భారత్ లో మహిళలకి సోకుతున్న క్యాన్సర్ లలో రొమ్ము క్యాన్సర్ రెండో స్థానం ఆక్రమిస్తుంది.పట్టణ స్త్రీలలో లక్ష మందిలో 22- 28 మందికి పల్లె స్త్రీలలో లక్షకి ఆరు మందిలోనూ బ్రెస్ట్ క్యాన్సర్ కనిపిస్తుంది.అలాగే పేద స్త్రీల కన్నా ధనిక స్త్రీలలో అధికంగా ఉంది. నాగరిక అలవాట్లు నాగరికతల ప్రభావం ఇది వర్గాలవారీగా చూస్తే పారాసి మహిళల బ్రెస్ట్ క్యాన్సర్ కి అత్యధికంగా గురవుతున్నారు. మొత్తం మీద ఏటేటా ఈ క్యాన్సర్ బారిన పడుతున్న వారి సంఖ్య పెరుగుతుంది.
కొన్ని మహానగరాలు వాటితో పోలిస్తే పల్లెలు వీటిల్లో బ్రెస్ట్ క్యాన్సర్ సోకుతున్న వారి సంఖ్య ఎలా ఉందో చూస్తే తెలుస్తుంది ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనాల ప్రకారం 2021 నాటికి 99 వేల మంది భారతీయ మహిళలకు బ్రెస్ట్ క్యాన్సర్ సోకగా 2002లో ఈ సంఖ్య 80 వేలు దాటింది._
ఏ పరిస్థితుల్లో వస్తుంది...?
🏵️వయసు పెరిగే కొద్దీ బ్రెస్ట్ క్యాన్సర్ అవకాశాలు పెరుగుతాయి.
🏵️ బ్రెస్ట్ క్యాన్సర్ మహిళల్లోనే అధికం అత్తి 100 బ్రెస్ట్ క్యాన్సర్లలో ఒక్కటి మాత్రం పురుషుల లో కనిపిస్తుంది. (1%)
🏵️ ధనిక దేశాల్లో ధనిక ప్రజల్లో ఆధునిక జీవనశైలి కలిగిన వారిలో అధికం.
🏵️ 11 సంవత్సరాల లోపు రజస్వలమైన ఆడపిల్లలకి భవిష్యత్తులో బ్రెస్ట్ క్యాన్సరు అవకాశాలు అధికo.
🏵️ 40వ పడిలో తొలిసారి నిండు గర్భం ధరించిన స్త్రీలకు అధికం.
🏵️రక్త బంధువులు ఎవరికైనా యవ్వన కాలంలో బ్రెస్ట్ క్యాన్సర్ సోకితే...
🏵️ వంశపారంపర్యంగా కొన్ని సాధారణ జీన్స్ సంక్రమిస్తే...
🏵️ ఒకవేళ బ్రెస్ట్ కి క్యాన్సర్ వచ్చి ఉంటే...
🏵️Saturated fats గల ఆహారం అధికంగా తీసుకుంటుంటే...
🏵️ ఆల్కహాలు అధికంగా సేవిస్తుంటే...
🏵️ కుటుంబ నియంత్రణ మాత్రలు వాడుతుంటే...
🏵️ హార్మోన్ చికిత్స తీసుకుంటుంటే...
ఈ పరిస్థితుల్లో బ్రెస్ట్ క్యాన్సర్ సోకే అవకాశాలు మార్పులు కన్నా ఎక్కువగా ఉంటాయి వీటిల్లో నివారించగలిగిన వాటి నన్నిటిని నివారిస్తే క్యాన్సర్ అవకాశాలు తగ్గుతాయి.
🌹బ్రెస్ట్ సమస్యలన్నీ క్యాన్సర్లు కావు...
బ్రెస్ట్ లో అనేక సమస్యలు- నొప్పి గడ్డలు సలుపు, చీము పట్టడం మొదలైనవి ఎన్నో వస్తుంటాయి వాటిలో 75% హాని లేనివే. అవి క్యాన్సర్ సంబంధమైనవి కావు క్యాన్సర్ కు దారి తీయవు కనుక అనవసర భయాలకు చోటు ఇవ్వకుండా అనుమానం వచ్చినప్పుడు డాక్టర్ కి చూపించు కోవాలి.
🌹నివారణ చర్యలు...
కొన్ని అలవాట్లను మార్చుకోవడం ద్వారా మరికొన్నిటిని నేర్చుకోవడం ద్వారా బ్రెస్ట్ క్యాన్సర్ అవకాశాలను బాగా తగ్గించుకోవచ్చు. ఈ సందర్భంగా బెస్ట్ క్యాన్సర్ కలిగించే పరిస్థితులు ఉన్న ప్రతి ఒక్కరికి బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చేస్తుందని మాత్రం పోరాబడవద్దని హెచ్చరిస్తున్నాము. అందరికీ పనికొచ్చే జాగ్రత్తలని ఈ దిగువ పెరుకుంటున్నాము.
🏵️ కొవ్వు తక్కువగాను, విటమిన్లు, ఖనిజ లవణాలు ( మినరల్స్) ఏంటి యాక్సిడెంట్లు ( తాజా పళ్ళు కూరగాయలు.) అధికంగా ఉండే ఆహారం తీసుకోండి.
🏵️ ప్రతిరోజు వ్యాయామం చేయండి. శరీర బరువుని వయసుకు ఎత్తుకు తగిన పరిస్థితులు ఉంచుకోండి...
🏵️ ఆల్కహాలు అలవాటు చేసుకోకండి అలవాటు ఉంటే మానేయండి.
స్మోకింగ్ జోలికి పోవద్దు (మహానగరాల మహిళలు స్మోకింగ్ కి అలవాటు పడుతున్నారు.పల్లెల్లో చుట్టా తాగే అలవాటు శ్రామిక వర్గాల మహిళల్లో అధికం ) దాని వల్ల బ్రెస్ట్ క్యాన్సర్ రాదు. కానీ, కొన్ని ఇతర బ్రెస్ట్ సమస్యలు ( చిన్న గడ్డలు వగైరా) ఇంతకంటే ప్రమాదకరమైన అనారోగ్యాలు ఎలాగో వస్తాయి.
🏵️ కుటుంబ నియంత్రణ హార్మోను ఫిల్సు,రిప్లేస్మెంట్ చికిత్సలు డాక్టర్ అనుమతితోనూ పర్యవేక్షణలోనూ మాత్రమే జరగాలి.స్వంత వైద్యం వద్దు.
🏵️ తరచు రొమ్ముల స్వీయ పరీక్ష చేసుకోవాలి. ప్రతి సంవత్సరము డాక్టర్ చెప్పిన ప్రకారం రొమ్ముల పరీక్ష చేయించుకోవాలి.
_ఈ జాగ్రత్తలు పాటిస్తే బ్రెస్ట్ క్యాన్సర్ సోకే అవకాశాలు తగ్గుతాయి._
Comments
Post a Comment