Skip to main content

Posts

Showing posts with the label students

కరెంట్ అఫైర్స్ (సెప్టెంబర్ 4, 2025)

👉జాతీయ వన్యప్రాణుల దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు? — సెప్టెంబర్ 4 👉భారతదేశం ఏ దేశ విద్యార్థుల కోసం ఇ-స్కాలర్‌షిప్ పథకాన్ని ప్రకటించింది? — ఆఫ్ఘనిస్తాన్ 👉ఫుజైరా గ్లోబల్ సూపర్ స్టార్స్ 2025 విజేత ఎవరు? — ప్రణవ్ వెంకటేష్ 👉2026 ఆర్థిక సంవత్సరానికి భారతదేశ GDP వృద్ధి రేటు యొక్క కొత్త అంచనా ఎంత? — 6.7% 👉భారత ప్రభుత్వ విద్యా మంత్రిత్వ శాఖ ద్వారా ఎంత మంది ఉపాధ్యాయులకు జాతీయ ఉపాధ్యాయ అవార్డు 2025 లభించింది? — 45 ఉపాధ్యాయులు 👉'సెమికాన్ ఇండియా- 2025' ఎక్కడ నిర్వహించబడుతుంది? — యశోభూమి, న్యూఢిల్లీ 👉ఐసిసి మహిళల ప్రపంచ కప్ 2025 విజేతకు ఎంత ప్రైజ్ మనీ లభిస్తుంది? — 4.48 మిలియన్ USD 👉బెంగళూరులోని రామన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (RRI) విశ్వంలోని ఏ కాలపు రహస్యాలను ఛేదించడానికి ప్రయత్నిస్తోంది? — కాస్మిక్ డాన్ 👉'బీహార్ స్టేట్ లైవ్లీహుడ్ ఫండ్ క్రెడిట్ కోఆపరేటివ్ ఫెడరేషన్ లిమిటెడ్' ను ఎవరు ప్రారంభించారు? — నరేంద్ర మోడీ 👉దీపక్ మిట్టల్‌ను ఏ దేశానికి భారత రాయబారిగా విదేశాంగ మంత్రిత్వ శాఖ నియమించింది? — UAE (యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్) 👉మైత్రి-XIV సంయుక్త సైనిక విన్యాసాలు భారతదేశం మరియు ఏ...

తెలుసుకుందామా రోజుకో కొత్త విషయం... “భూమి మీద సరిగ్గా పనిచేసే గడియారం, వేరే గ్రహం మీద కూడా అదే విధంగా పనిచేస్తుందా?”

వివరణ: సాధారణంగా మనం గడియారం ఎక్కడ పెట్టినా అది ఒకేలా టిక్ టిక్ చేస్తుందని అనుకుంటాం. కానీ భౌతిక శాస్త్రం చెబుతున్న సత్యం వేరే! ఐన్‌స్టీన్ చెప్పిన సాపేక్షతా సిద్ధాంతం ప్రకారం, సమయం అనేది గురుత్వాకర్షణ మరియు వేగం మీద ఆధారపడి మారుతుంది. ఒక గ్రహానికి గురుత్వాకర్షణ ఎక్కువగా ఉంటే, అక్కడ గడియారం నెమ్మదిగా నడుస్తుంది. తక్కువ గురుత్వం ఉన్న గ్రహంలో అది వేగంగా నడుస్తుంది. కాంతి వేగానికి దగ్గరగా కదిలే వస్తువుల్లో సమయం మరీ ఎక్కువగా నెమ్మదిస్తుంది. ఉదాహరణకు – భూమి మీద ఒక గడియారం ఒక గంట చూపుతుంటే, అదే గడియారం బలమైన గురుత్వం ఉన్న జూపిటర్ దగ్గర ఉంటే కొద్దిగా వెనకబడుతుంది. చంద్రునిపై అయితే భూమికంటే వేగంగా నడుస్తుంది. 👉 అంటే సమయం అనేది ఒకేలా ఉండే గడియారం టిక్ టిక్ కాదు; ప్రపంచంలో మీరు ఎక్కడ ఉన్నారో, ఎంత వేగంగా కదులుతున్నారో, ఎంత బలమైన గురుత్వం ఉందో అనుసరించి మారిపోతుంది. 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

తెలుసుకుందామా రోజుకో కొత్త విషయం... పురుగులు రైల్లో ఎలా ఎగరగలవు? How insects flying in Train Bogie?

