Skip to main content

Posts

Showing posts with the label job information

విజయవాడలో మెగా జాబ్ డ్రైవ్ – 300కి పైగా ఉద్యోగ అవకాశాలు

నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలను కల్పించే ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ (APSSDC) ఆధ్వర్యంలో ఈ నెల 24న విజయవాడలో ప్రత్యేక ఉద్యోగ మేళా నిర్వహించబడుతోంది. ఈ ఉద్యోగ మేళాలో ప్రముఖ టైర్ తయారీ సంస్థ MRF కోసం NAPS Trainee మరియు Production Associate పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు. ముఖ్య వివరాలు • తేదీ: 24 జూన్ 2026 (బుధవారం) • సమయం: ఉదయం 9:30 గంటల నుండి • వేదిక: జిల్లా ఉపాధి కార్యాలయం, ప్రభుత్వ ఐటీఐ కళాశాల ప్రాంగణం, రమేష్ హాస్పిటల్స్ రోడ్, విజయవాడ అర్హతలు • 10వ తరగతి • ఇంటర్మీడియట్ • ఐటీఐ • పాలిటెక్నిక్ • డిగ్రీ • B.Tech • పీజీ వయోపరిమితి 18 నుండి 35 సంవత్సరాల మధ్య వయస్సు గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. వేతనం & సౌకర్యాలు • నెలకు సుమారు ₹18,000 నుండి ₹40,000 వరకు (అర్హత ఆధారంగా) • ESI, PF, గ్రాట్యుటీ • అటెండెన్స్ బోనస్ • సబ్సిడీ భోజనం • రవాణా సౌకర్యం ఎంపికైన అభ్యర్థులు తెలంగాణ రాష్ట్రంలోని సంగారెడ్డి జిల్లా, మెదక్ ప్లాంట్‌లో విధులు నిర్వహించాల్సి ఉంటుంది. ​ఆసక్తి గల అభ్యర్థులు ముందుగా https://naipunyam.ap.gov.in/user-registration   వెబ్‌సైట్ నందు తమ వ...

Central Bank of India Apprentice Recruitment 2026 – నిరుద్యోగ యువతకు మంచి అవకాశం

బ్యాంకింగ్ రంగంలో కెరీర్ ప్రారంభించాలని భావిస్తున్న డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులకు సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభవార్త అందించింది. దేశవ్యాప్తంగా వివిధ శాఖల్లో అప్రెంటిస్ (Apprentice) పోస్టుల భర్తీ కోసం భారీ స్థాయిలో నియామక ప్రక్రియను చేపట్టింది. ఈ నియామక ప్రక్రియ ద్వారా మొత్తం 4500 అప్రెంటిస్ ఖాళీలను భర్తీ చేయనున్నారు. బ్యాంకింగ్ రంగంలో అనుభవాన్ని పొందడంతో పాటు భవిష్యత్తులో జరిగే బ్యాంకు ఉద్యోగ నియామకాలకు ఉపయోగపడే ప్రాక్టికల్ నాలెడ్జ్‌ను అభ్యర్థులు పొందే అవకాశం ఉంటుంది. అర్హత కలిగిన అభ్యర్థులు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం లేదా విద్యాసంస్థ నుండి ఏదైనా విభాగంలో డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. ఎంపికైన అభ్యర్థులకు శిక్షణ కాలంలో నెలవారీ స్టైపెండ్ అందించబడుతుంది. ప్రాంతాన్ని బట్టి గరిష్టంగా నెలకు రూ.15,000 వరకు స్టైపెండ్ పొందే అవకాశం ఉంది. దరఖాస్తు ప్రక్రియ పూర్తిగా ఆన్‌లైన్‌లో నిర్వహించబడుతుంది. ఆసక్తి మరియు అర్హత కలిగిన అభ్యర్థులు అధికారిక నోటిఫికేషన్‌ను పరిశీలించి నిర్ణీత గడువులోగా దరఖాస్తు చేసుకోవాలి. ముఖ్య వివరాలు సంస్థ: Central Bank of India పోస్టు పేరు: Apprentice మొత్తం ఖాళీలు: 4500 ...

