Skip to main content

Posts

Showing posts with the label facts

తెలుసుకుందామా రోజుకో కొత్త విషయం... పురుగులు రైల్లో ఎలా ఎగరగలవు? How insects flying in Train Bogie?

స్టేషనులో ఆగి ఉన్న రైలులో మనం కూర్చొని ఒక బంతినిపైకి విసిరితే, అది తిరిగి మన చేతిలోకే పడుతుంది. అదే వేగంగా వెళుతున్న రైలు పెట్టెలో కూర్చొని బంతిని పైకి విసిరినా అది కూడా మన చేతిలోనే పడుతుంది. బంతి పైకి వెళ్లి తిరిగి వచ్చేలోగా రైలు ముందుకు కదులుతుంది కాబట్టి అది వెనక్కి ఎందుకు పడదనే సందేహం మీకు కలగవచ్చు. దీనికి కారణం రైలు సమ వేగంతో ముందుకు వెళుతుండడమే. మనం బంతిని పైకి విసిరినపుడు మన చేతిలోంచి పైకి గాలిలోకి లేచిన బంతికి కూడా రైలు వేగమే ఉంటుంది. అంటే సమవేగంతో వెళుతున్న రైలుకు ఉండే ధర్మాలన్నీ ఆ రైలులో ఉన్న ప్రయాణికులకు, వస్తువులకు కూడా ఉంటాయన్నమాట. అదే సూత్రం రైలులో లైటు చుట్టూ తిరుగుతున్న పురుగులకు కూడా వర్తిస్తుంది. అంటే ఆ పురుగులు కూడా రైలు వేగాన్ని కలిగి ఉంటాయి. అందువల్లే పురుగులు రైలు నిలకడగా ఉన్నప్పుడు, వేగంగా ఉన్నప్పుడు ఒకే రకంగా లైటు చుట్టూ తిరుగుతుంటాయి. 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

తెలుసుకుందామా... రోజుకో కొత్త విషయం.... పునాదులతో సహా ఇళ్లు లేపి కూలిపోకుండా మరో చోట పెడుతున్నారు. ఇదెలా సాధ్యం?

💚ఎన్నో సాంకేతిక శాస్త్రాల మేళవింపునకు సంబంధించిన ఆధునిక ప్రక్రియ ఇది. ప్రతి ఇంటికి భూమిలో కొంత లోతు వరకు పునాదులు ఉంటాయి. ఆ పునాదిపైనే భవనం స్థిరంగా ఉండగలదు. సాధారణంగా కాంక్రీటు స్తంభాలు, కాంక్రీటువాసాలు, పునాది వాసాలతో నిర్మించబడ్డ దృఢమైన పంజరజాలయే భవనానికి స్థిరత్వాన్ని ఇస్తుంది. భవనంలో మిగిలిన భాగాలన్నీ కేవలం హంగులే. మన ఇంట్లో ఒక బల్ల ఉందనుకుందాం. అది సాధారణంగా నాలుగు కాళ్ల మీద ఉంటుంది. దాన్ని ఒక గది నుంచి మరో గదికి తీసుకెళ్లాలంటే రెండు పద్ధతులున్నాయి. ఒకరో ఇద్దరో కలిసి దాన్ని లాగడమో లేదా తోయడమే ఒక పద్ధతి. ఈ పద్ధతిలో బల్లమీద బలాలు సమంగా పనిచేయవు. రెండు కాళ్ల మీద పనిచేసే బలం ఓవిధంగా ఉండగా మిగిలిన రెండు కాళ్ల మీద బలం మరోలా ఉంటుంది. కానీ అదే బల్లను అటు ఇటు సమంగా ఎత్తిపట్టుకొని పక్క గదిలో పెట్టడం రెండో పద్ధతి. ఇక్కడ అన్ని ప్రాంతాల్లో బల్ల మీద ఒకే విధమైన బల ప్రయోగం ఉంటుంది. మొదటి పద్ధతిలో వ్యత్యాస బలాలుండటం వల్ల బల్లలోని సంధి ప్రాంతాలు వీగిపోయే ప్రమాదముంది. రెండో పద్ధతిలో అటువంటి ప్రమాదం లేదు. ఇదే విధంగా పెద్ద పెద్ద క్రేనుల సాయంతో భూమిలో భవనపు పునాదులున్న కుదుళ్ల వరకు అతి జాగ్రత్తగా, బ్...