డీఎస్సీ స్కోరు కార్డులలో టెట్ మార్కుల అభ్యంతరాలకు ఆఖరి అవకాశం...
మెగా డీఎస్సీ 2025 స్కోరు కార్డులు ఇదివరకే విడుదల చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో అభ్యంతరాల స్వీకరించిన తర్వాత సవరించిన టెట్ మార్కులతో అనుసంధానించిన స్కోర్ కార్డులను https://apdsc.apcfss.in/ వెబ్ సైట్ లో అందుబాటులో ఇప్పటికే ఉంచినట్లు మెగా డీఎస్సీ కన్వీనర్ శ్రీ ఎం.వి.కృష్ణారెడ్డి గారు ఒక ప్రకటనలో తెలిపారు. కావున అభ్యర్థులు టెట్ మార్కుల్లో ఇంకా ఏవైనా అభ్యంతరాలు ఉంటే ఎడిట్ ఆప్షన్ ఇచ్చామని, ఆఖరి అవకాశంగా భావించి 21.08.2025వ తేదీ మధ్యాహ్నం 12.00 లోపు సరిచేసుకోవాలని కోరారు.
ఇట్లు,
శ్రీ. ఎం.వి. కృష్ణారెడ్డి,
కన్వీనర్ మెగా డీఎస్సీ, ఆంధ్రప్రదేశ్.
Comments
Post a Comment