Latest job notifications...

Lakshya Educational Groups

📢 UPSC CDS-II 2026 నోటిఫికేషన్ విడుదల: 451 డిఫెన్స్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ప్రారంభం

ముఖ్య సమాచారం (Introduction): భారత రక్షణ దళాల్లో (Indian Armed Forces) ప్రతిష్టాత్మకమైన ఆఫీసర్ హోదాలో దేశానికి సేవ చేయాలనుకునే అభ్యర్థులకు కేంద్ర ప్రభుత్వ సర్వీస్ కమిషన్ (UPSC) ఒక అద్భుతమైన సువర్ణావకాశాన్ని అందించింది. కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ (CDS-II) ఎగ్జామినేషన్ 2026 నోటిఫికేషన్‌ను యూపీఎస్సీ అధికారికంగా విడుదల చేసింది. దీని ద్వారా ఇండియన్ మిలిటరీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్ విభాగాల్లో ఆఫీసర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ​ 📌 ముఖ్య వివరాలు (Key Highlights): ​మొత్తం ఖాళీల సంఖ్య: 451 పోస్టులు ​విభాగాలు (Academies): ​ఇండియన్ మిలిటరీ అకాడమీ (IMA) - డెహ్రాడూన్ ​ఇండియన్ నావల్ అకాడమీ (INA) - ఎజిమల ​ఎయిర్ ఫోర్స్ అకాడమీ (AFA) - హైదరాబాద్ ​ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ (OTA) - చెన్నై (పురుషులు మరియు మహిళలు ఇద్దరికీ అవకాశం) ​ 🎓 అర్హతలు (Eligibility Criteria): ​విద్యా అర్హత: - ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి డిగ్రీ (Graduation) ఉత్తీర్ణత సాధించి ఉండాలి. ​డిగ్రీ చివరి సంవత్సరం (Final Year) చదువుతున్న విద్యార్థులు కూడా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ​(గమనిక: ఇంజనీరింగ్ మరియు సైన్స్ బ...

📢 AP Government Recruitment Notification దివ్యాంగుల కమిషనర్ పోస్టుకు దరఖాస్తుల ఆహ్వానం

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహిళలు, పిల్లలు, దివ్యాంగులు మరియు వృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కీలక నియామక ప్రక్రియను ప్రారంభించింది. రాష్ట్రంలో దివ్యాంగుల హక్కుల పరిరక్షణ, సంక్షేమ పథకాల అమలు మరియు సేవల పర్యవేక్షణ కోసం “State Commissioner for Persons with Disabilities” పోస్టును భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. ఈ పోస్టుకు అర్హతలు కలిగిన అభ్యర్థుల నుంచి ఆన్‌లైన్ దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. 🔹 పోస్టు పేరు State Commissioner for Persons with Disabilities (దివ్యాంగుల కమిషనర్) 🔹 శాఖ మహిళలు, పిల్లలు, దివ్యాంగులు మరియు వృద్ధుల సంక్షేమ శాఖ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 📅 దరఖాస్తుల చివరి తేదీ 15 జూన్ 2026 🌐 దరఖాస్తు విధానం అభ్యర్థులు కేవలం అధికారిక వెబ్‌సైట్ ద్వారా మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. అవసరమైన స్వీయ ధృవీకరించిన (Self-Attested) పత్రాలను అప్లోడ్ చేయడం తప్పనిసరి. 🔗 అధికారిక వెబ్‌సైట్: [ www.wcdsc.ap.gov.in ]( http://www.wcdsc.ap.gov.in ) ⚠️ ముఖ్య సూచనలు ▪️ ఆఫ్‌లైన్ దరఖాస్తులు స్వీకరించబడవు ▪️ అసంపూర్ణ దరఖాస్తులు తిరస్కరించబడే అవకాశం ఉంది ▪️ Self-Attested పత్రాలు జత చేయని దరఖాస్తులు పరిగణనలోకి తీసు...

