1. అనేక రాష్ట్రాల్లోని షెడ్యూల్డ్ ప్రాంతాల పాలన, నియంత్రణకు సంబంధించిన పత్యేక నిబంధనలు భారత రాజ్యాంగంలో ఏ షెడ్యూల్‌లో ఉన్నాయి? జ: అయిదవ 2. అల్పసంఖ్యాక వర్గాల ప్రయోజనాల పరిరక్షణకు ఉద్దేశించిన నిబంధన ఏది? జ: నిబంధన- 29 3. రాజ్యాంగంలోని ఏ నిబంధన ప్రకారం సాంస్కృతిక, విద్యాయపరమైన హక్కులు కల్పించారు? జ: నిబంధనలు - 29, 30 4. మతం ప్రాతిపదికన భారతీయ పౌరుడికి ప్రభుత్వ పదవిని తిరస్కరిస్తే అతడికి ఏ ప్రాథమిక హక్కును లేకుండా చేసినట్లవుతుంది? జ: సమానత్వపు హక్కు 5. ప్రాథమిక హక్కుల సిద్ధాంతం దేన్ని సూచిస్తుంది? జ: పరిమిత ప్రభుత్వం 6. మతం లాంటి అంశాల మీద వివక్షను నిషేధించడం (భారత రాజ్యాంగం నిబంధన-15) దేని కింద వర్గీకరించిన ప్రాథమిక హక్కు? జ: సమానత్వపు హక్కు 7. భారత రాజ్యాంగంలో అంతర్జాతీయ శాంతిభద్రతలను ఎక్కడ పేర్కొన్నారు? జ: రాజ్య విధాన ఆదేశిక సూత్రాలు 8. భారత రాజ్యాంగం ఏడో షెడ్యూల్‌లోని కేంద్ర జాబితాలో ఉన్న అంశం ఏది? జ: గనుల్లోనూ, చమురు క్షేత్రాల్లోనూ శ్రమను, భద్రతను క్రమబద్ధం చేయడం 9. భారత రాజ్యాంగం నిబంధన 164(1) ప్రకారం మూడు రాష్ట్రాల్లో గిరిజన సంక్షేమానికి మంత్రి ఉండాలి....
Comments
Post a Comment