నేటి మోటివేషన్... పాత కథే అయిన మళ్ళీ మళ్ళీ చదవాలనిపించే కథ...

పాత కథే.... కానీ ఎన్నిసార్లు చదివినా మళ్ళీ మళ్ళీ చదవాలని అనిపిస్తుంది. అలా మారాలని అనిపిస్తుంది. 

నీ సమయాన్ని నేను కొనగలనా?
ఒక వ్యక్తి చాల ఆలస్యం గా ఇంటికి వచ్చాడు. గుమ్మం ముందు తన కోసం ఎదురు చూస్తున్న తన కుమారుడిని చూసాడు.
కొడుకు: నాన్న నేను నిన్ను ఒక ప్రశ్న అడగొచ్చా?
తండ్రి: హ తప్పకుండ అడుగు..
కొడుకు: నాన్న నువ్వు గంటకి ఎంత సంపాదిస్తావ్?
తండ్రి: అది నీకు అనవసరమైనది. అయిన నీకు ఎందుకు?
కొడుకు: నాకు తెలుసుకోవాలని ఉంది , దయచేసి చెప్పండి నాన్న, నువ్వు గంటకి ఎంత సంపాదిస్తావ్?
తండ్రి: సరే, నేను గంటకి 1000 రూపాయలు సంపాదిస్తాను.
కొడుకు: అవునా, అని తన తలదించుకొని , నాన్న నాకు 500 ఇస్తావా?
తండ్రి: కోపంతో నీకు ఎందుకు అంత డబ్బు... నీకు కావాల్సిన ఆట బొమ్మలు, నీకు ఏది కావాలంటే అన్ని తెచ్చాను గా! ఇంకా ఏంటి ? నోరుముస్కోని నీ గదిలోకి వెళ్లి పడుకో.
ఆ పిల్లాడు బాధతో తన గదిలోకి వెళ్లి పడుకున్నాడు.
ఆ తండ్రి కాసేపు కూర్చొని, ఇంకా కోపంతో ఎందుకు నా కొడుకు ఇలాంటి ప్రశ్నలు అడుగుతున్నాడు. అయిన వాడికి ఎంత దైర్యం నన్నే డబ్బు అడుగుతున్నాడు అది 500 రూపాయలు.

ఒక గంట తర్వాత ఆ వ్యక్తి కొంచెం శాంత పడి , ఆలోచించటం మొదలెట్టాడు...
వాడికి బాగా అవసరమైతేనే ఇంత డబ్బు అడుగుతాడు. లేకపోతె అడిగేవాడు కాదు కదా.. అయిన నేను సంపాదిస్తుంది వాడి కోసమే కదా... ఛ అనవసరం గా నా పనిలోని కోపం అంతా వాడి మీద చూపించాను.
అని వాడి గదిలోకి వెళ్లి ,
తండ్రి: నిద్రపోతున్నావా నాన్నా!!!
కొడుకు: లేదు నాన్న మేలుకువతోనే ఉన్న.
తండ్రి: నన్ను క్షమించు రా నా పని లో కోపాన్ని నీ మీద చూపించ.. ఇదుగో నువ్వు అడిగిన 500 తీసుకో...
కొడుకు: ఆనందంతో, థాంక్స్ నాన్న..
అని తన దిండు కింద నలిగిపోయిన డబ్బులుని తీసి లేక్కపెడుతున్నాడు.
తన దగ్గర డబ్బులుండి కూడా అడిగిన తన కుమారుడి ఇంకా కోపం వచ్చి...
తండ్రి: అయిన నీ దగ్గర డబ్బు ఉండి కూడా నను ఎందుకు అడిగావు???
కొడుకు: నాన్న ఇప్పుడు నా దగ్గర మొత్తం 1000 రూపాయలు ఉన్నాయి. ఇప్పుడు " నేను నీ గంట సమయాన్ని కొనగలనా! దయచేసి మీరు రేపు కొంచెం తొందరగా వస్తే నేను మీతో భోజనం చేద్దాం అనుకుంటున్నా....
వెంటనే తండ్రి కొడుకుని తన చేతులతో కొడుకుని హత్తుకొని, 
తండ్రి: నన్నూ క్షమించురా!! నేను ఇంకా ఎప్పుడు ఇలా చేయను...

అప్పటి నుండి తన కొడుకుతో కొద్ది సమయం గడుపుతూ ఉన్నాడు

ప్రియ మిత్రులారా, మీలో ఎంత మంది మీ కొడుకులతో సమయం గడుపుతున్నారు???
🏹లక్ష్య🇮🇳స్వచ్చంద📚సేవా🩺సంస్థ

Comments