Skip to main content

Posts

Showing posts with the label ఆరోగ్యం

8 అంకె ఆకారంలో వాకింగ్

అష్టాకార పథం అని ఆయుర్వేదంలో అంటారు.... ఆయుర్వేదం నుండి అష్టాకార పథం 8 అంకె నడక వచ్చింది. మనం వాకింగ్ చేయడంలో ఎనిమిది అంకె " 8 " ఆకారంలో వేసుకున్న ట్రాక్ పై నడవమంటారు దీని వలన మనకు జరిగే ఉపయోగం ఏమిటి ? దీనికి ఎంత స్థలం కావాలి ?  "8" ఆకారంలో వాకింగ్ చేయడం (అష్టాకార పథం) ఒక ప్రత్యేకమైన మరియు ప్రభావవంతమైన వ్యాయామ పద్ధతి. వాకింగ్ అంటే అలా ఒకదారి పొడవునా నడుస్తూ వెళ్తాం. కానీ 8 ఆకారంలో నడవటం వల్ల అనేక లాభాలున్నాయి. 8 అనే అంకెను అడ్డుగా చూస్తే ఇన్ఫినిటీ గుర్తులాగా ఉంటుంది. ∞ అందుకే దీన్ని *ఇన్ఫినిటీ వాక్* అనికూడా అంటారు.  దీనివల్ల కలిగే లాభాలు కూడా అనంతమే మరి. మీరు నడుస్తున్నప్పుడు ఒక ఊహాజనిత 8 ఆకారాన్ని సృష్టించుకోవాలి.  భూమి మీద అడ్డంగా ఒక ఎనిమిది ఆకారం గీసి ఉన్నట్లు అనుకోవాలి.  ఎనిమిది రాస్తున్నప్పుడు మీ చేతి వేళ్ళు ఎలా కదులుతుందో అదే విధంగా మలుపులు తీసుకుంటూ, సున్నాలు పూర్తిచేస్తూ మీరు అడుగులు వేయాలి.  దాని వెంబడే నడుస్తూ ఉండాలి.  మెళ్లిగా , వేగం పెంచుతూ 8 ఆకారంలో నడవాలి.  అలా నడుస్తూ ఉండాలి. అంతే.! " 8 " ఆకారంలో వాకింగ్ చేయడం వలన ఉపయోగాలు (లాభాలు): 1. స...

నేటి ఆరోగ్యం... థైరాయిడ్ & హైపోథైరాయిడ్ మధ్య తేడా

థైరాయిడ్ మన మెడలో ఉన్న చిన్న గ్రంధి. ఇది శరీరంలో మెటబాలిజం, బరువు, శక్తి, హృదయ స్పందనలు, శరీర ఉష్ణోగ్రత మొదలైన వాటిని నియంత్రించే థైరాక్సిన్ (T4), ట్రైఐయోడోథైరోనిన్ (T3) అనే హార్మోన్లను విడుదల చేస్తుంది. అంటే థైరాయిడ్ అనేది గ్రంధి పేరు. హైపోథైరాయిడ్ థైరాయిడ్ గ్రంధి సరిగా పని చేయకపోతే హార్మోన్లు తక్కువగా ఉత్పత్తి అవ్వడం. దీనిని Hypothyroidism అంటారు. ఇది ఒక వ్యాధి స్థితి. 👉 కాబట్టి థైరాయిడ్ = గ్రంధి, హైపోథైరాయిడ్ = వ్యాధి అని గుర్తుంచుకోవాలి. 🩺 హైపోథైరాయిడ్ లక్షణాలు అలసట, బలహీనత బరువు పెరగడం మలబద్ధకం చల్లదనం ఎక్కువగా అనిపించడం జుట్టు రాలడం, చర్మం పొడిగా మారడం మానసికంగా డిప్రెషన్, దృష్టి కేంద్రీకరించలేకపోవడం. 🌿 *ఆయుర్వేద ఫార్మసీలో దొరికే మందులు 1. Kanchanar Guggulu – థైరాయిడ్ గడ్డలు, హార్మోన్ అసమతుల్యతకు. 2. Ashwagandha Churna / Tablets  – గ్రంధి పనితీరును సమతుల్యం చేస్తుంది. 3. Punarnava Mandur – వాపులు, మెటబాలిజం సమస్యలకు. 4. Trikatu Churna (మిరియాలు, శొంఠి, పిప్పలి) – జీర్ణక్రియ, థైరాయిడ్ హార్మోన్ యాక్టివిటీ పెంచుతుంది. 5. Varunadi Kashayam – గ్రంధుల వాపు, మలబద్ధకం, మెటబాలిజం స...

హార్ట్‌ ఎటాక్‌ ముప్పు ఆల్కహాల్‌ వల్ల కాదండోయ్‌!..... మీరు ఎంతగానో ఇష్టపడి త్రాగే ఇదే...

