Skip to main content

నేటి మోటివేషన్... అమ్మ అమ్మే....... ఓపిక చేసుకొని ఇది చదవండి..

అమ్మను మించిన దైవం ఉండదన్న క్లారిటీ వస్తుంది.మా అమ్మకు ఒక్క కన్నే ఉండేది. మా అమ్మంటే నాకు ఇష్టం ఉండేది కాదు. ఆమె ఎక్కడికి వచ్చినా నాకు అవమానంగా తోస్తుండేది. ఆమె ఓ చిన్న కొట్టు నడుపుతుండేది .ఒక రోజు మా అమ్మ నాకు చెప్పకుండా నన్ను కలుసుకోవడానికి స్కూల్ కి వచ్చింది. ఇంక అప్పట్నించి చూడండి. ”మీ అమ్మ ఒంటి కన్నుది” అని స్నేహితులందరూ ఒకటే వెక్కిరింతలు, అవహేళనలు. అలా ఆమె ఎక్కడికి వచ్చినా నాకు అవమానాలే. అసలు ఈమె కడుపులో నేను ఎందుకు పుట్టానబ్బా అనిపించేది.ఒక్కోసారి నాకు.అసలామె ఈ లోకం నుంచే ఒక్కసారిగా అదృశ్యమైపోతే బావుణ్ణు. అనిపించేది..“అమ్మా నీ రెండో కన్ను ఎక్కడికి పోయింది? నీవల్ల నేను అందరికీ చులకన అయిపోయాను. నువ్వు చచ్చిపో!” కోపంగా అరిచేసే వాణ్ణి.ఆమె మొహంలో నిర్లిప్తత తప్ప ఇంకేమీ కనిపించేదికాదు.నాకు మాత్రం చిర్రెత్తుకొచ్చేది. అయినా సరే అమ్మను అలా మాట్లాడినందుకు మాత్రం నాకు ఎక్కడలేని సంతోషంగా ఉండేది.ఆమె నన్ను ఎప్పుడూ దండించలేదు కాబట్టి ఆమెను నేను ఎంతగా భాధ పెట్టానో నాకు తెలియదు.ఒక రోజు రాత్రి యధాప్రకారం అమ్మను నానా మాటలు అనేసి నిద్రపోయాను. మద్యలో దాహం వేసి మెలుకువ వచ్చింది. నీళ్ళు తాగడానికి వంటగదిలోకి వెళ్ళాను. అమ్మ అక్కడ ఒంటరిగా రోదిస్తోంది. మళ్ళీ ఆ దిక్కుమాలిన ఒక్క కంటిలోంచే నీళ్ళు. నా సహజ స్వభావం ఎక్కడికి పోతుంది? మొహం తిప్పుకుని వెళ్ళిపోయాను.ఎక్కడికొచ్చినా నన్ను అవమానాలు పాలు చేసే మా అమ్మను, మా పేదరికాన్ని తిట్టుకుంటూ ఎప్పటికైనా నేను పెద్ద ధనవంతుణ్ణవ్వాలనీ, బాగా పేరు సంపాదించాలనీ కలలుగంటూ నిద్రపోయాను..ఆ తరువాత నేను చాలా కష్టపడి చదివాను. పై చదువుల కోసం అమ్మను వదిలి వచ్చేశాను. మంచి విశ్వవిద్యాలయంలో సీటు సంపాదించి మంచి ఉద్యోగంలో చేరాను.బాగా డబ్బు సంపాదించాను. మంచి ఇల్లు కొనుక్కున్నాను.మంచి అమ్మాయిని చూసి పెళ్ళి చేసుకున్నాను. నాకిప్పుడు ఇద్దరు పిల్లలు కూడా. ఇప్పుడు నాకు చాలా సంతోషంగా జీవితం గడిచిపోతుంది. ఎందుకంటే ఇక్కడ మా ఒంటికన్ను అమ్మ లేదుకదా!అలా ఎడతెరిపిలేని సంతోషాలతో సాగిపోతున్న నా జీవితంలోకి మళ్ళీ వచ్చింది మహాతల్లి. ఇంకెవరు? మా అమ్మ. ఆమె ఒంటి కన్ను చూసి రెండేళ్ళ నా కూతురు భయంతోజడుసుకుంది. “ఎవరు నువ్వు? ఎందుకొచ్చావిక్కడికి? నువ్వెవరో నాకు తెలియదు. నా ఇంటికొచ్చి నా కూతుర్నే భయపెడతావా?ముందునువ్వెళ్ళిపో ఇక్కడ్నుంచి!!!”సాధ్యమైనంతవరకు తెలియనట్లే నటించాను.“క్షమించండి బాబూ! తెలియక తప్పుడు చిరునామాకి వచ్చినట్లున్నాను” ఆమె అదృశ్యమైపోయింది. “హమ్మయ్య ఆమె నన్ను గుర్తు పట్టలేదు”. భారంగా ఊపిరి పీల్చుకున్నాను.