Skip to main content

రూపాయి.. రూపాయి.. నువ్వేం చేస్తావు

ఇద్దరు మిత్రులు ఒక రోజు ఉదయం ఒక నిర్జనారణ్యం గుండా నడుచుకుంటూ వెళుతున్నారు. అకస్మాత్తుగా వారి సమీపంలోని ఒక పొద వైపు నుంచి ఓ సన్యాసి ఆదుర్దాగా, ఆయాసంతో రొప్పుతూ వస్తూ కనిపించాడు. వాళ్ళిద్దరూ ఆయన్ను ఆపి "ఏం జరిగింది? ఎందుకలా భయపడుతున్నారు?" అని అడిగారు. అందుకాయన... "అదిగో అక్కడ కనిపిస్తున్న పొదలో మనుషుల్ని చంపేది ఉంది." వాళ్ళిద్దరూ భయంతో… "అంటే అక్కడ పులి ఉందా?" అని అడిగారు.

"కాదు. కానీ దానికన్నా ప్రమాదకరమైనది. నేను కొన్ని మూలికల కోసం తవ్వుతుండగా అది బయటపడింది." అన్నాడాయన. "ఇంతకీ ఏమిటది?" అని అడిగారు వాళ్ళిద్దరూ కంగారుగా. "బంగారు నాణేల గుట్ట" అన్నాడు సన్యాసి. వాళ్ళిద్దరూ సంతోషంగా "ఎక్కడ?" అని అడిగారు.

"అదిగో ఆ పొదల్లోనే" అని వేలు చూపించి తన దారిన పోయాడా సన్యాసి. వాళ్ళిద్దరూ ఆ పొదవైపు పరుగెత్తుకుంటూ వెళ్ళి చూస్తే నిజంగానే అక్కడ బంగారు నాణేలు కనిపించాయి. "ఈ సన్యాసి ఎంత మూర్ఖుడు? బంగారు నిక్షేపాన్ని పట్టుకుని మనుషుల్ని చంపేది అంటాడేమిటి?" అన్నాడొక మిత్రుడు.

"అతడి సంగతి వదిలేయ్. ముందుగా ఇప్పుడేం చేయాలో ఆలోచిద్దాం. పట్టపగలే బహిరంగంగా దీన్ని మోసుకుపోతే ఊర్లో జనాలు అనుమానపడే అవకాశం ఉంది. మనలో ఒకరం దీనికి కాపలాగా ఉందాం. మరొకరు ఊర్లోకి వెళ్ళి భోజనం తీసుకు వద్దాం." అన్నాడు మరో మిత్రుడు.

అనుకున్నట్టే ఒక మిత్రుడు బంగారానికి కాపలాగా ఉన్నాడు. రెండోవాడు ఊర్లోకి వెళ్లాడు. ఈలోగా మొదటి వాడు ఇలా అనుకున్నాడు. "ఛ… ఈ రోజు నేను ఒంటరిగా ఇక్కడికి వచ్చుంటే ఎంత బాగుండేది? ఇప్పుడు అనవసరంగా నేను అతనికి సగం బంగారం ఇవ్వాల్సి వస్తుంది. బంగారం కూడా మరీ ఎక్కువగా లేదు. నా కుటుంబం చాలా పెద్దది. దాన్ని పోషించడానికి ఈ బంగారం అంతా నాకే దక్కితే బాగుంటుంది కదా! వాడు వచ్చీ రాగానే కత్తితో పొడిచి చంపేస్తాను. ఎవరికీ అనుమానం రాదు. బంగారం అంతా నేనే తీసుకోవచ్చు." అలా అనుకుని కత్తిని నూరి సిద్ధంగా ఉంచుకున్నాడు.

