Skip to main content

Posts

Showing posts with the label Health

వంట నూనెల అధిక వినియోగం.. ఆరోగ్యానికి & ఆర్థిక వ్యవస్థకు ముప్పు!

భారతదేశంలో వంట నూనెల వినియోగం గత కొన్నేళ్లుగా గణనీయంగా పెరుగుతోంది. ప్రజల అవసరాలను తీర్చడానికి దేశం భారీగా విదేశీ దిగుమతులపై ఆధారపడుతోంది. దీని వల్ల కోట్ల రూపాయల విదేశీ మారకద్రవ్యం ఖర్చవుతోంది. ఈ పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని వంటనూనెల వినియోగాన్ని తగ్గించాల్సిన అవసరం ఉందని కేంద్ర ప్రభుత్వం పలు సందర్భాల్లో సూచిస్తోంది. ## 🌾 దేశీయ ఉత్పత్తి పెంపు కోసం ప్రయత్నాలు భారత్‌లో నువ్వులు, సోయాబీన్, పొద్దుతిరుగుడు వంటి నూనెగింజల సాగును ప్రోత్సహించేందుకు గతంలో “పసుపు విప్లవం” కార్యక్రమాన్ని ప్రారంభించారు. దీని ద్వారా దేశీయంగా వంటనూనెల ఉత్పత్తిని పెంచి, దిగుమతులపై ఆధారాన్ని తగ్గించాలనే లక్ష్యం పెట్టుకున్నారు. గత కొన్ని దశాబ్దాల్లో నూనెగింజల ఉత్పత్తి పెరిగినా, వినియోగం మరింత వేగంగా పెరగడం వల్ల ఇప్పటికీ భారత్ ప్రపంచంలోనే అతిపెద్ద వంటనూనెల దిగుమతిదారుగా కొనసాగుతోంది. ## 📈 అవసరానికి మించిన వినియోగం పోషకాహార నిపుణుల సూచనల ప్రకారం ఒక వ్యక్తికి ఏడాదికి పరిమిత స్థాయిలోనే వంటనూనె అవసరం. కానీ ప్రస్తుతం దేశంలో తలసరి వినియోగం ఆ స్థాయిని దాటిపోయింది. జీవనశైలి మార్పులు, ఫాస్ట్ ఫుడ్ అలవాట్లు, అధికంగా వేయించిన ...

🚨 ట్రామా కేర్ ప్రతి పౌరుడి హక్కే – సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు

దేశంలో రోడ్డు ప్రమాదాలు, అత్యవసర వైద్య పరిస్థితులు పెరుగుతున్న నేపథ్యంలో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రమాద సమయంలో బాధితులకు వెంటనే చికిత్స అందించడం ప్రతి పౌరుడి ప్రాథమిక హక్కు అని స్పష్టం చేస్తూ కేంద్రం, రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలకు పలు మార్గదర్శకాలు జారీ చేసింది. ⚖️ ‘ ట్రామా కేర్’పై సుప్రీంకోర్టు స్పష్టమైన సందేశం ప్రమాదం జరిగిన తర్వాత తొలి కొన్ని నిమిషాలు అత్యంత కీలకమని వైద్య నిపుణులు చెబుతున్న నేపథ్యంలో, అత్యవసర వైద్య సేవలు మరింత వేగంగా అందేలా చర్యలు తీసుకోవాలని ధర్మాసనం ఆదేశించింది. “సమయానికి చికిత్స అందితే ఎన్నో ప్రాణాలు కాపాడవచ్చు” అని కోర్టు అభిప్రాయపడింది. 📞 మూడు నెలల్లో 112 ఎమర్జెన్సీ స్పందన వ్యవస్థ దేశవ్యాప్తంగా అత్యవసర పరిస్థితుల్లో ప్రజలకు తక్షణ సహాయం అందించేందుకు ‘112’ హెల్ప్‌లైన్ వ్యవస్థను సమర్థవంతంగా అమలు చేయాలని సుప్రీంకోర్టు కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించింది. అవసరమైన మౌలిక వసతులు, స్పందనా బృందాలు, ట్రామా కేర్ నెట్‌వర్క్‌ను బలోపేతం చేయాలని పేర్కొంది. 🏥 ఆస్పత్రుల బాధ్యతపై స్పష్టత ప్రమాద బాధితులను చికిత్సకు తీసుకొచ్చిన వారిని ఆస్పత్రులు త...