ఎనర్జీ డ్డ్రింక్స్ వల్ల అని చెబుతున్నారు నిపుణులు! ఎనర్జీ డ్రింక్స్ హానికరం కాదని మీరు అనుకుంటున్నారా?  ఒకటి తాగిన తర్వాత మీ హృదయ స్పందన రేటు పెరుగుతుందా?  ఈ సందేహాలు మీకూ ఉన్నాయా?  'హార్ట్ ట్రాన్స్‌ప్లాంట్ డక్' గా పిలువబడే ప్రముఖ కార్డియాలజిస్ట్‌ డాక్టర్ డిమిత్రి యారనోవ్ మీ సందేహాలకు సమాధానం ఇస్తున్నారు.  ఎనర్జీ డ్రింక్ వినియోగం యువకుల గుండె జబ్బులతో ముడిపడి ఉంటుంది.  అధిక ఎనర్జీ డ్రింక్ వినియోగం తీవ్రమైన ప్రమాదాన్ని కలిగిస్తుందని అతను అంటున్నారు. ఎనర్జీ డ్రింక్స్ తీసుకోవడం వల్ల గుండె జబ్బులు ఉన్న రోగులను తాను ఎక్కువగా చూస్తున్నానని.. 20, 30 ఏళ్లలోపు యువకులు, ఆరోగ్యవంతులు అకస్మాత్తుగా గుండె వైఫల్యంతో బాధపడుతున్నారు. ధూమపానం అలవాటు లేదు, కుటుంబ చరిత్ర కూడా లేదు. కానీ వీరందరిలో ఓ ఉమ్మడి అలవాటు ఉంది. అది వారు ప్రతిరోజూ 3-4 డబ్బాల ఎనర్జీ డ్రింక్స్ తీసుకుంటున్నారు. ఎనర్జీ డ్రింక్స్ రక్తపోటును పెంచుతాయని, అసాధారణ గుండె లయలకు కారణమవుతాయని, కాలక్రమేణా గుండె కండరాలను బలహీనపరుస్తాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. అధిక కెఫిన్, ఉత్తేజకాలు గుండెను ఓవర్‌డ్రైవ్‌కు గురి చేస్తాయి...

అలారం శబ్దంతో గుండెపోటు ముప్పు..!

ఉదయం అలారం మోగగానే.. , అబ్బా అప్పుడే లేవాలా? , అనిపిస్తుంది (Morning Alarm). , మళ్లీ రోజంతా చేయాల్సిన పనులు గుర్తొచ్చి.. , తప్పదిక అనుకుంటూ లేస్తాం. , అయితే ఈ మార్నింగ్ అలారం గురించి యూనివర్సిటీ ఆఫ్ వర్జీనియాకు చెందిన స్కూల్ ఆఫ్ నర్సింగ్ చేసిన తాజా అధ్యయనం ఆశ్చర్యకర అంశాలను వెల్లడించింది. , పొద్దున్నే వినిపించే అలారం మోత గుండెపోటు, స్ట్రోక్‌ (Heart Attack and Stroke) వచ్చే ముప్పును పెంచుతుందని పేర్కొంది. , 32 మందిపై ఈ అధ్యయనం నిర్వహించారు. , రెండు రోజులపాటు వారంతా నిద్రలో స్మార్ట్ వాచ్‌లు, ఫింగర్ బ్లడ్ ప్రెజర్ కఫ్స్‌ ధరించి అందులో పాల్గొన్నారు. ఎటువంటి అలారం లేకుండా సహజంగా నిద్రలేవమని మొదటిరోజు పరిశోధకులు ఆ 32 మందికి సూచించారు. , రెండోరోజు.. , ఐదు గంటలకు పైగా నిద్రపోయిన తర్వాత అలారం పెట్టుకొని లేవమని చెప్పారు. , ఈ రెండు ఫలితాలను పరిశీలించగా.. , సహజంగా, బలవంతంగా మేల్కొనడం మధ్య బ్లడ్‌ప్రెజర్‌లో పెరుగుదలను గుర్తించారు. , సహజంగా నిద్రలేచేవారితో పోలిస్తే 74 శాతం అధికంగా బ్లడ్ ప్రెజర్ ఉన్నట్లు వెల్లడించారు. , హైదరాబాద్‌లోని అపోలో హాస్పిటల్స్‌కు చెందిన న్యూరాలజిస్ట్ డాక్టర్ సుధీర్‌ కుమార్.. ,...

వేదించే కీళ్ల వాతానికి ఆయుర్వేద వైద్యం.

