కూర్చోవడం,
లేవడం,
పడుకోవడం,
నడవడం,
పనిచేయడం మాములుగా అయితే ఈ కదలికలన్నీ సాఫీగా, సవ్యంగా జరిగిపోతాయి.
అదే రుమటాయిడ్ ఆర్థరైటిస్ తో బాధపడుతున్నప్పుడు మాత్రం ఈ చిన్న చిన్న పనులే అతి కష్టమైన వ్యవహారాలుగా మారిపోతాయి..
రుమటాయిడ్ ఆర్థరైటిస్ ని మన వాడుక భాషలో కీళ్ళవాతం అని అంటూ ఉంటారు.
కీళ్ళవాతం బారిన పడ్డప్పుడు కీళ్లన్ని బిగుసుకుపోతాయి.
కీళ్లన్ని ఎర్రగా వాపు వచ్చేసి నొప్పి మంటతో బాధిస్తుంటాయి.
ఒక్కమాటలో చెప్పాలంటే కీళ్ళవాతం బారిన పడ్డాక నిత్య జీవితం దుర్భరంగా మారిపోతుంది.
వేదించే కీళ్ల వాతం జబ్బుకు ఆయుర్వేదం
గమనిక: ఆరోగ్య నిపుణులు, పరిశోధనల ప్రకారం ఈ వివరాలను అందించాం.
కేవలం వైద్య సామాజిక అవగాహన కొరకు మాత్రమే.
ఈ పోస్ట్ డాక్టర్ ప్రిస్క్రిప్షన్ కాదు హెల్త్ కి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా డాక్టర్స్ ని కలవండి.
మీ ఆరోగ్యానికి సంబంధించిన ఏదైనా ఇతర అంశం గురించి మీకు ఏవైనా ఆందోళనలు ఉంటే, సరైన రోగ నిర్ధారణ, నిర్వహణ మరియు మార్గదర్శకత్వం కోసం డాక్టర్స్ ని సంప్రదించడం చాలా ముఖ్యం._
సాధ్యమైనంత వరకు డాక్టర్ ని కలవండి. చిట్కాలు , హోమ్ రెమిడీస్ పై ఆధార పడవద్దు. చిట్కాలు , హోమ్ రెమిడీస్ తాత్కాలిక ఉపశమనాన్ని మాత్రమే ఇవ్వగలవు.
రుమటాయిడ్ ఆర్థరైటిస్ ( కీళ్ళవాతం ) లక్షణాలు మరియు ఆయుర్వేద వైద్యం
కీళ్లు మన కదలికలకు అధరాలు.
కీళ్లలో ఏ చిన్న సమస్య తలెత్తిన మొత్తం మన కదలికలన్నీ స్థంబించిపోతాయి.
నిజానికి అనేక జ్వరాలు,
జబ్బులు కీళ్లను ఇబ్బందుల్లో పడేస్తుంటాయి.
ఇలా కీళ్ల కదలికలను క్లిష్టతరం చేసే సమస్యల్లో రుమటాయిడ్ ఆర్థరైటిస్ ని ప్రదానంగా చెప్పుకోవచ్చు.
*కీళ్లవాతం* బారిన పడ్డప్పుడు లోపల అంతా వాచిపోయి కదపాలంటేనే తీవ్రమైననొప్పి, బాధతో జాయింట్ ని కదపలేకపోతుంటారు.
కీలు అరిగిపోవడం, ఇన్ఫెక్షన్ లు, చికెన్ గున్యా వంటి వైరల్ వ్యాధుల వంటి కారణాలు ఏమి లేకుండానే శరీరంలోని కీళ్లన్నిటిలో మంటలు, నొప్పులు పోటెత్తుతుంటాయి.
కీళ్ళవాతం ఎవరికీ, ఎప్పుడు ఎందుకు వస్తుందో స్పష్టమైన కారణం ఇప్పటివరకు తెలియదు. కానీ ప్రతి 100 మందిలో ఒకరిని వేధిస్తుంది.
రుమటాయిడ్ ఆర్థరైటిస్ ని ఆయుర్వేదంలో ఆమవాతం అంటాము..
ఈ ఆమవాతం జబ్బులో కీళ్ల సందులో సంధి సొద అంటే సందులలో ఇంఫ్లమాషన్ లైన్స్ ఉండి వాపు, మంట, నొప్పి ఇదంతా కలుగుతుంది.
సాధారణంగా వేళ్ళ గణుపులు, మోకాళ్ళు, మెడ లాంటి చోట ఈ నొప్పితో ప్రారంభమైన ఈ జబ్బు రాను రాను మరింత పెరుగుతుంది.
ఇది సాధారణంగా ఉదయం వేళల్లో నిద్ర లేచిన తర్వాత బెడ్ నుంచి లేవడానికె చాలా ఇబ్బందిగా అనిపిస్తూ
ఉంటుంది.
