🌎అంతర్జాతీయం🌎
హైయాంగ్ 2డీచైనాకు చెందిన జియుక్వాన్ శాటిలైట్ సెంటర్ నుంచి మే 19న లాంగ్‌మార్చ్-4బి రాకెట్ ద్వారా హైయాంగ్-2డి ఉపగ్రహాన్ని ప్రయోగించింది. ఇది సముద్రాల విపత్తు సమాచారం తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది.
అణువిద్యుత్ ప్రాజెక్ట్‌చైనా-రష్యా అతిపెద్ద అణువిద్యుత్ ప్రాజెక్టు నిర్మాణానికి మే 19న ఆమోదించాయి. ఉమ్మడిగా ఈ ఒప్పందం ప్రకారం జుడాపు అణువిద్యుత్ ప్లాంట్ 3, 4 యూనిట్లు, తియాన్వన్ అణువిద్యుత్ ప్లాంట్ 7, 8 యూనిట్ల నిర్మాణానికి ఆమోదం తెలిపాయి.
భారత్‌కు అమెరికా సాయంకరోనా సెకండ్ వేవ్‌తో అల్లాడుతున్న భారత్‌కు అమెరికా 500 మిలియన్ డాలర్ల ఆర్థిక సాయం ప్రకటించింది. 80 మిలియన్ల వ్యాక్సిన్‌ను భారత్‌కు పంపించడం కోసం అమెరికా కేబినెట్ మే 20న ఆమోదించింది.
ఇన్‌ఫెక్షన్స్-2021ప్రపంచ ఆరోగ్య సంస్థ గ్లోబల్ ప్రోగ్రెస్ రిపోర్ట్ ఆన్ హెచ్‌ఐవీ, వైరల్ హెపటైటిస్ అండ్ సెక్సువల్లీ ట్రాన్స్‌మిటెడ్ ఇన్‌ఫెక్షన్స్-2021 పేరుతో రూపొందించిన ఒక నివేదికను మే 20న విడుదల చేసింది. దీని ప్రకారం ప్రపంచవ్యాప్తంగా హెచ్‌ఐవీ, వైరల్ హెపటైటిస్ అండ్ సెక్సువల్లీ ట్రాన్స్‌మిటెడ్ ఇన్‌ఫెక్షన్స్ వల్ల ఏటా 23 లక్షల మంది చనిపోతున్నారు.
▪️జాతీయం▪️
కొత్త జిల్లాపంజాబ్ రాష్ట్రంలో నూతన 23వ జిల్లాగా మలేర్‌కోట్లను మే 14న ప్రకటించారు. మలేర్‌కోట్ల ముస్లిం ప్రాబల్యం ఉన్న ప్రాంతం. పంజాబ్ సీఎం అమరీందర్ సింగ్. అసెంబ్లీ స్థానాలు 117.
గుజరాత్‌కు వెయ్యి కోట్లుఅరేబియా సముద్రంలో ఏర్పడిన తౌక్టే తుఫాను కారణంగా దెబ్బతిన్న గుజరాత్‌ను ఆదుకునేందుకు ప్రధాని మోదీ తక్షణ సాయంగా రూ.1000 కోట్లు మే 19న ప్రకటించారు. తుఫాను వల్ల వేర్వేరు రాష్ర్టాల్లో చనిపోయిన బాధిత కుటుంబాలకు రూ.2 లక్షల వంతున, గాయపడినవారికి రూ.50,000 చొప్పున ఎక్స్‌గ్రేషియా చెల్లిస్తామని చెప్పారు.
ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్‌కరోనా బాధితులకు అవసరమైన ఆక్సిజన్‌ను అందించడం కోసం ఏప్రిల్ 19న ప్రారంభించిన ‘ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్’ 10 వేల టన్నుల లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్‌ను సరఫరా చేసి రికార్డు సృష్టించినట్లు రైల్వే బోర్డు చైర్మన్ సునీత్ శర్మ మే 17న వెల్లడించారు. ప్రతిరోజు 600కు పైగా ట్యాంకర్లతో మొత్తం 13 రాష్ర్టాలకు 800 టన్నుల ఆక్సిజన్‌ను రైల్వే సరఫరా చేస్తుంది.
పశ్చిమబెంగాల్‌లో శాసనమండలిశాసన మండలి ఏర్పాటుకు పశ్చిమబెంగాల్ ప్రభుత్వం మే 19న ఆమోదించింది. 1969లో యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వం శాసన మండలి వ్యవస్థను రద్దుచేసింది. దేశంలో ప్రస్తుతం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కేరళ, మహారాష్ట్ర, బీహార్, ఉత్తరప్రదేశ్ రాష్ర్టాల్లో శాసనమండలి వ్యవస్థ ఉంది.
కేరళ సీఎంగా పినరయికేరళ సీఎంగా సీపీఎం సీనియర్ నాయకుడు పినరయి విజయన్ రెండోసారి మే 20న ప్రమాణం చేశారు. తిరువనంతపురంలోని సెంట్రల్ స్టేడియంలో గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ విజయన్‌తో ప్రమాణం చేయించారు. వామపక్ష కూటమి ఎల్‌డీఎఫ్‌కు సీపీఎం తరఫున పినరయి నాయకత్వం వహించారు.
బ్లాక్ ఫంగస్‌బ్లాక్ ఫంగస్‌ను ‘అంటువ్యాధుల చట్టం-1897’ కింద గుర్తించాలని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ మే 20న ఆదేశాలు జారీచేసింది. వ్యాధి గుర్తింపు, చికిత్స, నివారణపై ఐసీఎంఆర్ నిర్దేశించిన మార్గదర్శకాలను పాటించాలని సూచించింది.
తేనెటీగల దినోత్సవంమే 20న అంతర్జాతీయ తేనెటీగల పెంపకం దినోత్సవాన్ని నిర్వహించారు. తేనెటీగల కాలనీల ఏర్పాటుకు కేంద్రం రుణంతోపాటు మొత్తం వ్యయంలో 40 శాతం రాయితీ ఇస్తుంది. ఇందుకు ‘జాతీయ తేనెటీగల పెంపకం, తేనె ఉత్పత్తి మిషన్’ను కేంద్రం ఏర్పాటు చేసింది. దీని అమలుకు ‘ఆత్మనిర్భర్ భారత్’ పథకంలో మూడేండ్ల (2020-23)లో రూ.500 కోట్లు ఖర్చు చేస్తుంది.
Comments
Post a Comment