కూర్చోవడం,  లేవడం,  పడుకోవడం,  నడవడం,  పనిచేయడం మాములుగా అయితే ఈ కదలికలన్నీ సాఫీగా, సవ్యంగా జరిగిపోతాయి.  అదే రుమటాయిడ్ ఆర్థరైటిస్ తో బాధపడుతున్నప్పుడు మాత్రం ఈ చిన్న చిన్న పనులే అతి కష్టమైన వ్యవహారాలుగా మారిపోతాయి.. రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ ని మన వాడుక భాషలో కీళ్ళవాతం అని అంటూ ఉంటారు.  కీళ్ళవాతం బారిన పడ్డప్పుడు కీళ్లన్ని బిగుసుకుపోతాయి.  కీళ్లన్ని ఎర్రగా వాపు వచ్చేసి నొప్పి మంటతో బాధిస్తుంటాయి.  ఒక్కమాటలో చెప్పాలంటే కీళ్ళవాతం బారిన పడ్డాక నిత్య జీవితం దుర్భరంగా మారిపోతుంది.  వేదించే కీళ్ల వాతం జబ్బుకు ఆయుర్వేదం  గమనిక: ఆరోగ్య నిపుణులు, పరిశోధనల ప్రకారం ఈ వివరాలను అందించాం. కేవలం వైద్య సామాజిక అవగాహన కొరకు మాత్రమే.  ఈ పోస్ట్ డాక్టర్ ప్రిస్క్రిప్షన్ కాదు హెల్త్ కి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా డాక్టర్స్ ని కలవండి. మీ ఆరోగ్యానికి సంబంధించిన ఏదైనా ఇతర అంశం గురించి మీకు ఏవైనా ఆందోళనలు ఉంటే, సరైన రోగ నిర్ధారణ, నిర్వహణ మరియు మార్గదర్శకత్వం కోసం డాక్టర్స్ ని సంప్రదించడం చాలా ముఖ్యం._ సాధ్యమైనంత వరకు డాక్టర్ ని కలవండి. చిట్కాలు , హోమ్ రెమిడ...

నేటి ఆరోగ్య సూత్ర... ఈ రోజు మనం ఉప్పు స్టోరీ గురించి తెలుసుకుందాం

▪️రాక్ సాల్ట్ అంటే ,దొడ్డు ఉప్పు, కల్లుప్పు, రాళ్ళ ఉప్పు ...ఇలా రకరకాలుగా పిలుస్తూ ఉంటాం కదా!. ▪️అయితే ఈ రాక్ సాల్ట్" కి, సన్న ఉప్పు అంటే టేబుల్ సాల్ట్ కి ఉన్న తేడా ఏమిటో తెలుసుకుందాం. ▪️మనిషి తన ఆహారంలో సముద్రపు ఉప్పు తగిలితే మంచి రుచి వస్తుందనే విషయం కనుక్కున్నప్పటి నుంచీ తరతరాలుగా వేల ఏళ్లుగా… సముద్రపు ఉప్పునే వాడుతూ వస్తున్నాడు. ▪️అప్పట్లో బీపీలు లేవు ! ఒంట్లో ఎముకల నొప్పులు లేవు.!! థైరాయిడ్ సమస్యల్లేవు.!!! ఊళ్లల్లో కిరాణ షాపుల ముందు బస్తాల కొద్దీ ఈ కల్లు ఉప్పు బస్తాలు జస్ట్ అలా బయటే వదిలేసేవారు. ఎందుకంటే ఉప్పును ఎవరూ దొంగతనం చేయరు. ▪️ ఎవరైనా ఉప్పు ఉచితంగా అడిగితే నిరాకరించవద్దనే నియమం కూడా అప్పట్లో ఉండేది. ♦️▪️ ఆ రోజులు పోయాయి ▪️అంతా సన్న ఉప్పు(టేబుల్ సాల్ట్) అదీ అయోడైజ్డు ఉప్పు మన కిచెన్లలోకి వేగంగా వచ్చేసింది ! ▪️కల్లు ఉప్పుతో పోలిస్తే ఇది సన్నగా, అంటుకోకుండా ఉండటంతో అందరూ దీన్నే ప్రిఫర్ చేస్తున్నారు… ▪️కానీ, ఇది మన ఆరోగ్యానికి విపరీతంగా హాని చేయడం మొదలుపెట్టింది. ♦️ అదెలా స్టార్టయిందంటే..? ▪️ఒకప్పుడు ఈశాన్య రాష్ట్రాల్లోని ప్రజలు అయోడిన్లోపం వల్ల , "గాయిటర్  అనే వ్యాధి...

