బ్యాంకింగ్ రంగంలో కెరీర్ ప్రారంభించాలని భావిస్తున్న డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులకు సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభవార్త అందించింది. దేశవ్యాప్తంగా వివిధ శాఖల్లో అప్రెంటిస్ (Apprentice) పోస్టుల భర్తీ కోసం భారీ స్థాయిలో నియామక ప్రక్రియను చేపట్టింది. ఈ నియామక ప్రక్రియ ద్వారా మొత్తం 4500 అప్రెంటిస్ ఖాళీలను భర్తీ చేయనున్నారు. బ్యాంకింగ్ రంగంలో అనుభవాన్ని పొందడంతో పాటు భవిష్యత్తులో జరిగే బ్యాంకు ఉద్యోగ నియామకాలకు ఉపయోగపడే ప్రాక్టికల్ నాలెడ్జ్‌ను అభ్యర్థులు పొందే అవకాశం ఉంటుంది. అర్హత కలిగిన అభ్యర్థులు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం లేదా విద్యాసంస్థ నుండి ఏదైనా విభాగంలో డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. ఎంపికైన అభ్యర్థులకు శిక్షణ కాలంలో నెలవారీ స్టైపెండ్ అందించబడుతుంది. ప్రాంతాన్ని బట్టి గరిష్టంగా నెలకు రూ.15,000 వరకు స్టైపెండ్ పొందే అవకాశం ఉంది. దరఖాస్తు ప్రక్రియ పూర్తిగా ఆన్‌లైన్‌లో నిర్వహించబడుతుంది. ఆసక్తి మరియు అర్హత కలిగిన అభ్యర్థులు అధికారిక నోటిఫికేషన్‌ను పరిశీలించి నిర్ణీత గడువులోగా దరఖాస్తు చేసుకోవాలి. ముఖ్య వివరాలు సంస్థ: Central Bank of India పోస్టు పేరు: Apprentice మొత్తం ఖాళీలు: 4500 ...
కష్టే ఫలి అన్న విషయం గుర్తుంచుకోండి చాలు.. మా యొక్క సర్వీస్ బాగుంటేనే ఇంకొకరికి చెప్పండి... ఆసరా లేదని అక్షరం... డబ్బు లేదని ఊపిరి... ఆగకూడదు అన్న ఒక బృహత్తర ఆలోచనతో లక్ష్య చారిటబుల్ సొసైటీ అనే సంస్థని ఏర్పరిచి అవసరం ఉన్న చోట సభ్యుల సహాయ సహకారాలతో సేవా కార్యక్రమాలు చేస్తున్నాము...