8 అంకె ఆకారంలో వాకింగ్

అష్టాకార పథం అని ఆయుర్వేదంలో అంటారు.... ఆయుర్వేదం నుండి అష్టాకార పథం 8 అంకె నడక వచ్చింది. మనం వాకింగ్ చేయడంలో ఎనిమిది అంకె " 8 " ఆకారంలో వేసుకున్న ట్రాక్ పై నడవమంటారు దీని వలన మనకు జరిగే ఉపయోగం ఏమిటి ? దీనికి ఎంత స్థలం కావాలి ?  "8" ఆకారంలో వాకింగ్ చేయడం (అష్టాకార పథం) ఒక ప్రత్యేకమైన మరియు ప్రభావవంతమైన వ్యాయామ పద్ధతి. వాకింగ్ అంటే అలా ఒకదారి పొడవునా నడుస్తూ వెళ్తాం. కానీ 8 ఆకారంలో నడవటం వల్ల అనేక లాభాలున్నాయి. 8 అనే అంకెను అడ్డుగా చూస్తే ఇన్ఫినిటీ గుర్తులాగా ఉంటుంది. ∞ అందుకే దీన్ని *ఇన్ఫినిటీ వాక్* అనికూడా అంటారు.  దీనివల్ల కలిగే లాభాలు కూడా అనంతమే మరి. మీరు నడుస్తున్నప్పుడు ఒక ఊహాజనిత 8 ఆకారాన్ని సృష్టించుకోవాలి.  భూమి మీద అడ్డంగా ఒక ఎనిమిది ఆకారం గీసి ఉన్నట్లు అనుకోవాలి.  ఎనిమిది రాస్తున్నప్పుడు మీ చేతి వేళ్ళు ఎలా కదులుతుందో అదే విధంగా మలుపులు తీసుకుంటూ, సున్నాలు పూర్తిచేస్తూ మీరు అడుగులు వేయాలి.  దాని వెంబడే నడుస్తూ ఉండాలి.  మెళ్లిగా , వేగం పెంచుతూ 8 ఆకారంలో నడవాలి.  అలా నడుస్తూ ఉండాలి. అంతే.! " 8 " ఆకారంలో వాకింగ్ చేయడం వలన ఉపయోగాలు (లాభాలు): 1. స...

నేటి ఆరోగ్యం... థైరాయిడ్ & హైపోథైరాయిడ్ మధ్య తేడా

థైరాయిడ్ మన మెడలో ఉన్న చిన్న గ్రంధి. ఇది శరీరంలో మెటబాలిజం, బరువు, శక్తి, హృదయ స్పందనలు, శరీర ఉష్ణోగ్రత మొదలైన వాటిని నియంత్రించే థైరాక్సిన్ (T4), ట్రైఐయోడోథైరోనిన్ (T3) అనే హార్మోన్లను విడుదల చేస్తుంది. అంటే థైరాయిడ్ అనేది గ్రంధి పేరు. హైపోథైరాయిడ్ థైరాయిడ్ గ్రంధి సరిగా పని చేయకపోతే హార్మోన్లు తక్కువగా ఉత్పత్తి అవ్వడం. దీనిని Hypothyroidism అంటారు. ఇది ఒక వ్యాధి స్థితి. 👉 కాబట్టి థైరాయిడ్ = గ్రంధి, హైపోథైరాయిడ్ = వ్యాధి అని గుర్తుంచుకోవాలి. 🩺 హైపోథైరాయిడ్ లక్షణాలు అలసట, బలహీనత బరువు పెరగడం మలబద్ధకం చల్లదనం ఎక్కువగా అనిపించడం జుట్టు రాలడం, చర్మం పొడిగా మారడం మానసికంగా డిప్రెషన్, దృష్టి కేంద్రీకరించలేకపోవడం. 🌿 *ఆయుర్వేద ఫార్మసీలో దొరికే మందులు 1. Kanchanar Guggulu – థైరాయిడ్ గడ్డలు, హార్మోన్ అసమతుల్యతకు. 2. Ashwagandha Churna / Tablets  – గ్రంధి పనితీరును సమతుల్యం చేస్తుంది. 3. Punarnava Mandur – వాపులు, మెటబాలిజం సమస్యలకు. 4. Trikatu Churna (మిరియాలు, శొంఠి, పిప్పలి) – జీర్ణక్రియ, థైరాయిడ్ హార్మోన్ యాక్టివిటీ పెంచుతుంది. 5. Varunadi Kashayam – గ్రంధుల వాపు, మలబద్ధకం, మెటబాలిజం స...