నేటి ఆరోగ్య సమాచారం... బహిష్టు నొప్పి

గమనిక: ఆరోగ్య నిపుణులు, పరిశోధనల ప్రకారం ఈ వివరాలను అందించాం. కేవలం వైద్య సామాజిక అవగాహన కొరకు మాత్రమే.  ఈ పోస్ట్ డాక్టర్ ప్రిస్క్రిప్షన్ కాదు హెల్త్ కి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా డాక్టర్స్ ని కలవండి. 1. బహిష్టు ప్రారంభమయ్యే ముందు పొత్తికడుపు నొప్పిగా ఉంటుందా ? శారీరక క్రియ 2. బహిష్టు నొప్పి గర్భనిరోధక మాత్రలను ఉపయోగించడం మానేసిన తరువాత నుంచి ప్రారంభమైందా ? గర్భనిరోధకమాత్రలను వాడుతూ ఆపేయడం 3. గర్భాశయాంతర్గత సంతాన నిరోధక సాధనాన్ని (ఐ.యు.సీ.డి.) అమర్చుకున్నారా ? కుటుంబ నియంత్రణా సాధనం వల దుష్ఫలితాలు 4. కడుపు నొప్పిం నడుము నొప్పిలతోపాటు మైథనంలో నొప్పి ఉంటుందా? మల మూత్ర నిర్హరణ వ్యవస్థలో తేడాలు చోటు చేసుకున్నాయా ? గర్భాశయ అంతర్గత పొర ఇతర ప్రదేశాల్లో పెరగటం  (ఎండో మెట్రియోసిస్) 5. పొత్తికడుపు ఉబ్బరించినట్లుండటమే కాకుండా, తుంటి ప్రాంతం, నడుము ప్రాంతాల్లో బరువుగా ఉంటుందా ? గర్భాశయంలో నారవంటి కండర పెరుగుదలలు తయారవ్వటం (ఫైబ్రాయిడ్స్) 6. నొప్పి ఎప్పుడు వస్తుందనేది ఊహించగలవి కాకుండా ఉందా ? గర్భాశయంలో తిత్తి వంటి నిర్మాణాలు పెరగటం (పాలిప్స్) 7. గర్భాశయం ద్వారానికి ఇంతకుముందు ఇన్ఫెక్షన...

బ్రెస్ట్ క్యాన్సర్ రాకుండా జాగ్రత్తలు.

భారత్ లో మహిళలకి సోకుతున్న క్యాన్సర్ లలో రొమ్ము క్యాన్సర్ రెండో స్థానం ఆక్రమిస్తుంది.పట్టణ స్త్రీలలో లక్ష మందిలో 22- 28 మందికి పల్లె స్త్రీలలో లక్షకి ఆరు మందిలోనూ బ్రెస్ట్ క్యాన్సర్ కనిపిస్తుంది.అలాగే పేద స్త్రీల కన్నా ధనిక స్త్రీలలో అధికంగా ఉంది. నాగరిక అలవాట్లు నాగరికతల ప్రభావం ఇది వర్గాలవారీగా చూస్తే పారాసి మహిళల బ్రెస్ట్ క్యాన్సర్ కి అత్యధికంగా గురవుతున్నారు. మొత్తం మీద ఏటేటా ఈ క్యాన్సర్ బారిన పడుతున్న వారి సంఖ్య పెరుగుతుంది. కొన్ని మహానగరాలు వాటితో పోలిస్తే పల్లెలు వీటిల్లో బ్రెస్ట్ క్యాన్సర్ సోకుతున్న వారి సంఖ్య ఎలా ఉందో చూస్తే తెలుస్తుంది ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనాల ప్రకారం 2021 నాటికి 99 వేల మంది భారతీయ మహిళలకు బ్రెస్ట్ క్యాన్సర్ సోకగా 2002లో ఈ సంఖ్య 80 వేలు దాటింది._       ఏ పరిస్థితుల్లో వస్తుంది...? 🏵️వయసు పెరిగే కొద్దీ బ్రెస్ట్ క్యాన్సర్ అవకాశాలు పెరుగుతాయి. 🏵️ బ్రెస్ట్ క్యాన్సర్ మహిళల్లోనే అధికం అత్తి 100 బ్రెస్ట్ క్యాన్సర్లలో ఒక్కటి మాత్రం పురుషుల లో కనిపిస్తుంది. (1%) 🏵️ ధనిక దేశాల్లో ధనిక ప్రజల్లో ఆధునిక జీవనశైలి కలిగిన వారిలో అధికం. 🏵️ 11 సంవత్సరాల ల...

