Skip to main content

Posts

Showing posts with the label Today health tip

చరిత్రలో ఈ రోజు జూన్ -18 (Telugu / English

🔎సంఘటనలు🔍 🌸618: లీ యువాన్ (566 నుంచి 25 జూన్ 635 వరకు) టాంగ్వంశం చైనాను 300 సంవత్సరాలు పాలించటానికి పునాది వేశాడు. ఇతడే ఈ వంశంలో (ఎంపరర్ గవోజు ఆఫ్ టాంగ్ 618 నుంచి 626 వరకు) మొదటి ఛక్రవర్తి . 🌸1815: వాటర్లూ యుద్ధం : నెపోలియన్ బోనపార్టె బెల్జియంలోని వాటర్లూలో చేసిన ఆఖరి యుద్ధంలో ఓడిపోయాడు. ఈ యుద్దాన్ని సెవెన్త్ కోలిషన్ యుద్దం గా, వాటర్లూ యుద్ధంగాపిలుస్తారు). 🌸1858: ఛార్లెస్ డార్విన్ను జీవపరిణామం సిద్దాంతాన్ని ప్రచురించటానికి ప్రేరేపించిన వ్రాతప్రతిని (జీవపరిణామం విషయం మీద), తన సహచరుడైన ఆల్ ఫ్రెడ్ రస్సెల్ వాల్లేస్నుంచి అందుకున్నాడు. 🌸1953: ఈజిప్టు రాచరికాన్ని రద్దుచేసింది. 🌸1908: ఫిలిప్పీన్స్ దేశపు యూనివర్సిటీ అయిన యూనివర్సిటీ ఆఫ్ ఫిలిప్పీన్స్ని స్థాపించారు. 🌸1923: మిచిగాన్ లోని కలమజూలో ఉన్న 'చెకర్ మోటార్స్ కార్పొరేషన్' తయారు చేసిన చెకర్ టాక్సీ లను మొట్ట మొదటి సారిగా, ప్రజల కోసం, రోడ్ల మీద నడపటం మొదలు పెట్టాఅరు. 🌸1940: రెండవ ప్రపంచ యుద్దం: నాజీ జర్మనీకి...

🚨 ట్రామా కేర్ ప్రతి పౌరుడి హక్కే – సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు

దేశంలో రోడ్డు ప్రమాదాలు, అత్యవసర వైద్య పరిస్థితులు పెరుగుతున్న నేపథ్యంలో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రమాద సమయంలో బాధితులకు వెంటనే చికిత్స అందించడం ప్రతి పౌరుడి ప్రాథమిక హక్కు అని స్పష్టం చేస్తూ కేంద్రం, రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలకు పలు మార్గదర్శకాలు జారీ చేసింది. ⚖️ ‘ ట్రామా కేర్’పై సుప్రీంకోర్టు స్పష్టమైన సందేశం ప్రమాదం జరిగిన తర్వాత తొలి కొన్ని నిమిషాలు అత్యంత కీలకమని వైద్య నిపుణులు చెబుతున్న నేపథ్యంలో, అత్యవసర వైద్య సేవలు మరింత వేగంగా అందేలా చర్యలు తీసుకోవాలని ధర్మాసనం ఆదేశించింది. “సమయానికి చికిత్స అందితే ఎన్నో ప్రాణాలు కాపాడవచ్చు” అని కోర్టు అభిప్రాయపడింది. 📞 మూడు నెలల్లో 112 ఎమర్జెన్సీ స్పందన వ్యవస్థ దేశవ్యాప్తంగా అత్యవసర పరిస్థితుల్లో ప్రజలకు తక్షణ సహాయం అందించేందుకు ‘112’ హెల్ప్‌లైన్ వ్యవస్థను సమర్థవంతంగా అమలు చేయాలని సుప్రీంకోర్టు కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించింది. అవసరమైన మౌలిక వసతులు, స్పందనా బృందాలు, ట్రామా కేర్ నెట్‌వర్క్‌ను బలోపేతం చేయాలని పేర్కొంది. 🏥 ఆస్పత్రుల బాధ్యతపై స్పష్టత ప్రమాద బాధితులను చికిత్సకు తీసుకొచ్చిన వారిని ఆస్పత్రులు త...

