Skip to main content

రిటైర్మెంట్కు రెండేళ్ల ముందే సర్వీస్ ధ్రువీకరణ*


నిధి పోర్టల్లో కామన్ అప్లికేషన్ ఫాం

ఉత్తర్వులు జారీచేసిన ఆర్థికశాఖ

ఉద్యోగులు పదవీ విరమణ ప్రయోజనం పొందేందుకు దరఖాస్తులు, సంబంధిత ఫాంలలో మార్పులు చేస్తూ ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి పీయూష్కుమార్ ఉత్తర్వులు జారీచేశారు. ప్రస్తుతం పదవీ విరమణ సమయంలో మాత్రమే సర్వీస్ వివరాలు తనిఖీ చేస్తుండటం వల్ల పెన్షన్ దరఖాస్తుల ప్రాసెసింగ్లో జరుగుతున్న తీవ్ర జాప్యాన్ని నివా రించేందుకు ప్రీ రిటైర్మెంట్ సర్వీస్ వెరిఫికేషన్ చేపట్టినట్లు తెలిపారు. పదవీ విరమణ తేదీకి రెండేళ్ల ముందు సర్వీస్ వివరాల ధ్రువీకరణను తప్పనిసరి చేశారు. ఇది పదవీ విరమణ సమయంలో చివరి రెండేళ్ల సర్వీస్ వివరాల ధ్రువీ కరణను సులభతరం చేస్తుందని, ప్రక్రియ జాప్యాన్ని తొలగిస్తుందని పేర్కొ న్నారు. ఆర్థికశాఖ నిధి పోర్టల్ ద్వారా పదవీ విరమణ ప్రయోజనాలను ఆన్ లైన్లో అందించే ప్రక్రియను క్రమబద్ధీకరించడంతో పాటు డిజిటలైజ్ చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఈ పోర్టల్లోని కామన్ అప్లికేషన్ ఫాం ద్వారా దరఖాస్తుల్ని ప్రాసెస్ చేయనున్నట్లు తెలిపారు. సర్వీస్ రిజిస్టర్కి సంబంధించినవి తప్ప దేనికీ మాన్యువల్ ప్రక్రియలు, భౌతికపత్రాలు ఉండవని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

Comments

Popular posts

IIIT అప్లై చేసిన మీ 10th మార్క్స్ పెరిగితే ఏమి చేయాలి

ప్రధానోపాధ్యాయులకు/ప్రధానాచార్యులకు తెలియజేయునది. 10వ తరగతి పాసైన కొంతమంది విద్యార్థులకు IIIT అప్లై చేయడం జరిగింది. అప్లై చేసిన తర్వాత కొంతమంది విద్యార్థులకు రి వెరిఫికేషన్ మరియు రికౌంటింగ్ అప్లై చేసిన తర్వాత వారి మార్కులు మారి పెరగడం జరిగింది Already అప్లై చేసిన విద్యార్థులకు మరలా తిరిగి అప్లై చేసే అవకాశం లేదు కావున అట్లాంటి విద్యార్థుల కోసం కన్వీనర్ IIIT వారికి అడ్రస్ చేస్తూ గతంలో అప్లై చేసిన అప్లికేషన్ నంబర్తో ఒక రిక్వెస్ట్ లెటర్ ను రాస్తూ మార్కులు పెరిగిన తర్వాత కొత్తగా వచ్చిన మార్కులు మెమోని ఈ రిక్వెస్ట్ లెటర్ తో పాటు అటాచ్ చేసి ఈ క్రింది తెలిపిన రెండు Mail id లకు Convener Admissions RGUKT-AP •   convener.admissions@rgukt.in Assistant Registrar, Academics - RGUKT Nuzvid •   ar.academics@rguktn.ac.in  మెయిల్ చేసినట్లయితే పెరిగిన మార్కులను పరిగణలోకి తీసుకొని IIIT అవకాశం వచ్చే విధంగా కన్వీనర్ గారు చర్యలు తీసుకుంటారు. కావున ఈ విషయాన్ని ప్రధానోపాధ్యాయ/ప్రధానాచార్య మిత్రులు గమనించవలసిందిగా కోరుతున్నాం. IIIT అప్లై చేసిన మీ 10th మార్క్స్ రీవెరిఫికేషన్/రీకౌంటింగ్ లో పెరిగితే...

నేటి ప్రధాన వార్తా పత్రికలు

🗞️ఈనాడు ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.eenadu.net 📰ఆంధ్రజ్యోతి ➪ 🅐🅟 & 🅣🅢 http://mpaper.andhrajyothy.com/ 🗞️సాక్షి ➪ 🅐🅟 & 🅣🅢 http://epaper.sakshi.com/ 📰ఆంధ్రప్రభ ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.prabhanews.com/ 🗞️V6 వెలుగు➪ 🅣🅢 https://epaper.v6velugu.com 📰నవ తెలంగాణ ➪ 🅣🅢 http://epaper.navatelangana.com/ 🗞️నమస్తే తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.ntnews.com 📰మన తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.manatelangana.news 🧾English Newspapers🗞️        ☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟ 👉🏻The Hindu📰 https://epaper.thehindu.com/Home/Index 👉🏻Deccan Chronicle📰 http://epaper.deccanchronicle.com/states.aspx 👉🏻Indian Express📰 https://epaper.newindianexpress.com/t/3464 👉🏻The Hans India📰 https://epaper.thehansindia.com/           🏹లక్ష్య🇮🇳స్వచ్చంద📚సేవా🩺సంస్థ

తెలుసుకుందామా రోజుకో కొత్త విషయం...

🟥తెల్ల వెంట్రుకల్ని తీసేస్తే మరింత ఎక్కువగా వస్తాయంటారు. నిజమేనా? 🟢ఈ అభిప్రాయంలో నిజం లేదనే చెప్పుకోవాలి. తెల్ల వెంట్రుకలకు, నల్ల వెంట్రుకలకు ఉన్న తేడా కేవలం వాటిలో ఉన్న మెలనిన్‌ అనే వర్ణరేణువుల శాతంలో తేడానే. తెల్ల వెంట్రుకలలో మెలనిన్‌ రేణువులు దాదాపు ఉండవనే చెప్పవచ్చు. గోధుమ రంగు వెంట్రుకల్లో ఇవి ఓ మోస్తరుగా ఉంటాయి. వెంట్రుకలు మన చర్మం కింద ఉండే రోమ కుదుళ్ల నుంచి మొలుస్తాయి. ఈ కుదుళ్లు ఉపరితల చర్మం (epidermis) కింద ఉన్న అంతశ్చర్మం (dermis)లో ఉంటాయి. అక్కడే మెలనిన్‌ రేణువులు ఉత్పత్తి అవుతూ వెంట్రుక అనే ప్రొటీన్‌ గొట్టంలో దట్టంగా పేరుకుంటూ వస్తాయి. తెల్లని వెంట్రుకలు వచ్చే కుదుళ్ల దగ్గర మెలనిన్‌ రేణువుల ఉత్పత్తి లేకపోవడం కానీ లేదా వృద్ధాప్యం వల్ల మందగించడం కానీ జరుగుతుంది. ఆ తెల్ల వెంట్రుకల్ని పదే పదే తీసేసినప్పుడు అవి మాత్రమే పెరిగేలా ఆ కుదుళ్లు ఉత్తేజం పొంది, తెల్ల వెంట్రుకల ఉత్పత్తి జోరుగా సాగవచ్చునన్నది ఓ సమాధానం. కానీ దీనికి ఉన్న సంభావ్యత తక్కువ. 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