Skip to main content

Posts

Showing posts with the label August

తెలుసుకుందామా రోజుకో కొత్త విషయం... “భూమి మీద సరిగ్గా పనిచేసే గడియారం, వేరే గ్రహం మీద కూడా అదే విధంగా పనిచేస్తుందా?”

వివరణ: సాధారణంగా మనం గడియారం ఎక్కడ పెట్టినా అది ఒకేలా టిక్ టిక్ చేస్తుందని అనుకుంటాం. కానీ భౌతిక శాస్త్రం చెబుతున్న సత్యం వేరే! ఐన్‌స్టీన్ చెప్పిన సాపేక్షతా సిద్ధాంతం ప్రకారం, సమయం అనేది గురుత్వాకర్షణ మరియు వేగం మీద ఆధారపడి మారుతుంది. ఒక గ్రహానికి గురుత్వాకర్షణ ఎక్కువగా ఉంటే, అక్కడ గడియారం నెమ్మదిగా నడుస్తుంది. తక్కువ గురుత్వం ఉన్న గ్రహంలో అది వేగంగా నడుస్తుంది. కాంతి వేగానికి దగ్గరగా కదిలే వస్తువుల్లో సమయం మరీ ఎక్కువగా నెమ్మదిస్తుంది. ఉదాహరణకు – భూమి మీద ఒక గడియారం ఒక గంట చూపుతుంటే, అదే గడియారం బలమైన గురుత్వం ఉన్న జూపిటర్ దగ్గర ఉంటే కొద్దిగా వెనకబడుతుంది. చంద్రునిపై అయితే భూమికంటే వేగంగా నడుస్తుంది. 👉 అంటే సమయం అనేది ఒకేలా ఉండే గడియారం టిక్ టిక్ కాదు; ప్రపంచంలో మీరు ఎక్కడ ఉన్నారో, ఎంత వేగంగా కదులుతున్నారో, ఎంత బలమైన గురుత్వం ఉందో అనుసరించి మారిపోతుంది. 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

భారత రాష్ట్రాల స్థాపన దినోత్సవం

➺అరుణాచల్ ప్రదేశ్- 20 ఫిబ్రవరి 1987 ➺అస్సాం- 26 జనవరి 1950 ➺ఆంధ్రప్రదేశ్- 1 నవంబర్ 1956 ➺ఒడిశా- 1 ఏప్రిల్ 1936 ➺ఉత్తరప్రదేశ్- 24 జనవరి 1950 ➺ఉత్తరాఖండ్- 9 నవంబర్ 2000 ➺కర్ణాటక- 1 నవంబర్ 1956 ➺కేరళ- 1 నవంబర్ 1956 ➺గుజరాత్- 1 మే 1960 ➺గోవా- 30 మే 1987 ➺ఛత్తీస్‌గఢ్- 01 నవంబర్ 2000 ➺జార్ఖండ్- 15 నవంబర్ 2000 ➺తమిళనాడు- 1 నవంబర్ 1956 ➺తెలంగాణ- 02 జూన్ 2014 ➺త్రిపుర- 21 జనవరి 1972 ➺నాగాలాండ్- 01 డిసెంబర్ 1963 ➺పంజాబ్- 01 నవంబర్ 1966 ➺పశ్చిమ బెంగాల్- 26 జనవరి 1950 ➺బీహార్- 22 మార్చి 1912 ➺మణిపూర్- 21 జనవరి 1972 ➺మధ్యప్రదేశ్- 01 నవంబర్ 1956 ➺మహారాష్ట్ర- 1 మే 1960 ➺మిజోరం- 20 ఫిబ్రవరి 1987 ➺మేఘాలయ- 21 జనవరి 1972 ➺రాజస్థాన్- 30 మార్చి 1949 ➺సిక్కిం- 16 మే 1975 ➺హర్యానా- 1 నవంబర్ 1966 ➺హిమాచల్ ప్రదేశ్- 25 జనవరి 1971 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