​క్రీడా కోటా కింద అటవీశాఖలో 40 పోస్టుల భర్తీకి ప్రకటన

అటవీశాఖలోని వివిధ విభాగాల్లో 40 ఖాళీలను క్రీడా కోటా కింద భర్తీ చేయనున్నట్లు రాష్ట్ర క్రీడాప్రాధికార సంస్థ తెలిపింది. అర్హులైన క్రీడాకారులకు ఎలాంటి పరీక్ష లేకుండా క్రీడారంగంలో చూపిన ప్రతిభ ఆధారంగా పోస్టులు భర్తీ చేయనున్నట్లు వెల్లడించింది. ఈ నెల 18 నుంచి జూన్ 18వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని శనివారం ఓ ప్రకటనలో కోరింది. మరిన్ని వివరాలకు http://sports.ap.gov.in వెబ్‌సైట్‌ను సందర్శించాలని సూచించింది. రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాల్లో 9 ఫారెస్టు సెక్షన్ ఆఫీసర్లు, 17 బీట్ ఆఫీసర్లు, 13 అసిస్టెంట్ బీట్ ఆఫీసర్లు, ఒక టెక్నికల్ అసిస్టెంట్ పోస్టును భర్తీ చేయనున్నట్లు తెలిపింది. 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

Latest Job Notifications

🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

రాయలసీమ యూనివర్సిటీ, కర్నూలు 🎓 నాలుగవ కాన్వొకేషన్ నోటిఫికేషన్

📅 తేదీ: 12-11-2025 రాయలసీమ యూనివర్సిటీ, కర్నూలు లో నాలుగవ కాన్వొకేషన్ కార్యక్రమం 12 నవంబర్ 2025 న జరుగుతుంది. 🎓 అర్హులు: 2024-25 విద్యాసంవత్సరానికి చివరినాటికి డిగ్రీ సాధించిన విద్యార్థులు రెగ్యులర్ మోడ్ లో ఉంటే దరఖాస్తు చేసుకోవచ్చు. 🖥️ ఆన్‌లైన్ దరఖాస్తు తేదీలు: 👉 ప్రారంభం: 11-10-2025 👉 చివరి తేదీ: 25-10-2025 🌐 ఆన్‌లైన్ దరఖాస్తు వెబ్‌సైట్: https://od.rayalaseemauniversity.ac.in 📄 గమనిక: 2021-22 మరియు 2022-23 విద్యాసంవత్సరాలకు 04-09-2023 మరియు 16-05-2024 న జారీ చేసిన నోటిఫికేషన్లకు ఇప్పటికే దరఖాస్తు చేసిన వారు మళ్లీ దరఖాస్తు చేయనవసరం లేదు. 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

RRB NTPC 8050 జాబ్స్ నోటిఫికేషన్ విడుదల

రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు (RRB) 2025 సంవత్సరానికి సంబంధించి 8,050 ఖాళీలతో నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీస్ (గ్రాడ్యుయేట్ అండ్ అండర్ గ్రాడ్యుయేట్) సెంట్రలైజ్డ్ ఎంప్లాయిమెంట్ నోటిఫికేషన్ (CEN 2025)ను ఒక ప్రకటనలో విడుదల చేసింది. మొత్తం 8,050 ఖాళీలను భర్తీ చేయనుంది. వీటిలో 5,000 పోస్టులు గ్రాడ్యుయేట్, 3,050 అండర్ గ్రాడ్యుయేట్ పోస్టులు ఉన్నాయి. అర్హత: గ్రాడ్యుయేట్ పోస్టులకు డిగ్రీ ఉత్తీర్ణత, అండర్ గ్రాడ్యుయేట్ పోస్టులకు ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత ఉండాలి. ముఖ్య తేదీలు: గ్రాడ్యుయేట్ ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 20.11.2025. అండర్ గ్రాడ్యుయేట్ ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 27.11.2025.  మరిన్ని వివరాల కోసం అలాగే పూర్తి నోటిఫికేషన్ కోసం క్రింద ఉన్న లింకును క్లిక్ చేయగలరు  https://www.rrbapply.gov.in/#/auth/landing (Join us on whatsapp at) https://chat.whatsapp.com/JuVLXd0zVNNGnadLIN4Pr8?mode=ems_copy_t https://whatsapp.com/channel/0029VbAmA2K4SpkJgaw7uJ3u 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