హార్ట్‌ ఎటాక్‌ ముప్పు ఆల్కహాల్‌ వల్ల కాదండోయ్‌!..... మీరు ఎంతగానో ఇష్టపడి త్రాగే ఇదే...

ఎనర్జీ డ్డ్రింక్స్ వల్ల అని చెబుతున్నారు నిపుణులు! ఎనర్జీ డ్రింక్స్ హానికరం కాదని మీరు అనుకుంటున్నారా?  ఒకటి తాగిన తర్వాత మీ హృదయ స్పందన రేటు పెరుగుతుందా?  ఈ సందేహాలు మీకూ ఉన్నాయా?  'హార్ట్ ట్రాన్స్‌ప్లాంట్ డక్' గా పిలువబడే ప్రముఖ కార్డియాలజిస్ట్‌ డాక్టర్ డిమిత్రి యారనోవ్ మీ సందేహాలకు సమాధానం ఇస్తున్నారు.  ఎనర్జీ డ్రింక్ వినియోగం యువకుల గుండె జబ్బులతో ముడిపడి ఉంటుంది.  అధిక ఎనర్జీ డ్రింక్ వినియోగం తీవ్రమైన ప్రమాదాన్ని కలిగిస్తుందని అతను అంటున్నారు. ఎనర్జీ డ్రింక్స్ తీసుకోవడం వల్ల గుండె జబ్బులు ఉన్న రోగులను తాను ఎక్కువగా చూస్తున్నానని.. 20, 30 ఏళ్లలోపు యువకులు, ఆరోగ్యవంతులు అకస్మాత్తుగా గుండె వైఫల్యంతో బాధపడుతున్నారు. ధూమపానం అలవాటు లేదు, కుటుంబ చరిత్ర కూడా లేదు. కానీ వీరందరిలో ఓ ఉమ్మడి అలవాటు ఉంది. అది వారు ప్రతిరోజూ 3-4 డబ్బాల ఎనర్జీ డ్రింక్స్ తీసుకుంటున్నారు. ఎనర్జీ డ్రింక్స్ రక్తపోటును పెంచుతాయని, అసాధారణ గుండె లయలకు కారణమవుతాయని, కాలక్రమేణా గుండె కండరాలను బలహీనపరుస్తాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. అధిక కెఫిన్, ఉత్తేజకాలు గుండెను ఓవర్‌డ్రైవ్‌కు గురి చేస్తాయి...

అలారం శబ్దంతో గుండెపోటు ముప్పు..!

ఉదయం అలారం మోగగానే.. , అబ్బా అప్పుడే లేవాలా? , అనిపిస్తుంది (Morning Alarm). , మళ్లీ రోజంతా చేయాల్సిన పనులు గుర్తొచ్చి.. , తప్పదిక అనుకుంటూ లేస్తాం. , అయితే ఈ మార్నింగ్ అలారం గురించి యూనివర్సిటీ ఆఫ్ వర్జీనియాకు చెందిన స్కూల్ ఆఫ్ నర్సింగ్ చేసిన తాజా అధ్యయనం ఆశ్చర్యకర అంశాలను వెల్లడించింది. , పొద్దున్నే వినిపించే అలారం మోత గుండెపోటు, స్ట్రోక్‌ (Heart Attack and Stroke) వచ్చే ముప్పును పెంచుతుందని పేర్కొంది. , 32 మందిపై ఈ అధ్యయనం నిర్వహించారు. , రెండు రోజులపాటు వారంతా నిద్రలో స్మార్ట్ వాచ్‌లు, ఫింగర్ బ్లడ్ ప్రెజర్ కఫ్స్‌ ధరించి అందులో పాల్గొన్నారు. ఎటువంటి అలారం లేకుండా సహజంగా నిద్రలేవమని మొదటిరోజు పరిశోధకులు ఆ 32 మందికి సూచించారు. , రెండోరోజు.. , ఐదు గంటలకు పైగా నిద్రపోయిన తర్వాత అలారం పెట్టుకొని లేవమని చెప్పారు. , ఈ రెండు ఫలితాలను పరిశీలించగా.. , సహజంగా, బలవంతంగా మేల్కొనడం మధ్య బ్లడ్‌ప్రెజర్‌లో పెరుగుదలను గుర్తించారు. , సహజంగా నిద్రలేచేవారితో పోలిస్తే 74 శాతం అధికంగా బ్లడ్ ప్రెజర్ ఉన్నట్లు వెల్లడించారు. , హైదరాబాద్‌లోని అపోలో హాస్పిటల్స్‌కు చెందిన న్యూరాలజిస్ట్ డాక్టర్ సుధీర్‌ కుమార్.. ,...