ఇక ఆమె గురించి జీవితాంతం పట్టించుకోనవసరంలేదు అనుకున్నాను..కానీ కొద్దిరోజులకు పాఠశాల పూర్వ విద్యార్థుల సమ్మేళనానికి రమ్మని ఒక ఆహ్వాన పత్రం అందింది నాకు. వ్యాపార నిమిత్తం వెళుతున్నానని మా శ్రీమతికిఅబద్ధం చెప్పి అక్కడికి బయలు దేరాను.స్కూల్లో కార్యక్రమం అయిపోయిన తర్వాత నేను మా గుడిసె దగ్గరికి వెళ్ళాను. ఎంత వద్దకున్నా నా కళ్ళు లోపలి భాగాన్ని పరికించాయి. మా అమ్మ ఒంటరిగా కటికనేలపై పడి ఉంది. ఆమె చేతిలో ఒక లేఖ. నా కోసమే రాసిపెట్టి ఉంది. దాని సారాంశం.ప్రియమైన కుమారునికి,ఇప్పటికే నేను బతకాల్సిన దానికన్నా ఎక్కువే బతికాను. నేనింక నీవుండే దగ్గరికి రాను. కానీ నువ్వైనా నా దగ్గరికి వచ్చిపోరా కన్నా! ఏం చేయమంటావు?నిన్ను చూడకుండా ఉండలేకున్నాను. కన్నపేగురా. తట్టుకోలేక పోతోంది.నువ్వు పాఠశాల పూర్వ విద్యార్థుల సమ్మేళనానికి వస్తున్నావని తెలిసిన నా ఆనందానికి పట్టపగాలు లేవు. కానీ నేను మాత్రం నీకోసం స్కూల్ దగ్గరికి రానులే. వస్తే నీకు మళ్ళీ అవమానం చేసినదాన్నవుతాను.ఒక్క విషయం మాత్రం ఇప్పటికి చెప్పక తప్పడం లేదు. చిన్నా! నీవు చిన్నపిల్లవాడిగా ఉన్నపుడు ఒక ప్రమాదంలో నీకు ఒక కన్నుపోయింది. నా ప్రాణానికి ప్రాణమైన నిన్ను ఒక కంటితో చూడలేకపోయాన్రా కన్నా! అందుకనే నా కంటిని తీసి నీకు పెట్టమన్నాను. నా కంటితో నువ్వు ప్రపంచం చూస్తున్నందుకునాకు ఎంత గర్వంగా ఉందో తెలుసా? నువ్వు చేసిన పనులన్నింటికీ నేను ఎప్పుడూ బాధపడలేదు.ఒక్క రెండు సార్లు మాత్రం ” వాడు నా మీద కోప్పడ్డాడంటే నా మీద ప్రేమ ఉంటేనా కదా!” అని సరిపెట్టుకున్నాను. చిన్నప్పుడు నేను నీతో గడిపిన రోజులన్నీ నా హృదయంలో శాశ్వతంగా నిలిచిపోయే మధురానుభూతులు..ఉత్తరం తడిసి ముద్దయింది. నాకు ప్రపంచం కనిపించడం లేదు.నవనాడులూ కుంగిపోయాయి. భూమి నిలువుగా చీలిపోయి అందులో చెప్పలేనంత లోతుకి వెళ్ళిపోయాను. తన జీవితమంతా నాకోసం ధారబోసిన అటు వంటి మా అమ్మ పట్ల నేను ఏ విధంగా ప్రవర్తిoచాను ? మా అమ్మ కోసం నేను ఎన్ని కన్నీళ్ళు కారిస్తే సరిపోతాయి? ఎన్ని జన్మలెత్తి తే ఆమె ఋణం తీర్చుకోగలను ?(ఇది ఇంగ్లీష్ కథకు అనువాదం)నాస్తి మాతృ సమం దైవం.నాస్తి మాతృ సమః పూజ్యోనాస్తి మాతృ సమో బంధునాస్తి మాతృ సమో గురుఃఅమ్మతో సమానమైన పూజ్యులుగానీ దైవంగానీ లేరు.తల్లిని మించిన బంధువులుగానీ గురువులుకానీ లేరు.ఆకలేసినా.. ఆనందం వేసినా, దిగులేసినా , దుఃఖం ముంచుకొచ్చినా , పిల్లలకైనా, పిల్లలను కన్న తల్లిదండ్రు లకైనా గుర్తొచే పదం అమ్మ.తన కడుపు మాడ్చుకొని పిల్లల కడుపు కోసం ఆరాటపడే అమృతమూర్తి అమ్మ .అటు వంటి అమ్మ కంట కన్నీరు పెట్టనివ్వకండి. కనుపాప లా కాపాడండి. ఒక్కసారి ఆలోచించండి...... అందరికీ అభినందనలు... నలుగురికీ ఇలాంటి సందేశాలుపంపండి...... బంధాలు బాంధవ్యాలను కాపాడుదాం..