ఇదిలా ఉండగా ఊర్లోకి వెళ్ళిన రెండో వాడి ఆలోచన ఇలాఉంది… "వాడికి సగం భాగం ఎందుకివ్వాలి? మొత్తం బంగారం నేనే తీసుకుంటే పోలా! అసలే నాకు చాలా అప్పులున్నాయి. నా జీవితంలో నేను ఏదీ వెనుకేసుకోలేదు. వాడికేమో అప్పులు లేవు. ఉన్నవాళ్ళు స్నేహితులుగా ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా బంగారమంతా నాకే దక్కాలి. కాబట్టి నేను తీసుకెళ్ళే భోజనంలో విషం కలుపుతాను. అది తిని వాడు చనిపోతాడు. ఎవరికీ తెలియకుండా బంగారమంతా నేనే తీసుకోవచ్చు" అనుకున్నాడు. అలా అతడు భోజనంలో విషం కలిపి మిత్రుడి కోసం నిధి దగ్గరకు తీసుకెళ్ళాడు. 

అతను దగ్గరికి వెళ్ళగానే అక్కడే కత్తితో పొంచి ఉన్న రెండోవాడు ఒక్క ఉదుటున మీదకు దూకి కత్తితో పొడిచి చంపేశాడు.

"పిచ్చివాడు. సగం బంగారం కోసం ప్రాణాలు పోగొట్టుకున్నాడు. ఇంక నేను భోంచేస్తాను." అనుకుని

ఏ మాత్రం అనుమానం లేకుండా తెచ్చిన అన్నాన్ని తిన్నాడు. అరగంట తర్వాత అతని ప్రాణాలు అనంత వాయువుల్లో కలిసిపోయాయి. "సన్యాసి మాటలు ఎంత నిజమో కదా" అనుకున్నాడు చివరి క్షణాల్లో.

రూపాయి.. రూపాయి.. నువ్వేం చేస్తావు? అంటే… తోబుట్టువుల మధ్య వైరం పెంచుతాను. తల్లీ బిడ్డల మధ్య చిచ్చుబెడతాను, చివరికి స్నేహితులను కూడా దూరం చేస్తాను అంటుంది ఆ రూపాయి…. అని పెద్దల నానుడి. కాబట్టి ఆ రూపాయి విషయంలో జాగ్రత.

🏹లక్ష్య🇮🇳స్వచ్చంద📚సేవా🩺సంస్థ

Comments

Popular posts

📚 TET పరీక్ష రాస్తున్న ఉపాధ్యాయ మిత్రులకు ✨ NORMALIZATION గురించి సులభమైన అవగాహన ✨

ఒకే TET పరీక్షను వేర్వేరు షిఫ్ట్‌లలో నిర్వహించినప్పుడు, అన్ని షిఫ్ట్‌ల ప్రశ్నపత్రాలు అచ్చం ఒకే కష్టతర స్థాయిలో ఉండకపోవచ్చు. ఒక షిఫ్ట్‌లో ప్రశ్నలు కాస్త కఠినంగా ఉండవచ్చు. మరో షిఫ్ట్‌లో ప్రశ్నలు మధ్యస్థంగా ఉండవచ్చు. ఇంకొక షిఫ్ట్‌లో ప్రశ్నలు కొంత సులభంగా ఉండవచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో అభ్యర్థుల పనితీరును న్యాయంగా పోల్చడానికి కొన్ని పరీక్షల్లో గణాంక ఆధారిత NORMALIZATION విధానాన్ని ఉపయోగిస్తారు. 🔹 NORMALIZATION అంటే ఏమిటి? వేర్వేరు షిఫ్ట్‌లలో వచ్చిన మార్కులను, ఆయా షిఫ్ట్‌ల ప్రశ్నపత్రం స్థాయి మరియు అభ్యర్థుల పనితీరును పరిగణనలోకి తీసుకుని ఒక సాధారణ ప్రమాణానికి సర్దుబాటు చేసే ప్రక్రియను నార్మలైజేషన్ అంటారు. ఇందులో సాధారణంగా షిఫ్ట్ సగటు మార్కులు, Standard Deviation, అభ్యర్థి మార్కులు వంటి గణాంక అంశాలను పరిగణనలోకి తీసుకోవచ్చు. 📌 ఒక సులభమైన ఊహాత్మక ఉదాహరణ: మూడు షిఫ్ట్‌లలో పరీక్ష జరిగిందని అనుకుందాం. 🔵 SHIFT–1 ప్రశ్నపత్రం కొంచెం కఠినంగా ఉంది. షిఫ్ట్ సగటు = 60 మార్కులు. అభ్యర్థి A = 75 మార్కులు. అంటే A తన షిఫ్ట్ సగటు కంటే 15 మార్కులు ఎక్కువ సాధించాడు. 🟢 SHIFT–2 ప్రశ్నపత్రం మధ్యస్థంగా ఉంది. షిఫ్...