Walnuts oil వాల్నట్ ఆయిల్ ఉపయోగాలు మరియు దుష్ప్రభావాలు

Walnuts-oil-benefits walnuts oil వాల్నట్ అక్రోట్లను మాదిరిగానే వాల్నట్ నూనెలో కూడా మంచి పోషకాలు మరియు యాంటీ ఆక్సిడెంట్ల కలిగి ఉంటాయి, దీనిలో చాలావరకు ఆల్ఫా-లినోలెనిక్ ఆమ్లం అని పిలువబడే ఒమేగా -3 కొవ్వు ఆమ్లం ఉంటుంది. ఈ “మంచి కొవ్వు” గలా ఒమేగా -3 కొవ్వు ఆమ్లం వాల్నట్ అయిల్ ను మీ రోజువారీ ఆహారంలో భాగంగా చూసుకుంటే గుండె జబ్బులు వచ్చే ప్రమాదాన్ని 10% తగ్గిస్తుంది అలాగే జ్ఞాపకశక్తి మరియు ఏకాగ్రతను మెరుగుపరుస్తుంది ఇలాంటి అనేక ప్రయోజనాలు ఉన్నా వాల్నట్ నూనె గురించి తెలుసుకుందాం.. వాల్నట్ నూనెను ఎలా ఉపయోగించాలి ఆరోగ్యం కోసం వాల్నట్ నూనె వాడకం: వాల్నట్ నూనె కి వంట చేసేటప్పుడు వాడితే కూరకి చేదు రుచి వస్తుంది కాబట్టి దీనిని నేరుగా వంటల్లో కాకుండా సలాడ్లలో ఆహారంలో తీసుకోవచ్చు. చర్మం కోసం వాల్నట్ నూనె వాడకం: చర్మం కోసం రెండు మూడు చుక్కల వాల్నట్ నూనె తీసుకోండి. ఇప్పుడు మీ ముఖానికి వేళ్ల సహాయంతో మసాజ్ చేయండి. మీకు కావాలంటే, మీరు ఉపయోగించే ఫేస్ ప్యాక్ లో రెండు మూడు చుక్కలు వాల్నట్ ఆయిల్ ని ఉపయోగించవచ్చు. బరువు తగ్గాలనుకునే వాళ్ళ కోసం ఇంటి చిట్కాలు జుట్టుకు వాల్నట్ నూనె వాడకం: జుట్టుకు దాని ప్రయోజనాలను...

Vitamin B12 గురించి సమగ్ర సమాచారం... తప్పనిసరిగా తెలుసుకోవాల్సిన విషయాలు...

Vitamin B12 rich foods విటమిన్ బి12 అధికంగా ఉండే ఆహార పదార్థాలు విటమిన్ బి 12 ఆహార పదార్థాలు:- విటమిన్ బి 12 మనం తీసుకునే ఆహార పదార్థాల నుంచి మాత్రమే మనకు లభిస్తుంది ఎందుకంటే విటమిన్ బి 12 శరీరం సొంతంగా తయారు చేయలేని ముఖ్యమైన పోషకం. ఇది అనేక ప్రమాదకరమైన వ్యాధుల నుండి రక్షించడానికి మరియు శరీరంలో ఎర్ర రక్త కణాలు ఏర్పడటానికి , శరీరానికి ఫోలిక్ ఆమ్లాన్ని రవాణా చేయడంలో సహాయపడుతుంది విటమిన్ బి -12 లోపం కారణంగా నాడీ వ్యవస్థకు సంబంధించిన అనేక సమస్యలు తలఎత్తతాయి. ఇది తీవ్రమైన రక్తహీనతకు,అలసట, శ్వాస ఆడకపోవడం, శక్తి లేకపోవడం, తలనొప్పి మొదలైన వాటికి కారణమవుతుంది. ఆహారంలో విటమిన్ బి -12 అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవడం ద్వారా మీరు లోపాన్ని భర్తీ చేయవచ్చు విటమిన్ బి -12 అధికంగా ఉండే ఆహారాలు  గుడ్డు గుడ్లలో ప్రోటీన్‌తో పాటు, అనేక ప్రయోజనకరమైన విటమిన్లు కూడా ఉన్నాయి, వాటిలో ఒకటి విటమిన్ బి -12. కోడిగుడ్డు తెల్లసొనలో కన్నా పచ్చసొనలో అధిక మొత్తంలో విటమిన్ బీ 12 లభిస్తుంది పాలు శాకాహారులకు విటమిన్ బి 12 యొక్క ఉత్తమ వనరులు పాలు మరియు వాటి నుంచి వచ్చే పాల ఉత్పత్తులు. తక్కువ కొవ్వు ఒక కప్పు పాలలో 1.2 ఎం...

