Skip to main content

Posts

Showing posts with the label teachers

📢 TIS (Teacher Information System)లో తప్పనిసరిగా వెరిఫై చేసుకోవాల్సిన అంశాలు

✅ 1. పుట్టిన తేదీ (Date of Birth) ✅ 2. స్థానికత (Nativity) ✅ 3. మొదటి నియామక తేదీ & హోదా (Date of First Appointment & Designation) (మరొక DSCలో Lien తీసుకున్నట్లయితే, ప్రస్తుతం ఉన్న DSCనే తొలి నియామకంగా పరిగణిస్తారు.) ✅ 4. పదోన్నతి తేదీ & పదోన్నతి హోదా (Date of Promotion & Promotion Designation) ✅ 5. ప్రస్తుత హోదాలో చేరిన తేదీ (Date of Joining Present Designation) ✅ 6. సీనియారిటీ లెక్కించే తేదీ (Seniority Count From) • ప్రస్తుత హోదాలో చేరిన తేదీ నుంచే సీనియారిటీ లెక్కిస్తారు. • IDT అయితే, ప్రస్తుత జిల్లాలో చేరిన తేదీని పరిగణనలోకి తీసుకుంటారు. ✅ 7. బదిలీల వివరాలు (Transfers Sequence) • Continuity "From" & "To" తేదీలు సరి గా ఉన్నాయో పరిశీలించండి. • "From" మరియు "To" తేదీలు ఒకే విధంగా ఉండకూడదు. ✅ 8. TET అర్హతలు (TET Qualifications) ✅ 9. ప్రస్తుతం పనిచేస్తున్న పాఠశాల (Present School) (దీనినే చివరి బదిలీగా పరిగణిస్తారు.) ✅ 10. దివ్యాంగత వివరాలు & శాతం (Disability & Percentage) ✅ 11. Treasury ID & CFMS ID సరిగ్గా ఉన్నాయో ...

Current Education information Of Andhra Pradesh

💥త్వరలో Inservice Teachers కు AICTE నిబంధనల ప్రకారం ప్రత్యేక TET నిర్వహణ సన్నాహాలు. ఒకటి రెండు రోజుల్లో AP గౌరవ విద్యా మంత్రి గారిచే ప్రకటన! 💥 5 యేళ్ళ పైబడి సర్వీసు ఉన్న వారందరూ ప్రస్తుతం పని చేయుచున్న పోస్టు TET పాస్ తప్పని సరి.SGT వారు అర్హతలు ఉంటే SA TET కూడా వ్రాయవచ్చు. 💥2010 తర్వాత ఉద్యోగము TET అర్హతలతో ఉద్యోగం పొందిన వారు మరల TET వ్రాయవలసిన అవసరం లేదు. 💥2010 తర్వాత SGT లో Join అయిన వారు గతం లోనే SA TET కూడా అర్హత పొందిన ఉంటే‌ మరల TET వ్రాయవలసిన పని లేదు. 💥HM గా పని చేయుచున్న వారు TET అర్హత పొందనవసరం లేదు. 💥High School plus లలో PGT లుగా పని చేయుచూ గతంలో TET అర్హత పొందని వారు కూడా TET అర్హత పొందాలి. 💥RTE Act 8 th class వరకే వర్తిస్తుంది కనుక Junior colleges &Model School లోని J.Ls కు TET వర్తించదు 💥Local caderisation కాక పోయినా ZP&Mpl High School HMs&MEOs పోస్టులు Zonal Level కు పెంచుతారట. న్యాయ శాఖ ఒప్పుకొంటే త్వరలో సవరణ ఉత్తర్వులు.ఈ ఉత్తర్వులు వస్తే ZP&Mpl HMs కు జోనల్ స్థాయిలో బదిలీలు & పదోన్నతులు 💥DSC 2003 వారికి OPS వర్తింపు ఫైలుకు తుద...