ఆ తర్వాత సాయంత్రానికి కొంత తగ్గినట్టుగా అనిపించచ్చు.
సాధారణంగా ఈ జబ్బు స్త్రీ లల్లో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది.
ఇది పూర్తిగా శరీరంలో రోగనిరోధక వ్యవస్థ లోపించినవాళ్లలో కలిగే అవకాశం ఉంటుంది.
రోగనిరోధక వ్యవస్థని ప్రేరేపించే అంశాలు పొగ త్రాగడం, రసాయనిక వాతావరణ పొల్యూషన్, అనేక రకాల వైరస్ ల వల్ల కూడా ఇది ప్రేరేపించబడవచ్చు.
ఇది ఒకసారి ప్రాబ్లమ్ అయిన తర్వాత జీవితాంతం కొనసాగుతూనే ఉంటుంది.
సరైన జాగ్రత్త లేకుంటే ఇది గుండెను, మూత్రపిండాల్ని, ఇతర అంగాల్ని కూడా ఇది ప్రభావితం చేస్తుంది.
ఆయుర్వేద వైద్యం
ఆమవాతం రోగులు వీటికి నిమిత్తంగా ఒక చికిత్స అంటూ లేదు కాబట్టి వీళ్ళు సాధారణంగా ఆహార నియమాలతోనే ఈ వ్యాధిని అదుపులో ఉంచుకోవాలి.
గోరువెచ్చని నీళ్లలో ఉప్పు కలిపి సేవిచడం.
మిరియాలు,
అల్లం,
సుంటి.
ఉలవలు
ఇలాంటివి బాగా తీసుకోవాలి.
ఇవి తీసుకున్నప్పుడు వీటి వల్ల బాగా తగ్గుతాయని చెప్పడం జరిగింది.
ఈ ఆమవాత రోగులు మామిడి పళ్ళు తినొచ్చు.
మామిడి పళ్ళ తినడం వల్ల అమవాత లక్షణాలు కొంత తగ్గే అవకాశాలు ఉన్నాయి.
చేయాల్సిన పనులు,చేయకూడని పనులు :
ఎక్కువగా రాత్రుళ్ళు నిద్ర మేల్కోవడం మంచిది కాదు.
వీళ్ళు త్వరగా నిద్రించడం,
వేడిగా ఉన్న ఆహారపదార్దాలు తీసుకోవడం,
వేడి నీళ్లు ఉప్పు కలిపి తీసుకోవడం మంచిది.
పొగత్రాగే అలవాటు ఉంటె దాన్ని పూర్తిగా మానేయడం చాలా మంచిది.
కీళ్ల వాతం తో బాధపడుతున్నప్పుడు రోజు వారి ఆహారపు అలవాట్లలో మార్పులు చేసుకోవడం వల్ల మంచి ఫలితం కనిపిస్తుంది.
కొన్ని రకాల ఆహారాలకు వాపుని తగ్గించే గుణం ఉంది.
ముఖ్యంగా చేపల్ని ప్రతి రోజు తినాలి.
అలాగే ఫిష్ ఆయిల్, ఆలివ్ ఆయిల్ లాంటివి తీసుకోవడం వల్ల వాటిలో ఉండే ఒమెగా3 ఫ్యాట్స్ కీళ్లలో వచ్చే వాపుల్ని సమర్దవంతంగా తగ్గిస్తాయి.
ఆక కూరలు, కాయగూరల్లో కూడా వాపుని తగ్గించే యాంటీ ఇంప్లమెంటరీ ఏజెంట్స్ ఉంటాయి.
కాబట్టి వాటిని కూడా ఆహారంలో అంతర్భాగం చేసుకోవాలి.
మొక్కజొన్న, సొయా చిక్కుళ్ళు ప్రధానంగా వాపుని పెంచే గుణాలను కలిగి ఉంటాయి.
కాబట్టి వాటిని మన ఆహారంలో పూర్తిగా తగ్గించాలి.
గోధుమతో తయారయ్యే వస్తువులను కూడా మానేయ్యాలి.
బంగాళాదుంప, బఠాణీలు, అన్నిరకాల చిక్కుళ్లను కూడా ఆహారంలో వాడరాదు.
బయట రెడీమేట్ గా తయారయ్యే ఆహారాలను కూడా తగ్గించాలి.
మనకు ఇంట్లోనే మిర్యాలు ఉంటాయి.
తర్వాత పిప్పళ్లు(లాంగ్ పెప్పర్) అనేటివి ఆయుర్వేద ఔషధశాలలో దొరుకుతాయి.
కొన్ని పిప్పళ్లు తీసుకొని, కొన్ని మిరియాలు తీసుకొని పెనం మీద కొద్దిగా వేయించి తర్వాత ఈ రెండింటిని చూర్ణం చేసుకోవాలి.