8 అంకె ఆకారంలో వాకింగ్

అష్టాకార పథం అని ఆయుర్వేదంలో అంటారు.... ఆయుర్వేదం నుండి అష్టాకార పథం 8 అంకె నడక వచ్చింది. మనం వాకింగ్ చేయడంలో ఎనిమిది అంకె " 8 " ఆకారంలో వేసుకున్న ట్రాక్ పై నడవమంటారు దీని వలన మనకు జరిగే ఉపయోగం ఏమిటి ? దీనికి ఎంత స్థలం కావాలి ?  "8" ఆకారంలో వాకింగ్ చేయడం (అష్టాకార పథం) ఒక ప్రత్యేకమైన మరియు ప్రభావవంతమైన వ్యాయామ పద్ధతి. వాకింగ్ అంటే అలా ఒకదారి పొడవునా నడుస్తూ వెళ్తాం. కానీ 8 ఆకారంలో నడవటం వల్ల అనేక లాభాలున్నాయి. 8 అనే అంకెను అడ్డుగా చూస్తే ఇన్ఫినిటీ గుర్తులాగా ఉంటుంది. ∞ అందుకే దీన్ని *ఇన్ఫినిటీ వాక్* అనికూడా అంటారు.  దీనివల్ల కలిగే లాభాలు కూడా అనంతమే మరి. మీరు నడుస్తున్నప్పుడు ఒక ఊహాజనిత 8 ఆకారాన్ని సృష్టించుకోవాలి.  భూమి మీద అడ్డంగా ఒక ఎనిమిది ఆకారం గీసి ఉన్నట్లు అనుకోవాలి.  ఎనిమిది రాస్తున్నప్పుడు మీ చేతి వేళ్ళు ఎలా కదులుతుందో అదే విధంగా మలుపులు తీసుకుంటూ, సున్నాలు పూర్తిచేస్తూ మీరు అడుగులు వేయాలి.  దాని వెంబడే నడుస్తూ ఉండాలి.  మెళ్లిగా , వేగం పెంచుతూ 8 ఆకారంలో నడవాలి.  అలా నడుస్తూ ఉండాలి. అంతే.! " 8 " ఆకారంలో వాకింగ్ చేయడం వలన ఉపయోగాలు (లాభాలు): 1. స...

నేటి ఆరోగ్యం... థైరాయిడ్ & హైపోథైరాయిడ్ మధ్య తేడా

థైరాయిడ్ మన మెడలో ఉన్న చిన్న గ్రంధి. ఇది శరీరంలో మెటబాలిజం, బరువు, శక్తి, హృదయ స్పందనలు, శరీర ఉష్ణోగ్రత మొదలైన వాటిని నియంత్రించే థైరాక్సిన్ (T4), ట్రైఐయోడోథైరోనిన్ (T3) అనే హార్మోన్లను విడుదల చేస్తుంది. అంటే థైరాయిడ్ అనేది గ్రంధి పేరు. హైపోథైరాయిడ్ థైరాయిడ్ గ్రంధి సరిగా పని చేయకపోతే హార్మోన్లు తక్కువగా ఉత్పత్తి అవ్వడం. దీనిని Hypothyroidism అంటారు. ఇది ఒక వ్యాధి స్థితి. 👉 కాబట్టి థైరాయిడ్ = గ్రంధి, హైపోథైరాయిడ్ = వ్యాధి అని గుర్తుంచుకోవాలి. 🩺 హైపోథైరాయిడ్ లక్షణాలు అలసట, బలహీనత బరువు పెరగడం మలబద్ధకం చల్లదనం ఎక్కువగా అనిపించడం జుట్టు రాలడం, చర్మం పొడిగా మారడం మానసికంగా డిప్రెషన్, దృష్టి కేంద్రీకరించలేకపోవడం. 🌿 *ఆయుర్వేద ఫార్మసీలో దొరికే మందులు 1. Kanchanar Guggulu – థైరాయిడ్ గడ్డలు, హార్మోన్ అసమతుల్యతకు. 2. Ashwagandha Churna / Tablets  – గ్రంధి పనితీరును సమతుల్యం చేస్తుంది. 3. Punarnava Mandur – వాపులు, మెటబాలిజం సమస్యలకు. 4. Trikatu Churna (మిరియాలు, శొంఠి, పిప్పలి) – జీర్ణక్రియ, థైరాయిడ్ హార్మోన్ యాక్టివిటీ పెంచుతుంది. 5. Varunadi Kashayam – గ్రంధుల వాపు, మలబద్ధకం, మెటబాలిజం స...