RRB JE Recruitment: రైల్వేలో 2,570 జూనియర్ ఇంజినీర్, మెటలర్జికల్ అసిస్టెంట్ పోస్టులు

భారతీయ రైల్వే (Indian Railway).. 2,570 పోస్టులతో మరో నోటిఫికేషన్ను విడుదల చేసింది. దేశ వ్యాప్తంగా అన్ని రీజియన్లలో ఉద్యోగాల భర్తీకి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు (RRB) నోటిఫికేషన్ (సీఈఎల్ నంబర్ 05/ 2025) విడుదల చేసింది. ఈ ప్రకటన ద్వారా 2,570 జూనియర్ ఇంజినీర్, డిపో మెటీరియల్ సూపరింటెండెంట్, కెమికల్ అండ్ మెటలర్జికల్ అసిస్టెంట్ ఖాళీలు భర్తీ కానున్నాయి. ఆర్ఆర్బీ ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ అక్టోబర్ 31వ తేదీ నుంచి ప్రారంభమై నవంబర్ 31వరకు కొనసాగనుంది. పూర్తి వివరాల కోసం ఆఫీసియల్ వెబ్సైటు లింక్ https://www.rrbcdg.gov.in/ 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

CBSE - Single Gild Child Scholarship 2025

తల్లిదండ్రులకు ఏకైక బాలికా సంతానంగా ఉన్న ప్రతిభ కలిగిన విద్యార్థినుల కోసం సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) ఉపకార వేతనాన్ని ఏటా అందిస్తోంది. ఇందుకు సంబంధించి సీబీఎస్ఈ- సింగిల్ గర్ల్ చైల్డ్ స్కాలర్షిప్ 2025 ప్రకటన వెలువడింది. సీబీఎస్ఈ పదోతరగతి పరీక్షలో ఉత్తీర్ణులైన విద్యార్థినుల నుంచి ఆన్లైన్ దరఖాస్తులు కోరుతోంది. 👉 అర్హతలు: విద్యార్థిని తల్లిదండ్రులకు ఏకైక కూతురై ఉండాలి. విద్యార్థిని సీబీఎస్ఈలో పదోతరగతి ఉత్తీర్ణురాలై, సీబీఎస్ఈ అనుబంధ పాఠశాలలో పదకొండవ తరగతి, పన్నెండో తరగతి చదువుతూ ఉండాలి. పదో తరగతి పరీక్షలో కనీసం 70శాతం మార్కులు సాధించి ఉండాలి. విద్యార్థిని ట్యూషన్ ఫీజు నెలకు రూ.3000 కంటే మించకూడదు. 👉 చివరి తేదీ: 23.10.2025 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

క్యాలిక్యులేటర్ లో ఉండే ఈ GT, MU, M+, M-, MRC బటన్ల అర్థాలు, ఎందుకు వాడుతారో తెలుసా..?

