెంట్ అయ్యి కోమాలోంచి బ‌య‌ట‌ప‌డ్డ ఈ ర‌చ‌యిత ఇప్పుడు త‌న ర‌చ‌న‌ల‌తో ప్ర‌పంచాన్ని ఆలోచింప‌జేస్తున్నాడు. ఆనందానికి 6 అంశాల సూత్రం. S.A.V.E.R.S S-Silence( నిశ్శ‌బ్దం)....మ‌న ప్ర‌తి రోజును చాలా నిశ్శ‌బ్దంగా ప్రారంభించాలి…అంటే ప్ర‌శాంత‌త‌తో స్టార్ట్ చేయాలి..లేవ‌డం లేట‌య్యింది…అయ్యే ఎలా…? ఆఫీస్ ప‌ని…ఈ రోజు అత‌డిని క‌లుస్తాన‌ని చెప్పాను…ఎమోయ్…టిఫిన్ అయ్యిందా…..ఇదిగో ఇంత‌లా హైరానా ప‌డొద్దు… ప్ర‌శాంతంగా లేవ‌గానే….కాసింత సేపు మెడిటేష‌న్ చేయండి. లేదా…క‌ళ్ళు మూసుకొని ప్ర‌శాంత‌త‌ను మీ మ‌న‌స్సులోకి ఆహ్వానించండి. ఇక్క‌డే మ‌న రోజు ఎలా గ‌డుస్తుంది? అనేది డిసైడ్ అయిపోతుంది . A-Affirmations ( నీతో నువ్వు మాట్లాడుకోవ‌డం)…. అంద‌రి గురించి, అన్ని విష‌యాల గురించి అన‌ర్గ‌లంగా మాట్లాడే మ‌నం…మ‌న‌తో మ‌నం ఒక్క‌సారి కూడా మాట్లాడుకోలేక‌పోతున్నాం. అస‌లు మ‌న‌లోని మ‌న‌కు ఏం కావాలి? పెద్ద స్థాయికి ఎదిగిన వాళ్ళ‌ల్లో ఖ‌చ్చితంగా ఈ ల‌క్ష‌ణం ఉంటుంది. ఈ మూడు పా...