Pumpkin seeds గుమ్మడికాయ గింజలు ఆరోగ్య ప్రయోజనాలు

గుమ్మడికాయ ఎంత పెద్దగా ఉంటుందో గుమ్మడికాయ గింజలలో కూడా అంతే పెద్ద మొత్తంలో విటమిన్లు మినరల్ లభిస్తాయి. గుమ్మడికాయ యొక్క చిన్న విత్తనాలు క్యాన్సర్ ,అధిక రక్తపోటు వంటి తీవ్రమైన సమస్యలను నయం చేయడానికి అద్భుతంగా పనిచేస్తాయి. వివిధ వ్యాధులకు గుమ్మడికాయ గింజల యొక్క ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకుందాం. గుమ్మడికాయ విత్తనాల ఆరోగ్య ప్రయోజనాలు గుమ్మడికాయ గింజల్లో విటమిన్ ఎ,విటమిన్ బి,విటమిన్ K,మరియు విత్తనాల్లో ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు, బీటా-కెరోటిన్ , భాస్వరం, మెగ్నీషియం, రాగి, ఇనుము, పొటాషియం వంటి విటమిన్లు మరియు ఖనిజాలు పుష్కలంగా ఉన్నాయి ,ఇది రోగనిరోధక వ్యవస్థ బ్యాక్టీరియా మరియు వైరస్‌లతో పోరాడటానికి సహాపడుతుంది. గుమ్మడికాయ గింజల్లో విటమిన్ సి అధికంగా ఉంటుంది, ఇది సమర్థవంతమైన యాంటీ ఆక్సిడెంట్ కలిగి ఉండి రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడంలో సహాయపడుతుంది. విటమిన్ సి రోగనిరోధక శక్తిని పెంచడంతో పాటు చర్మం, జుట్టు సౌందర్యాన్ని పెంచుతుంది అదనంగా, గుమ్మడికాయ గింజలలో ఫైబర్ కూడా పుష్కలంగా లభిస్తుంది. గుమ్మడికాయ గింజలు తినడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఒక నివేదిక ప్రకారం, గుమ్మడికాయ గింజలలో ఫైబర్ ఎక్కువగా...

ఫ్రిజ్‌ల్లో ఎక్కువ చల్లదనాన్ని ఇచ్చే చిన్న పెట్టెలాంటి ఫ్రీజర్‌ను పైభాగంలోనే అమరుస్తారు. దాన్ని ఫ్రిజ్‌కు కింది భాగంలో ఎందుకు పెట్టరు❓

🌸జవాబు: రిఫ్రిజిరేటర్‌లో సులభంగా ఆవిరయ్యే ఫ్రియాన్‌ (Freon) అనే ద్రవ పదార్థాన్ని సన్నని తీగ చుట్టల ద్వారా ప్రవహింపజేస్తారు. ఈ ద్రవాన్ని 'రెఫ్రిజిరెంట్‌' అంటారు. ఈ ద్రవం ఫ్రిజ్‌లో ఉండే పదార్థాల వేడిని గ్రహించి ఆవిరిగా మారుతుంది. ఫ్రిజ్‌లో చల్లదనాన్ని కలుగజేస్తుంది. ఆవిరిగా మారే ఫ్రియాన్‌ తిరిగి ఫ్రిజ్‌లోని కండెన్సర్‌ ద్వారా పీడనానికి గురై మళ్లీ ద్రవంగా మారుతుంది. ఇది తిరిగి ద్రవరూపాన్ని పొందేటప్పుడు అది అంతకు ముందు గ్రహించిన వేడి ఫ్రిజ్‌ వెనక భాగం నుంచి బయటకు పోతుంది. ఫ్రిజ్‌లోని పదార్థాలలోని వేడిని గ్రహించి ఆవిరిగా మారిన ఫ్రియాన్‌ ఉష్ణోగ్రత ఎక్కువగా ఉంటుంది. ఆవిరిగా మారిన దాని సాంద్రత (density)తక్కువ కావడంతో ఆ ఆవిరి ఫ్రిజ్‌ పైభాగానికి పయనిస్తుంది. ఈ ప్రక్రియ వల్ల ఫ్రిజ్‌లో చల్లదనం ఏర్పడి ఉష్ణోగ్రత 5 డిగ్రీల సెల్షియస్‌కు తగ్గుతుంది. ఫ్రీజర్‌ను ఫ్రిజ్‌ అడుగు భాగంలో అమరుస్తే అక్కడ ఉష్ణోగ్రత మరీ తగ్గడం వల్ల వెలువడే ఉష్ణకిరణాలు పైవైపు ప్రయాణించి అక్కడ అంతకు ముందు చల్లబడిన పదార్థాల ఉష్ణోగ్రత కూడా పెరుగుతుంది. అందువల్లనే ఫ్రీజర్‌ను పైభాగంలోనే అమరుస్తారు. అక్కడ వెలువడిన ఉష్ణకిరణాలు అ...

Today's General Knowledge Parliament Of Other Countries

✦India➖Parliament (Sansad) ✦Iran➖Majlis ✦Ireland➖Dail Eireann ✦Israel➖Knesset ✦Japan➖Diet ✦Malaysia➖Majlis ✦Maldive➖Majlis ✦Magnolia➖Khural ✦Nepal➖Rasthtriya Panchayat ✦Netherlands➖States General ✦Norway➖Storting ✦Pakistan➖National Assembly ✦Poland➖Scym ✦Spain➖Crotes ✦Sweden➖Riksdag ✦South Africa➖Parliament ✦Switzerland➖Federal Assembly ✦Russia➖Duma ✦Taiwan➖Yuan ✦Turkey➖Grand National Assembly ✦U.S.A.➖Congress ✦Afghanistan➖Shora ✦Australia➖Parliament ✦Bangladesh➖Jatia Parliament ✦Bhutan➖Tasongadu ✦Canada➖Parliament ✦China➖National People Congress ✦Denmark➖Folketing ✦Egypt➖People’s Assembly ✦France➖National Assembly ✦Germany➖Bundestag ✦Great Britain➖Parliament 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