స్టేషనులో ఆగి ఉన్న రైలులో మనం కూర్చొని ఒక బంతినిపైకి విసిరితే, అది తిరిగి మన చేతిలోకే పడుతుంది. అదే వేగంగా వెళుతున్న రైలు పెట్టెలో కూర్చొని బంతిని పైకి విసిరినా అది కూడా మన చేతిలోనే పడుతుంది. బంతి పైకి వెళ్లి తిరిగి వచ్చేలోగా రైలు ముందుకు కదులుతుంది కాబట్టి అది వెనక్కి ఎందుకు పడదనే సందేహం మీకు కలగవచ్చు. దీనికి కారణం రైలు సమ వేగంతో ముందుకు వెళుతుండడమే. మనం బంతిని పైకి విసిరినపుడు మన చేతిలోంచి పైకి గాలిలోకి లేచిన బంతికి కూడా రైలు వేగమే ఉంటుంది. అంటే సమవేగంతో వెళుతున్న రైలుకు ఉండే ధర్మాలన్నీ ఆ రైలులో ఉన్న ప్రయాణికులకు, వస్తువులకు కూడా ఉంటాయన్నమాట. అదే సూత్రం రైలులో లైటు చుట్టూ తిరుగుతున్న పురుగులకు కూడా వర్తిస్తుంది. అంటే ఆ పురుగులు కూడా రైలు వేగాన్ని కలిగి ఉంటాయి. అందువల్లే పురుగులు రైలు నిలకడగా ఉన్నప్పుడు, వేగంగా ఉన్నప్పుడు ఒకే రకంగా లైటు చుట్టూ తిరుగుతుంటాయి. 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

వివిధ న్యూస్ పేపర్స్ లలో వచ్చిన ఉద్యోగ మరియి విద్యా సంబంధిత విషయాలు మీకోసం...

🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

డిగ్రీ, డిప్లొమా, బీటెక్, ఐటిఐ మరియు ఇతర కోర్సులలో వాళ్ళకి ఫీజు రీయింబర్స్మెంట్ అప్లై చేసిన తర్వాత చేయవలసినది...

డిగ్రీ, డిప్లొమా, బీటెక్, ఐటిఐ మరియు ఇతర కోర్సులలో 2వ, 3వ, 4వ సంవత్సరం చదువుతున్న విద్యార్థులు కాలేజీలో  ఫీజు రీయింబర్స్‌మెంట్‌కి అప్లై చేసిన తరువాత* తప్పనిసరిగా గ్రామ/వార్డు సచివాలయంలో 5-స్టెప్ వెరిఫికేషన్  చేయించుకోవాలి.   ⚠️ వెరిఫికేషన్ పూర్తి చేసిన విద్యార్థులకు మాత్రమే  ఫీజు రీయింబర్స్‌మెంట్ జమ అవుతుంది. 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

తెలుసుకుందామా... రోజుకో కొత్త విషయం.... పునాదులతో సహా ఇళ్లు లేపి కూలిపోకుండా మరో చోట పెడుతున్నారు. ఇదెలా సాధ్యం?

💚ఎన్నో సాంకేతిక శాస్త్రాల మేళవింపునకు సంబంధించిన ఆధునిక ప్రక్రియ ఇది. ప్రతి ఇంటికి భూమిలో కొంత లోతు వరకు పునాదులు ఉంటాయి. ఆ పునాదిపైనే భవనం స్థిరంగా ఉండగలదు. సాధారణంగా కాంక్రీటు స్తంభాలు, కాంక్రీటువాసాలు, పునాది వాసాలతో నిర్మించబడ్డ దృఢమైన పంజరజాలయే భవనానికి స్థిరత్వాన్ని ఇస్తుంది. భవనంలో మిగిలిన భాగాలన్నీ కేవలం హంగులే. మన ఇంట్లో ఒక బల్ల ఉందనుకుందాం. అది సాధారణంగా నాలుగు కాళ్ల మీద ఉంటుంది. దాన్ని ఒక గది నుంచి మరో గదికి తీసుకెళ్లాలంటే రెండు పద్ధతులున్నాయి. ఒకరో ఇద్దరో కలిసి దాన్ని లాగడమో లేదా తోయడమే ఒక పద్ధతి. ఈ పద్ధతిలో బల్లమీద బలాలు సమంగా పనిచేయవు. రెండు కాళ్ల మీద పనిచేసే బలం ఓవిధంగా ఉండగా మిగిలిన రెండు కాళ్ల మీద బలం మరోలా ఉంటుంది. కానీ అదే బల్లను అటు ఇటు సమంగా ఎత్తిపట్టుకొని పక్క గదిలో పెట్టడం రెండో పద్ధతి. ఇక్కడ అన్ని ప్రాంతాల్లో బల్ల మీద ఒకే విధమైన బల ప్రయోగం ఉంటుంది. మొదటి పద్ధతిలో వ్యత్యాస బలాలుండటం వల్ల బల్లలోని సంధి ప్రాంతాలు వీగిపోయే ప్రమాదముంది. రెండో పద్ధతిలో అటువంటి ప్రమాదం లేదు. ఇదే విధంగా పెద్ద పెద్ద క్రేనుల సాయంతో భూమిలో భవనపు పునాదులున్న కుదుళ్ల వరకు అతి జాగ్రత్తగా, బ్...

Latest job notifications in various paper cuttings for you

🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

Latest Government and private job notifications...

🏹 Lakshya🇮🇳Charitable📚Society 🩺