వేదించే కీళ్ల వాతానికి ఆయుర్వేద వైద్యం.

కూర్చోవడం,  లేవడం,  పడుకోవడం,  నడవడం,  పనిచేయడం మాములుగా అయితే ఈ కదలికలన్నీ సాఫీగా, సవ్యంగా జరిగిపోతాయి.  అదే రుమటాయిడ్ ఆర్థరైటిస్ తో బాధపడుతున్నప్పుడు మాత్రం ఈ చిన్న చిన్న పనులే అతి కష్టమైన వ్యవహారాలుగా మారిపోతాయి.. రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ ని మన వాడుక భాషలో కీళ్ళవాతం అని అంటూ ఉంటారు.  కీళ్ళవాతం బారిన పడ్డప్పుడు కీళ్లన్ని బిగుసుకుపోతాయి.  కీళ్లన్ని ఎర్రగా వాపు వచ్చేసి నొప్పి మంటతో బాధిస్తుంటాయి.  ఒక్కమాటలో చెప్పాలంటే కీళ్ళవాతం బారిన పడ్డాక నిత్య జీవితం దుర్భరంగా మారిపోతుంది.  వేదించే కీళ్ల వాతం జబ్బుకు ఆయుర్వేదం  గమనిక: ఆరోగ్య నిపుణులు, పరిశోధనల ప్రకారం ఈ వివరాలను అందించాం. కేవలం వైద్య సామాజిక అవగాహన కొరకు మాత్రమే.  ఈ పోస్ట్ డాక్టర్ ప్రిస్క్రిప్షన్ కాదు హెల్త్ కి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా డాక్టర్స్ ని కలవండి. మీ ఆరోగ్యానికి సంబంధించిన ఏదైనా ఇతర అంశం గురించి మీకు ఏవైనా ఆందోళనలు ఉంటే, సరైన రోగ నిర్ధారణ, నిర్వహణ మరియు మార్గదర్శకత్వం కోసం డాక్టర్స్ ని సంప్రదించడం చాలా ముఖ్యం._ సాధ్యమైనంత వరకు డాక్టర్ ని కలవండి. చిట్కాలు , హోమ్ రెమిడ...