ఇప్పుడంటే అన్నీ కంప్యూటర్ మయం అయిపోయాయి. దానికి తోడు స్మార్ట్ ఫోన్ లేకుండా క్షణం గడవదు. ప్రతీ దానికి యాప్ లు వచ్చేసాయి. ఇప్పుడంటే మనం సులభం గా పెద్ద పెద్ద అమౌంట్స్ కూడిక వెయ్యటానికి కాలిక్యులేటర్ యాప్ లను వాడుతున్నాం. అయితే ఫిజికల్ కాలిక్యులేటర్ వాడకం మాత్రం ఇంకా తగ్గలేదని చెప్పాలి. ఇప్పటికీ షాపుల్లో, ఆఫీసుల్లో అకౌంట్స్ సెక్షన్స్ లో దీని అవసరం ఉంటూనే ఉంటుంది. మీరు ఎప్పుడైనా కాలిక్యులేటర్ ను సరిగా చూసినట్లయితే అందులో కొన్ని ప్రత్యేకమైన బటన్స్ ఉంటాయి. GT, MU, M+, M-, MRC ఇలా కొన్ని స్పెషల్ బటన్లు ఉంటాయి. కాలిక్యులేటర్ ను వాడే చాలా మందికి అవేంటో ఎందుకు వాడతారో తెలియదనే చెప్పాలి. అసలు ఆ బటన్ల ఉపయోగం ఏంటో తెలుసుకుందామా... 1. GT - గ్రాండ్ టోటల్ (Grand Total) GT బటన్ మీకు గ్రాండ్ టోటల్ ను చెప్తుంది. అంటే ఉదాహరణకు 4 × 2 = 8 అని ఒక గుణకారాన్ని వేసుకుని తరువాత 7 × 6 = 42 అనే వేరే లెక్కను వేసారనుకోండి. ఇప్పుడు GT అనే బటన్ ప్రెస్ చేస్తే మీకు టోటల్ 50 (08 + 42 = 50) అనే ఆన్సర్ వస్తుంది. సో ఇది పెద్ద పెద్ద మొత్తాలలో లెక్కలు చేసినప్పుడు ఈజీ గా గ్రాండ్ టోటల్ తెలుసుకోవడానికి పనికొస్తుంది. ఒకసారి ట్రై చ...

సైన్స్ లో ముఖ్యమైన ప్రశ్నలు - జవాబులు....

ప్రశ్న: కాంతి వేగం ఎంత? జవాబు: 3 లక్షలు కి.మీ/సెకండ్ ప్రశ్న: విద్యుత్ యొక్క ప్రమాణం ఏమిటి? జవాబు: వాట్ (Watt) ప్రశ్న: అత్యంత తేలికపాటి వాయువు ఏది? జవాబు: హైడ్రోజన్ ప్రశ్న: DNA డబుల్ హెలికల్ నిర్మాణాన్ని ఎవరు కనిపెట్టారు? జవాబు: వాట్సన్ మరియు క్రిక్ ప్రశ్న: పెనిసిలిన్‌ను ఎవరు కనిపెట్టారు? జవాబు: అలెగ్జాండర్ ఫ్లెమింగ్ ప్రశ్న: ఎర్ర రక్త కణాలు ఎక్కడ తయారవుతాయి? జవాబు: ఎముక మజ్జ (Bone Marrow) ప్రశ్న: సూర్యుని నుండి శక్తి ఏ రూపంలో లభిస్తుంది? జవాబు: ప్రకాశం మరియు ఉష్ణం ప్రశ్న: రక్త శుద్ధి ఎక్కడ జరుగుతుంది? జవాబు: మూత్రపిండం (Kidney) ప్రశ్న: మనిషి కంటి లెన్స్ ఏ రకం? జవాబు: కుంభాకారం కటకం (Convex Lens) ప్రశ్న: పాలను పెరుగుగా మారడానికి ఏ బాక్టీరియా సహాయం చేస్తాయి? జవాబు: లాక్టోబాసిల్లస్ ప్రశ్న: ఇన్సులిన్ ఏ అవయవం నుండి ఉత్పత్తి అవుతుంది? జవాము: క్లోమం (Pancreas) ప్రశ్న: హీమోగ్లోబిన్ ద్వారా ఆక్సిజన్‌ను ఎవరు తీసుకెళ్తారు? జవాబు: ఎర్ర రక్త కణాలు ప్రశ్న: ప్రపంచంలో అత్యంత కఠిన పదార్థం ఏది? జవాబు: వజ్రం (Diamond) 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

తెలుసుకుందామా రోజుకో కొత్త విషయం...

