Skip to main content

అలారం శబ్దంతో గుండెపోటు ముప్పు..!


ఉదయం అలారం మోగగానే.. , అబ్బా అప్పుడే లేవాలా? , అనిపిస్తుంది (Morning Alarm). , మళ్లీ రోజంతా చేయాల్సిన పనులు గుర్తొచ్చి.. , తప్పదిక అనుకుంటూ లేస్తాం. , అయితే ఈ మార్నింగ్ అలారం గురించి యూనివర్సిటీ ఆఫ్ వర్జీనియాకు చెందిన స్కూల్ ఆఫ్ నర్సింగ్ చేసిన తాజా అధ్యయనం ఆశ్చర్యకర అంశాలను వెల్లడించింది. , పొద్దున్నే వినిపించే అలారం మోత గుండెపోటు, స్ట్రోక్‌ (Heart Attack and Stroke) వచ్చే ముప్పును పెంచుతుందని పేర్కొంది. , 32 మందిపై ఈ అధ్యయనం నిర్వహించారు. , రెండు రోజులపాటు వారంతా నిద్రలో స్మార్ట్ వాచ్‌లు, ఫింగర్ బ్లడ్ ప్రెజర్ కఫ్స్‌ ధరించి అందులో పాల్గొన్నారు.

ఎటువంటి అలారం లేకుండా సహజంగా నిద్రలేవమని మొదటిరోజు పరిశోధకులు ఆ 32 మందికి సూచించారు. , రెండోరోజు.. , ఐదు గంటలకు పైగా నిద్రపోయిన తర్వాత అలారం పెట్టుకొని లేవమని చెప్పారు. , ఈ రెండు ఫలితాలను పరిశీలించగా.. , సహజంగా, బలవంతంగా మేల్కొనడం మధ్య బ్లడ్‌ప్రెజర్‌లో పెరుగుదలను గుర్తించారు. , సహజంగా నిద్రలేచేవారితో పోలిస్తే 74 శాతం అధికంగా బ్లడ్ ప్రెజర్ ఉన్నట్లు వెల్లడించారు. , హైదరాబాద్‌లోని అపోలో హాస్పిటల్స్‌కు చెందిన న్యూరాలజిస్ట్ డాక్టర్ సుధీర్‌ కుమార్.. , ఈ రక్తపోటు పెరుగుదల నిద్ర తక్కువగా ఉన్న వ్యక్తుల్లో ఎక్కువగా కనిపిస్తుందని వెల్లడించారు.

అలారం శబ్దం (Alarm Sound) మన శరీరంలో ఒత్తిడిని ప్రేరేపిస్తుంది. , ఆ స్పందన కారణంగా కార్టిసోల్‌, అడ్రినలిన్ విడుదల అవుతుంది. , ఈ హార్మోన్లు గుండె వేగాన్ని పెంచుతాయి. , రక్తనాళాలు కుచించుకుపోయేలా చేస్తాయి. , అవి బీపీని పెంచేందుకు కారణమవుతున్నాయని పరిశోధకులు గుర్తించారు. , నిద్రలేవగానే ఇలా బీపీ పెరగడాన్ని మార్నింగ్ బ్లడ్‌ ప్రెజర్ సర్జ్ అని పిలుస్తారు. , నిద్రసరిపోనప్పుడు ఈ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. , ఇలా ఉదయం పూట అలారంతో బీపీ పెరగడం తాత్కాలికమే అయితే ప్రమాదం లేదు కానీ.. , కానీ తరచూ అదే పరిస్థితి ఎదురయితే.. , మరీ ముఖ్యంగా గుండె సంబంధిత సమస్యలున్న వారికి ప్రమాదకరమని వెల్లడించారు.

రోజూ ఒకే సమయానికి నిద్రపోవడం, లేవడం ద్వారా అలారాన్ని దూరంగా ఉంచొచ్చు. , ఆవలింతలు, అలసట వంటి శరీరం ఇచ్చే సిగ్నళ్లను గుర్తించి నిద్రకు ఉపక్రమించేలా చూసుకోవాలి. , వ్యాయామాన్ని ఒక అలవాటుగా మార్చుకోవాలి. , బెడ్‌పైన పడే లైటింగ్ సహజంగా ఉండేలా చూసుకోవాలి. , అయితే ఇదంతా ఒక పైలట్ స్టడీ మాత్రమే కావడంతో ఈ అధ్యయనంపై ఇప్పుడే ఒక అంచనాకు రాలేమని, ఈ స్టడీ విస్తృత స్థాయిలో జరగాల్సి ఉందని నిపుణులు వెల్లడించారు. 

🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

Comments

Popular posts

నేటి ప్రధాన వార్తా పత్రికలు తెలుగు మరియు ఇంగ్లీష్

                             ఈనాడు ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.eenadu.net ఆంధ్రజ్యోతి ➪ 🅐🅟 & 🅣🅢 http://mpaper.andhrajyothy.com/ సాక్షి ➪ 🅐🅟 & 🅣🅢 http://epaper.sakshi.com ఆంధ్రప్రభ ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.prabhanews.com/ V6 వెలుగు➪ 🅣🅢 https://epaper.v6velugu.com 📰నవ తెలంగాణ ➪ 🅣🅢 http://epaper.navatelangana.com/ నమస్తే తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.ntnews.com 📰మన తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.manatelangana.news English Newspapers        ☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟ 👉🏻The Hindu📰 https://epaper.thehindu.com/Home/Index Deccan Chronicle http://epaper.deccanchronicle.com/states.aspx Indian Express https://epapeHr.newindianexpress.com/t/3464 The Hans India https://epaper.thehansindia.com/ 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

నేటి ప్రధాన వార్తా పత్రికలు

🗞️ఈనాడు ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.eenadu.net 📰ఆంధ్రజ్యోతి ➪ 🅐🅟 & 🅣🅢 http://mpaper.andhrajyothy.com/ 🗞️సాక్షి ➪ 🅐🅟 & 🅣🅢 http://epaper.sakshi.com/ 📰ఆంధ్రప్రభ ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.prabhanews.com/ 🗞️V6 వెలుగు➪ 🅣🅢 https://epaper.v6velugu.com 📰నవ తెలంగాణ ➪ 🅣🅢 http://epaper.navatelangana.com/ 🗞️నమస్తే తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.ntnews.com 📰మన తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.manatelangana.news 🧾English Newspapers🗞️        ☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟ 👉🏻The Hindu📰 https://epaper.thehindu.com/Home/Index 👉🏻Deccan Chronicle📰 http://epaper.deccanchronicle.com/states.aspx 👉🏻Indian Express📰 https://epaper.newindianexpress.com/t/3464 👉🏻The Hans India📰 https://epaper.thehansindia.com/           🏹లక్ష్య🇮🇳స్వచ్చంద📚సేవా🩺సంస్థ

ఆధునిక భారతదేశ చరిత్ర top 30 bits....

1. భగత్ సింగ్‌కు మరణశిక్ష విధించిన న్యాయమూర్తి ఎవరు?  జ: GC హిల్టన్  2. మహాత్మా గాంధీ రాజకీయ గురువు ఎవరు?  జ: గోపాల్ కృష్ణ గోఖలే  3. ఏ చట్టాన్ని అప్పీల్ లేకుండా, లాయర్ లేకుండా మరియు వాదన లేకుండా చట్టం అని పిలుస్తారు.  జ: రౌలట్ చట్టం  4. దండా ఫౌజ్‌ను ఎవరు ఏర్పాటు చేశారు?  జ: చమందీవ్ (పంజాబ్)  5. పాముల దేశం అని దేనిని పిలుస్తారు?  జ: బ్రెజిల్  6. మరణశిక్ష విధించిన అతి పిన్న వయస్కుడైన విప్లవకారుడు ఎవరు?  జ: ఖుదీరామ్ బోస్  7. జలియన్ వాలాబాగ్ మారణకాండకు నిరసనగా కైసర్-ఎ-హింద్ బిరుదును ఎవరు తీసుకున్నారు? నిరాకరించారు.  జ: మహాత్మా గాంధీ  8. గదర్ పార్టీని ఎవరు స్థాపించారు?  జ: లాలా హర్దయాల్, కాశీరాం  9. ఫార్వర్డ్ బ్లాక్ సంస్థ స్థాపకుడు ఎవరు?  జ: సుభాష్ చంద్రబోస్  10. కాంగ్రెస్ ఎప్పుడు, ఏ పార్టీలలో చీలిపోయింది?  జ: 1907 మితవాదులు మరియు తీవ్రవాదులు (సూరత్ సెషన్)  11. కాంగ్రెస్ మొదటి ముస్లిం అధ్యక్షుడు ఎవరు?  జ: బద్రుద్దీన్ త్యాబ్జీ  12. మరాఠా సామ్రాజ్య స్థాపకుడు ఎవరు.  జ: శివాజీ ...