Skip to main content

రేపే డీఎస్సీ మెరిట్ లిస్ట్... మెగా డీఎస్సీ కన్వీనర్ వ్యాఖ్యలు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం
పాఠశాల విద్యాశాఖ
పారదర్శకంగా డీఎస్సీ నియామకాలు 
• అర్హులైన అభ్యర్థులను పారదర్శకంగా నియమించడమే ప్రభుత్వం దృఢ సంకల్పం 

మెగా DSC-2025 పరీక్షలు పూర్తిగా నిర్దిష్ట షెడ్యూల్ ప్రకారం, సాంకేతిక భద్రతతో, పారదర్శకంగా, పకడ్బందీగా విజయవంతంగా నిర్వహించడం జరిగింది. తర్వాత టెట్ మార్కులు సరిచేసుకోవడానికి అభ్యర్థులకు తగిన సమయం ఇవ్వడం జరిగింది. అభ్యర్థుల స్కోర్ కార్డులు విడుదల చేసిన తర్వాత కూడా ప్రతిభ కనబరిచిన ఏ అభ్యర్థి నష్టపోకూడదనే ఆలోచనతో టెట్ మార్కుల వివరాలు సవరించుకోవడానికి ఆఖరి అవకాశం కూడా ఇవ్వడమైంది. స్పోర్ట్స్ కోటా మెరిట్ జాబితా కూడా పూర్తి అయిన నేపథ్యంలో ఈ నెల 22వ తేదీన మెరిట్ లిస్ట్ విడుదల చేయడానికి తగిన ఏర్పాట్లు చేయడం జరుగుతోంది. మెరిట్ లిస్ట్ జాబితా డీఎస్సీ అధికారిక వెబ్సైటుతో పాటు జిల్లా విద్యాధికారి వెబ్సైటులో కూడా ఉంచడం జరుగుతుంది. అభ్యర్థులు ఈ వెబ్సైట్ల నుండి మాత్రమే సమాచారం పొందాలి. వివిధ కేటగిరీలకు సంబంధించిన పోస్టుల నియామక ప్రక్రియలో భాగంగా ‘జోన్ ఆఫ్ కన్సిడరేషన్’ లోకి వచ్చిన అభ్యర్థులకు తమ వ్యక్తిగత లాగిన్ ద్వారా కాల్ లెటర్ అందించబడుతుంది. సదరు అభ్యర్థులు సంబంధిత ఒరిజినల్ సర్టిఫికెట్లతో పాటు ఇటీవల తీసుకున్న కుల ధ్రువీకరణ పత్రం, గజిటెడ్ అధికారితో ధ్రువీకరించిన మూడు సెట్లు జెరాక్స్ కాపీలు, 5 పాస్ పోర్టు సైజు ఫోటోలతో సర్టిఫికెట్లు వెరిఫికేషనుకు వ్యక్తిగతంగా హాజరు కావాల్సి ఉంటుంది. వెరిఫికేషనుకు హాజరు కావడానికి మునుపే సంబంధిత సర్టిఫికేట్లను వెబ్సైట్లో అప్ లోడ్ చేయడం తప్పనిసరి. వెరిఫికేషన్ సమయంలో సమర్పించవలసిన సర్టిఫికెట్ల వివరాలతో కూడిన చెక్ లిస్ట్ డీఎస్సీ వెబ్సైటులో అందుబాటులో ఉంచడం జరుగుతుంది. సర్టిఫికేట్ల పరిశీలన సమయంలో అభ్యర్థి హాజరు కాకపోయినా, సరైన సర్టిఫికెట్లు సమర్పించకపోయినా, తగిన విద్యార్హతలు లేనట్లుగా రుజువైనా మెరిట్ లిస్టులో తరువాత ఉన్న అభ్యర్థికి అవకాశం ఇవ్వడం జరుగుతుంది. 
ఉపాధ్యాయ ఉద్యోగం ఇప్పిస్తామని దళారులు చెప్పే మాటలు, కొంతమంది సోషల్ మీడియా వేదికగా, అసత్య వదంతులు వ్యాప్తి చేస్తూ అభ్యర్థులను ఆందోళనకు గురిచేస్తూ, అభ్యర్థుల మనోభావాలను దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారు. ఇలాంటి దుష్ప్రచారాలను నమ్మి అభ్యర్థులు మోసపోవద్దని, ఇలాంటి వదంతులు సృష్టించి వ్యాప్తి చేసేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించడమైంది. కాబట్టి అభ్యర్థులు కేవలం డీఎస్సీ అధికారిక వెబ్‌సైట్‌లో ఉన్న ప్రకటనలు, నోటిఫికేషన్లు, ఫలితాలను మాత్రమే పరిగణలోకి తీసుకోవాలని తెలియజేయడమైనది. అభ్యర్థుల వ్యక్తిగత స్కోర్లు, మెరిట్ లిస్ట్, ఎంపిక జాబితాలు, నియామక ఉత్తర్వులు మెగా డీఎస్సీ అధికారిక వెబ్సైటు, జిల్లా విద్యాధికారి వెబ్సైట్ , క్యాండిడేట్ లాగిన్ నందు మరియు ప్రభుత్వం ద్వారా విడుదల చేయబడే పత్రికా ప్రకటనల ద్వారా మాత్రమే తెలియజేయబడతాయి.  
రాష్ట్రంలో నాణ్యమైన విద్యను అందించేందుకు అర్హులైన అభ్యర్థులను పారదర్శకంగా నియమించాలని ప్రభుత్వం దృఢ సంకల్పంతో ఉంది. 