🟥తెల్ల వెంట్రుకల్ని తీసేస్తే మరింత ఎక్కువగా వస్తాయంటారు. నిజమేనా? 🟢ఈ అభిప్రాయంలో నిజం లేదనే చెప్పుకోవాలి. తెల్ల వెంట్రుకలకు, నల్ల వెంట్రుకలకు ఉన్న తేడా కేవలం వాటిలో ఉన్న మెలనిన్‌ అనే వర్ణరేణువుల శాతంలో తేడానే. తెల్ల వెంట్రుకలలో మెలనిన్‌ రేణువులు దాదాపు ఉండవనే చెప్పవచ్చు. గోధుమ రంగు వెంట్రుకల్లో ఇవి ఓ మోస్తరుగా ఉంటాయి. వెంట్రుకలు మన చర్మం కింద ఉండే రోమ కుదుళ్ల నుంచి మొలుస్తాయి. ఈ కుదుళ్లు ఉపరితల చర్మం (epidermis) కింద ఉన్న అంతశ్చర్మం (dermis)లో ఉంటాయి. అక్కడే మెలనిన్‌ రేణువులు ఉత్పత్తి అవుతూ వెంట్రుక అనే ప్రొటీన్‌ గొట్టంలో దట్టంగా పేరుకుంటూ వస్తాయి. తెల్లని వెంట్రుకలు వచ్చే కుదుళ్ల దగ్గర మెలనిన్‌ రేణువుల ఉత్పత్తి లేకపోవడం కానీ లేదా వృద్ధాప్యం వల్ల మందగించడం కానీ జరుగుతుంది. ఆ తెల్ల వెంట్రుకల్ని పదే పదే తీసేసినప్పుడు అవి మాత్రమే పెరిగేలా ఆ కుదుళ్లు ఉత్తేజం పొంది, తెల్ల వెంట్రుకల ఉత్పత్తి జోరుగా సాగవచ్చునన్నది ఓ సమాధానం. కానీ దీనికి ఉన్న సంభావ్యత తక్కువ. 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

కరెంట్ అఫైర్స్ (సెప్టెంబర్ 12, 2025)

👉విదేశాల్లో మొదటి అటల్ ఇన్నోవేషన్ సెంటర్ (AIC) ఎక్కడ ఏర్పాటు చేయబడింది? — అబుదాబి, UAE 👉ప్రపంచంలో మొట్టమొదటి డిజిటల్ గిరిజన విశ్వవిద్యాలయం "ఆది సంస్కృతి" ఎక్కడ ప్రారంభించబడింది? — న్యూఢిల్లీ 👉ఇటీవల భారతదేశం-ఇటలీ సంయుక్త నావికాదళ విన్యాసాలు ఎక్కడ జరిగాయి? — ఉత్తర అరేబియా సముద్రం 👉ప్రపంచంలో అత్యంత ధనవంతుడు ఎవరు (సెప్టెంబర్ 2025)? — లారీ ఎల్లిసన్ 👉జోనాస్ గహర్ స్టోర్ ఏ దేశానికి ప్రధానమంత్రి అయ్యారు? — నార్వే. 👉UPI-UPU ఇంటిగ్రేషన్ ప్రాజెక్ట్ కోసం సహకారంలో ఏ భారతీయ సంస్థ భాగం? — NPCI ఇంటర్నేషనల్ పేమెంట్స్ లిమిటెడ్ (NIPL) 👉దుబాయ్‌లో జరిగిన 28వ యూనివర్సల్ పోస్టల్ కాంగ్రెస్‌లో UPI-UPU ఇంటిగ్రేషన్ ప్రాజెక్ట్‌ను ఎవరు ప్రారంభించారు? — జ్యోతిరాదిత్య M. సింధియా 👉స్వచ్ఛతా హీ సేవా (SHS) 2025 ప్రచారం ఎప్పుడు జరుగుతుంది? — సెప్టెంబర్ 17 నుండి అక్టోబర్ 2, 2025 వరకు 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

కరెంట్ అఫైర్స్ (సెప్టెంబర్ 3, 2025)