Current affairs practice bits with useful explanation for you

ప్రశ్న 01. "అంతర్జాతీయ బానిసత్వం గుర్తుంచుకోవడం రోజు" ఎప్పుడు జరుపుకున్నారు? (ఎ) 20 ఆగస్టు (బి) 21 ఆగస్టు (సి) 22 ఆగస్టు (డి) 23 ఆగస్టు సమాధానం: (డి) 23 ఆగస్టు వివరణ: ప్రతి సంవత్సరం ఆగస్టు 23 న, "ఇంటర్నేషనల్ స్లాటీస్ డే" జరుపుకుంటారు, తద్వారా బానిస వాణిజ్యం మరియు దాని ముగింపు పోరాటాన్ని గుర్తుంచుకోవచ్చు. ప్రశ్న 02. ఇటీవల FSSAI (ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా) యొక్క కొత్త CEO గా ఎవరు నియమించబడ్డారు? (ఎ) రజిత్ పన్నానీ (బి) అమితాబ్ కాంత్ (సి) BR GAWAI (డి) శ్రీ నివాసులు శెట్టి సమాధానం: (ఎ) రాజత్ పన్నానీ వివరణ: రజిత్ పన్నానీని ఇటీవల ఎఫ్‌ఎస్‌ఎస్‌ఎఐ కొత్త సిఇఒగా నియమించారు. ఈ సంస్థ భారతదేశంలో ఆహార భద్రత మరియు ప్రమాణాలకు బాధ్యత తీసుకుంటుంది. ప్రశ్న 03. 14 వ ఉమ్మడి ద్వైపాక్షిక సైనిక వ్యాయామం భారతదేశం మరియు ఏ దేశం మధ్య "స్నేహం" నిర్వహించబడుతుంది? (ఎ) మలేషియా (బి) థాయిలాండ్ (సి) బంగ్లాదేశ్ (డి) వియత్నాం సమాధానం: (బి) థాయిలాండ్ వివరణ: భారతదేశం మరియు థాయ్‌లాండ్ మధ్య 14 వ ఉమ్మడి సైనిక వ్యాయామం "స్నేహం" ఉమ్రోయి (మేఘాలయ) వద్ద జరుగుతుంది. ప్రశ్న ...

Latest job notifications

This week employment news magazine

Click here to get magazine వాట్సాప్ గ్రూప్స్ ద్వారా... సుమారు 25వేల మందికి పైగానే ప్రతిరోజు అన్నిరకాల ఉద్యోగాలకు సంబందించిన మెటీరియల్స్ పది సంవత్సరాలు నుండి నిర్వీరామంగా సేవలు అందిస్తున్న మన లక్ష్య ఉద్యోగ సోపానం గ్రూప్స్.. ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వడానికి... ఈ క్రిందన లింక్ క్లిక్ చేయండి... Our WhatsApp group link అలాగే మన లక్ష్య గ్రూప్ సభ్యుల సహకారాలతో లక్ష్య చారిటబుల్ సొసైటీ అనే సంస్థని ఏర్పాటు చేసి. ఎంతోమంది అవసరం ఉన్నవారికి  సేవలు అందించడం జరిగింది... 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

వివిధ న్యూస్ పేపర్స్ లలో వచ్చిన ఉద్యోగ మరియి విద్యా సంబంధిత విషయాలు మీకోసం...

🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

డిగ్రీ, డిప్లొమా, బీటెక్, ఐటిఐ మరియు ఇతర కోర్సులలో వాళ్ళకి ఫీజు రీయింబర్స్మెంట్ అప్లై చేసిన తర్వాత చేయవలసినది...