ఎం.వి.కృష్ణారెడ్డి,
కన్వీనర్, మెగా DSC–2025.

🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

Comments

Popular posts

RRB NTPC 8050 జాబ్స్ నోటిఫికేషన్ విడుదల

రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు (RRB) 2025 సంవత్సరానికి సంబంధించి 8,050 ఖాళీలతో నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీస్ (గ్రాడ్యుయేట్ అండ్ అండర్ గ్రాడ్యుయేట్) సెంట్రలైజ్డ్ ఎంప్లాయిమెంట్ నోటిఫికేషన్ (CEN 2025)ను ఒక ప్రకటనలో విడుదల చేసింది. మొత్తం 8,050 ఖాళీలను భర్తీ చేయనుంది. వీటిలో 5,000 పోస్టులు గ్రాడ్యుయేట్, 3,050 అండర్ గ్రాడ్యుయేట్ పోస్టులు ఉన్నాయి. అర్హత: గ్రాడ్యుయేట్ పోస్టులకు డిగ్రీ ఉత్తీర్ణత, అండర్ గ్రాడ్యుయేట్ పోస్టులకు ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత ఉండాలి. ముఖ్య తేదీలు: గ్రాడ్యుయేట్ ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 20.11.2025. అండర్ గ్రాడ్యుయేట్ ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 27.11.2025.  మరిన్ని వివరాల కోసం అలాగే పూర్తి నోటిఫికేషన్ కోసం క్రింద ఉన్న లింకును క్లిక్ చేయగలరు  https://www.rrbapply.gov.in/#/auth/landing (Join us on whatsapp at) https://chat.whatsapp.com/JuVLXd0zVNNGnadLIN4Pr8?mode=ems_copy_t https://whatsapp.com/channel/0029VbAmA2K4SpkJgaw7uJ3u 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

RRB JE Recruitment: రైల్వేలో 2,570 జూనియర్ ఇంజినీర్, మెటలర్జికల్ అసిస్టెంట్ పోస్టులు

భారతీయ రైల్వే (Indian Railway).. 2,570 పోస్టులతో మరో నోటిఫికేషన్ను విడుదల చేసింది. దేశ వ్యాప్తంగా అన్ని రీజియన్లలో ఉద్యోగాల భర్తీకి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు (RRB) నోటిఫికేషన్ (సీఈఎల్ నంబర్ 05/ 2025) విడుదల చేసింది. ఈ ప్రకటన ద్వారా 2,570 జూనియర్ ఇంజినీర్, డిపో మెటీరియల్ సూపరింటెండెంట్, కెమికల్ అండ్ మెటలర్జికల్ అసిస్టెంట్ ఖాళీలు భర్తీ కానున్నాయి. ఆర్ఆర్బీ ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ అక్టోబర్ 31వ తేదీ నుంచి ప్రారంభమై నవంబర్ 31వరకు కొనసాగనుంది. పూర్తి వివరాల కోసం ఆఫీసియల్ వెబ్సైటు లింక్ https://www.rrbcdg.gov.in/ 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

నేటి ప్రధాన వార్తా పత్రికలు

🗞️ఈనాడు ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.eenadu.net 📰ఆంధ్రజ్యోతి ➪ 🅐🅟 & 🅣🅢 http://mpaper.andhrajyothy.com/ 🗞️సాక్షి ➪ 🅐🅟 & 🅣🅢 http://epaper.sakshi.com/ 📰ఆంధ్రప్రభ ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.prabhanews.com/ 🗞️V6 వెలుగు➪ 🅣🅢 https://epaper.v6velugu.com 📰నవ తెలంగాణ ➪ 🅣🅢 http://epaper.navatelangana.com/ 🗞️నమస్తే తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.ntnews.com 📰మన తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.manatelangana.news 🧾English Newspapers🗞️        ☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟ 👉🏻The Hindu📰 https://epaper.thehindu.com/Home/Index 👉🏻Deccan Chronicle📰 http://epaper.deccanchronicle.com/states.aspx 👉🏻Indian Express📰 https://epaper.newindianexpress.com/t/3464 👉🏻The Hans India📰 https://epaper.thehansindia.com/           🏹లక్ష్య🇮🇳స్వచ్చంద📚సేవా🩺సంస్థ