నేటి ఆరోగ్య సూత్ర... ఈ రోజు మనం ఉప్పు స్టోరీ గురించి తెలుసుకుందాం

▪️రాక్ సాల్ట్ అంటే ,దొడ్డు ఉప్పు, కల్లుప్పు, రాళ్ళ ఉప్పు ...ఇలా రకరకాలుగా పిలుస్తూ ఉంటాం కదా!. ▪️అయితే ఈ రాక్ సాల్ట్" కి, సన్న ఉప్పు అంటే టేబుల్ సాల్ట్ కి ఉన్న తేడా ఏమిటో తెలుసుకుందాం. ▪️మనిషి తన ఆహారంలో సముద్రపు ఉప్పు తగిలితే మంచి రుచి వస్తుందనే విషయం కనుక్కున్నప్పటి నుంచీ తరతరాలుగా వేల ఏళ్లుగా… సముద్రపు ఉప్పునే వాడుతూ వస్తున్నాడు. ▪️అప్పట్లో బీపీలు లేవు ! ఒంట్లో ఎముకల నొప్పులు లేవు.!! థైరాయిడ్ సమస్యల్లేవు.!!! ఊళ్లల్లో కిరాణ షాపుల ముందు బస్తాల కొద్దీ ఈ కల్లు ఉప్పు బస్తాలు జస్ట్ అలా బయటే వదిలేసేవారు. ఎందుకంటే ఉప్పును ఎవరూ దొంగతనం చేయరు. ▪️ ఎవరైనా ఉప్పు ఉచితంగా అడిగితే నిరాకరించవద్దనే నియమం కూడా అప్పట్లో ఉండేది. ♦️▪️ ఆ రోజులు పోయాయి ▪️అంతా సన్న ఉప్పు(టేబుల్ సాల్ట్) అదీ అయోడైజ్డు ఉప్పు మన కిచెన్లలోకి వేగంగా వచ్చేసింది ! ▪️కల్లు ఉప్పుతో పోలిస్తే ఇది సన్నగా, అంటుకోకుండా ఉండటంతో అందరూ దీన్నే ప్రిఫర్ చేస్తున్నారు… ▪️కానీ, ఇది మన ఆరోగ్యానికి విపరీతంగా హాని చేయడం మొదలుపెట్టింది. ♦️ అదెలా స్టార్టయిందంటే..? ▪️ఒకప్పుడు ఈశాన్య రాష్ట్రాల్లోని ప్రజలు అయోడిన్లోపం వల్ల , "గాయిటర్  అనే వ్యాధి...

నేటి ఆరోగ్య సూత్ర.... మీరు పెరుగుతో పాటు ఈ ఫుడ్స్ కలిపి తింటున్నారా..

పెరుగు ఆరోగ్యానికి మంచిదే అయినప్పటికీ కొన్ని రకాల ఫుడ్స్‌తో కలిపి అస్సలు తినకూడదని ఆయుర్వేదం చెబుతోంది.  పెరుగు తో కొన్ని ఫుడ్ కాంబినేషన్స్‌ ఆరోగ్య సమస్యలకు దారితీస్తాయి. పెరుగు ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఇందులో శరీరానికి కావాల్సిన ప్రొటీన్లు, కాల్షియం, విటమిన్లతో పాటు ఇతర కీలక పోషకాలు ఉంటాయి.  ప్రతిరోజు పెరుగు తింటే ఎముకలు, దంతాలు ధృడంగా మారతాయి. డైజేషన్ ఇంప్రూవ్ అవుతుంది. ఇందులోని ప్రొబయోటిక్స్ కారణంగా పేగుల కదలికలు చురుగ్గా ఉంటాయి. పెరుగు తింటే ఎనర్జీ లెవల్స్ పెరగడంతో పాటు శరీర బరువు అదుపులో ఉంటుంది.  ఇది సూపర్ ఫుడ్‌గా ఉండటమే కాకుండా బ్యూటీ ప్రొడక్టుగానూ పనిచేస్తుంది.  స్కిన్, హెయిర్ హెల్త్‌కి పెరుగు బెనిఫిట్ చేస్తుంది. అందుకే, పెరుగు ను తప్పనిసరిగా రోజువారీ డైట్‌లో చేర్చుకోవాలని న్యూట్రిషనిస్టులు సూచిస్తున్నారు.  అయితే, పెరుగు ఆరోగ్యానికి మంచిదే అయినప్పటికీ కొన్ని రకాల ఫుడ్స్‌తో కలిపి అస్సలు తినకూడదని ఆయుర్వేదం చెబుతోంది.  పెరుగు తో కొన్ని ఫుడ్ కాంబినేషన్స్‌ ఆరోగ్య సమస్యలకు దారితీస్తాయి. ఫ్రైడ్ ఫుడ్స్ నూనెలో వేయించిన ఫుడ్స్‌తో పెరుగు ని కలిపి తినడం ఆరోగ్య...

నేటి ఆరోగ్య సూత్ర.... రేల చెట్టు ఉపయోగాలు...

