Skip to main content

ఆగస్టు 19 చరిత్రలో..... ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవం

ఒక చిత్రం అనేక విషయాలను తెలుపుతుంది. , ఇది అనేక భావోద్వేగాలు, భావనలను కలిగిస్తుంది. , దీనిది విశ్వభాష. , మనసుకు ఆహ్లాదాన్ని కలిగించే ప్రతి దృశ్యాన్ని ఫొటో రూపంలో బంధించి.. , విలువైన జ్ఞాపకంగా మనతో ఉంచుకోవచ్చు. , వీటిని చూసినప్పుడల్లా పాత గుర్తులను నెమరువేసుకునే అవకాశం ఉంటుంది. , మనకు కావాల్సిన వ్యక్తులు, ప్రకృతి అందాలు, పక్షులు - జంతువులు, కాలానికి అనుగుణంగా వచ్చే మార్పులు ఇలా ప్రతిదీ మనం చిత్తరువుగా భద్రపరచుకోవచ్చు. , ప్రస్తుత డిజిటల్‌ యుగంలో స్మార్ట్‌ఫోన్ల వాడకం పెరిగాక ప్రతి సందర్భాన్ని తీపి గుర్తుగా మలుచుకునేందుకు ఫొటోలను తీసుకుంటున్నారు. , చారిత్రక సంఘటనలకు దృశ్య రూపం కల్పించి, వాటిని భవిష్యత్తు తరాలకు అందించడంలో ‘ఫొటోగ్రఫీ’ ముఖ్యపాత్ర పోషిస్తోంది. , మానవ జీవనంలో ఫొటోగ్రఫీ ప్రాముఖ్యాన్ని తెలియజేసే ఉద్దేశంతో ఏటా ఆగస్టు 19న ‘ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవం’గా (World Photography Day) నిర్వహిస్తారు. , దీన్నే ‘వరల్డ్‌ ఫొటో డే’గా పిలుస్తారు. , ఈ కళారూపాలకు కారణమైన ఫొటోగ్రాఫర్లను గౌరవించుకోవడంతోపాటు సమాజంలో దీన్ని ఒక కళగా వ్యాప్తి చేయడం ఈ రోజు ముఖ్య ఉద్దేశం.

ఒకప్పుడు కాలక్షేపానికి ఫొటోలు తీసేవారు. , సాంకేతికత అభివృద్ధి చెందడంతో కాలక్రమేణా ఫొటోగ్రఫీ ఎంతగానో మెరుగుపడింది. , ప్రస్తుతం దీన్ని ఒక కెరీర్‌గా ఎంచుకునే స్థాయికి ఎదిగింది. , మన దేశంలోని కొన్ని ఇన్‌స్టిట్యూట్స్‌ ఫొటోగ్రఫీలో డిప్లొమా, యూజీ, పీజీ లెవల్లో కోర్సులు అందిస్తున్నాయి. , ఉద్యోగం లేదా ఫ్రీలాన్సింగ్‌ ద్వారా ఉపాధి పొందేందుకు ఇది చక్కటి కెరీర్‌ ఫ్లాట్‌ఫాంలా ఉపయోగపడుతోంది.

చారిత్రక నేపథ్యం

ఫొటోగ్రఫీ చరిత్ర 1837లో ఫ్రాన్స్‌లో ప్రారంభమైంది. , ఆ సమయంలో జోసెఫ్‌ నీస్‌ఫోర్‌ నీప్సే, లూయిస్‌ డగ్యురే అనే శాస్త్రవేత్తలు మొదటిసారి ఫొటోగ్రఫిక్‌ ప్రక్రియ లేదా డాగ్యురోటైప్‌ను అభివృద్ధి చేశారు.

1838లో లూయిస్‌ డగ్యురె తొలిసారి ఇద్దరు వ్యక్తుల ఫొటో తీశాడు. , 1839, ఆగస్టు 19న ఫ్రెంచ్‌ ప్రభుత్వం డాగ్యురోటైప్‌ ప్రక్రియను అధికారికంగా ప్రకటించింది. , ఫొటోలను సంగ్రహించి, రక్షించే పద్ధతుల్లో ఒకటిగా ఇది పేరొందింది. , ఫొటోగ్రఫీ పుట్టుకకు దీన్నే నాందిగా పేర్కొంటారు. 