ఉపాధ్యాయుల కోసం ముఖ్య సమాచారం: టీచర్ హ్యాండ్‌బుక్స్‌లో కొత్త మార్పులు

పాఠశాల విద్యలో నాణ్యతను మరింత మెరుగుపరచడం, విద్యార్థి కేంద్రిత బోధనకు ప్రాధాన్యత ఇవ్వడం లక్ష్యంగా ప్రాథమిక తరగతుల కోసం రూపొందిస్తున్న టీచర్ హ్యాండ్‌బుక్స్‌లో పలు మార్పులు చోటుచేసుకుంటున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా 3, 4, 5 తరగతుల తెలుగు బోధన నిర్మాణంలో జరిగిన మార్పులకు అనుగుణంగా కొత్త హ్యాండ్‌బుక్స్ సిద్ధం చేస్తున్నారు. కొత్త రూపకల్పనలో భాగంగా విద్యార్థుల్లో చదవడం, వినడం, మాట్లాడడం, రాయడం వంటి భాషా నైపుణ్యాల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తున్నారు. దీనిలో భాగంగా గతంలో ఉపయోగించిన కొన్ని శీర్షికలకు బదులుగా మరింత విద్యార్థి అనుకూలమైన కొత్త శీర్షికలను చేర్చనున్నట్లు సమాచారం. ఉదాహరణకు, పాటలు మరియు కథల ఆధారిత అభ్యాస కార్యక్రమాలను మరింత ఆకర్షణీయంగా రూపొందించే ప్రయత్నం జరుగుతోంది. పాఠ్యాంశాలకు అనుసంధానంగా వివిధ బోధనా కార్యకలాపాలు, సమూహ చర్చలు, పఠన కార్యక్రమాలు, సృజనాత్మక రచన వ్యాయామాలు మరియు నిరంతర మూల్యాంకనానికి సంబంధించిన సూచనలను కూడా హ్యాండ్‌బుక్‌లో పొందుపరచనున్నట్లు తెలుస్తోంది. దీని ద్వారా ఉపాధ్యాయులు తరగతి గదిలో బోధనను మరింత సమర్థవంతంగా నిర్వహించగలరు. అలాగే ఉపాధ్యాయుల డైరీ నిర్వహణ, పాఠ్య ప్రణా...

TET special ప్రజ్ఞా లబ్ది మరియు శిశు వికాస సిద్ధాంతాలపై పూర్తి వివరణ మరియు ప్రాక్టీస్ బిట్స్...

శిశు వికాస సిద్ధాంతాలు & ప్రతిపాదకులు (Child Development Theories & Founders) విద్యా మనోవిజ్ఞాన శాస్త్ర పితామహుడు: ఎడ్వర్డ్ లీ థోర్న్‌డైక్ (Edward L. Thorndike) ఆధునిక మనోవిజ్ఞాన శాస్త్ర పితామహుడు: విలియం జేమ్స్ (William James) ప్రయోగాత్మక మనోవిజ్ఞాన శాస్త్ర పితామహుడు: విల్హెల్మ్ వుండ్ట్ (Wilhelm Wundt) మానసిక విశ్లేషణ సిద్ధాంతం (Psychoanalytic Theory): సిగ్మండ్ ఫ్రాయిడ్ (Sigmund Freud) ప్రముఖ వికాస సిద్ధాంతాలు సంగ్రహణాత్మక వికాస సిద్ధాంతం (Cognitive Development Theory) ప్రతిపాదకుడు: జీన్ పియాజే (Jean Piaget) వికాస దశలు జ్ఞానేంద్రియ చలన దశ (0-2 సంవత్సరాలు) పూర్వ కార్యాచరణ దశ (2-7 సంవత్సరాలు) నిర్దిష్ట కార్యాచరణ దశ (7-11 సంవత్సరాలు) అమూర్త కార్యాచరణ దశ (11+ సంవత్సరాలు) సాంఘిక-సాంస్కృతిక వికాస సిద్ధాంతం ప్రతిపాదకుడు: లెవ్ వైగోట్‌స్కీ (Lev Vygotsky) ముఖ్య భావనలు Zone of Proximal Development (ZPD) Scaffolding (ఆధార బోధన) నైతిక వికాస సిద్ధాంతం ప్రతిపాదకుడు: లారెన్స్ కోల్‌బర్గ్ (Lawrence Kohlberg) స్థాయిలు పూర్వ సంప్రదాయ స్థాయి సంప్రదాయ స్థాయి అనంతర సంప్రదాయ స్థాయి మనోసాంఘిక వికాస సి...