తర్వాత ఒక చెంచా ఆముదం పెనం మీద వేసి ఆముదంలో ఈ రెండింటిని కొద్దిగా వేడి చేస్తే చిన్న ముద్దలాగా తయారవుతుంది.
దీన్ని తీసి ఇంట్లో పెట్టుకొని ప్రతి రోజు రెండు ఉండలంతా ప్రతిరోజు తీసుకుంటే ఈ అమవత లక్షణాలు కొద్దిగా తగ్గుతూ వస్తాయి.
దీనికి ప్రధానంగా ఒక చికిత్స అంటూ లేదు కాబట్టి ఈ గృహ చికిత్సని వాడుకోవచ్చు.
వీటితో పాటు అనేక ఔషధాలు కూడా ఆయుర్వేద షాపుల్లో మనకు దొరుకుతాయి.
థయోదశ గుగ్గులు
ఆమవాత గుగ్గులు
ఇలా గుగ్గులు అనే ఒక పదం ఉన్న ఆయుర్వేధ ఔషధాలు మనకు చికిత్సలో ఉపయోగపడతాయి.
ప్రధానంగా మిరపకాయలు వాడకాన్ని మానేసి , మిరియాల వాడకాన్ని పెంచాలి.
వాటితోపాటుగా పెరుగు తినడం మానేసి మజ్జిగని మాత్రమే సేవించడం మంచిది.
బెల్లం కూడా వద్దు.
వేడిగా ఉన్న ఆహారాన్ని తినడం, వేళకు పడుకోవడం మంచిది.
వ్యాయామం చేయడంలోకూడా అంటే చాలా ఎక్కువ చేస్తే వాకింగ్ చేస్తే సాధారణంగా కీళ్లు సర్దుకొని బాగుంటాయని అనిపిస్తుంది
కాబట్టి వ్యాయామం చాలా పరిమితంగానే చేయాల్సి ఉంటుంది.
ఎక్కువ వ్యాయామం చేయడం ఆమవాతం మరింత ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుందని మనకు ఆయుర్వేద శాస్త్రం చెబుతుంది.
కీళ్ళవాతం ఉన్నవాళ్ళల్లో చాలా మంది పూర్తిగా రెస్ట్ తీసుకుంటూ వ్యాయామం చేయడం మానేస్తుంటారు.
ఇది సరైన పద్ధతి కాదు.
వ్యాయామం చేయకపోతే కీళ్లు గట్టిగ బిగుసుకుపోతాయి.
కాబట్టి కీళ్లను తరచుగా కదిలిస్తూ ఉండాలి.
తగినంత వ్యాయామం కల్పించుకోవాలి.
కీళ్ళవాతం తాలూకు ఇబ్బందులు మరీ తీవ్రంగా ఉన్నప్పుడు యోగరాజ్ గుగ్గులు,
సింహనాద్ గుగ్గులు, మహారాస్నాద్ గడ,
స్వర్ణ భస్మం,
రచత భస్మం
తదితర ఔషధాలను ఆయుర్వేద వైద్యుల పర్యవేక్షణలో కొంతకాలం వాడుకుంటే మంచి ఫలితం కనిపిస్తుంది.
ఏదైనా అనారోగ్య సమస్య ఉంటే +𝟵𝟭𝟵𝟴𝟰𝟵𝟴𝟵𝟰𝟵𝟬𝟲 𝗦𝗠𝗦 చెయ్యండి. ఆయుర్వేద వైద్యుల ద్వారా సలహాలు సూచనలు తెలియ పర్చగలము
గమనిక: ఆరోగ్య నిపుణులు, పరిశోధనల ప్రకారం ఈ వివరాలను అందించాం.
కేవలం వైద్య సామాజిక అవగాహన కొరకు మాత్రమే.
ఈ పోస్ట్ డాక్టర్ ప్రిస్క్రిప్షన్ కాదు హెల్త్ కి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా డాక్టర్స్ ని కలవండి.
మీ ఆరోగ్యానికి సంబంధించిన ఏదైనా ఇతర అంశం గురించి మీకు ఏవైనా ఆందోళనలు ఉంటే, సరైన రోగ నిర్ధారణ, నిర్వహణ మరియు మార్గదర్శకత్వం కోసం డాక్టర్స్ ని సంప్రదించడం చాలా ముఖ్యం.
సాధ్యమైనంత వరకు డాక్టర్ ని కలవండి. చిట్కాలు , హోమ్ రెమిడీస్ పై ఆధార పడవద్దు. చిట్కాలు , హోమ్ రెమిడీస్ తాత్కాలిక ఉపశమనాన్ని మాత్రమే ఇవ్వగలవు.
Forward as received...
Comments
Post a Comment