👉భారత వైమానిక దళ ప్రధాన కార్యాలయంలో ఎయిర్ ఆఫీసర్ ఇన్ ఛార్జ్ మెయింటెనెన్స్ (AOM)గా ఎవరు నియమితులయ్యారు? — సంజీవ్ ఘురాటియా 👉ఇండియా మొబైల్ కాంగ్రెస్ 2025 కోసం కేంద్ర కమ్యూనికేషన్ల మంత్రి ఏ మొబైల్ యాప్‌ను ప్రారంభించారు? — IMC25 👉భారత ప్రభుత్వం బీమా రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (FDI) పరిమితిని ఎంత శాతానికి పెంచింది? — 100% 👉క్రోకోథెమిస్ ఎరిథ్రేయా డ్రాగన్‌ఫ్లై తిరిగి ఎక్కడ కనుగొనబడింది? — దక్షిణ పశ్చిమ కనుమలు 👉2026 బ్యాడ్మింటన్ ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లను ఏ నగరం నిర్వహించింది? — న్యూఢిల్లీ 👉భారత సైన్యం పెంచుతున్న కొత్త కమాండో బెటాలియన్ల పేరు రాపిడో కెప్టెన్ ఏమిటి? — భైరవ్ 👉మిచెల్ స్టార్క్ ఏ దేశానికి చెందిన క్రికెటర్, అతను T20 అంతర్జాతీయ క్రికెట్ నుండి రిటైర్ అయ్యాడు? — ఆస్ట్రేలియా 👉ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (FSSAI) కి CEO గా ఎవరు నియమితులయ్యారు? - రంజిత్ పునాని 👉2025 ప్రపంచ శాంతి సూచికలో అత్యంత ఆందోళనకరమైన దేశం ఏది? — రష్యా 👉భారతదేశం మరియు అమెరికా మధ్య ఉమ్మడి సైనిక వ్యాయామం 'యుద్ధ అభ్యాస్ 2025' ఎక్కడ నిర్వహించబడుతుంది? — అలాస్కా US 👉దేశ కొత్త కంట్...

కరెంట్ అఫైర్స్ (సెప్టెంబర్ 4, 2025)

👉జాతీయ వన్యప్రాణుల దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు? — సెప్టెంబర్ 4 👉భారతదేశం ఏ దేశ విద్యార్థుల కోసం ఇ-స్కాలర్‌షిప్ పథకాన్ని ప్రకటించింది? — ఆఫ్ఘనిస్తాన్ 👉ఫుజైరా గ్లోబల్ సూపర్ స్టార్స్ 2025 విజేత ఎవరు? — ప్రణవ్ వెంకటేష్ 👉2026 ఆర్థిక సంవత్సరానికి భారతదేశ GDP వృద్ధి రేటు యొక్క కొత్త అంచనా ఎంత? — 6.7% 👉భారత ప్రభుత్వ విద్యా మంత్రిత్వ శాఖ ద్వారా ఎంత మంది ఉపాధ్యాయులకు జాతీయ ఉపాధ్యాయ అవార్డు 2025 లభించింది? — 45 ఉపాధ్యాయులు 👉'సెమికాన్ ఇండియా- 2025' ఎక్కడ నిర్వహించబడుతుంది? — యశోభూమి, న్యూఢిల్లీ 👉ఐసిసి మహిళల ప్రపంచ కప్ 2025 విజేతకు ఎంత ప్రైజ్ మనీ లభిస్తుంది? — 4.48 మిలియన్ USD 👉బెంగళూరులోని రామన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (RRI) విశ్వంలోని ఏ కాలపు రహస్యాలను ఛేదించడానికి ప్రయత్నిస్తోంది? — కాస్మిక్ డాన్ 👉'బీహార్ స్టేట్ లైవ్లీహుడ్ ఫండ్ క్రెడిట్ కోఆపరేటివ్ ఫెడరేషన్ లిమిటెడ్' ను ఎవరు ప్రారంభించారు? — నరేంద్ర మోడీ 👉దీపక్ మిట్టల్‌ను ఏ దేశానికి భారత రాయబారిగా విదేశాంగ మంత్రిత్వ శాఖ నియమించింది? — UAE (యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్) 👉మైత్రి-XIV సంయుక్త సైనిక విన్యాసాలు భారతదేశం మరియు ఏ...