మెట్ట ప్రాంతాల‌లో, కొండ‌లు, గుట్ట‌ల‌పై, రోడ్డుకు ఇరు ప‌క్క‌లా ఎక్కువ‌గా పెరిగే చెట్ల‌ల్లో రేల చెట్టు కూడా ఒక‌టి.  దీనిని చాలా మంది చూసే ఉంటారు.  ఈ చెట్టు ఎన్నో ఔష‌ధ గుణాల‌ను క‌లిగి ఉంటుంది.  మ‌న‌కు వ‌చ్చే అనేక ర‌కాల అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను న‌యం చేయ‌డంలో ఈ మొక్క ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డుతుంది.  రేల చెట్టు లో ఉండే ఔష‌ధ గుణాల గురించి, ఈ చెట్టు వ‌ల్ల క‌లిగే ప్ర‌యోజ‌నాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.  రేల చెట్టు క‌షాయం చేదుగా ఉండి వేడి చేసే గుణాన్ని క‌లిగి ఉంటుంది.  మ‌ల‌బ‌ద్ద‌కాన్ని త‌గ్గించ‌డంలో ఈ చెట్టు ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డుతుంది.  చ‌ర్మ రోగాల‌ను, క‌ఫ రోగాల‌ను, క్రిమి రోగాల‌ను, విషాన్ని హ‌రించ‌డంలో కూడా ఈ చెట్టు స‌హాయ‌ప‌డుతుంది. రేల చెట్టు బెర‌డును దంచి దానిని ఒక గ్లాస్ నీటిలో వేసి ఒక క‌ప్పు క‌షాయం అయ్యే వ‌ర‌కు మ‌రిగించి వ‌డ‌క‌ట్టి గోరు వెచ్చ‌గా తాగుతూ ఉంటే మూత్రం నుండి ర‌క్తం ప‌డ‌డం త‌గ్గుతుంది.  రేల చెట్టు  పువ్వుల‌ను ఇత‌ర దినుసుల‌తో క‌లిపి ప‌చ్చ‌డిగా కూడా చేసుకుని తిన‌వ‌చ్చు.  ఈ ప‌చ్చ‌డి ఎంతో రుచిగా ఉంటుంది.  జ్వ‌రం త‌గ్గిన వారు ప‌థ్యంగా...

నేటి ఆరోగ్య సూత్ర.... బీపీని తగ్గించుకోవడానికి ఈ ఆహార పదార్థాలు

సాధారణంగా చాలా మందిలో అధిక రక్తపోటు సమస్య ఉంటుంది.  ప్రపంచ వ్యాప్తంగా బిలియన్ మందికి పైగా ప్రజలు రక్తపోటు తో బాధపడుతున్నారు.  ఇది గుండె జబ్బులకు దారితీస్తుంటుంది.  అయితే సరిగ్గా తినడం.. జీవన శైలిలో మార్పులు చేసుకోవడం ద్వారా రక్తపోటును నియంత్రించవచ్చు.  ఒక వ్యక్తికి సిస్టోలిక్ రక్తపోటు 130 మి.మీ హెచ్ జీ కంటే ఎక్కువ.. డయాస్టోలిక్ రక్తపోటు 80 మి. మీ హెచ్ జీ కంటే ఎక్కువగా ఉన్నప్పుడు అతనికి వ్యక్తికి ఎక్కువగా బ్లడ్ ప్రెజర్ ఉన్నట్లు చెబుతారు.  అయితే ఈ శరీరంలో రక్తపోటును నియంత్రణలో ఉంచడానికి ఈ ఆహార పదార్థాలను తీసుకోవడం ఉత్తమం. సిట్రస్ పండ్లు సిట్రస్ పండ్లు రోగ నిరోధక శక్తిని ఇవ్వలేవు.  కానీ రక్తపోటును నియంత్రిస్తాయి.  అలాగే ఇందులో ఐరన్, విటమిన్లు, ఇతర పాంట్ సమ్మెళనాలు అధికంగా ఉంటాయి.  ఇవి గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి.  అలాగే అధిక రక్తపోటు ను తగ్గిస్తాయి.  ఇటీవల జపాన్ మహిళలపై నిర్వహించిన ఓ అధ్యయనంలో వాకింగ్ చేస్తున్నప్పుడు నిమ్మరసం తీసుకోవడం వలన సిస్టోలిక్ రక్తపోటు తగ్గుతుందని తేలింది. అరటి పండ్లు అరటిలో పొటాషియం అధికంగా ఉంటుంది.  ఇ...