నేటి ప్రధాన వార్తా పత్రికలు తెలుగు మరియు ఇంగ్లీష్

                             ఈనాడు ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.eenadu.net సాక్షి ➪ 🅐🅟 & 🅣🅢 http://epaper.sakshi.com ఆంధ్రప్రభ ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.prabhanews.com/ V6 వెలుగు➪ 🅣🅢 https://epaper.v6velugu.com 📰నవ తెలంగాణ ➪ 🅣🅢 http://epaper.navatelangana.com/ నమస్తే తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.ntnews.com 📰మన తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.manatelangana.news English Newspapers        ☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟ 👉🏻The Hindu📰 https://epaper.thehindu.com/reader Deccan Chronicle http://epaper.deccanchronicle.com/states.aspx Indian Express https://epapeHr.newindianexpress.com/t/3464 The Hans India https://epaper.thehansindia.com/ 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

TET అభ్యర్థులకు ఉపయోగకరమైన ఆన్‌లైన్ మాక్ టెస్ట్ ప్లాట్‌ఫామ్

TET పరీక్షకు సిద్ధమవుతున్న అభ్యర్థుల కోసం ఒక ప్రత్యేకమైన ఆన్‌లైన్ మాక్ టెస్ట్ ప్లాట్‌ఫామ్ అందుబాటులో ఉంది. ఈ ప్లాట్‌ఫామ్‌లో మీరు ఎన్ని సార్లైనా పరీక్ష రాయవచ్చు. ప్రతి ప్రయత్నంలో కొత్త ప్రశ్నాపత్రం రూపొందించబడటం దీని ప్రత్యేకత. ఈ మాక్ టెస్టులు విస్తృతమైన ప్రశ్నల బ్యాంక్ ఆధారంగా రూపొందించబడుతున్నందున, ప్రతి పరీక్షలో భిన్నమైన ప్రశ్నలు ఎదురవుతాయి. దీనివల్ల ఒకే రకమైన ప్రశ్నలు పదేపదే రావడం తగ్గి, అభ్యర్థులు వివిధ అంశాలపై మెరుగైన అవగాహన పెంపొందించుకోవచ్చు. ఈ ప్లాట్‌ఫామ్‌ను ఉపయోగించడం ద్వారా: • అపరిమిత సంఖ్యలో మాక్ టెస్టులు రాయవచ్చు. • ప్రతి ప్రయత్నంలో కొత్త ప్రశ్నాపత్రం లభిస్తుంది. • విభిన్న అంశాలపై ప్రాక్టీస్ చేసే అవకాశం ఉంటుంది. • పరీక్షా సమయ నిర్వహణ నైపుణ్యాలు మెరుగుపడతాయి. • మీ బలాలు, బలహీనతలను గుర్తించి వాటిపై మరింత దృష్టి పెట్టవచ్చు. • కంప్యూటర్ ఆధారిత పరీక్షలకు అలవాటు పడేందుకు ఇది ఉపయోగపడుతుంది. • కంప్యూటర్ వినియోగంలో అనుభవం తక్కువగా ఉన్న అభ్యర్థులు కూడా ముందుగానే ప్రాక్టీస్ చేసి ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవచ్చు. నిరంతరంగా మాక్ టెస్టులు రాయడం ద్వారా పరీక్షా భయం తగ్గి, నిజమైన TET పరీక్షలో ...