TET- PSYCHOLOGY REVISION BITS PART - 2

101. ప్రజ్ఞ అంటే? — సమస్య పరిష్కార సామర్థ్యం   102. ప్రజ్ఞను తీర్పు శక్తిగా నిర్వచించినవాడు? — బినెట్   103. వ్యక్తిత్వం అంటే? — సమగ్ర లక్షణాల సమాహారం   104. Trait Theory ఎవరిది? — ఆల్పోర్ట్   105. 16 Personality Factors ఎవరిది? — క్యాటెల్   106. Introvert ఎవరు? — ఒంటరిగా ఉండేవాడు   107. Extrovert ఎవరు? — సమాజంలో కలిసేవాడు   108. Ambivert అంటే? — రెండు లక్షణాల సమ్మేళనం   109. Learningను ప్రభావితం చేసేది? — ఆసక్తి   110. Behaviourను ప్రభావితం చేసేది? — వైఖరి   111. అభిరుచి అంటే? — ప్రత్యేక ఆకర్షణ   112. Aptitude ఏమి సూచిస్తుంది? — భవిష్యత్ విజయం   113. Achievement Test ఏమి కొలుస్తుంది? — నేర్చుకున్నది   114. Aptitude Test ఏమి కొలుస్తుంది? — భవిష్యత్ సామర్థ్యం   115. Personality Test ఏమి కొలుస్తుంది? — వ్యక్తిత్వం   116. Inkblot Test ఎవరిది? — రోర్షాక్   117. TAT రూపొందించినవాడు? — ముర్రే   118. Creativity ప్రధాన లక్షణం? ...

రిటైర్మెంట్కు రెండేళ్ల ముందే సర్వీస్ ధ్రువీకరణ*

నిధి పోర్టల్లో కామన్ అప్లికేషన్ ఫాం ఉత్తర్వులు జారీచేసిన ఆర్థికశాఖ ఉద్యోగులు పదవీ విరమణ ప్రయోజనం పొందేందుకు దరఖాస్తులు, సంబంధిత ఫాంలలో మార్పులు చేస్తూ ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి పీయూష్కుమార్ ఉత్తర్వులు జారీచేశారు. ప్రస్తుతం పదవీ విరమణ సమయంలో మాత్రమే సర్వీస్ వివరాలు తనిఖీ చేస్తుండటం వల్ల పెన్షన్ దరఖాస్తుల ప్రాసెసింగ్లో జరుగుతున్న తీవ్ర జాప్యాన్ని నివా రించేందుకు ప్రీ రిటైర్మెంట్ సర్వీస్ వెరిఫికేషన్ చేపట్టినట్లు తెలిపారు. పదవీ విరమణ తేదీకి రెండేళ్ల ముందు సర్వీస్ వివరాల ధ్రువీకరణను తప్పనిసరి చేశారు. ఇది పదవీ విరమణ సమయంలో చివరి రెండేళ్ల సర్వీస్ వివరాల ధ్రువీ కరణను సులభతరం చేస్తుందని, ప్రక్రియ జాప్యాన్ని తొలగిస్తుందని పేర్కొ న్నారు. ఆర్థికశాఖ నిధి పోర్టల్ ద్వారా పదవీ విరమణ ప్రయోజనాలను ఆన్ లైన్లో అందించే ప్రక్రియను క్రమబద్ధీకరించడంతో పాటు డిజిటలైజ్ చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఈ పోర్టల్లోని కామన్ అప్లికేషన్ ఫాం ద్వారా దరఖాస్తుల్ని ప్రాసెస్ చేయనున్నట్లు తెలిపారు. సర్వీస్ రిజిస్టర్కి సంబంధించినవి తప్ప దేనికీ మాన్యువల్ ప్రక్రియలు, భౌతికపత్రాలు ఉండవని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. 🏹Lakshya...

📢 JNV Admission Notification: Class IX & XI (2026–27)

Attention students and parents! Applications are invited for admission to Class IX & XI in Jawahar Navodaya Vidyalayas through the Lateral Entry Selection Test. 🗓 Key Dates Last Date to Apply: 21.10.2025 Date of Selection Test: 07.02.2026 🔗 Registration Links Class IX: https://cbseitms.nic.in/2025/nvsix_9/registrationclassIX/registrationclassIX Class XI (Lateral Entry): https://cbseitms.nic.in/2025/nvsxi_11/ 👉 Kindly forward this message so that all eligible students get the opportunity to apply on time. 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

రాయలసీమ యూనివర్సిటీ, కర్నూలు 🎓 నాలుగవ కాన్వొకేషన్ నోటిఫికేషన్

📅 తేదీ: 12-11-2025 రాయలసీమ యూనివర్సిటీ, కర్నూలు లో నాలుగవ కాన్వొకేషన్ కార్యక్రమం 12 నవంబర్ 2025 న జరుగుతుంది. 🎓 అర్హులు: 2024-25 విద్యాసంవత్సరానికి చివరినాటికి డిగ్రీ సాధించిన విద్యార్థులు రెగ్యులర్ మోడ్ లో ఉంటే దరఖాస్తు చేసుకోవచ్చు. 🖥️ ఆన్‌లైన్ దరఖాస్తు తేదీలు: 👉 ప్రారంభం: 11-10-2025 👉 చివరి తేదీ: 25-10-2025 🌐 ఆన్‌లైన్ దరఖాస్తు వెబ్‌సైట్: https://od.rayalaseemauniversity.ac.in 📄 గమనిక: 2021-22 మరియు 2022-23 విద్యాసంవత్సరాలకు 04-09-2023 మరియు 16-05-2024 న జారీ చేసిన నోటిఫికేషన్లకు ఇప్పటికే దరఖాస్తు చేసిన వారు మళ్లీ దరఖాస్తు చేయనవసరం లేదు. 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

తెలుసుకుందామా రోజుకో కొత్త విషయం...