నేటి ఆరోగ్య సమాచారం... బహిష్టు నొప్పి

గమనిక: ఆరోగ్య నిపుణులు, పరిశోధనల ప్రకారం ఈ వివరాలను అందించాం. కేవలం వైద్య సామాజిక అవగాహన కొరకు మాత్రమే.  ఈ పోస్ట్ డాక్టర్ ప్రిస్క్రిప్షన్ కాదు హెల్త్ కి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా డాక్టర్స్ ని కలవండి. 1. బహిష్టు ప్రారంభమయ్యే ముందు పొత్తికడుపు నొప్పిగా ఉంటుందా ? శారీరక క్రియ 2. బహిష్టు నొప్పి గర్భనిరోధక మాత్రలను ఉపయోగించడం మానేసిన తరువాత నుంచి ప్రారంభమైందా ? గర్భనిరోధకమాత్రలను వాడుతూ ఆపేయడం 3. గర్భాశయాంతర్గత సంతాన నిరోధక సాధనాన్ని (ఐ.యు.సీ.డి.) అమర్చుకున్నారా ? కుటుంబ నియంత్రణా సాధనం వల దుష్ఫలితాలు 4. కడుపు నొప్పిం నడుము నొప్పిలతోపాటు మైథనంలో నొప్పి ఉంటుందా? మల మూత్ర నిర్హరణ వ్యవస్థలో తేడాలు చోటు చేసుకున్నాయా ? గర్భాశయ అంతర్గత పొర ఇతర ప్రదేశాల్లో పెరగటం  (ఎండో మెట్రియోసిస్) 5. పొత్తికడుపు ఉబ్బరించినట్లుండటమే కాకుండా, తుంటి ప్రాంతం, నడుము ప్రాంతాల్లో బరువుగా ఉంటుందా ? గర్భాశయంలో నారవంటి కండర పెరుగుదలలు తయారవ్వటం (ఫైబ్రాయిడ్స్) 6. నొప్పి ఎప్పుడు వస్తుందనేది ఊహించగలవి కాకుండా ఉందా ? గర్భాశయంలో తిత్తి వంటి నిర్మాణాలు పెరగటం (పాలిప్స్) 7. గర్భాశయం ద్వారానికి ఇంతకుముందు ఇన్ఫెక్షన...

బ్రెస్ట్ క్యాన్సర్ రాకుండా జాగ్రత్తలు.

భారత్ లో మహిళలకి సోకుతున్న క్యాన్సర్ లలో రొమ్ము క్యాన్సర్ రెండో స్థానం ఆక్రమిస్తుంది.పట్టణ స్త్రీలలో లక్ష మందిలో 22- 28 మందికి పల్లె స్త్రీలలో లక్షకి ఆరు మందిలోనూ బ్రెస్ట్ క్యాన్సర్ కనిపిస్తుంది.అలాగే పేద స్త్రీల కన్నా ధనిక స్త్రీలలో అధికంగా ఉంది. నాగరిక అలవాట్లు నాగరికతల ప్రభావం ఇది వర్గాలవారీగా చూస్తే పారాసి మహిళల బ్రెస్ట్ క్యాన్సర్ కి అత్యధికంగా గురవుతున్నారు. మొత్తం మీద ఏటేటా ఈ క్యాన్సర్ బారిన పడుతున్న వారి సంఖ్య పెరుగుతుంది. కొన్ని మహానగరాలు వాటితో పోలిస్తే పల్లెలు వీటిల్లో బ్రెస్ట్ క్యాన్సర్ సోకుతున్న వారి సంఖ్య ఎలా ఉందో చూస్తే తెలుస్తుంది ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనాల ప్రకారం 2021 నాటికి 99 వేల మంది భారతీయ మహిళలకు బ్రెస్ట్ క్యాన్సర్ సోకగా 2002లో ఈ సంఖ్య 80 వేలు దాటింది._       ఏ పరిస్థితుల్లో వస్తుంది...? 🏵️వయసు పెరిగే కొద్దీ బ్రెస్ట్ క్యాన్సర్ అవకాశాలు పెరుగుతాయి. 🏵️ బ్రెస్ట్ క్యాన్సర్ మహిళల్లోనే అధికం అత్తి 100 బ్రెస్ట్ క్యాన్సర్లలో ఒక్కటి మాత్రం పురుషుల లో కనిపిస్తుంది. (1%) 🏵️ ధనిక దేశాల్లో ధనిక ప్రజల్లో ఆధునిక జీవనశైలి కలిగిన వారిలో అధికం. 🏵️ 11 సంవత్సరాల ల...