డిగ్రీ, డిప్లొమా, బీటెక్, ఐటిఐ మరియు ఇతర కోర్సులలో 2వ, 3వ, 4వ సంవత్సరం చదువుతున్న విద్యార్థులు కాలేజీలో  ఫీజు రీయింబర్స్‌మెంట్‌కి అప్లై చేసిన తరువాత* తప్పనిసరిగా గ్రామ/వార్డు సచివాలయంలో 5-స్టెప్ వెరిఫికేషన్  చేయించుకోవాలి.   ⚠️ వెరిఫికేషన్ పూర్తి చేసిన విద్యార్థులకు మాత్రమే  ఫీజు రీయింబర్స్‌మెంట్ జమ అవుతుంది. 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

ఆగస్టు 19 చరిత్రలో..... ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవం

ఒక చిత్రం అనేక విషయాలను తెలుపుతుంది. , ఇది అనేక భావోద్వేగాలు, భావనలను కలిగిస్తుంది. , దీనిది విశ్వభాష. , మనసుకు ఆహ్లాదాన్ని కలిగించే ప్రతి దృశ్యాన్ని ఫొటో రూపంలో బంధించి.. , విలువైన జ్ఞాపకంగా మనతో ఉంచుకోవచ్చు. , వీటిని చూసినప్పుడల్లా పాత గుర్తులను నెమరువేసుకునే అవకాశం ఉంటుంది. , మనకు కావాల్సిన వ్యక్తులు, ప్రకృతి అందాలు, పక్షులు - జంతువులు, కాలానికి అనుగుణంగా వచ్చే మార్పులు ఇలా ప్రతిదీ మనం చిత్తరువుగా భద్రపరచుకోవచ్చు. , ప్రస్తుత డిజిటల్‌ యుగంలో స్మార్ట్‌ఫోన్ల వాడకం పెరిగాక ప్రతి సందర్భాన్ని తీపి గుర్తుగా మలుచుకునేందుకు ఫొటోలను తీసుకుంటున్నారు. , చారిత్రక సంఘటనలకు దృశ్య రూపం కల్పించి, వాటిని భవిష్యత్తు తరాలకు అందించడంలో ‘ఫొటోగ్రఫీ’ ముఖ్యపాత్ర పోషిస్తోంది. , మానవ జీవనంలో ఫొటోగ్రఫీ ప్రాముఖ్యాన్ని తెలియజేసే ఉద్దేశంతో ఏటా ఆగస్టు 19న ‘ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవం’గా (World Photography Day) నిర్వహిస్తారు. , దీన్నే ‘వరల్డ్‌ ఫొటో డే’గా పిలుస్తారు. , ఈ కళారూపాలకు కారణమైన ఫొటోగ్రాఫర్లను గౌరవించుకోవడంతోపాటు సమాజంలో దీన్ని ఒక కళగా వ్యాప్తి చేయడం ఈ రోజు ముఖ్య ఉద్దేశం. ఒకప్పుడు కాలక్షేపానికి ఫొటోలు తీసే...

10వ తరగతి పాస్ అయిన విద్యార్థులకు సువర్ణావకాశం

2024-25 విద్యా సంవత్సరంలో 10వ తరగతి లో 60% లేదా అంతకన్నా ఎక్కువ మార్కులు తో పాస్ అయిన విద్యార్ధిని విద్యార్ధులకు ఎంట్రెన్స్ ఎగ్జామ్ లేకుండానే నవోదయ ఎటపాక స్కూల్ నందు 11వ తరగతి సైన్స్ మరియు మ్యాథ్స్ గ్రూప్స్ లో డైరెక్ట్ గా సీటు ఇవ్వబడును. కావున విద్యార్ధులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారని కోరుకుంటున్నాము. దరఖాస్థులు నింపి పంపించడానికి చివరి తేదీ 20 ఆగష్టు 2025 . అడ్మిషన్స్ కేవలం మెరిట్ బేసిస్ మీదనే ఉంటుంది. ఎవరి సిఫార్సులు పని చేయవు.  మొత్తం ఖాళీల సంఖ్య: 52 సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 9494343022 (కె. టీ. ప్రసాద్)  9491191813 (శ్రీ భాస్కరాచారీ, సీనియర్ టీచర్)  9491768144 (శ్రీ కె. శేఖర్, కౌన్సిలర్) ముఖ్య గమనిక: 11వ తరగతిలో ఎంపికకు ఖాళీగా ఉన్న సీట్లు 12 నుంచి 52 కు పెంచబడినాయని చెప్పటానికి సంతోషిస్తున్నాము. అంటే ఒక సెక్షన్ పెంచబడింది. ఇట్లు ప్రిన్సిపాల్ ఇంచార్జి  కె టి ప్రసాద్ 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

APPSC latest job notifications...

ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వారు... తాజాగా విడుదల చేసిన జాబ్ నోటిఫికేషన్స్ మీకోసం... 1. Technical assistant notification 2. Agricultural officer notification 3. Endowment executive officer notification అలాగే మీకు ఈ జాబ్స్ సంబందించిన అన్ని రకాల మెటీరియల్స్ మన లక్ష్య ఉద్యోగ సోపానం గ్రూప్స్ నందు లభించును.. మన లక్ష్య ఎడ్యుకేషన్ గ్రూప్స్ లలో జాయిన్ అవ్వడానికి క్రింది లింక్ క్లిక్ చేయగలరు... Group link... ఏమైనా ఇష్యూస్ ఉంటే కామెంట్ చేయగలరు... 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

నేటి మోటివేషన్.... హృదయం కదిలించే కథ

రవి సాప్ట్ వేర్ ఇంజినీర్. భార్య డెలివరీకి వెళ్ళింది. అప్పటిదాకా తాముంటున్న సింగిల్ బెడ్ రూమ్ ఇంటిని ఖాళీ చేసి ఊరికి కొంచెం దూరంగా గేటెడ్ కమ్యూనిటీలో డబుల్ బెడ్ రూమ్ ఇల్లు అద్దెకు తీసుకుని చేరాడు. స్వయంపాకం చేసుకుంటాడు. ఆరోజు ఆదివారం. పోర్టికోలో కూర్చుని కాఫీ తాగుతున్నాడు. "ఆకు కూరలు... ఆకు కూరలు" అని కేక వినిపించింది. డెబ్బై ఏళ్ల వృద్ధురాలు తలపై కూరల గంప పెట్టుకుని కనిపించింది. పిలిచాడు. "కాస్త గంప దించయ్యా" అన్నది ఆమె. "పాలకూర కట్ట ఎంత?" అడిగాడు. "పది రూపాయలకు మూడయ్యా" చెప్పింది అవ్వ. "మరీ అన్యాయం... బయట అయిదు ఇస్తున్నారు" అన్నాడు చిరుకోపంగా "నాలుగు తీసుకో నాయన.." కట్టలు తీసింది అవ్వ. పదిరూపాయలు ఇచ్చాడు. "గంప కాస్త పట్టయ్యా" అన్నది అవ్వ గంపను తనవైపు ఎత్తి పట్టుకుని. గంపను పైకి లేపుతూ రెండు కట్టలు పాలకూర తీసి ఇంట్లోకి విసిరాడు రవి.అమ్మయ్య పది రూపాయలకు ఆరు కట్టలు వచ్చాయి అనుకున్నాడు ఒకింత సంతోషంగా. అవ్వ వెళ్ళిపోయింది. "ఎంత ఆశో ఈ ముసలిదానికి... ఇవాళో రేపో చావబోతుంది... ఇంకా డబ్బు మూటలు కడుతున్నది" ముసిముసిగా ...