ఈ కీలకమైన రోజును గుర్తుంచుకునేందుకు ఏటా ఆగస్టు 19న ‘ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవం’గా జరుపుకోవాలని ప్రపంచ ఫొటోగ్రఫీ సంస్థ 2009లో తీర్మానించింది. , దీన్ని మొదటిసారి 2010లో నిర్వహించారు.

2025 నినాదం: 

"My Favorite Photo"

🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

Comments

Popular posts

🚨 తల్లికి వందనం స్టేటస్ కోసం ఈ లింక్ చెక్ చేయండి

తల్లికి వందనం పథకం కింద అర్హులైన లబ్ధిదారుల ఖాతాల్లో ఆర్థిక సహాయం జమ చేసే ప్రక్రియ త్వరలో ప్రారంభం కానుంది. 💰 https://bm-sgsw.ap.gov.in/BM/Schemeout మీ పేరు అర్హుల జాబితాలో ఉందో లేదో, దరఖాస్తు ఆమోదం పొందిందో లేదో ముందుగానే తెలుసుకోవడం కోసం పై లింక్ ఓపెన్ చేసి... మీ అబ్బాయి/అమ్మాయి ఆధార్ enter చేయండి  కొత్త మార్గదర్శకాల ప్రకారం, ఒకే కుటుంబంలో అర్హత కలిగిన ఒక్కరికంటే ఎక్కువ మంది విద్యార్థులు ఉంటే, ప్రతి విద్యార్థికి విడివిడిగా ప్రయోజనం అందే అవకాశం ఉంది. క్రింది కారణాల వల్ల మీ దరఖాస్తు ప్రభావితమయ్యే అవకాశం ఉంటుంది: ❌ అర్హత నిబంధనలకు సంబంధించిన వివరాలు సరిపోకపోతే ❌ బ్యాంక్ ఖాతా ఆధార్ మరియు NPCIతో అనుసంధానం కాకపోతే ❌ ఇతర ధృవీకరణ వివరాల్లో లోపాలు ఉంటే మీ ఆధార్ వివరాలతో ఇంటి నుంచే ఆన్‌లైన్‌లో స్టేటస్‌ను సులభంగా పరిశీలించవచ్చు. 📱 మరిన్ని వివరాల కోసం: https://apgovtschemes.com/thalliki-vandanam-status-check-2026-27/ https://apgovtschemes.com/thalliki-vandanam-status-check-2026-27/ 📢 గమనిక: తుది అర్హత, చెల్లింపు తేదీలు మరియు నిబంధనలు ప్రభుత్వ అధికారిక ప్రకటనల ఆధారంగా మారవచ్చు. 🏹Lakshya🇮...

నేటి ప్రధాన వార్తా పత్రికలు తెలుగు మరియు ఇంగ్లీష్

                             ఈనాడు ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.eenadu.net సాక్షి ➪ 🅐🅟 & 🅣🅢 http://epaper.sakshi.com ఆంధ్రప్రభ ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.prabhanews.com/ V6 వెలుగు➪ 🅣🅢 https://epaper.v6velugu.com 📰నవ తెలంగాణ ➪ 🅣🅢 http://epaper.navatelangana.com/ నమస్తే తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.ntnews.com 📰మన తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.manatelangana.news English Newspapers        ☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟ 👉🏻The Hindu📰 https://epaper.thehindu.com/reader Deccan Chronicle http://epaper.deccanchronicle.com/states.aspx Indian Express https://epapeHr.newindianexpress.com/t/3464 The Hans India https://epaper.thehansindia.com/ 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

ఫ్లాష్ ఫ్లాష్ AP పాలీ సెట్ ఫలితాలు విడుదల...

https://polycetap.nic.in/rank_card_2021.aspx 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