తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులకు మరో శుభవార్త అందబోతోంది. వివిధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న వేలాది పోస్టుల భర్తీకి తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) త్వరలో కొత్త నోటిఫికేషన్లు విడుదల చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అధికార వర్గాల సమాచారం ప్రకారం, రాష్ట్ర ప్రభుత్వం వివిధ శాఖల నుంచి ఖాళీల వివరాలను సేకరించే ప్రక్రియను వేగవంతం చేసింది. ఇప్పటికే సుమారు 6 వేలకుపైగా పోస్టుల భర్తీకి సంబంధించిన ప్రతిపాదనలు సిద్ధమైనట్లు తెలుస్తోంది. 🔹 ప్రధాన ఖాళీలు • ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో 1,000కు పైగా అధ్యాపక పోస్టులు • ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలల్లో 300కు పైగా పోస్టులు • డైట్ (DIET) కళాశాలల్లో 100కు పైగా అధ్యాపక ఖాళీలు • జూనియర్ లెక్చరర్ (JL) పోస్టులు • ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ (PET) పోస్టులు ఇవే కాకుండా దేవాదాయ శాఖ, అటవీ శాఖ, సర్వే & సెటిల్‌మెంట్, రవాణా, పట్టణాభివృద్ధి మరియు పురపాలక శాఖల్లో కూడా గణనీయమైన ఖాళీలు ఉన్నట్లు సమాచారం. 🔹 దశలవారీగా నోటిఫికేషన్లు అభ్యర్థులపై ఒత్తిడి తగ్గించే లక్ష్యంతో అన్ని ఉద్యోగాల నోటిఫికేషన్లను ఒకేసారి విడుదల చేయకుండా, ప్రతి రెండు వారాలకు ఒక నోటిఫికేషన్ విడు...
కష్టే ఫలి అన్న విషయం గుర్తుంచుకోండి చాలు.. మా యొక్క సర్వీస్ బాగుంటేనే ఇంకొకరికి చెప్పండి... ఆసరా లేదని అక్షరం... డబ్బు లేదని ఊపిరి... ఆగకూడదు అన్న ఒక బృహత్తర ఆలోచనతో లక్ష్య చారిటబుల్ సొసైటీ అనే సంస్థని ఏర్పరిచి అవసరం ఉన్న చోట సభ్యుల సహాయ సహకారాలతో సేవా కార్యక్రమాలు చేస్తున్నాము...