🟥తెల్ల వెంట్రుకల్ని తీసేస్తే మరింత ఎక్కువగా వస్తాయంటారు. నిజమేనా? 🟢ఈ అభిప్రాయంలో నిజం లేదనే చెప్పుకోవాలి. తెల్ల వెంట్రుకలకు, నల్ల వెంట్రుకలకు ఉన్న తేడా కేవలం వాటిలో ఉన్న మెలనిన్‌ అనే వర్ణరేణువుల శాతంలో తేడానే. తెల్ల వెంట్రుకలలో మెలనిన్‌ రేణువులు దాదాపు ఉండవనే చెప్పవచ్చు. గోధుమ రంగు వెంట్రుకల్లో ఇవి ఓ మోస్తరుగా ఉంటాయి. వెంట్రుకలు మన చర్మం కింద ఉండే రోమ కుదుళ్ల నుంచి మొలుస్తాయి. ఈ కుదుళ్లు ఉపరితల చర్మం (epidermis) కింద ఉన్న అంతశ్చర్మం (dermis)లో ఉంటాయి. అక్కడే మెలనిన్‌ రేణువులు ఉత్పత్తి అవుతూ వెంట్రుక అనే ప్రొటీన్‌ గొట్టంలో దట్టంగా పేరుకుంటూ వస్తాయి. తెల్లని వెంట్రుకలు వచ్చే కుదుళ్ల దగ్గర మెలనిన్‌ రేణువుల ఉత్పత్తి లేకపోవడం కానీ లేదా వృద్ధాప్యం వల్ల మందగించడం కానీ జరుగుతుంది. ఆ తెల్ల వెంట్రుకల్ని పదే పదే తీసేసినప్పుడు అవి మాత్రమే పెరిగేలా ఆ కుదుళ్లు ఉత్తేజం పొంది, తెల్ల వెంట్రుకల ఉత్పత్తి జోరుగా సాగవచ్చునన్నది ఓ సమాధానం. కానీ దీనికి ఉన్న సంభావ్యత తక్కువ. 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

Important Update On APDSC Selections

DSC 2025 సెలక్షన్ లిస్ట్ .. ఏ‌ క్షణమైనా విడుదలయ్యే అవకాశం. దరఖాస్తులో‌ ఏ పోస్ట్ కి మొదటి ప్రిఫరెన్స్ ఇచ్చారో ఆ పోస్ట్ మాత్రమే ఫైనల్. ఈ విషయమై అధికారులు బెట్టు సడలలేదు. SGT.. SA రెండూ రాసి.. రెండూ సెలక్ట్ అయితే మొదటి ప్రిఫరెన్స్ SGT ఇస్తే అదే ఫైనల్. SA పోస్ట్ తరువాతి రోస్టర్ వారికి కేటాయించబడుతుంది. 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

తెలుసుకుందామా రోజుకో కొత్త విషయం... పురుగులు రైల్లో ఎలా ఎగరగలవు? How insects flying in Train Bogie?

స్టేషనులో ఆగి ఉన్న రైలులో మనం కూర్చొని ఒక బంతినిపైకి విసిరితే, అది తిరిగి మన చేతిలోకే పడుతుంది. అదే వేగంగా వెళుతున్న రైలు పెట్టెలో కూర్చొని బంతిని పైకి విసిరినా అది కూడా మన చేతిలోనే పడుతుంది. బంతి పైకి వెళ్లి తిరిగి వచ్చేలోగా రైలు ముందుకు కదులుతుంది కాబట్టి అది వెనక్కి ఎందుకు పడదనే సందేహం మీకు కలగవచ్చు. దీనికి కారణం రైలు సమ వేగంతో ముందుకు వెళుతుండడమే. మనం బంతిని పైకి విసిరినపుడు మన చేతిలోంచి పైకి గాలిలోకి లేచిన బంతికి కూడా రైలు వేగమే ఉంటుంది. అంటే సమవేగంతో వెళుతున్న రైలుకు ఉండే ధర్మాలన్నీ ఆ రైలులో ఉన్న ప్రయాణికులకు, వస్తువులకు కూడా ఉంటాయన్నమాట. అదే సూత్రం రైలులో లైటు చుట్టూ తిరుగుతున్న పురుగులకు కూడా వర్తిస్తుంది. అంటే ఆ పురుగులు కూడా రైలు వేగాన్ని కలిగి ఉంటాయి. అందువల్లే పురుగులు రైలు నిలకడగా ఉన్నప్పుడు, వేగంగా ఉన్నప్పుడు ఒకే రకంగా లైటు చుట్టూ తిరుగుతుంటాయి. 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

తెలుసుకుందామా... రోజుకో కొత్త విషయం.... పునాదులతో సహా ఇళ్లు లేపి కూలిపోకుండా మరో చోట పెడుతున్నారు. ఇదెలా సాధ్యం?