నేటి మోటివేషన్... ప్రశాంత జీవనం

ప్రతి వ్యక్తీ ప్రశాంతమైన జీవితాన్నే కోరుకుంటాడు. ఆహ్లాదకరమైన వాతావరణంలో జీవనయానం కొనసాగాలని ఆకాంక్షిస్తాడు. ఒత్తిళ్లకు దూరంగా చింతలేని జీవితాన్ని ఆస్వాదించాలని ఆశిస్తాడు. కానీ ఆచరణలో అది సాధ్యమేనా? జీవితం సుఖదుఃఖాల సంగమం. కష్టాలూ సమస్యలు లేని వారంటూ ఎవరూ ఉండరు. అయితే వాటిని ఎంత నిబ్బరంగా ఎదుర్కొంటామన్న దానిపైనే మన జీవన నాణ్యత ఆధారపడి ఉంటుంది.  నిజానికి జీవితం అంటే ఒక సమస్య నుంచి మరొక సమస్యకు ప్రయాణించడమే. అయితే ఆ సమస్యల వల్ల ఏర్పడే విపరిణామాలలో చిక్కుకోకుండా వాటిని చాకచక్యంగా పరిష్కరించుకుంటూ ముందుకు సాగడం మన వివేచన మీద ఆధారపడి ఉంటుంది. ప్రశాంతత కోసం మనం ఎక్కడెక్కడో అన్వేషిస్తూ ఉంటాం. కానీ, ప్రశాంతత అనేది మనలోనే, మనతోనే, మన ఆలోచనల్లోనే నిండి ఉంటుంది. సర్వకాల సర్వావస్థల్లోనూ మనసును నిర్మలంగా స్ఫటికమంత స్వచ్ఛంగా ఉంచుకోగలిగితే ప్రశాంత అనుభూతిని ఆస్వాదించవచ్చు. సమస్యలనేవి సముద్రపు అలల్లా వచ్చి పోతూనే ఉంటాయి. వాటి ఒత్తిడికి అతీతంగా మసలుకుంటే మనల్ని మనం నియంత్రించుకోవచ్చు.  సుఖదుఃఖాలు అనేవి రెండు తలుపులు లాంటివి. వాటిలో ఒకటి తెరుచుకుంటే ఇంకొకటి మూసుకుంటుంది. సమస్యలతో సంఘటనలతో నిమిత్...

నేటి మోటివేషన్... ఆత్మసంతృప్తి

భూలోకంలో ఒక మహారాజు జనరంజకంగా పాలించాడు. పుణ్యకార్యాలు చేశాడు. మరణానంతరం తాను స్వర్గానికే వెళ్తానని, అక్కడ బంగారు కొండపై తన పేరు శాశ్వ తంగా చెక్కి ఉంటుందని నమ్మాడు. చనిపోయి స్వర్గానికి వెళ్లాడు. తన పేరు చూసు కోవాలన్న ఆత్రుతతో ఆ కొండ దగ్గరకు వడివడిగా వెళ్లాడు. దానిపై తన పేరు లేదు. విచారంగా ఉన్న అతణ్ని చూసి అక్కడి భటుడు నవ్వుతూ 'ఏదో ఒక పేరు చెరిపి నీది రాసుకో' అన్నాడు. మహారాజు ఆశ్చర్యపోయాడు. 'ఆ పని చేస్తే తరవాత వచ్చిన వాడు నా పేరు కూడా చెరిపేస్తాడు. అంటే నా పేరు కొన్నాళ్లకు భూలోకంలో వినిపించదు. స్వర్గంలో కూడా కనిపిం చదు. ఇన్నాళ్లూ మంచి పనులు చేసి ఫలి తమేంటి...' అనుకున్నాడు. మంచి పనులు చేస్తే స్వర్గం, చెడు పనులు చేస్తే నరకం లభిస్తుందని పార మార్థిక చింతన ఉన్నవాళ్లు నమ్ముతారు. ఆ నమ్మకం మంచి పనులు చేయడానికి ప్రేరణ ఇస్తుందని భావించారు పూర్వీ కులు. చీకట్లో ఆడుకుంటున్న పిల్లల్ని ఆట మానెయ్యమంటే ఒక పట్టాన వినరు. అందుకని 'చీకట్లో దయ్యాలు తిరుగుతాయి. ఆట ఆపి రండి' అనే వారు. దయ్యాలు అనగానే భయపడి ఎవరింటికి వారు వెళ్లిపోతారు. దయ్యాలు లేవని తెలుసు. చీకట్లో పురుగూ పుట్రా, ముళ్లూ ర...