కరెంట్ అఫైర్స్ May 4th Week 2021... Part--1

🌎అంతర్జాతీయం🌎 హైయాంగ్‌ 2డీచైనాకు చెందిన జియుక్వాన్‌ శాటిలైట్‌ సెంటర్‌ నుంచి మే 19న లాంగ్‌మార్చ్‌-4బి రాకెట్‌ ద్వారా హైయాంగ్‌-2డి ఉపగ్రహాన్ని ప్రయోగించింది. ఇది సముద్రాల విపత్తు సమాచారం తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది. అణువిద్యుత్‌ ప్రాజెక్ట్‌చైనా-రష్యా అతిపెద్ద అణువిద్యుత్‌ ప్రాజెక్టు నిర్మాణానికి మే 19న ఆమోదించాయి. ఉమ్మడిగా ఈ ఒప్పందం ప్రకారం జుడాపు అణువిద్యుత్‌ ప్లాంట్‌ 3, 4 యూనిట్లు, తియాన్వన్‌ అణువిద్యుత్‌ ప్లాంట్‌ 7, 8 యూనిట్ల నిర్మాణానికి ఆమోదం తెలిపాయి. భారత్‌కు అమెరికా సాయంకరోనా సెకండ్‌ వేవ్‌తో అల్లాడుతున్న భారత్‌కు అమెరికా 500 మిలియన్‌ డాలర్ల ఆర్థిక సాయం ప్రకటించింది. 80 మిలియన్ల వ్యాక్సిన్‌ను భారత్‌కు పంపించడం కోసం అమెరికా కేబినెట్‌ మే 20న ఆమోదించింది. ఇన్‌ఫెక్షన్స్‌-2021ప్రపంచ ఆరోగ్య సంస్థ గ్లోబల్‌ ప్రోగ్రెస్‌ రిపోర్ట్‌ ఆన్‌ హెచ్‌ఐవీ, వైరల్‌ హెపటైటిస్‌ అండ్‌ సెక్సువల్లీ ట్రాన్స్‌మిటెడ్‌ ఇన్‌ఫెక్షన్స్‌-2021 పేరుతో రూపొందించిన ఒక నివేదికను మే 20న విడుదల చేసింది. దీని ప్రకారం ప్రపంచవ్యాప్తంగా హెచ్‌ఐవీ, వైరల్‌ హెపటైటిస్‌ అండ్‌ సెక్సువల్లీ ట్రాన్స్‌మిటెడ్‌ ఇన్‌ఫెక్షన్స్‌ వల్ల ఏటా ...

బడులు తెరుస్తున్నారు... టీచర్లు తీసుకోవలసిన జాగర్తలు

తెలంగాణా లో ఆగస్ట్ 27 నుండి, ఆంధ్రాలో సెప్టెంబర్ 5 నుండి బడులు తెరుస్తున్నారు. చాలా కాలం ఇంట్లో ఉన్న టీచర్లు ఇప్పుడు బడి బాట పట్టబోతున్నారు...ఈ సందర్భంగా టీచర్లు ఖచ్చితంగా కొన్ని స్వయం నిబంధనలు పాటించాలి ఇంటి నుండి బడికి వెళ్లే ముందు 1. మాస్కు ధరించాలి 2. బ్యాగ్ లో సబ్బు, sanitiser అదనపు మాస్కు ఉంచుకోవాలి 3. ఎవరి ప్లేట్, వాటర్ bottle, స్పూన్ వారే తీసుకువెళ్లాలి 4. పవర్ బ్యాంక్, చార్జర్ లు వంటివి కూడా ఎవరివి వారే తీసుకువెళ్లాలి 5. Two వీలర్ పై ఒక్కరు మాత్రమే వెళ్ళాలి 6. కార్లో ఇద్దరు మాత్రమే ఒకరు ముందు సీట్లో ఇంకొకరు వెనుక సీట్లో కూర్చోవాలి. కార్ కిటికీలు తెరిచి ఉంచాలి 7. బస్ లో వెళ్లే వారు మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలి 8. అనవసరముగా ఎవరితో ముచ్చటించరాదు ప్రయాణంలో. 9. అనారోగ్యముగా ఉంటే బడికి వెళ్లకూడదు 10. అవసరమైన మందులు వెంట తీసుకివెళ్లాలి బడిలో ఉన్నప్పుడు...  1. అనవసరంగా వస్తువులను తాకారాదు 2. భౌతిక దూరం పాటించాలి 3. మాస్కు, ఫేస్ షీల్డ్ నిరంతరం ధరించాలి 4. మీరు వాడే వస్తువులను రోజు శుద్ధి చేసుకోవాలి 5. కరచాలనం వద్దు,నమస్కారం ముద్దు 6. సమావేశాలు భౌతిక దూరం తో నిర్వహించాలి 7. ఎప్పటిక...