💚ఎన్నో సాంకేతిక శాస్త్రాల మేళవింపునకు సంబంధించిన ఆధునిక ప్రక్రియ ఇది. ప్రతి ఇంటికి భూమిలో కొంత లోతు వరకు పునాదులు ఉంటాయి. ఆ పునాదిపైనే భవనం స్థిరంగా ఉండగలదు. సాధారణంగా కాంక్రీటు స్తంభాలు, కాంక్రీటువాసాలు, పునాది వాసాలతో నిర్మించబడ్డ దృఢమైన పంజరజాలయే భవనానికి స్థిరత్వాన్ని ఇస్తుంది. భవనంలో మిగిలిన భాగాలన్నీ కేవలం హంగులే. మన ఇంట్లో ఒక బల్ల ఉందనుకుందాం. అది సాధారణంగా నాలుగు కాళ్ల మీద ఉంటుంది. దాన్ని ఒక గది నుంచి మరో గదికి తీసుకెళ్లాలంటే రెండు పద్ధతులున్నాయి. ఒకరో ఇద్దరో కలిసి దాన్ని లాగడమో లేదా తోయడమే ఒక పద్ధతి. ఈ పద్ధతిలో బల్లమీద బలాలు సమంగా పనిచేయవు. రెండు కాళ్ల మీద పనిచేసే బలం ఓవిధంగా ఉండగా మిగిలిన రెండు కాళ్ల మీద బలం మరోలా ఉంటుంది. కానీ అదే బల్లను అటు ఇటు సమంగా ఎత్తిపట్టుకొని పక్క గదిలో పెట్టడం రెండో పద్ధతి. ఇక్కడ అన్ని ప్రాంతాల్లో బల్ల మీద ఒకే విధమైన బల ప్రయోగం ఉంటుంది. మొదటి పద్ధతిలో వ్యత్యాస బలాలుండటం వల్ల బల్లలోని సంధి ప్రాంతాలు వీగిపోయే ప్రమాదముంది. రెండో పద్ధతిలో అటువంటి ప్రమాదం లేదు. ఇదే విధంగా పెద్ద పెద్ద క్రేనుల సాయంతో భూమిలో భవనపు పునాదులున్న కుదుళ్ల వరకు అతి జాగ్రత్తగా, బ్...

త్వరలోనే మరో భారీ నోటిఫికేషన్...

1) కష్టాలను అధిగమించి  బాగా చదివి DSC పరీక్ష రాసినప్పటికి కొన్ని కారణాల వల్ల మార్కులు తక్కువగా వచ్చాయి అని బాధ పడకండి. KVS+NVS లో 16000+ టీచర్ ఉద్యోగాల భర్తీ త్వరలోనే జరగనుంది. 2) మీరు DSC కొరకు చదివిన సిలబస్ దాదాపుగా 85% వరకు సమానంగా ఉంటుంది. మిగతా కొంత బాగాన్ని కూడ సులబంగానే నేర్చుకోవచ్చు. మరికొన్ని రోజుల్లోనే ctet నోటిఫికేషన్ రానుంది, ఆవెంటనే central DSC ని నిర్వహించే అవకాశం అధికంగా ఉంది. ఈ ప్రక్రియ మొత్తం 6 నుండి 8 నెలల లోగా పుర్తి కావచ్చు. 3) ఆంద్రప్రదేశ్ లో కూడ కనీసం మరో 2 DSC లు నిర్వహించే అవకాశం. ఉంది. రిటైర్మెంట్లు అయ్యే ఉపాధ్యాయులు అధికంగా ఉన్నారు కాబట్టి post లు కూడ అధికంగానే ఉంటాయి. 4. మీరు నేర్చుకున్న subject ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది, కాబట్టి నిరాశ, నిస్పృహలకు లోను కాకుండ నమ్మకంతో మీ ప్రిపరేషన్ ను బలంగా కొనసాగించండి. వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుదాం...... " కష్టేఫలి"✊🏻.. 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