🏹లక్ష్య🇮🇳స్వచ్చంద📚సేవా🩺సంస్థ

Comments

Popular posts

నేటి ప్రధాన వార్తా పత్రికలు

🗞️ఈనాడు ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.eenadu.net 📰ఆంధ్రజ్యోతి ➪ 🅐🅟 & 🅣🅢 http://mpaper.andhrajyothy.com/ 🗞️సాక్షి ➪ 🅐🅟 & 🅣🅢 http://epaper.sakshi.com/ 📰ఆంధ్రప్రభ ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.prabhanews.com/ 🗞️V6 వెలుగు➪ 🅣🅢 https://epaper.v6velugu.com 📰నవ తెలంగాణ ➪ 🅣🅢 http://epaper.navatelangana.com/ 🗞️నమస్తే తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.ntnews.com 📰మన తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.manatelangana.news 🧾English Newspapers🗞️        ☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟ 👉🏻The Hindu📰 https://epaper.thehindu.com/Home/Index 👉🏻Deccan Chronicle📰 http://epaper.deccanchronicle.com/states.aspx 👉🏻Indian Express📰 https://epaper.newindianexpress.com/t/3464 👉🏻The Hans India📰 https://epaper.thehansindia.com/           🏹లక్ష్య🇮🇳స్వచ్చంద📚సేవా🩺సంస్థ

RRB NTPC 8050 జాబ్స్ నోటిఫికేషన్ విడుదల

రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు (RRB) 2025 సంవత్సరానికి సంబంధించి 8,050 ఖాళీలతో నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీస్ (గ్రాడ్యుయేట్ అండ్ అండర్ గ్రాడ్యుయేట్) సెంట్రలైజ్డ్ ఎంప్లాయిమెంట్ నోటిఫికేషన్ (CEN 2025)ను ఒక ప్రకటనలో విడుదల చేసింది. మొత్తం 8,050 ఖాళీలను భర్తీ చేయనుంది. వీటిలో 5,000 పోస్టులు గ్రాడ్యుయేట్, 3,050 అండర్ గ్రాడ్యుయేట్ పోస్టులు ఉన్నాయి. అర్హత: గ్రాడ్యుయేట్ పోస్టులకు డిగ్రీ ఉత్తీర్ణత, అండర్ గ్రాడ్యుయేట్ పోస్టులకు ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత ఉండాలి. ముఖ్య తేదీలు: గ్రాడ్యుయేట్ ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 20.11.2025. అండర్ గ్రాడ్యుయేట్ ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 27.11.2025.  మరిన్ని వివరాల కోసం అలాగే పూర్తి నోటిఫికేషన్ కోసం క్రింద ఉన్న లింకును క్లిక్ చేయగలరు  https://www.rrbapply.gov.in/#/auth/landing (Join us on whatsapp at) https://chat.whatsapp.com/JuVLXd0zVNNGnadLIN4Pr8?mode=ems_copy_t https://whatsapp.com/channel/0029VbAmA2K4SpkJgaw7uJ3u 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

ఆధునిక భారతదేశ చరిత్ర top 30 bits....

1. భగత్ సింగ్‌కు మరణశిక్ష విధించిన న్యాయమూర్తి ఎవరు?  జ: GC హిల్టన్  2. మహాత్మా గాంధీ రాజకీయ గురువు ఎవరు?  జ: గోపాల్ కృష్ణ గోఖలే  3. ఏ చట్టాన్ని అప్పీల్ లేకుండా, లాయర్ లేకుండా మరియు వాదన లేకుండా చట్టం అని పిలుస్తారు.  జ: రౌలట్ చట్టం  4. దండా ఫౌజ్‌ను ఎవరు ఏర్పాటు చేశారు?  జ: చమందీవ్ (పంజాబ్)  5. పాముల దేశం అని దేనిని పిలుస్తారు?  జ: బ్రెజిల్  6. మరణశిక్ష విధించిన అతి పిన్న వయస్కుడైన విప్లవకారుడు ఎవరు?  జ: ఖుదీరామ్ బోస్  7. జలియన్ వాలాబాగ్ మారణకాండకు నిరసనగా కైసర్-ఎ-హింద్ బిరుదును ఎవరు తీసుకున్నారు? నిరాకరించారు.  జ: మహాత్మా గాంధీ  8. గదర్ పార్టీని ఎవరు స్థాపించారు?  జ: లాలా హర్దయాల్, కాశీరాం  9. ఫార్వర్డ్ బ్లాక్ సంస్థ స్థాపకుడు ఎవరు?  జ: సుభాష్ చంద్రబోస్  10. కాంగ్రెస్ ఎప్పుడు, ఏ పార్టీలలో చీలిపోయింది?  జ: 1907 మితవాదులు మరియు తీవ్రవాదులు (సూరత్ సెషన్)  11. కాంగ్రెస్ మొదటి ముస్లిం అధ్యక్షుడు ఎవరు?  జ: బద్రుద్దీన్ త్యాబ్జీ  12. మరాఠా సామ్రాజ్య స్థాపకుడు ఎవరు.  జ: శివాజీ ...