AP TET Results working links

Step 1 : ముందుగా ఏపీ టెట్ 2024 వెబ్సైట్ ఓపెన్ చేసి                  https://aptet.apcfss.in Know / forgot your Tet hall ticket అనే ఆప్షన్ పైన క్లిక్ చేసి మొబైల్ నెంబర్ ఎంటర్ చేస్తే  ఆ మొబైల్ నెంబర్ కు లింక్ అయిన అన్ని టెట్ hallticket నంబర్స్ వస్తాయి.  అక్కడే 2024, 2022, 2018, 2017 టెట్ స్కోర్ కూడా చూపిస్తుంది 2017 , 2018 టెట్ ఫలితాలు కోసం  2017 టెట్ result   https://www.vidyavision.com/results/APTET2018.aspx results.manabadi.co.in/APTET-Results-2018-1903.htm  2018 టెట్ result https://www.vidyavision.com/results/aptet02062018.aspx  ఏపీ టెట్ 2011 results  https://www.vidyavision.com/results/aptet2011.htm 🎯పై నంబర్స్ లకు ఫోన్ చేసి మన డీటెయిల్స్ చెబితే మనకు వాళ్ళు 2012 Tet hall ticket చెబుతున్నారు. 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

Important Update On APDSC Selections

DSC 2025 సెలక్షన్ లిస్ట్ .. ఏ‌ క్షణమైనా విడుదలయ్యే అవకాశం. దరఖాస్తులో‌ ఏ పోస్ట్ కి మొదటి ప్రిఫరెన్స్ ఇచ్చారో ఆ పోస్ట్ మాత్రమే ఫైనల్. ఈ విషయమై అధికారులు బెట్టు సడలలేదు. SGT.. SA రెండూ రాసి.. రెండూ సెలక్ట్ అయితే మొదటి ప్రిఫరెన్స్ SGT ఇస్తే అదే ఫైనల్. SA పోస్ట్ తరువాతి రోస్టర్ వారికి కేటాయించబడుతుంది. 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

భారత రాష్ట్రాల స్థాపన దినోత్సవం

➺అరుణాచల్ ప్రదేశ్- 20 ఫిబ్రవరి 1987 ➺అస్సాం- 26 జనవరి 1950 ➺ఆంధ్రప్రదేశ్- 1 నవంబర్ 1956 ➺ఒడిశా- 1 ఏప్రిల్ 1936 ➺ఉత్తరప్రదేశ్- 24 జనవరి 1950 ➺ఉత్తరాఖండ్- 9 నవంబర్ 2000 ➺కర్ణాటక- 1 నవంబర్ 1956 ➺కేరళ- 1 నవంబర్ 1956 ➺గుజరాత్- 1 మే 1960 ➺గోవా- 30 మే 1987 ➺ఛత్తీస్‌గఢ్- 01 నవంబర్ 2000 ➺జార్ఖండ్- 15 నవంబర్ 2000 ➺తమిళనాడు- 1 నవంబర్ 1956 ➺తెలంగాణ- 02 జూన్ 2014 ➺త్రిపుర- 21 జనవరి 1972 ➺నాగాలాండ్- 01 డిసెంబర్ 1963 ➺పంజాబ్- 01 నవంబర్ 1966 ➺పశ్చిమ బెంగాల్- 26 జనవరి 1950 ➺బీహార్- 22 మార్చి 1912 ➺మణిపూర్- 21 జనవరి 1972 ➺మధ్యప్రదేశ్- 01 నవంబర్ 1956 ➺మహారాష్ట్ర- 1 మే 1960 ➺మిజోరం- 20 ఫిబ్రవరి 1987 ➺మేఘాలయ- 21 జనవరి 1972 ➺రాజస్థాన్- 30 మార్చి 1949 ➺సిక్కిం- 16 మే 1975 ➺హర్యానా- 1 నవంబర్ 1966 ➺హిమాచల్ ప్రదేశ్- 25 జనవరి 1971 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