ఈ కరోనా సమయంలో అతిముఖ్యమైన సమాచారం మీకోసం...

జ్వరం, దగ్గుతో ఉన్న ఓ వ్యక్తి(40) కరోనా నిర్ధారణ కోసం ఆర్ టీ-పీసీఆర్ (రివర్స్ ట్రాన్స్ క్రిప్షన్ పొలిమెరేజ్ చైన్ రియాక్షన్ ) పరీక్ష చేయించుకోగా ఫలితాల్లో నెగెటివ్ వచ్చింది. లక్షణాలు అలాగే ఉండడంతో వైద్యుని సలహా మేరకు కొవిడ్ చికిత్సనే ఇంటి వద్ద పొందాడు. 10 రోజులు గడిచినా లక్షణాలు తగ్గకపోగా, మరింతగా పెరిగాయి. ఆయాసం ఎక్కువైంది. సమీపంలోని ఆరోగ్య కేంద్రంలో యాంటీజెన్ పరీక్ష చేయించుకున్నాడు. అందులోనూ నెగెటివ్ వచ్చింది.  రక్తంలో ఆక్సిజన్ శాతం తగ్గిపోతుండటంతో... ఒక కార్పొరేట్ ఆసుపత్రిలో చేరాడు. అక్కడ కూడా ఆర్ టీ-పీసీఆర్ పరీక్ష చేయగా కొవిడ్ లేదు.  ఈ పరిస్థితుల్లో ఛాతీ CT స్కాన్ తీయించిన వైద్యులు.. కొవిడ్ గా నిర్ధారించి, చికిత్స అందిస్తున్నారు. పరీక్షలు చేస్తే వెల్లడైన ఫలితాలనే ఎవరైనా నమ్ముతారు. వైరస్ ఉంటే ఉన్నట్లు.. లేకపోతే లేనట్లుగా భావిస్తారు.  కరోనాగా నిర్ధారిస్తే.. దానికి తగ్గట్లుగా చికిత్స పొందుతూ మానసికంగా సన్నద్ధమవుతారు.  లేదని తేలితే.. వైరస్ సోకలేదని ఊరట పొందుతారు.  అయినా లక్షణాలు కనిపిస్తుంటే.. సీజనల్ వ్యాధులు కావచ్చులే అని అనుకునే అవకాశాలూ ఉన్నాయి.  అయితే...

గుండె గురించి... ఈ పది పాయింట్స్ తప్పనిసరిగా తెలుసుకోండి...

గుండె గుప్పెడంత... కానీ నిండు నూరేళ్లు ఆరోగ్యంగా వుండాలంటే...  గుండె ఆరోగ్యం గురించి పది పాయింట్లు తెలుసుకుందాం. హృదయం అన్ని అవయవాలకు సక్రమంగా రక్తాన్ని సరఫరా చేస్తూ వుంటుంది. గుండె ఎపుడైతే తన పనిని మానేస్తుందో అంతటితో మనిషి జీవితం సమాప్తం. అలాంటి గుండెను జాగ్రత్తగా కాపాడుకోవటానికి ఈ 9 సూత్రాలు.   1. అధిక బరువు గుండెకూ చేటే. బరువు పెరగటం వల్ల గుండె మరింత కష్టపడాల్సి వస్తుంది. కాబట్టి ఆహార, వ్యాయామాలతో బరువు పెరగకుండా చూసుకోవాలి.  2. తగినంత నీరు తాగాలి. శరీరంలో నీటిశాతం తగ్గితే రక్తం చిక్కబడుతుంది. గుండెజబ్బు గలవారికిది మరింత హాని చేస్తుంది.  3. జంక్‌ఫుడ్‌తో మధుమేహం ముప్పు పెరుగుతుంది. అందుకే జంక్‌ఫుడ్‌కు దూరంగా ఉండాలి. మధుమేహానికీ గుండెజబ్బుకూ లంకె ఉందన్న విషయం గుర్తుపెట్టుకోండి.  4. నిద్రలేమితో రక్తపోటు పెరుగుతుంది. ఇది గుండెజబ్బుకు దారితీస్తుంది. రాత్రిపూట 7-8 గంటలు నిద్రపోతే గుండె ఆరోగ్యమూ పుంజుకుంటుంది.  5. ఒత్తిడితో గుండె వైఫల్యం, గుండెపోటు ముప్పు పెరుగుతుంది. రోజూ కనీసం 20 నిమిషాల సేపు ధ్యానం చేస్తే ఒత్తిడి పలాయనం చిత్తగిస్తుంది.  6. గుండె కూడా క...